The content in this feature is rated as "A++". You must be at least 18 years old to view this feature.
Home>>Vasheekaranadhikaramu
వశీకరణాధికారము

"ఓం హలీం నమః'' అను మంత్రమును ఏడు లక్షలు జపించిన పురుషుడు స్త్రీలకూ మన్మధుని వలెను, బృహస్పతి వేలును, గరుత్మతుని వలెను, సాక్షాత్తు మన్మథునివలెనూ అనిపించును. కుండలినీ మంత్రమును ఇరవై వేలు జపము చేసి, పాటలీ పుష్పములతో హోమము చేసిన సిద్ధించును. కంఠ, హృదయ, ముఖ, మదన మందిరములపైన హృదయమున కృష్ణ వర్ణము, వదనమందు శ్వేత వర్ణము, కంఠమున పీత వర్ణముపై ప్రదేశములందు ధ్యానించిన ప్రభువును, శత్రువును, సరస్వైని, స్త్రీని వశము చేయును. పీత వర్ణము ప్రభువును, కృష్ణ వర్ణము శత్రువును, శ్వేత వర్ణము సరస్వతిని రక్త వర్ణము స్త్రీని వశము చేయును. 'ఓం మద మద మాదయ మాదయ హంసౌం హ్రీం రూపిణీం స్వాహా' ఈ మంత్రమును పదివేలు జపము చేసి ఎర్రని పుష్పములతో ఒక వేయి హోమము చేసిన సిద్ధించును. పునశ్చరణ తరువాత స్మరమందిరమును ఎడమ చేతి బొటనవ్రేలితో స్పృశించవలెను. ఆ విధముగా చూసిన ఆమె వెంటనే ద్రవించును.

 

హృల్లేఖ మంత్రమును లక్ష జపము చేసి, దశాంశము (పదివేలు) తిలలతో (నువ్వులతో) హోమము చేసిన సిద్ధిని పొందును. ఈ మంత్రమును సూర్యోదయ సమయమున జపించిన క్రూరస్వభావం కళ స్త్రీని గూడ ఆకర్షించును. సామాన్య స్త్రీల విషయము చెప్పనేల? "ఓం హృల్లీఖమణి ద్రవే కామరూపిణి స్వాహా'' అనునది హృల్లేఖ మంత్రము, ఈ మంత్రమును రెండు లక్షల జపము చేసి అనంతరము కదంబ పుష్పములతో ఒక లక్ష హోమము చేసిన పతివ్రతలు గూడ వశమగుదురు. నాడీ, తాడ బీజములను గోరోచానములో కలిపి కన్య చేత చూర్ణము చేయించి శిరస్సుపై చల్లిన ఆ స్త్రీ వెంటనే వశమగును. "ఓం క్రీం హ్లీం శ్రీం ఢే0 స్వాహా'' అనునది సప్తాక్షర మంత్రము. "ఓం చాముండే జయ జమ్మే మోహాయ వశ మాన్య ఆముకీం (పేరు) స్వాహా'' ఈ మంత్రముతో అభిమంత్రించిగాని, పూజచేసి గాని పుష్పములు స్త్రీకి ఇచ్చిన ఆమె వశమగును.