The content in this feature is rated as "A++". You must be at least 18 years old to view this feature.
Home>>Is their any Harm in Blood Relation Marriages
మేనరికాలవల్ల నష్టాలు కలుగుతాయా?

శిరీషకి తన బావ అంటే ఎంతో యిష్టం. కోరి కోరి బావను పెళ్ళి చేసుకుంటే బావకుమాత్రం శిరీష మీద అంతగా మనస్సు లేదు. అతనికి శిరీషలో కనబడని ఆకర్షణ, మాటల్లోని కవ్వింపు బయట స్త్రీలల్లో కనబడుతూ వుంటాయి. ఆకర్షణ లేకపోయినా దాంపత్య జీవితం అతనికి అలవాటుగా మారింది. పెళ్ళి అంటే ఇద్దరు స్త్రీపురుషుల కలయికేగాదు పరస్పర ఆకర్షణ, అనురాగంతో కూడిన అనుబంధం అని అతని అనుభవంలో తేలింది. ఇదే అభిప్రాయం భాగ్యమనిదికూడా. ఎందుకంటే బాగ్యమని తాతముత్తాతల దగ్గరనుంచీ ఇటూ-అటూ దాదాపు అందరికీ మేనరికాలే. వయస్సు వచ్చిన పిల్ల, చదువుకున్న పిల్ల అయిన భాగ్యమనికి వాళ్ళ-వాళ్ళ దాంపత్యాల్లో లాలిత్యం, శృంగారం కంటే అవసరం తీర్చుకోవడం మాత్రం కనబడుతోంది. ముచ్చట కనబడటం లేదు. వాళ్ళ వాళ్ళ జీవితాల్లో ఒకరినొకరు కవ్వించుకునే గుణంలేదు. శృంగారంలో తియ్యదనాల రుచిచూపించే థ్రిల్ లేదు.

 

బహుశా అతి సన్నిహిత్యంవల్ల, రక్తబందుత్వంవల్ల రతిలో తియ్యదనం, స్పర్శలో మధురానుభూతి లేకుండా పోతోంది. అందుకనే కాబోలు పదునైన వయసులో ఉన్న పద్దెనిమిదేళ్ళ పడతి శిరీష సరసన ఉన్నా ఆమె బావలో కలగవలసిన కవ్వింపుగానీ, మధురానుభూతిగాని లేవు. ఒకరకంగా మేనరికాలవల్ల చాలామంది దాంపత్య జీవితాల్లో ఆకర్షణ, ఆనందం లోపిస్తూ వుంటే, మరో రకంగా మరుగునపడిపోయే వ్యాధులు, శారీరక బలహీనతలు బహిర్గతమవుతాయి. దీనివల్ల మొండి చర్మవ్యాధులు, కండరాల వ్యాధులు, నరాల జబ్బులు, మానసిక రుగ్మతలు తేలికగా రావడానికి ఆస్కారంవుంది. ఈ వ్యాధులు మేనరికాలు చేసుకోని వాళ్ళల్లో కూడా ఉన్నా, మేనరికాలు చేసుకొన్నవారిలోను, దగ్గరి బంధువులలో వివాహం చేసుకొన్న వాళ్ళల్లోనూ పదిరెట్లు ఎక్కువగా వస్తాయని శాస్త్రజ్ఞులు తమ పరిశీలనలో తెలియజేశారు.