The content in this feature is rated as "A++". You must be at least 18 years old to view this feature.
Home>>Menstrual Problems in Females (dysmenorrhoea)
బహిష్టు స్త్రీల సమస్యలు

అనసూయమ్మగారు తన కూతురు నిర్మాలని డాక్టరు దగ్గరికి గాబరాపడుతూ తీసుకుని వచ్చింది. నిర్మలకి రమారమి 16 సంవత్సరాలు ఉంటాయి. ఈ మధ్యనే వివాహం అయింది. డాక్టరు దగ్గరికి వచ్చిన నిర్మల కడుపునొప్పితో మెలికలు తిరిగిపోతోంది. కడుపులో తెరలు తెరలుగా నొప్పిరావడం, గట్టిగ ఒక అరుపు అరిచి స్పృహకోల్పోయినట్టు అవడం జారుతుంది. శరీరానికి చెమటలుపట్టి, ఒళ్ళంతా చల్లగా అయినట్లు కూడా ఉంటుంది. తన కూతురు పరిస్థితిని ఈ స్థితిలో చూసిన అనసూయమ్మగారు డాక్టరుతో "డాక్టర్ ...! మా అమ్మాయి ఈ ఉదయమే బహిష్టు అయింది. అప్పటినుంచి ఇదే పరిస్థితి. ఇంతకుముందు బహిష్టు అయినప్పుడు ఏదో కాస్త నొప్పి వచ్చిపోవడం తప్ప ఇలా జరగలేదు. ఈ మధ్యనే వివాహమై కాపురానికి వెళ్ళింది. కాపురానికి వెంటనే పంపించడం తప్పు అయిందా డాక్టర్?'' అని ఎంతో ఆవేదనతో అడిగింది. "అదేమీ కాదమ్మా ... ఆడపిల్లకి రజస్వల అయిన కొంతకాలానికి బహిష్టులో వచ్చే నొప్పే ఇది. మీ అమ్మాయి కాపురానికి వెళ్ళిందని అంటున్నారు. కనుక ఈ నొప్పి త్వరగానే తగ్గిపోవడానికి ఆస్కారం వుంది'' అని డాక్టరు చెపితే అనసూయమ్మగారికి ఆశ్చర్యం, ఆనందం రెండూ కలిగాయి.
స్త్రీలకి బహిష్టులో వచ్చే కడుపునొప్పిని 'డిస్ నోరియా' అంటారు. ఇది ముఖ్యంగా రెండు విధాలుగా వస్తుంది. కొందరు స్త్రీలకి బహిష్టు ప్రారంభం కావడానికి మూడునుంచి ఐదు రోజులు ముందునుంచే పొత్తికడుపులోనూ, నడుములోనూ నొప్పిగా బరువుగా ఉంటుంది. మరికొందరి స్త్రీలకి బహిష్టు ప్రారంభమయిన రోజునే పొత్తికడుపు, నడుములో తీవ్రమైన నొప్పి వస్తుంది. బహిష్టు ప్రారంభం కావడానికి మూడు నుంచి ఐదు రోజుల ముందునుంచే పొత్తికడుపులో నొప్పి ఉండేవాళ్లకి అంతర జననేంద్రియాలు, వాటికి దగ్గరగా ఉన్న తక్కిన అవయవాలు రక్తాధిక్యతతో ఉబ్బినట్టు అవుతాయి. పెద్ద ప్రేగు చివరి భాగం కూడా కదలికలేకుండా అయి ఉబ్బినట్టు అవుతుంది. ఇందువలన మలవిసర్జన కూడా సరిగ్గా జరగదు. వీటన్నింటివేలన పొత్తికడుపులో ఒక రకమైన బరువు, బాధ ఉంటుంది. అయితే బహిష్టు ప్రారంభం కాగానే అంతర జననేంద్రియాల దగ్గర రక్తాధిక్యత తగ్గిపోతుంది. చుట్టూతా వున్నా కండరాలలోని బిగువు సడలిపోతుంది. ఇంతటితో ఆ స్త్రీకి ఒక రకమైన ఉపశాంతి కలుగుతుంది. ఇటువంటి బాధ ఉన్నప్పుడు స్త్రీలు ఎనిమా చేయించుకుంటేనూ, విరోచానానికి తీసుకుంటేనూ కొంత ఉపశాంతి కలుగుతుంది. ఈ రకమైన బహిష్టు బాధని 'కంజెక్టివ్ డిస్ మెనోరియా' అంటారు.
