బరువు తగ్గడానికి ఆహారాన్ని క్రమేణా తగ్గించుకుంటూ రావాలి. అంతేగాని ఒకరోజున బరువు తగ్గాలని అనుకుని వెంటనే అన్నీ మానివేయడం సరైన పధ్ధతి కాదు. అలాగే త్వరగా బరువు తగ్గాలని ఉపవాసాలు చేయడం మరింత తప్పు. దానివల్ల కొంత విపరీత పరిణామాలు సంభవిస్తాయి. బరువు తగ్గ్గడానికి శ్రద్ధతో ఆహార నియమాలని పాటిస్తే తప్పక మంచి ఫలితం కనబడుతుంది. బరువు మొదటి దినాల్లో అంతగా తగ్గనట్లుగా అనిప్న్చినా పట్టుదల వీడకుండా నియమంగా భుజించుతూ ఉంటే బరువు తగ్గుతున్నట్లు తరువాత గమనించవచ్చు. బరువు ఎప్పుడూ ఒకే మిషను మీద చూసుకుంటూ ఉండాలి. ఒక్కొక్కసారి మిషను మీద బరువు చూసుకుంటూ ఉంటే తేడాలు వస్తూ ఉంటాయి. ఒకసారి బరువు తగ్గిన తరువాత కూడా ఆహార నియమాలని పాటిస్తూనే ఉండాలి. అంతేగాని తిగి అన్నీ తినివేయడం జరిగితే మళ్ళీ ఒళ్ళు వచ్చేస్తుంది.
నడిస్తే నాజూకుగా తయారవవచ్చు :-
ఆహారాన్ని మితంగా భుజించడమే కాకుండా రోజూ కనీసం ఒక మైలు నడిస్తే బరువు తగ్గడం జరుగుతుంది. నడవడం కూడా నిదానంగా కాకుండా వేగంగా నడిస్తే మంచి ఫలితం కనబడుతుంది. వెళ్ళేటప్పుడు ఎక్కువ దూరమైనా నడిచివెళ్ళి, నడిచివస్తే మంచిది. వంశపారంపర్యంగా లావు వచ్చేవాళ్ళు 20 సంవత్సరాలు వచ్చిన దగ్గరనుండే మితంగా భుజించడం, శరీర వ్యాయామం చేయడం చేస్తే లావు అవకుండా చేసుకోవచ్చు.
లావు తగ్గడానికి మందులు లేవా? :-
లావు తగ్గడానికి మందులు ఉన్నాయి. కాని ఆ మందులు వాడుతున్నా ఆహార నియమాలని పాటించాలి. శరీర వ్యాయామం చేయాలి. అయితే త్వరగా లావు తగ్గడం జరుగుతుంది. ఈ వ్యాసం చివర ఇచ్చిన బరువు పట్టిక ద్వారా ఏ వ్యక్తి అయినా తన వయస్సు, ఎత్తునిబట్టి ఉండవలసిన బరువుకంటే ఎంత ఎక్కువ ఉన్నదీ నిర్థారణ చేసుకోవాలి. వయస్సు, ఎత్తు ఒకటే అయినా స్త్రీ-పురుషుల బరువులు ఆయా వయస్సులకి వేరువేరుగా ఉంటాయి. పట్టికలో ఇచ్చిన బరువుకంటే 10 శాతం బరువు ఎక్కువ ఉంటే తాము ఉండవలసిన బరువుకంటే ఎక్కువ ఉన్నట్లు భావించాలి. ఆహారం విషయంలో జాగ్రత్త వహించడం, మందు బిళ్ళలు వాడటం చేయాలి. పట్టికలో ఇచ్చిన బరువుకంటే 10 శాతం నుంచి 25 శాతం బరువు ఎక్కువ ఉంటే ఒక మోస్తరుగా బరువు అధికమనే భావించాలి. అలాకాక పట్టికలో ఇచ్చిన బరువుకంటే 25 శాతం మించి ఉంటే మంచి ఆరోగ్యానికి హానికరమైన ఒళ్లుగా భావించి తప్పక బరువు తగ్గడానికి కృషి చేయాలి.
బరువు తగ్గడానికి స్లిమిరాక్స్ టాబ్లెట్లుగాని, పాండెరాక్స్ ట్లాబ్లెట్లుగాని, ఫ్లబోలిన్ టాబ్లెట్లుగాని వాడవచ్చు. వీటిలో ఏ ఒక రకమైనా టాబ్లెట్లు వదినా చాలు. ఒక మోస్తారుగా బరువు ఎక్కువ ఉన్నవాళ్ళు బిళ్ళలు మొదలుపెట్టిన మొదటి వారంలో రోజూ ఒకటి, రెండవ వారంలో ఉదయం ఒకటి, రాత్రి ఒకటి, మూడవ వారంలో ఉదయం ఒకటి, రాత్రి రెండు బిళ్ళలు చొప్పున వరసగా ఇంకా 10 వారాలు వాడాలి. ఎక్కువ బరువు ఉన్నవ్య్యక్తులు మూడవ వారంనుంచి ఉదయం రెండు మధ్యాహ్నం రెండు రాత్రి రెండు చొప్పున వరసగా 10 వారాలు వాడాలి. బరువు తగ్గడానికి బిళ్ళలు వాడటం మొదలుపెట్టిన 4 వారాల వరకు పెద్దగా బరువు తగ్గినట్టు కనిపించదు. 4 వారాల తరువాత నుంచే బరువు తగ్గడం కనిపించుతుంది. అయినా బిళ్ళలు మొదలుపెట్టిన దగ్గరనుంచి ప్రతి వారం బరువు ఎంత తగ్గుతున్నదీ నోట్ బుక్ లో వ్రాస్తూ ఉండాలి. తగ్గవలసిన బరువు తగ్గినా తరువాత నిదానంగా బిళ్ళలు మోతాదులో తగ్గిస్తూ మానివేయవచ్చు. మాత్రలు వాడుతూ మధ్యలో మానివేసినా ఏమీ అవదు. బిళ్ళలు అన్నం తినగానే వేసుకోవచ్చు లేదా ముందుగానైనా వేసుకోవచ్చు.