వైద్యశాస్త్రం అభివృద్ది చెందడంతో వృద్దుల సంఖ్య పెరుగుతూ వుంది. వృద్దాప్యంలో ఆరోగ్యంగా వుండేవారి సంఖ్య కూడా ఎక్కువగానే వుంది. వృద్దాప్యంలో శృంగారం అన్న ఆలోచనే కొందరికి వింతగా తోచవచ్చు. యువకులకు వారి తల్లిదండ్రులు శృంగారములో పాల్గొంటారన్నది ఆశ్చర్యంగా వుండవచ్చు. ముఖ్యంగా శృంగారం అన్నది పిల్లలు పుట్టించడానికి మాత్రమే అనుకునేవారు, పిల్లలు పుట్టించే వయసు తరువాత శృంగార జీవితం కూడా అయిపోతుంది అని భావిస్తారు. వయసు వచ్చేకొద్దీ శృంగార జీవితంలో మార్పులు వస్తాయి. ఈ మార్పులు వయస్సు వలనే కాకుండా, ఎక్కువకాలం వాడిన అనేక రకాల మందులు, దీర్ఘకాలిక వ్యాధులు, వృద్దాప్యం రాగానే శృంగారంలో పాల్గోకూడదనే ఆలోచన, వీటన్నిటి ప్రభావం వలన సంభవిస్తాయి.
స్త్రీలలో 40 సంవత్సరాలు దాటాక మార్పులు ఎక్కువగా వుంటాయి. ముట్లుడగడం, హార్మోన్ల లో మార్పులు, శరీరంలో అనేక మార్పుల్ని కలుగజేస్తాయి. స్త్రీలలో కామోద్రేకం కలిగినప్పుడు యోనిలో స్రావాలు తక్కువగా ఊరడం, యోనిగోడలలో సాగే శక్తి తగ్గడం, వక్షోజాలలో మార్పులు తక్కువగా వుండడం, భావప్రాప్తి సమయంలో కండరాల సంకోచాల తీవ్రత తక్కువగా వుండడం, మొదలగునవి కలుగుతాయి. పురుషులలో వృద్దాప్యం వచ్చినా హార్మోన్లలో పెద్ద మార్పులుండవు. టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తి నెమ్మదిగా తగ్గుతుంది. వీర్యం వీర్యకణాల పరిమాణం, నెమ్మదిగా తగ్గుతుంది. వీర్యం, వీర్యకణాల ఉత్పత్తి మాత్రం జీవితాంతం వుంటుంది.
పురుషులలో అంగస్తంభన పొందడానికి ఎక్కువ సమయం అవసరమవుతుంది. ఎక్కువసేపు అంగాన్ని స్పృశించడం అవసరమవడం, స్ఖలనం అవడానికి ఎక్కువసేపు అవసరమవ్వడం, అంగస్తంభనాలు ఎక్కువ గట్టిగా లేకపోవడం, బీజాలు పైకి లాగబడడం తక్కువగా వుండడం జరుగుతుంది. సెక్స్ లో పాల్గొన్న ప్రతిసారీ స్ఖలనం అవ్వాలన్న అవసరం తగ్గుతుంది. ఒకసారి స్ఖలనం అయ్యాక మళ్ళీ స్ఖలనమవ్వడానికి పట్టే సమయం కూడా పెరుగుతుంది. ఈ మార్పులన్నీ సహజంగా సంభవించేవే అన్న విషయం తెలియక చాలామంది ఈ మార్పులు కలగగానే సెక్స్ జీవితం అయిపోయింది. అని కంగారుపడి, పార్టనర్ తో శారీరక స్పర్శ పొందడం కూడా మానివేస్తారు. శృంగారం జరుపలేని దంపతులు తక్కిన పద్దతుల ద్వారా ఆనందం పొందుతూ, ప్రేమానురాగాలు వ్యక్తం చెయ్యవచ్చు.శృంగారం అంటే కేవలం రతి మాత్రమే కాదు. పరస్పర స్పర్శ అన్నది కూడా ముఖ్యమైనదే. వృద్దాప్యంలో సెక్స్ సమస్యలున్నవాళ్ళు యువకులలాగానే వాటికి పరిష్కారం పొందవచ్చు. తగిన హార్మోన్లు ఇవ్వడం, కొన్ని టెక్నిక్ లు, అనేక రకాల సమస్యలను తగ్గిస్తాయి. యవ్వనంలోనూ, మధ్యవయస్కులలోనూ సెక్స్ లో తక్కువగా పాల్గొనేవారు వృద్దాప్యంలో కూడా తక్కువగానే పాల్గొంటారు. అదే ఆ వయసులలో ఎక్కువగా పాల్గొనేవారు వృద్దావస్థలో కూడా పాల్గొనగలుగుతారు. ముట్లుడిగిన తర్వాత కూడా శృంగారంలో పాల్గొనేవారిలో యోనిగోడలలో మార్పులు తక్కువగా వుంటాయి. కనుక శృంగారంలో పాల్గోవడం మంచిది.
అమెరికాలో డి. హెచ్. ఈ. ఏ. అనే మందు 50 ఏళ్ళు నిండిన మగవారు 50 మిల్లీగ్రాములు రోజుకు, ఆడవారు 25 మీల్లీగ్రాములు రోజుకువాడుతున్నారు. ముట్లుడిగాక సమస్యలున్న స్త్రీలకు హార్మోన్ రీప్లేస్ మెంట్ థెరపీ చేస్తున్నారు. వయసు వచ్చేకొద్దీ శరీరంలో అనేక మార్పులు కలగడం, దీర్ఘకాలవ్యాధులు వాటికి వాడే మందులు, పెరిగే పిల్లలు, ఆర్దిక ఇబ్బందులు, ఇవన్నీ సమస్యలకు దారి తీస్తాయి. వ్యాధులలో మధుమేహవ్యాధి, రక్తనాళాలకు సంబంధించిన వ్యాధులు, నాడులకు సంబంధించిన వ్యాధులు, కీళ్లజబ్బులు , మల్టిపుల్ స్కీరోసిస్ లాంటి వ్యాధులతో శృంగార సమస్యలు కలగవచ్చు. మందుల విషయానికొస్తే ఎక్కువకాలం డిప్రెషన్ కు వాడే మందులు, మానసిక వికృతులు, మానసిక వికృతులకు అధికకాలం వాడే మందులు, శృంగార సమస్యలు కలిగిస్తాయి. మధ్యవయసులో లేదా మొదటినుంచి శృంగారంలో ఎక్కువ చురుకుగా పాల్గొనేవారు రెగ్యులర్ గా సెక్స్ లో పాల్గొనేవారు, వృద్దాప్యంలో కూడా చురుకుగా పాల్గొనగలుగుతారు. అదే మొదటినుంచి తక్కువగా పాల్గొనేవారు వృద్దాప్యం కలిగేసరికి తొందరగా శృంగారంలో పాల్గొనడం తగ్గుతుంది.
|
|


