The content in this feature is rated as "A++". You must be at least 18 years old to view this feature.
Home>>Sex Problems in Old Age
వృద్ధాప్యంలో సెక్స్ సమస్యలు

ఒక పరిశోధనలో 1844 మంది ఆడవారిని చూడగా 93 శాతం మంది 50 లలో, 81 శాతం మంది 60 లలో , 65 శాతం మంది 70 లలో శృంగారంలో చురుకుగా పాల్గొన్నట్టు చూశారు. అదే 2402 మంది మగవారిని పరిశీలించగా 50 నుంచి 59 సంవత్సరముల మధ్య వయసు కలవారిలో 98 శాతం మంది, 60 నుంచి 69 మధ్య వయసు కలవారిలో 91 శాతం మంది, 70 దాటినవారిలో 79 శాతం మంది శృంగారంలో చురుకుగా పాల్గొన్నట్లు చూశారు. వయసు మళ్ళిన వారు అడిగే ముఖ్యమైన ప్రశ్న ఏ వయసు వరకు శృంగారంలో పాల్గోవచ్చు? 60 ఏళ్ళు దాటిన వారు కూడా శృంగారంలో పాల్గొంటారా? అన్నవి. శృంగారానికి ఎంత వయసు కలవారైనా పాల్గొనవచ్చు. 60 లు దాటినవారు కూడా అనేకమంది శృంగారంలో పాల్గొంటారు. మంచి ఆహారం తీసుకోవడం, ఆరోగ్యంగా వుండడం, తగినంత వ్యాయామం చెయ్యడం, మానసిక దిగులు లేకుండా వుండడం - ఇవన్నీ ముఖ్యమైనవి. ప్రపంచంలో వృద్దుల సంఖ్య పెరుగుతోంది. రాబోయే 30 సంవత్సరాలలో మూడురెట్లు అవుతోంది అని ఒక అంచనా.

 

గడిచిన దశాబ్దాలలో శిశుజననాల రేటు తగ్గడం, మరణాల రేటు తగ్గడంలో వృద్దుల సంఖ్య అంటే 65 ఏళ్ళు నిండిన వారి సంఖ్య రాబోయే 25 సంవత్సరాలలో 82 శాతం పెరుగు తుందని శిశువుల సంఖ్య 3శాతం పెరుగుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు. పనిచేసే వారి సంఖ్య 46 శాతం మాత్రమే పెరుగుతుంది. అందువలన వృద్దులు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరమవుతాయి. వృద్దాప్యంలో శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. వివిధ శరీర క్రియలలో మార్పులు ముఖ్యం కండరాలు, మెదడు, ఎముకలు, కేంద్రీయ నాడీమండలం వీటి కార్యాలలో మార్పులు సంభవిస్తాయి. టెస్టోస్టిరాన్, గ్రోత్ హార్మోన్లు కూడా తగ్గడంతో కండరాల పరిమాణం, వాటిలో శక్తి తగ్గుతుంది. ఎముకలు, కండరాలు ఆరోగ్యంగా వుండడానికి వ్యాయామం అత్యంత అవసరం. కండరాల శక్తి తగ్గినందువలన వృద్దులు వ్యాయామంలో పాల్గొనలేరు. వ్యాయామం లేనందువలన కండరాల శక్తి తగ్గుతుంది. కీళ్ల వ్యాధులు కూడా సమస్యను మరింత పెంచుతుంది. సౌల్యం మరొక సమస్య. దీనినుంచి టైప్ - 2 డయాబెటీస్, గుండెజబ్బులు కలుగుతాయి. ఇవి కూడా వృద్దులలో ఎక్కువవుతాయి...మెదడు కార్యాలలో కూడా మార్పులు సంభవిస్తాయి. ఆల్జీమర్స్ డిసీజ్ లో హార్మోన్ల కారణాలు కూడా చూశారు. మహిళలలో ఈస్ట్రోజెన్ రీప్లేస్ మెంట్ ట్రీట్ మెంట్ వలన ఉపయోగం వుంటుంది. మగవారి వయసు పెరిగేకొద్దీ టెస్టోస్టిరాన్ పరిమాణం తగ్గుతుందని చూశారు.

