నువ్వుల ఘోషలత, వేలిగారము, మనిశిల, జాజిపూలను నువ్వుల నూనెలో వేసి కాచి వారము రోజులు ఆ తిలముతో లింగమర్థన చేసిన ఎడల లింగము వృద్ధి చెందును. నువ్వులు, దానిమ్మ, వాకుడు, చెంగల్వకోష్టు, జీడి గింజలను ఆవనూనెలో కాచి లింగ లేపనము చేసిన అది వృద్ధి చెందును. (జీడిగింజలు అంగానికి తగిలితే వాపు కలుగుతుంది జాగ్రత్త) సైంధవలవణం, నాచు, కమల నాళము, నాగ జెముడుతో జీడి గింజలను ధూపము వేసి దానిని వాకుడు రసముతో భావన చేసి లింగ లేపము చేసిన వృద్ధి చెందును. చెంగల్వకోష్టు, నాచు, గోమూత్రములను వెన్నతో కలిపి లేపము చేసిన లింగవృద్ధియగును.
జీడిగింజ, పేడ, నాచు, అశ్వగంథ, సైందవలవణములను సమముగా గ్రహించి నూనెతో గాని, నేతితో గాని తైలపక్వముగా కాచి లేపనము చేసిన లింగము వృద్ధిచెందును. తేనె, గ్రంధితగరము, తెల్లవాలు వాకుడు, ఉత్తరేణి, పిప్పలి, నువ్వులు, యవలు, చెంగల్వ కోష్టి, మిరియములు, ఉప్పు, అశ్వగంధ, మినుములు, నిరంతరమూ లేపనము చేసిన స్తనములు, కపాలము, మెడ, లింగాదులు నిశ్చయముగా దృఢమగును. జీడి గింజలు, వాకుడు గింజలు, దానిమ్మ పండు ముద్దుగా చేసి, ఆవనూనేతో కాచి లింగమునకు మర్థించిన లింగము గుర్రపు లింగం లాగా స్థూలమగును. పద్మదలము, జీడి, నల్ల ఉప్పులను వాకుడు రసములో భావన చేసి, పేడతో కలిపి లింగ లేపనము చేసిన రోకలిలాగా లావుగా అవుతుంది. మదనవిహ్వల యువతీజనుల దర్పాన్ని అణుస్తుంది. వాకుడు పండు, జీడి, పద్మదలము, నాచులను వెన్నతో కలిపి గాని, అశ్వగంధమూలమును గేదె పేడతో కలిపి గాని లేపనము చేసిన లింగము గాడిద లింగమువలె ఉందును. ఉమ్మెత్త ఆకు రసములో అశ్వగంధను కలిపి, దానిలో ఆవుపేడను గూడ కలిపి, వెన్నతో లింగమునకు లేపనము చేసిన గుర్రపు లింగం లాగా మరియు హస్తినీజాతి స్త్రీలను కూడా సంతృప్తి పరచగలుగుతారు. స్థూలమగును..
|
|