బహిష్టు రోజునే కడుపులో నొప్పి వచ్చే స్త్రీలు మొదటిరకం స్త్రీలకంటే ఎక్కువ బాధపడతారు. ఈ రెండవరకం బహిష్టు నొప్పిని 'స్పాసమోడిక్ మెనోరియా అంటారు. ఈ రకం నొప్పి 90 శాతం స్త్రీలలో ఎప్పుడో ఒకప్పుడు కొద్దోగొప్పో వస్తుంది. అయితే వీరిలో 10 శాతం స్త్రీలే తమ బాధా నివృత్తికి డాక్టర్ సలహా పొందవలసివస్తుంది. తక్కిన వాళ్ళకి తేలికగా నొప్పి తగ్గిపోతుంది. కాని కొందరికి కడుపునొప్పి విపరీతంగా వచ్చి అరగంట, గంట ఉంటుంది. ఈ సమయంలో నొప్పి తీవ్రంగా రావడం మరల కాస్త తగ్గడం జరుగుతూ నొప్పి భరించలేక స్పృహతప్పి పడిపోవడం, వాంతులు అవడం జరుగుతుంది. నిదానంగా ఈ తీవ్రత తగ్గి కొద్ది మోతాదులో వచ్చి తగ్గుతూ ఒక రోజంతా ఉంటుంది. కొంతమందికి నొప్పి బహిష్టు రావడానికి ఒక పూట ముందుగా కూడా కనబడవచ్చు.


సాధారణంగా రజస్వల అయిన రెండు మూడు సంవత్సరాల వరకు బహిష్టులో ఎటువంటి బాధ లేకుండా ఉంటుంది. ఈ రెండు మూడు సంవత్సరాలదాకా స్త్రీలలో అండాశయంనుంచి అండం విడుదల అవటం అంటూ ఉండదు. అండం తయారవడం జరిగినప్పటినుంచే బహిష్టులో నొప్పి రావడం ప్రారంభమవుతుంది. ఇదే నిర్మల విషయంలో జరిగింది. నిర్మలకి 16 సంవత్సరాలు వచ్చేవరకు వచ్చిన బహిష్టులన్నీ అండంవిడుదలతో సంబంధం లేకుండా వచ్చినవే. నిర్మలలో అండం విడుదల ప్రారంభం అయినప్పటినుంచీ కొన్ని ఇతర హార్మోన్లు తయారవడం, కడుపులో నొప్పి ఎక్కువగా రావడం ప్రారంభమయింది. ఈ రకమైన కడుపులో నొప్పి 3 నుంచి 21 సంవత్సరాల వయస్సులో ఎక్కువగా ఉంటుంది. 35 సంవత్సరాలు దాటిన వారిలో అరుదుగా కనబడుతుంది. కన్యలుగా ఉన్న స్త్రీలలోకంటే వివాహమైన స్త్రీలలో ఇటువంటి బహిష్టునొప్పి ఎక్కువగా వస్తుంది. ఒకసారి గర్భవతి అయినా ఈ నొప్పి చాలా వరకు రాకుండా పోవటమో లేక ఎక్కువ బాధ లేకుండా ఉండడమో జరుగుతుంది. ఒక బిడ్డ కలిగినవారిలో కంటే ఇద్దరు, ముగ్గురు బిడ్డలు కలిగినవాళ్ళలో అటువంటి బహిష్టు నొప్పి చాలా తక్కువ. కొంతమంది స్త్రీలు బహిష్టు నొప్పి వచ్చేతట్లయితే గర్భంవచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయని భావిస్తారు. కాని అది పొరపాటు అభిప్రాయం. బహిష్టుసమయంలో కడుపులో నొప్పి వచ్చేవాళ్ళకి కొందరికి ఋతుస్రావం నెలనెలా రావడంలో కొంత అస్తవ్యస్తత ఉంటుంది.
బహిష్టులో కడుపునొప్పి వున్నప్పుడు ఎ.పి.సి. బిళ్ళలుగాని, బరాల్గాన్ టాబ్లెట్ గాని వేసుకుంటే చాలావరకు ఉపశాంతి కలుగుతుంది. మరీ ఎక్కువ నొప్పి ఉంటే డి.అండ్.సి. ఆపరేషన్ చేయించుకుంటే మంచిది. ఇవికాక ఇతర హార్మోన్ల చికిత్స కూడా డాక్టరు సలహాపై పొందవచ్చు. ఇంటగాని దిగులుపడి కూర్చోనవసరంలేదు.