The content in this feature is rated as "A++". You must be at least 18 years old to view this feature.
Home>>Do Twins Health Will Be Identical To Each Other
కవలపిల్లల ఆరోగ్యం ఇద్దరిదీ ఒకటేలా ఉంటుందా?

వేరు వేరు అండములతో తయారయిన కవలల ఆరోగ్యం ఇద్దరిదీ ఒకటేలాగా వుండాలని, వాతావరణంలో వచ్చే మార్పులకుగాని, వ్యాధులకుగాని ఒకేలాగా గురికావాలని లేదు. కాని ఒకే అండం నుంచి కవలలుగా పుట్టినవాళ్ళ ఆరోగ్యం మాత్రం చాలావరకు ఒకటేలాగా వుంటుందని కొందరు తమ పరిశోధనలలో వివరించారు. మార్గోలిస్, ఐన్ స్టీన్ అనే శాస్త్రజ్ఞులు కవలపిల్లల గురించి పరిశోధనలు జరిపిన వాటిలో ఒకే అండంనుంచి పుట్టిన కవలల గురించి కొన్ని విస్మయ కరమైన విషయాలని వెల్లడించారు. ఇలాంటి కవలలు ఇద్దరూ దాదాపు కొద్దిమాసాల తేడాతో కంటిగుడ్డుకు కేన్సర్ వ్యాధికి గురి అయినారు. అలాగే మరో కవలపిల్లలకి ఒకే వయస్సులో మానసిక రుగ్మత ఏర్పడింది.

 

 

మరొక కవలసోదరులు అరవై సంవత్సరాల వయస్సులో మధుమేహ వ్యాధికి గుర అయి, ఒకే రకమైన దుష్ఫలితాలు కలిగి దాదాపు కొద్దిరోజుల తేడాలోనే మరణించారు. న్యూయార్కులో వున్న కవల సోదరి, శాన్ ఫ్రాన్సిస్కోలో వున్న తోడి కవల సోదరి ఇద్దరూ 52 సంవత్సరంలోనే మధుమేహ వ్యాధికి గురిఅవడం చివరికి ఇద్దరూ ఒకే వయస్సులో చనిపోవడం జరిగింది. అలాగే ఇటువంటి వాళ్ళల్లో సమానంగా ఒకే సమయంలో మూత్రపిండాల జబ్బులు, ఉబ్బసం, ఊపిరి తిత్తుల జబ్బులు, కళ్ళలో శుక్లాలు మొదలైనవి రావడం గమనించడం జరిగింది. ఈ విధంగా అనేక ఉదాహరణలు ఇస్తూ ఈ రకంగా రావడానికి ఒకే అండంనుంచి కవలలు ఇద్దరూ తయారవడం జరిగింది కనుక వారిలో సమానంగా ఒకటే రకం జీన్స్ వుండబట్టి వారి ఆరోగ్యం కూడా అదే విధంగా వుండడం జరిగిందని వివరించారు. అదే విధంగా వంశపారంపర్యంగా జీన్స్ ద్వారా వ్యాధులు కూడా సంక్రమిస్తుంటాయని నిర్థారించారు.