ఎవరైనా సన్నగా ఉండేవాళ్ళు లావు అయిపోతూ ఉంటే దానికి తగిన శరీర శ్రమ లేదని భావించవలసి వస్తుంది. ఇక వాళ్ళు వచ్చిన దగ్గరనుంచీ కాళ్ళు వంగవు, నడుము వంగదు. మరి ఇంత ఇదిగా తయారైతే ఆరోగ్యమే దెబ్బతినిపోతుంది. అందుకనే శరీర వ్యాయామం లేనివాళ్ళు వాళ్ళు పెరిగి బాధపడటమే కాకుండా గుందేజబ్బులకి కూడా దారి అవుతూ ఉంటారు. మరి వాళ్ళు పెరగకుండా జాగ్రత్తపడడమెలా? అందుకని డాక్టర్ రూబిన్ వాళ్ళు పెరిగిన వాళ్ళందరికీ శాస్త్రీయంగా ఒక సలహా ఇచ్చారు.
ఇది ఇంకేమీ కాదు ... త్వరగా పెళ్ళి చేసుకుని సంయోగంలో ఎక్కువగా పాల్గొనమని! దీనివల్ల వంట్లో ఉన్న కొవ్వు కాస్తా కరిగిపోయి 'స్లిమ్'గా తయారవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఒకసారి సంయోగంలో పాల్గొంటే 159 కాలరీల శక్తి ఖర్చు అవుతుంది. రోజుకి ఎంత ఎక్కువసార్లు సంయోగం చేస్తే అంత ఎక్కువ కాలరీలు ఖర్చు అవుతాయి. మరి అంత కాలరీల శక్తి ఖర్చు అవడానికి వంట్లో ఉన్న క్రొవ్వు తరగకమానదు. ఒక ప్రక్క కరిగి తరిగిపోతూ ఉంటే గుండెకు కూడా శక్తి పెరుగుతుంది. ఎందుకంటే రతిలో పరాకాష్టను చేరినప్పుడు గుండె నిముషానికి 160 సార్లు కొట్టుకోవడం జరుగుతుంది. రక్తపోటు కూడా పెరుగుతుంది. ఇలా తాత్కాలికంగా గుండె ఎక్కువ పనిచేయడంతో దానికి కూడా వ్యాయామం అవుతుంది. గుండె కండరాలు బలంగా తయారవుతాయి. గుండె విషయం ఇలా వుండగా వెన్నుపూసకి, తక్కిన కీల్లకి మంచి వ్యాయామం అవుతుంది. కండరాలన్నీ చైతన్యవంతంగా తయారవుతాయి. ఒకసారి సంయోగంలో హుషారుగా పాల్గొనడమంటే పార్కు చుట్టూ పరుగెత్తుతూ నాలుగు రౌండ్లు కొట్టి రావడంతో సమానం. శరీర వ్యాయామంలో కేవలం శారీరకంగా బలం చేకూరితే సంయోగంలో శారీరక బలంతోపాటు మానసిక తృప్తి కూడా మిళితమై ఉంటుంది. దానివల్ల నరాలకి సంబంధించిన టెన్షన్ లేకుండా పోయి మనస్సు కుదుటపడ్తుంది. గుండెజబ్బు రావడానికి ముఖ్యంగా శరీర వ్యాయామం లేకపోవడం, వంటికి కొవ్వు ఎక్కువగా ఉండటం, మనస్సులో టెన్షన్ ఉండటం ముఖ్యకారణాలు. కనుక హుషారుగా సంయోగంలో పాల్గొంటే ఈ మూడు సమస్యలు తీరిపోయి మనిషి ఆరోగ్యంగానూ, స్లిమ్ గా తయారవుటాడని అంటారు డాక్టర్ డేవిడ్ రూబిన్.
లావుగా వున్న భార్య - సన్నగా వున్న భర్త :-
రతిలో తృప్తి కలగడానికి కావలసింది సామర్థ్యమే తప్ప లావు, సన్నం కాదు. చక్కని కామకళ తెలిసిన భర్త ఆరోగ్యంగా ఉండి, బాగా సన్నంగా ఉన్నా లావుగా ఉన్నా భార్యని రతిలో తృప్తిపరచి ఆమె మనస్సును దోచుకోగలడు. భర్తకి బాగా ఒళ్ళు ఉండి లావుగా ఉంటే మాత్రం రతిలో త్వరగా అలసట, ఆయాసం కలిగి రతిని అంత నైపుణ్యంగా కొనసాగించలేకపోవచ్చు. అయినా ఒంట్లో మంచి ఆరోగ్యం, శక్తి ఉంటే భర్త లావుగా ఉన్నా రతిలో అంత త్వరగా అలసిపోవడం జరగదు. అందుకని భార్యాభర్తల లావు-సన్నం బట్టి రతిలో, అసమర్తతని నిర్థారించడానికి వీలులేదు.
సంయోగము బలహీనతని కలిగిస్తుందా? :-
స్త్రీలోగాని పురుషులలోగాని సంయోగం జరపడం వల్ల శారీరకంగా బలహీనత జరగడమంటూ ఉండదు. కొందరు సంయోగం జరపడంవల్ల పురుషునికి వీర్యస్ఖలనం జరిగి శారీరక బలహీనత ఏర్పడుతుందని, అటువంటి వీర్యస్ఖలనం స్త్రీలలో వుండదు గనుక ఆమెకు మాత్రం ఎటువంటి బలహీనత కలగదని భావిస్తారు. కాని ఇది తప్పు అభిప్రాయం. అతిగా సంయోగంలో పాల్గొనబట్టి కామ గ్రంథులు అలసిపోయి శారీరకంగా అలసట కలిగి తాత్కాలికంగా కాస్త నీరసంగా అనిపించినా తిరిగి విశ్రేఆంటి తీసుకుంటే కొద్దిగంటల్లో తిరిగి పూర్తిగా కోలుకోవడం జరుగుతుంది. మామూలుగా మితంగా రతిలో పాల్గోనప్పుడు ఎప్పటికప్పుడు కోల్పోయిన శక్తిని శరీరం ప్రసాదిస్తూనే ఉంటుంది.