 

ఆరోగ్యవంతులైన మగవారిలో ఫ్రీటెస్టోస్టిరాన్ పరిమాణం తగ్గుతుందని అనేక పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ఆండ్రోజెన్స్ కు ప్రత్యుత్పత్తికే కాక అనేక ఇతర కార్యాలు కూడా వున్నాయి. కండరాల, ఎముకల శక్తిని కొనసాగించడం, అలాగే సెక్స్ కు సంబంధం లేని ఇతర మానసిక కార్యాలకు కూడా ఆండ్రోజెన్స్ అవసరమవుతాయి. మగవారిలో ఆండ్రోజెన్స్ లో కొద్దిభాగం ఈస్ట్రోజెన్ గా మారి అనేక కార్యాలు నిర్వహిస్తాయి. కేవలం ఆండ్రోజెన్స్ మాత్రమే కాకుండా గ్రోత్ హార్మోన్, ఎడ్రినల్ నుంచి వచ్చే ఆండ్రోజెన్స్ కూడా వయసు పెరిగేకొద్దీ తగ్గుతాయి. ఆండ్రోజెన్స్, గ్రోత్ హార్మోన్లు కలిసి కార్యాలు నిర్వహిస్తాయి. 25 నుండి 75 సంవత్సరాల మధ్యగల ఆరోగ్యవంతులయిన మగవారిలో సుమారు 30 శాతం మందిలో టెస్టోస్టిరాన్ పరిమాణం తగ్గినట్లు అనేక పరిశోధనలలో చూశారు. సెక్స్ హార్మోన్ బైండింగ్ గ్యోబ్యులిన్ వయసుతోపాటు పెరుగుతుంది. దీనితో కలవని టెస్టోస్టిరాన్ సుమారు 50 శాతం తగ్గుతుంది. వయసు పెరిగేకొద్దీ శరీరంలో కలిగే అనేక వ్యాధులు కూడా టెస్టోస్టిరాన్ పరిమాణం తగ్గేట్టు చేస్తాయి.

 

ముఖ్యంగా ఫ్రీ టెస్టోస్టిరాన్ వయసు పెరిగేకొద్దీ తగ్గుతుంది. 20 నుంచి 100 సంవత్సరాల మధ్యవయసు తగ్గినట్లు చూశారు. 80 ఏళ్ళునిండిన మగవారిలో 15 శాతం మందిలో టెస్టోస్టిరాన్ పరిమాణం మామూలుగా వున్నట్లు చూశారు. మగవారిలో టెస్టోస్టిరాన్ అనేక కార్యాలు నిర్వహిస్తుంది. యవ్వనంలో సెకండరీ క్యారెక్టర్స్ కలిగించడం, ప్రత్యుత్పత్తి, సెక్స్ కోర్కెలు కలిగించడం, మంచి మూడ్ కలిగించడం, ఎముకలు, కండరాలలో ఎనబాలిక్ ఎఫెక్ట్స్ కలిగించడం ముఖ్యమైనవి. టెస్టోస్టిరాన్ తగ్గినప్పుడు దీనిలో లోపంవలన కలిగే లక్షణాలు నెమ్మదిగా కలుగుతాయి. మగవారిలో వయసు పెరిగేకొద్దీ ఈస్ట్రోజెన్ పరిమాణంలో మార్పులేమీ వుండవు. ఫలితంగా వయసు పెరిగేకొద్దీ ఈస్ట్రోజెన్ మరియు ఆండ్రోజెన్ ల నిష్పత్తి పెరుగుతుంది. సెక్స్ హార్మోన్ బైండింగ్ గ్యోబ్యులిన్ టెస్టోస్టిరాన్ తోనే కాకుండా ఈస్ట్రోడియోల్ తో కూడా కలుస్తుంది. వయసు పెరిగేకొద్దీ ఈ సెక్స్ హార్మోన్ బైండింగ్ గ్యోబ్యులిన్ పరిమాణం కూడా పెరుగుతుంది. కనుక ఫ్రీ ఈస్ట్రోడియోల్ పరిమాణాలు కూడా తగ్గుతాయి. బోన్ మినరలైజేషన్, స్కెలెటన్ మ్యాచ్యురేషన్ లో ఈస్ట్రోజెన్ లు ప్రధానపాత్ర పోషిస్తాయి. రక్తంలో లిపిడ్స్ లో కూడా మార్పులు ఈస్ట్రోజెన్ తగ్గినప్పుడు కలుగుతాయి. ఆండ్రోజెన్ లు సెక్స్ కలిగించడంలో ముఖ్యపాత్రను పోషిస్తాయి. అంగస్తంభన విషయంలో ఆండ్రోజెన్ లు పాత్ర ఇంకా పూర్తిగా నిర్దారించబడలేదు. సాధారణంగా 20 నుండి 50 సంవత్సరాల మధ్య వయసులో వుండాల్సిన దాంట్లో 60 నుండి 80శాతం పరిమాణంలో ఆండ్రోజెన్ వున్నా సెక్స్ కార్యాలు మామూలుగానే కొనసాగుతాయి. వయసు పెరిగేకొద్దీ ఆండ్రోజెన్ లకు సెన్సిటివిటీ తగ్గుతుందని కొందరు భావిస్తున్నారు.

