.png)
అలాగే చూస్తుందిపోయడు ఆంజనేయులు తండ్రి. తలారా స్నానం చేసిన వ్యక్తి అలాగే తడి దుస్తులతో ఓ మొక్క దగ్గరికి వెళ్ళాడు. ఓ ఆకు కోశాడు. బెల్లం ముక్క తీసుకొచ్చి ఆ ఆకులో పెట్టాడు. ఆ వైవేద్యాన్ని ఏ అదృశ్య దేవతకో నివేదిస్తున్నట్టు పూజ చేశాడు. చివరగా ఆకుతో సహా ప్రసాదం తీసికెళ్ళి తన ఇంటి పిట్టగోడ మీద వుంచాడు. ఆ పిట్టగోడ ఆంజనేయులు ఇంటికి అతడి ఇంటికి సరిహద్దు గోడ.
మరొక్క మారు తలారా స్నానించాడు. అంగోస్త్రం మార్చుకున్నాడు. అందరి వలెనే తానూ తదుపరి పూజా కార్యక్రమానికి ఉపక్రమించాడు. అయితే అతడు ఆకులో బెల్లం ముక్క పెట్టి ప్రసాదంగా సరిహద్దు గోడమీద పెట్టడంలో ఉద్దేశం - శనిదేవునికి ప్రసాదం పెట్టడమే. ఆ బెల్లం ముక్కని కాకి రూపంలో వచ్చి శని స్వీకరిస్తాడని అతడి మూఢనమ్మకం. కాని ఆ దృశ్యాన్ని చూసిన ఆంజనేయులు తండ్రి పరిస్థితి మరోలా అర్థం చేసుకున్నాడు.
వీడేదో దుష్ట శక్తిని పూజచేసి నా ఇంటిమీదకు విడిచి పెడుతున్నాడు అనుకున్నాడు. ఉదయం అయ్యప్ప వేషంలో గోడ దూకి పారిపోయిన వాడు ఎడమవైపున వుంటే, వీడు ఆంజనేయులు ఇంటికి కుడివైపున వుంటాడు. పైపెచ్చు పారిపోయిన వాడు, వీడు మంచి స్నెహితూ. "అమ్మాయి వాడి నల్లడ్రెస్ చూసి వాణ్ణి ఓ మంత్రగాదని భ్రమపడిందిగాని, అసలు మంత్రగాడు వీడే ... కాకుంటే తడి బట్టలతో పూజలేమిటి? అయినా ఇంత అర్థరాత్రి వేళ తలారా స్నానమేమిటి? అనుకున్నాడు.
అంతేగాని అప్పుడు సమయం తెల్లవారు జామున నాలుగున్నర అయిందని ఆంజనేయులు తండ్రికి తెలియదు. 'వెదు మంత్రగాడే ... సందేహం లేదు' అని నిర్ణయించుకుని, నెమ్మదిగా ఆంజనేయులు పడకగది దగ్గరకు వెళ్ళాడు. సరసికి మెళకువ కాకుండా జాగ్రత్త పడుతూ ఆంజనేయుల్ని నిద్రలేపాడు. తండ్రి సైగల్ని అర్థం చేసుకున్న ఆంజనేయులు పిల్లిలా బయటపడ్డాడు.
ఆ సమయంలో పక్కింటివాడు పెరట్లోకి వెళ్ళి ఏవేవో మొక్కలు పీకుతున్నాడు. కామెర్ల రోగులకి నాటు వైద్యం చేస్తాడతను. నేల వుసిరి మొక్కలు తీసుకొచ్చి ఎవరికీ ఆనవాలు దొరక్కుండా మెత్తగా నూరసాగాడు.
"చూశావా ... వీడి తంతు ఇది. అర్థరాత్రి వేళ లేచాడు. తలారా స్నానం చేశాడు. పిండితో బొమ్మని చేసి ఆకులో పెట్టాడు. ఏవేవో మంత్రాలు చదివి, ఆ బొమ్మని ఆకుతోసహా ఇంటి గోడమీద పెట్టాడు. ఇప్పుడు కనికట్టు కట్టడానికి పసర్లు తీస్తున్నాడు. అమ్మాయి మీద గాలిని ప్రయోగించిన అసలు మంత్రగాడు వీడే. ఏమంటావు?'' అని అడిగాడు తండ్రి. తండ్రి చెప్పిందంతా సబబుగానే కనిపించింది ఆంజనేయులుకి.
"నాన్నా, ఈ మంత్రగాళ్ళు శత్రువుల మీద మంత్రించి ఉమ్మి వేస్తారట గదా ... మన మీద ఆ పనిచేస్తే?''
"వాడికి ఆ అవకాశం ఇవ్వకుండా వాడికి మంత్రం పనిచేయకుండా వాడి దంతాలన్నీ రాలగొడదాం. అప్పుడు వాడు మనల్నేం చేయలేడు. అయితే, వాడు తేరుకుని జరుగుతున్నా దేమిటో గ్రహించేలోపే మనం వాడి దంతాలు రాలగొట్టాలి. లేకుంటే వాడు మంత్రించి మన మొహాన ఉమ్మివేసే ప్రమాదం వుంది'' అని తండ్రీ, కొడుకులు ఇద్దరూ కూడబలుక్కున్నారు.
కామెర్ల రోగులకు పసర మందు తీస్తున్న ఆ నాటు వైద్యుడి మీదకు దండయాత్ర చేశారు. అతడి నోట్లోని దంతాలన్నీ రాలగొట్టారు. ఆ గొడవకి ఆ నాటు వైద్యుడి ఇంట్లో వారే కాదు, ఆంజనేయులు ఇంట్లోని వారు ఆ పక్కింటి వారు కూడా నిద్రలేచారు.
|
|


