The content in this feature is rated as "A++". You must be at least 18 years old to view this feature.
Home>>Hereditary diseases - hemophilia
వంశపారంపర్య వ్యాధులు :- హిమోఫీలియా వ్యాధి

జగదీశ్వరరావుగారికి ఏ చిన్నగాయం తగిలినా రక్తం ఆగకుండా ఎక్కువసేపు కారుతూ ఉండేది. కాని ఆయన అంతగా ఎప్పుడూ పట్టించుకోలేదు. ఒకసారి పన్ను పీకించు కుంటే ఆగకుండా రక్తం గంటలతరబడి కారి ప్రాణంమీదికి వచ్చింది. అయితే ఆయనకు ఇద్దరు ఆడపిల్లలు - ముగ్గురు మగపిల్లలు పుట్టినా ఎవరూ ఇటువంటి పరిస్థితిలో బాధపడక పోవడంతో అంతగా పిల్లల విషయం పట్టించుకోలేదు. కాని విచిత్రం ఏమిటో జగదీశ్వరరావుగారి అమ్మాయికి పుట్టిన ఆడపిల్లలంతా బాగున్నారు, కాని మగపిల్లలకి ఏమాత్రం చిన్న దెబ్బతగిలినా రక్తం ఆగకుండా కారడం జరుగుతూ వుంది.

 

అంతేకాదు, మొదటి అమ్మాయి కొడుకుకి ఆటలలో గొంతుదగ్గర బంతి తగిలి చిన్న గాయానికే ఎంతో రక్తం చింది చనిపోవడం జరిగింది. కాని జగదీశ్వరరావు గారి అబ్బాయిలకి పుట్టిన ఆడపిల్లలుగాని, మగపిల్లలుగాని ఇటువంటి బాధ ఏదీ లేకుండా బాగానే ఉన్నారు. మరి కేవలం జగదీశ్వరరావు కూతుళ్ళకి పుట్టిన మగపిల్లలకే ఇటువంటి ప్రాణాంతకమైన పరిస్థితులు ఏర్పడటం ఎందుచేత? ఆ కూతుళ్ళకి ఆడపిల్లలు మాత్రం ఇటువంటి రక్తంకారే స్థితి లేకుండా చక్కగా ఉండటానికి కారణం ఏమిటి? జగదీశ్వరరావుగారు గాని, ఆయన కూతుళ్ళకి పుట్టిన మగపిల్లలకి గాని బాధపడిన రక్తసంబంధమైన జబ్బునే ''హిమోఫీలియా'' అని అంటారు. ఇది ఒక రకమైన విచిత్రమైన వంశపారంపర్య వ్యాధి. ఈ రక్త సంబంధమైన వ్యాధిలో రక్తం గడ్డకట్టే స్వభావం ఉండదు. అందుకని ఏమాత్రం చిన్న దెబ్బతగిలినా రక్తం ఆగకుండా కారుతూనే వుంటుంది. సాధారణంగా మామూలు వ్యక్తుల్లో ఆగకుండా రక్తం కారుతుంది.

ఆడవాళ్ళకేం మహారాణులు - మగ మహారాజుకే బాధలు :-

హిమోఫీలియా వ్యాధి ఒక తరంనుండి మరొక తరానికి స్త్రీల ద్వారా సంక్రమిస్తూ వుంటుంది. వాళ్ళలో ఈ వ్యాధి లక్షణాలువున్నా ఏమాత్రం బాధపడరు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బందీ వుండదు. అలాగే వాళ్ళకి పుట్టిన ఆడపిల్లలకి ఏమీ బాధ వుండదు. కేవలం వాళ్ళకి పుట్టిన మగపిల్లలకే ప్రాణాంతకమైన బాధలు తల్లిదండ్రుల ఇద్దరిలో ఏ ఒక్కరికి ఈ వ్యాదివున్నా పిల్లలకి తప్పకుండా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. జగదీశ్వరరావు గారి విషయంలో ఆయన భార్యకి ఈ జబ్బులేని కుటుంబంనుంచి వచ్చింది కనుక ఆయన పిల్లలకి ఆయన వలన ఈ వ్యాధి సంక్రమించినా, భార్య నుంచి సంక్రమించలేదు. కనుక మగపిల్లలు ఈ వ్యాధితో బాధపడలేదు. కాని జగదీశ్వరరావుగారి కూతురికి పుట్టిన మగపిల్లలు మాత్రం వాళ్ళ అమ్మనుంచే ఈ వ్యాధి సంక్రమించింది. కనుక చిన్న గాయానికే రక్తం తెగకారిపోయి మరణించడం కూడా జరిగింది.

 

ఈ రకంగా తరతరాలుగా హిమోఫీలియా వ్యాధి స్త్రీలద్వారా తరువాత తరానికి సంక్రమిస్తూ ఉంటుంది. ఏ తరంలోనయినా పుట్టినవాళ్ళంతా ఆడపిల్లలే అయినా, లేకపోతే హిమోఫీలియా లక్షణం వున్న మగవాడు ఆ వ్యాధిలేని కుటుంబంలోని స్త్రీని వివాహం చేసుకుంటే వాళ్ళకి పుట్టిన బిడ్డలా తరంలోనయినా ఈ వ్యాధి తాత్కాలికంగా కనబడకపోవచ్చు. కాని ఈ తరంలో తిరిగి ఆడపిల్లలకి పుట్టిన మగపిల్లలంతా ఈ వ్యాధికి గురిఅవుతారు. ఎట్టి పరిస్థితిల్లో అయినా భార్యాభార్తలు ఇద్దరూ హిమోఫీలియా వ్యాధి ఉన్న వంశంలోనుంచి వచ్చినవాళ్ళే అయితే వాళ్లకు పుట్టిన ఆడపిల్లలు, మగపిల్లలు ఇద్దరు కూడా ఈ వ్యాధికి గురికావడం జరుగుతుంది. కాని ఇలా జరగడం కూడా చాలా అరుదు. ఎప్పుడయినా హిమోఫీలియా వున్న ఏ వంశంలోనయినా అయిదు తరాల వరకు అందరూ ఆడపిల్లలే పుట్టినా, తరువాత తరంలో మగపిల్లవాడు పుట్టినా అతను ఈ వ్యాధికి గురికాకుండా తప్పించుకోలేడు. అందుకనే హిమోఫీలియా వున్న వంశంలో నుంచి మగపిల్లవాడినికాని, ఆడపిల్లని కాని వివాహం చేసుకోకూడదు. అసలు హిమోఫీలియా ఉందని తెలిసికూడా వివాహం చేసుకుంటే తరువాత తరం క్షేమం కొరకు పిల్లలు పుట్టకుండా జాగ్రత్త వహించాలి.