The content in this feature is rated as "A++". You must be at least 18 years old to view this feature.
Home>>Intercourse Problems of Youth
యువకులలో సెక్స్ సమస్యలు

యువకులలో సెక్స్ సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. 20 నుండి 40 సంవత్సరాల మధ్య వయసు కలవారిలో అంగస్తంభన సమస్య ఎక్కువ అవ్వడం చూస్తున్నాను. కేవలం సంఖ్య పెరగడమే కాకుండా సమస్య యొక్క తీవ్రత ఎక్కువ అవ్వడం కూడా గమనిస్తున్నాను. అనేక వేలమందిలో రిజీస్కాన్  పరీక్ష చేయించినప్పుడు  చాలా ఆసక్తికరమైన విషయాలు  గమనించాను. చాలామందిలో నిద్రలో అంగస్తంభనాలు మంచిగా వున్నవారిలో కూడా సెక్స్ చేయలేము, ఫెయిలవు తాము  అనే భావనలు తీవ్రంగా వున్నాయి. రిజీస్కాన్ చేయించుకున్నవారిలో  99  శాతం మంది యువకులే. పెళ్లికి ముందు సమస్యతో వచ్చిన వారిలోనే రిజీస్కాన్ చేయిస్తున్నాను. నిద్రలో అంగస్తంభనాలు బాగా వున్నవారిలో చికిత్సతో మార్పు తొందరగా  వస్తుంది. అదే నిద్రలో అంగస్తంభనలు సరిగా లేనివారిలో చికిత్స ