The content in this feature is rated as "A++". You must be at least 18 years old to view this feature.
Home>>Psycho
సైకో - 72

"గాయత్రీ ... ఇలా నీకు వచ్చిన ప్రమాదం ఏమీలేదు. నీకు అండగా నేను వుంటాను. కాని జయంత్ వద్ద స్టాఫ్ పిక్నిక్ ఫోటోలు, నీ ఫోటోలు వున్నాయి అవి అతని వద్ద వున్నతకాలం మనకి ప్రమాదం. ముందు ఆ ఫోటోలని, నేగిటివ్స్ ని నాశనం చేయాలి. లేకుంటే అటువంటి సైకో పాత్ ఆ ఫోటోలని ప్రతి బస్ స్టాప్ లోను అతికించగలడు'' రజిత మాటలు వింటూనే వణికిపోయింది. గాయత్రి ... ఆమె కళ్ళముందు తన నగ్న ఫోటోలు బస్ స్టాప్ లో డిస్ ప్లే చేసినట్టు కనిపించసాగాయి.

"గాయత్రీ ... ఈ క్షణాన మనం పోలీసులకి ఫిర్యాదు చేస్తే పోలీసులు రెయిడ్ చేసి ఫోటోలు, నేగిటివ్స్ స్వాధీనం చేసుకుంటారు. అతడిపై కేసు బుక్ చేస్తారు. అటువంటి మానసిక రోగికి ఇవ్వవలసింది పనిష్మెంట్ కాదు ... షాక్ ట్రీట్ మెన్. అది రెండవ ఘట్టం. ముందు మనం ఈ విషయమై అల్లరి పడకుండా ఇంట్లోని నేగిటివ్స్, ఫోటోలని చేజిక్కిన్చుకోవాలి, తగులబెట్టాలి'' గాయత్రికి ఆలోచించుకునే వ్యవధి కూడా ఇవ్వకుండా బయల్దేరదీసింది.

ఇద్దరూ బంగ్లాకి బయల్దేరారు. తన ఇళ్ళు సమీపిస్తుంటే గాయత్రి కాళ్ళు వణికాయి. ఆమె భయానికి కారణం లేకపోలేదు తాను బీఉవా తెరిచి ఫోటోలు చూస్తుంటే ఆ ఫోటోలు అక్కడికి ఎలా వచ్చాయో సంజాయిషీ ఇచ్చుకోవాల్సినవాడు, తాను బీరువా తెరిచినందుకు విపరీతార్థాలు తీశాడు. మిండ మొగుడు కోసం మూటాముల్లె సర్దుకుంటున్నావని ఆరోపించాడు. అటువంటివాడు ఇప్పుడు రజితని కూడా చూస్తే రజిత సందానకర్తగా వ్యవహరిస్తోందని ఆడిపోసుకుంటాడు ... మూడో మనిషి తమ మధ్య వున్నదన్న సంగతే మర్చిపోయి తిడతాడు. అందుకే గాయత్రి భయపడుతోంది.

అలా తిట్టేది జయంత్ ఒక్కడే కాదు ... ఈ సభ్య సమాజంలో అటువంటి జయంత్ లు ఎందఱో వున్నారు. తమ తాగుడు వ్యసనాన్ని, తమ జూదం వ్యసనాన్ని, తమ వ్యభిచార వ్యసనాన్ని ... ఒక్కమాటలో చెప్పాలంటే తమ బలహీనతల్ని కప్పిపుచ్చుకోవడానికి భార్య తమ వ్యసనాల్ని వేలెత్తి చూపకుండా వుండడానికి మగవాడు వుపయోగించే అస్త్రం ఆమె శీలాన్ని వేలెత్తి చూపడం. ఆమె ఫలానా వాడితో తిరుగుతుందని అతడు గొంతు చించుకుంటే ఆమె సిగ్గుతో చితికిపోయింది.

