Home » పిల్లల కోసం » అన్న-తమ్ముడుFacebook Twitter Google
అన్న-తమ్ముడు

అన్న-తమ్ముడు

 

 

రామాపురం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రీధర్‌, మురళి అనే అన్నదమ్ములు ఇద్దరు చదివేవాళ్ళు. ఇద్దరూ అన్నదమ్ములే అయినా వాళ్ళ ప్రవర్తన చాలా భిన్నంగా ఉండేది. శ్రీధర్‌లో స్వార్థం పాలు ఎక్కువ అనిపించేది. వాడు తనకంటే చిన్నపిల్లల్ని బెదిరించేవాడు. పెద్దల్ని ఎదిరించేవాడు, ఎవ్వరికీ సహాయం చేసేవాడు కాదు. "సాయం చేయొచ్చు కదా! ఏమౌతుంది?" అని ఎవరైనా అంటే "నాకేంటి లాభం?" అనేవాడు. వీడితో పోలిస్తే వీడి తమ్ముడు మురళి బాగుండేవాడు. చిన్నవాళ్లంటే కొంత ప్రేమ, పెద్దలంటే కొంత గౌరవం ఉండేవి వాడికి. తోటివారికి సాయం కూడా చేసేవాడు.

 

టీచర్లు, పిల్లలతో సహా అంతా తమ్ముడిని మెచ్చుకుంటుంటే అన్నకి కుళ్ళుగా ఉండేది. అయినా శ్రీధర్‌ ఇతరుల్ని తప్పు పట్టేవాడు తప్ప, తన ప్రవర్తనని మాత్రం మార్చుకునేవాడు కాదు. ఇలా ఉండగా ఒకసారి వాళ్ళ బడి పిల్లలంతా విహారయాత్రకని బయలుదేరారు. అందరితో పాటు వీళ్లిద్దరూ కూడా వెళ్ళారు. ఆ యాత్రలో శ్రీధర్‌ని ఎవరూ పట్టించుకోలేదు. అసలు అతను ఉన్నా లేనట్లే ప్రవర్తించారు. ఇక మురళితో మాత్రం ప్రతి ఒక్కరూ స్నేహంగా ఉన్నారు. అందరూ వాడిప్రక్కన చేరి సంతోషంగా ముచ్చట్లు పెట్టారు. అది చూసి శ్రీధర్‌కు అంతకంతకూ బాధ పెరిగి పోయింది. దర్శనీయ స్థలాల వద్ద కూడా, అందరూ ఒక ప్రక్కన నడిస్తే, శ్రీధర్ ఒక్కడూ మరో ప్రక్కన నడిచాడు. భోజనాల సమయంలో‌ కూడా, అందరూ కలివిడిగా అక్కడి వింతలు-విశేషాల గురించి కబుర్లు చెప్పుకుంటూ చాలా ఆనందంగా గడిపితే, శ్రీధర్ మటుకు ఒంటరిగా కూర్చొని కుళ్ళుకుంటూ భోంచేసాడు.

ఆ రోజు సాయంత్రం అంతా వెనక్కి తిరిగి వస్తున్నారు, బస్సు దగ్గరికి. పిల్లలంతా బాగా అలసిపోయారు. అయినా గందరగోళంగా, గుంపులు గుంపులుగానే ఉన్నారు. శ్రీధర్‌ మటుకు ఒక్కడే, ఏదో ఆలోచిస్తూ, నడుస్తున్నాడు. ఉన్నట్టుండి అతనికి ఒక బండ కొట్టుకుంది. రక్తం ధారగా కారసాగింది. అయినా ప్రతి ఒక్కరూ అతన్ని చూసి, ప్రక్కకు తప్పుకొని వెళ్తున్నారు తప్ప, అతనికి సాయం చేసేందుకు ఎవ్వరూ‌ ముందుకు రాలేదు. చివరికి మురళియే వాళ్ళ అన్నను చూసి, "అయ్యో! పెద్ద దెబ్బే తగిలిందే!" అనే సరికి అందరూ అక్కడ గుమిగూడారు. అందరూ మురళి వెంట ఉండి వాళ్ల అన్నను ఆసుపత్రికి తీసుకొని వెళ్ళారు.