 

వయసు పెరిగేకొద్దీ అంగస్తంభన సమస్య ఎక్కువగా వుంటుంది. సెక్స్ కోర్కెలలో పెద్ద మార్పులేమీ వుండవు. అందువలన వయసు మళ్ళీనవారిలో ఆండ్రోజెన్ ఇచ్చినందువలన సెక్స్ కార్యాలలో మార్పులు కలుగుతాయని ఖచ్చితంగా చెప్పలేము. టెస్టోస్టిరాన్ పరిమాణాలు తగ్గినవారిలో గుండెజబ్బులకు సంబంధించిన రిస్క్ ఫ్యాక్టర్లు, అధికరక్తపోటు, ఇన్సులిన్ రెసిస్టెన్స్, ట్రైగ్లిసరాయిడ్స్, పెరుగుదల, స్థౌల్యం వున్నట్లు చూశారు. అందువలన గుండెజబ్బులున్నవారిలో టెస్టోస్టిరాన్ ఇచ్చినందువలన ఏమైనా ఉపయోగం వుంటుందా అన్న విషయంపై అనేక పరిశోధనలు జరిగాయి. కొన్ని పరిశోధనల్లో పెద్దగా ఉపయోగం లేదని చూడగా, మరికొద్ది పరిశోధనలలో అనేక ఉపయోగాలు కలిగినట్లు ఎక్కువగా వుంటాయి కనుక ఇతర పరీక్షలతో పాటు ఫ్రీ టెస్టోస్టిరాన్ పరీక్ష కూడా చేయడం మంచిది. వీటి పరిమాణం తక్కువ వున్నవారిలో టెస్టోస్టిరాన్ ఇచ్చినందువలన ఉపయోగాలు ఏమైనా కలుగుతాయా అన్నది జాగ్రత్తగా గమనించాలి.

 

ప్రోస్టేట్ వ్యాధి: వృద్దులలో ఆండ్రోజెన్ లు ఇచ్చినప్పుడు కలిగేటువంటి ముఖ్యమైన సమస్య ప్రోస్టేట్ గ్రంధి పెద్దవ్వడం లేదా ప్రోస్టేట్ క్యాన్సర్ ఎక్కువవ్వడం. ఈ రెండు కండీషన్స్ ఆండ్రోజెన్స్ కలిగించకపోయినా వాటిని కొనసాగించడంలో సహాయపడతాయి. కనుక జాగ్రత్తగా వుండాలి. అనేక పరిశోధనలలో వయసు పెరిగేకొద్దీ ప్రోస్టేట్ క్యాన్సర్ కలిగే అవకాశాలు ఎక్కువవుతాయి అని చూశారు. 60 నుండి 70 సంవత్సరాల మధ్యవయసు కలవారిలో 33 నుండి 50 శాతం మందిలో ప్రోస్టేట్ క్యాన్సర్ తొలిదశలో గుర్తించారు. వీరిలో 4 నుండి 5 శాతం మందిలోనే అది పూర్తిస్థాయి క్యాన్సర్ గా మారడం చూశారు. పాశ్చత్య జీవనవిధానాలు వున్నచోట్ల ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ ఎక్కువగా వున్నట్లు చూశారు. టెస్టోస్టిరాన్ లోపంలేని వారిలో కొద్దికాలం టెస్టోస్టిరాన్ ఇచ్చినప్పుడు ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ పరిమాణాలు కొద్దిగా పెరిగినట్లు చూశారు. అందువలన వృద్దులలో టెస్టోస్టిరాన్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా వుండాలి. టెస్టోస్టిరాన్ ఇవ్వడానికి ముందే ప్రోస్టేట్ క్యాన్సర్ కు సంబంధించిన స్క్రీనింగ్ జరగాలని నిపుణులు సూచించారు. ప్రోస్టేటు పరీక్ష, ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటీ జెన్ స్క్రీనింగ్ జరపాలి. ఒకవేళ ప్రోస్టేట్ గ్రంధిలో ఏమైనా మార్పులు వుంటే ఇతర పరీక్షలు కూడా నిర్వహించాలి.