పరాయివాళ్ళ మొహంలోకి చూడడానికి భయపడుతుంది .ఇంట్లో నుంచి బయటక ఉరావడం మానేస్తుంది. భర్త ఎక్కడ నోరు తెరుస్తాడో, తనని ఎక్కడ వీథిలో పెడతాడోనని బితుకు బితుకుమంటుంది. గాయత్రి భయాందోళనలతో ప్రమేయం లేకుండా గాయత్రితో బీరువా తెరిపించిన రజిత ఆ ఫోటోలను, నెగటివ్స్ ని గ్యాస్ స్టౌ మీద తగులబెట్టింది. ఆ పని పూర్తయిన తర్వాత అన్నది రజిత

"గాయత్రీ ... నేను మొదట్నుంచీ అనుమానిస్తూనే వున్నాను. కాని నీవు కూడా నా నుంచి దాదాపు పెళ్ళికి వరుని ఆస్తి, చదువు, ఉద్యోగం, అందం చూస్తారు మనవారు. జాతకాలు కలిస్తే శుభమొహూర్తం చూసి పెళ్ళి చేస్తారు. కాని పెళ్ళికి ముందు అతడికి వంశపారంపర్యంగా వచ్చే జబ్బులు ఏమైనా వున్నదీ లేనిదీ గమనించం. సైకలాజికల్ గా అతడి ప్రవర్తనని స్టడీ చేయం. పెళ్ళికి ముందు 'కౌన్సిలింగ్' అనేది ఒకటి తున్తుందని, కాబోయే భార్యాభర్తలు కౌసిలింగ్ కి వెళ్ళడం మంచిదని మనకి తెలియదు. అందుకే మన వివాహాలు విఫలమయ్యేది. బెటర్ లేట్ దెన్ నెవర్ ... రా, ఇక్కడ ఇహ ఒక్క క్షణం కూడా వుండవద్దు.''

"ఎక్కడికి ...?''

"ఇంకెక్కడికి ... మీ అమ్మానాన్న దగ్గరికి''

"వద్దు రజితా ... శ్రీరాముడు మళ్ళీ జన్మ ఎత్తితే జయంత్ లా వుంటాడని మా వాళ్ళు అనుకుంటున్నారు. జయంత్ విషయం వింటే మా వాళ్ళు తట్టుకోలేదు. పైపెచ్చు నాన్నగారి ఆరోగ్యం సరిగా లేదు ...''

"డోంట్ బి ఫూలిష్ ... నిన్ను మీవాళ్ళ దగ్గరికి కాకపొతే వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ లో వుండగలను. లేదా మా ఇంటికి తీసుకువెళ్ళగలను. కాని నేను కోరుకుంటున్నది నీ జీవితానికి శాశ్వత పరిష్కారాన్ని. ఈ రోజున కాకపొతే రేపయినా మీవారికి తెలియవలసిందే ...''

"లేదు రజితా ... భర్తని విడిచిన భార్యని మావాళ్ళు గౌరవించరు''

"గాయత్రీ ... ఇది సతీ అనసూయల కాలం కాదు. ఇరవయ్యో శతాబ్దం. ప్రస్తుతం స్త్రీ ఎదుర్కొంటున్న సమస్య. వర్ణాంతర వివాహం కాదు, కట్న సమస్య కాదు, ఉద్యోగ సమస్య. ఉద్యోగం చేస్తున్న స్త్రీకి ఆర్ధిక స్వాతంత్ర్యం వుంటుంది. ఆర్ధిక స్వాతంత్ర్యంతో వ్యక్తిత్వం వస్తుంది. వ్యక్తిత్వంతో సామాజిక విలువ, గౌరవం, గుర్తింపు లభిస్తాయి. ఒక మానసిక రోగితో రోజూ తన్నులుతింటూ, ప్రతి రాత్రీ ఓ కాళరాత్రిలా గడపవలసిన అవసరం నీకు లేదు. పెళ్ళయి కొద్ది నెలలే అయింది. ఈ కొద్ది కాలాన్ని పీడకలలా మర్చిపో. నీ జీవితాన్ని నీవు సరిదిద్దుకో ... ముందు ఈ కూపం నుంచి బయటపడు. తర్వాత ఏమిటి అన్నది ఆలోచిద్దాం ...''

"అది నావల్ల కాదు రజితా ...''