The content in this feature is rated as "A++". You must be at least 18 years old to view this feature.
Home>>Is Twins a Heriditary Disease
వంశపారంపర్య వ్యాధులు - పరిష్కార మార్గాలు

కులాసాగా గడుపుదామనుకున్న క్రిష్ణారావుకి తన భార్య కడుపులో కవలపిల్లలు ఎదుగుతున్నారని తెలుసుక్ని కలవరపడసాగాడు. అసలే ఇప్పటికి ముగ్గురుపిల్లు. ఈసారితో ఆపరేషన్ చేయిద్దామనుకుంటే ఒకరికి బదులు మరో ఇద్దరు పుట్టబోతున్నారు. అంతులేని ఆందోళనతో వున్న కృష్ణారావుకి వాళ్ళ అమ్మమ్మకు కవలపిల్లలు పుట్టారన్నది, తన భార్యవైపు వాళ్ళలో కూడా కవలపిల్లల్ని కన్న తల్లులున్నారన్న మాట గుర్తుకు రాసాగింది.

 

 

తన భార్య ఆ ఆనవాయితీపోకుండా ఈ కరువు కాలంలో కవలపిల్లల్ని కంటున్నందుకు బాధపడిపోయాడు. వంశపారంపర్యంగా వ్యాధులు రావడం ఎలా వున్నదో అదే విధంగా వంశపారంపర్యంగా కవలపిల్లలు కొందరికి పుట్టడం జరుగుతూవుంటుంది. ఈ విధంగా కవలపిల్లలు గురించి జాన్ హోప్ కిన్స్ లో విశేషమైన పరిశోధనలు జరిపిన 'డాక్టర్ గ్రూలిక్, డాక్టర్ గుల్ కర్'లు మాకు కొన్ని విచిత్రమైన విశేషాలని వెల్లడించారు. ఒకే అందం నుంచి తయారయ్యే కవలలు (ఐడెంటికల్ ట్విన్స్) వంశపారంపర్యంగా పుట్టే లక్షణం కలిగివుండరనీ అలాగాక ఒకేసారి స్త్రీలో రెండు అండాలు విడుదలైనప్పుడు అవి వీర్యకణాలతో కలయికపొంది కవలలుగా రూపొందడం అనేది వంశపారంపర్య లక్షణంగా కనబడుతూ వుంటుందని వివరించారు. అంతేగాకుండా ఒకే అండంతో తయారయ్యే కవలలు మొదటి కాన్పులోనయినా పుట్టవచ్చుననీ, అలాకాక వేరు వేరు అండములతో తయారయ్యే కవలలు సాధారణంగా మొదటి కాన్పులోగాకుండా తరువాత కాన్పులలో పుడుతూ వుంటారని విశదీకరించారు.