The content in this feature is rated as "A++". You must be at least 18 years old to view this feature.
Home>>Why do Young Man interested in Middle aged women for Intercourse
రతిలో రుచులు చూపించే ప్రౌఢ స్త్రీ

సాధారణంగా పరాయి స్త్రీలతో యువకులు కామసంబందాలు కలిగివున్నప్పుడు వారు తమకంటే తక్కువ వయస్సు ఉన్నవారి ఎడల ఎక్కువ ఆసక్తిని చూపిస్తారని భావిస్తూ వుంటారు. కానీ కిన్సే తన పరిశీలనల్లో దీనికి భిన్నంగా గుర్తించడం జరిగింది. ఎక్కువమంది యువకులు తమకంటే ఎక్కువ వయస్సువున్న, ఆకర్షణీయమైన శరీర సౌందర్యమున్న ప్రౌఢ వయస్సు స్త్రీలతోనే లైంగిక సంబంధాలని కాన్క్షిస్తారు.

 

 

ఈ విషయంలో కిన్సే యువకుల మనస్తత్వాన్ని గురించి వివరిస్తూ 16-26 సంవత్సరాల వయస్సులోవున్న స్త్రీలలో కంటే 25-30 సంవత్సరాలు దాటినా స్త్రీలలోనే కామపరంగా పరిపక్వత కనబడుతుంది. అక్రమ లైంగిక సంబంధాలు కలిగివున్నప్పుడు తక్కువ వయస్సు వున్న స్త్రీలలో తగిన ధైర్యమూ ఉండదు, తగిన విధంగా మెప్పించగల సామర్థ్యమూ వుండదు. కాస్త వయస్సు వచ్చిన స్త్రీలో కామపరంగా పరిపక్వత ఉండటమే కాకుండా, రతిలో పరాయి పురుషునితో ధైర్యంగా పాల్గొని అతన్ని మెప్పించి తాను తృప్తి పొందుతుంది అందుకనే కిన్సే ఈ వయస్సు కలిగిన స్త్రీ సెక్సు విషయంలో మంచి అనుభవంగల దానిగా వర్ణించాడు. ఇటువంటి అనుభవం కలిగిన వయస్సులోని స్త్రీనే తక్కువ వయస్సు వున్న పురుషుడు ఇష్టపడటం జరుగుతుంది. పరాయి పురుషులతో రతిలో పాల్గొనే స్త్రీలలో కలిగే సుఖప్రాప్తి గురించి కిన్సే వివరిస్తూ, భర్తతో దాంపత్య జీవితంలో పాల్గొన్న దానికంటే పరాయి పురుషునితో రతిలో పాల్గోన్నప్ప్పుడు ఎక్కువసార్లు సుఖప్రాప్తిని (ఆర్గనిజం) పొందడం జరుగుతుందనీ తెలియజేశారు.

 

కిన్సే తన పరిశోధనల గురించి వెల్లడిస్తూ, తన భర్తతో ఏనాడూ రతిలో సుఖప్రాప్తి పొందని స్త్రీలు పరాయి పురుష సంపర్కంలో సుఖప్రాప్తిని పొందిన వాళ్ళు వున్నారని వివరించారు. 40సంవత్సరాలు దాటిన స్త్రీలు కొందరు మొదటిసారిగా పరాయి పురుష సంపర్కం పొందేవారు వుంటారు. దీనికి కారణం ఇక ఆ వయస్సులో పిల్లలు కలగరనే ధైర్యం స్త్రీకి రావటంతో సెక్సు ఎడల ఆసక్తి పెరుగుతుంది. అయితే ఆ వయస్సు వచ్చేసరికి భర్తకి కామసామర్థ్యం సన్నగిల్లుతుంది. ఒక రకమైన నిర్లిప్తత భర్తలో వచ్చివేస్తుంది. భర్తలోని నిర్లిప్తత, కామపరంగా అసమర్థత స్త్రీని పరాయి పురుష సంపర్కానికి దోహదం చేస్తుంది. తన భార్యకి అక్రమసంబంధం వున్నదని తెలిసినా కొందరు భర్తలు ఈ వయస్సులో మాట్లాడకుండా ఊరుకుంటారు. అలా ఊరుకోనకపోతే భార్య అతని అసమర్థతని ఎక్కడ వేలెత్తి చూపిస్తుందో, ఎక్కడ అపహాస్యం చేస్తుందో అని భయపడి ఊరుకుంటారని కిన్సే వయస్సు మల్లిన పురుషుల మనస్తత్వాన్ని వివరించాడు. వివాహిత స్త్రీలు పరాయి పురుషులతో లైంగిక సంబంధాలకి ఆసక్తి చూపడం విషయంలో కిన్సే వివరిస్తూ ఇటువంటి స్త్రీలల్లో 33 శాతం స్త్రీలకి వివాహానికి పూర్వమే లైంగికానుభావం వుండి వుంటుందని వెల్లడించారు. పాశ్చాత్యదేశ స్త్రీల విషయంలో కిన్సే వెల్లడించిన లేక్కలకి, మనదేశపు స్త్రీల విషయంలోనూ చాలా తేడా వుంటుంది. కాని లైంగిక సంబంధాల విషయంలో మనస్తత్వాలు మాత్రం ఒక్కటే.