 

యువకుల్లో లాగానే వృద్దులలో కూడా టెస్టోస్టిరాన్ లోపం వలన సెక్స్ కోర్కెలు తగ్గడం, ఎముకలు, కండరాలలో శక్తి తగ్గడం, మానసిక వికృతులు కలుగుతాయి. ఈ మార్పులు వయసు మళ్ళినందువలన కలుగుతాయా? లేదా వయసు పెరిగిన వారిలో తగ్గిన టెస్టోస్టిరాన్ వలన కలుగుతాయా? అన్నది చూడాలి. అంతేకాకుండా యువకులలో టెస్టోస్టిరాన్ తక్కువగా వున్నవారి సంఖ్య 1 శాతం వుంటే వృద్దులలో 30 శాతం వుంటుంది. వృద్దులలో నోటిద్వారా లేదా సబ్ క్యుటేనియస్ ఇంప్లాంట్ వాడవచ్చు. ఇంజెక్షన్ ల రూపంలో కంటే నోటిద్వారా వాడేదే మంచిదని శాస్త్రవేత్తలు చెపుతున్నారు.

 

అనేక సర్వేలలో వృద్దులలో సెక్స్ ఫ్రీక్వెన్సీ తగ్గినప్పటికీ సెక్స్ పట్ల ఇష్టం, సెక్స్ లో పాల్గొనాలనే కోరిక తగ్గలేదని చూశారు. మహిళలలో ముట్లుడిగిన తరువాత శరీరాకృతిలోనూ, సెక్సువల్ రెస్పాన్స్ లోనూ మార్పులు సంభవిస్తాయి. లూబ్రికేషన్ తగ్గడం, సెక్స్ కోర్కెలు తగ్గడం, ముట్లుడిగిన మహిళలో ముఖ్యమైన సమస్యలు. ఈస్ట్రోజన్, ఆండ్రోజెన్ లు ఇచ్చినప్పుడు సెక్స్ ఇంట్రెస్ట్ సెన్సిటివిటీ పెరగడం యోనిలో లోపలికి మార్పులు తగ్గడం చూసారు. హార్మోన్లు తీసుకోవడం ఇష్టంలేని స్త్రీలు కె. వై. జెల్లీ లాంటివి వాడవచ్చు. ఆడవాళ్లలో కాకుండా మగవాళ్లలో వయసుతో వచ్చే మార్పులు నెమ్మదిగా కలుగుతాయి. అంగస్తంభనాలు తగ్గుతాయి. ఒకసారి వీర్యస్ఖలనం అయ్యాక మళ్లీ అంగస్తంభనాలు కలగడానికి పట్టేకాలం పెరుగుతుంది. అంగం దగ్గర సెన్సిటివిటీ ప తగ్గుతుంది. సెక్స్ ఫ్రీక్వెన్సీ తీవ్రత రెండూ తగ్గుతాయి. అంగస్తంభనాన్ని కలిగించే మందులు వాడవచ్చు. కానీ పార్టనర్ కు సెక్స్ పట్ల ఇంట్రస్ట్ వుందా లేదా అన్నది చూసి మాత్రమే మందులు ఇవ్వాలి. మరో ముఖ్యమైన సమస్య వృద్దాప్యంలో పార్టనర్ లేకపోవడం. ఒంటరిగా వుండే వృద్దులలో పార్టనర్ లేకపోయినందువలన అనేక శారీరక, మానసిక బాధలు వుంటాయి. ఇతర దీర్ఘకాలవ్యాధులకు మందులు వాడడం, వీటి దుష్పరిణామాలు, దీర్ఘకాల వ్యాధులు రెండూ సెక్స్ ని తగ్గిస్తాయి. వృద్దులలో కలిగే సెక్స్ సమస్యలు శారీరకమైనవే అనే అపోహ చాలామందిలో వుంటుంది. అనేక మానసిక సమస్యలు కూడా వృద్దులలో వుంటాయి.