 

గాయం తగ్గాక శ్రీధర్ "చూసావా, ఎవ్వరికీ‌ నేనంటే ఇష్టం లేదు! ఇట్లాంటి వాళ్లకు నేను మటుకు ఎందుకు సాయం చెయ్యాలి?" అన్నాడు తమ్మునితో, కోపంగా. అప్పుడు మురళి "నిజమే అన్నయ్యా! చూశావా! మనం‌ విహార యాత్రకు వెళ్ళినప్పుడు నీకు దెబ్బ తగిలితే కూడా ఎవ్వరూ నీకు సాయం చేయలేదు. నువ్వు "ఇతరులకు సహయం చేస్తే నాకేంటి లాభం" అంటావుగా, అలాగే వాళ్లంతా కూడా అనుకున్నారనమాట! అది తప్పు కదా?! స్నేహ సంబంధాలను ఎవరికి వాళ్ళు పెంచి పోషించుకోవాల్సి ఉంటుంది. మనం ముందుకు పడి సాయం చేస్తే, వేరేవాళ్ళు కూడా సమయం వచ్చినప్పుడు మనకు సాయం చేస్తారు. ముందుగా మనం ఇతరులందరినీ దూరం పెట్టామనుకో, అప్పుడు వాళ్ళు కూడా మనల్ని దూరం పెడతారు" అన్నాడు.

తమ్ముడు ఏమంటున్నదీ అర్థమైన శ్రీధర్‌ తనను తాను మార్చుకోవాలని నిశ్చయించుకున్నాడు. "ఇకమీద అవతలి వాళ్ల తీరును పట్టించుకోను. నా అంతట నేనుగా అందరికీ సాయం చేస్తాను" అనుకున్నాడు. శ్రీధర్‌లో వచ్చిన మంచి మార్పుని బడిలో పిల్లలు కూడా త్వరలోనే గుర్తించారు. వాళ్లకు తెలీకుండానే అందరూ మురళి పట్ల స్నేహ భావనతో మెలగసాగారు. కొద్ది నెలల తర్వాత అన్నదమ్ములిద్దరూ బడిలో ఎంత మంచి పేరు సంపాదించుకున్నారంటే 'అబ్బ! వీళ్ళను చూస్తే ఎవరూ అన్నదమ్ములు అనుకోరు- మంచి ఫ్రెండ్స్ అనుకుంటారు!" అని చెప్పుకోసాగారు అందరూ.

 

- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో

 


నేనూ, మా అన్న ఉండేవాళ్ళం, మా యింటికల్లా పిల్లలం. మా ఇంటికెవరేనా పిల్లలొస్తే మాకెంతో సంతోషంగా ఉండేది. ఎవరూ లేనప్పుడు, మేం చదవనప్పుడూ మేమిద్దరం ఆడుకునేవాళ్లం....
Mar 2, 2020
పవన్, గణేష్ ఇద్దరూ ఒక రోజున వాళ్ళ ఊరి ప్రక్కనే ఉన్న అడవిలోకి వెళ్ళి, దారి తప్పారు. అడవిలో అంతా తిరిగి అలసిపోయారు. ...
Dec 18, 2019
తీరిన కష్టం
Aug 8, 2019
నన్ను కాపాడిన పిల్లి
Aug 27, 2019
అంతరంగ ఆలోచన..!!
May 10, 2019
అనగనగా నాగసముద్రంలో గంగరాజు అనే నేతగాడు ఒకడు ఉండేవాడు.
Apr 29, 2019
"అయ్యో, ఉడతా, నీ అమాయకత్వానికి నవ్వుతున్నాను! నీ చారలు చూసుకొనే నువ్వు..
May 13, 2019
పాముకి గుణపాఠం చెప్పిన కోడిపెట్ట
Apr 8, 2019
పిల్లలకు ఆకలి ఎక్కువ. టామీ కుక్కపిల్ల చిన్నగా ఉన్నప్పుడు దానికి కూడా చాలా ఆకలి ఉండేది.
Mar 1, 2019
రాజీవ్‌ అనే కుర్రవాడు చక్కగా చదివి, చదువు పూర్తయ్యాక ఉద్యోగం కోసం వెతుక్కుంటూ పట్టణం చేరాడు..
Feb 23, 2019
TeluguOne For Your Business
About TeluguOne