Facebook Twitter
విలక్షణ విళంబీ స్వాగతం

విలక్షణ విళంబీ! స్వాగతం 

 


విలక్షణ విళంబీ!
ఇక విలంబంచేయక
సలక్షణంగా అరుదెంచు!
సకలరంగాలలో మాకు విజయాల్ని కలిగించు
ప్రజలందరికీ శాంతి సౌఖ్యాల్ని ప్రసాదించు!
పచ్చడి అందించకపోయినా పర్వాలేదుగాని
అధిక ధరల భారంతో నలిగి
పచ్చడి కాకుండా మమ్మల్ని రక్షించు!
అవినీతి అసురనేతలపై
నిశిత బాణాల్ని సంధించు!
సర్వం స్వాహా చేసే స్వాముల్ని
లక్షల కోట్లు "స్కాముల్ని"
తక్షణం శిక్షించు!
అన్ని చట్టాల్ని తెచ్చినా
అంతకంతకూ దేశంలో నలుదెసలా
అధికమవుతున్న అత్యాచారాల్నివారించు
పండగపూట భాక్ష్యాల్ని
ప్రసాదించకపోయినా సరే 
మా లక్ష్యాల్నిసాధించేలా అనుగ్రహించు 
అలా - పంచాంగాల్ని సవరించు!

రచన :  డా|| వడ్డేపల్లి కృష్ణ