.png)
ఆ మర్నాడు స్వప్న ఆఫీసుకి సెలవు పెట్టింది.
స్వర్ణకి ఫోన్ చేసి రమ్మని చెప్పింది. మధ్యాహ్నం ఆమె వచ్చింది.
”ఈవేళ నాక్కొంచెం పనుంది వదినా! అందుకని …”
”చెప్పమ్మా!” అంది స్వర్ణ.
”పిల్లల్ని నీతో తీసుకెళ్ళు” అంది.
”ఏమిటి విషయం?”
స్వప్న సిగ్గుతో మొహం దించుకుంది.
”అర్థమయింది” అంది స్వర్ణ. స్కూల్ నించి వచ్చిన పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయింది స్వర్ణ.
సాయంత్రం ఇంటికొచ్చిన భర్త జూనియర్స్ కి ఆరోజు సెలవిచ్చి పంపేసింది.
ఆ రాత్రి రాజారావు ఇంట్లో అడుగుపెడుతూనే నిశ్శబ్ద వాతావరణాన్ని చూసి — ”పిల్లలేరి?” అడిగాడు.
”మా ఇంటికి పంపాను”
”దేనికి?” ఆశ్చర్యంగా అడిగాడు.
”ఈవేళ … ఇంట్లో మనిద్దరమే వుండాలి” అంది నేలకేసి చూస్తూ స్వప్న.
రాజారావు చిరునవ్వు నవ్వాడు. చక్కగా అలంకరించి వున్న పడక గదిని చూసి ఆమెని పొదవి పట్టుకుని మంచం దగ్గరికి నడిచాడు రాజారావు.
అతని మొహంలోకి చూస్తూ — ”ఐ లవ్ యూ సర్” అంది.
అతను ఆమెని దగ్గరికి తీసుకుని మత్తుగా తన గుండెలకి అదుముకున్నాడు. ఒక నిజాయితీ, ఒక చక్కని అనుబంధం, కవచంలాంటి రక్షణ, అసలైన ప్రేమ …. తోడూ … అన్నీ ఆ కౌగిలిలో ఆమెకు దొరికినట్టు అనిపిస్తోంది. నిజమైన ప్రేమపిలుపు …. ఆమెకి అతని గుండె చేస్తున్న సవ్వడిలో వినబడుతోంది.
— అయిపొయింది —
|
|

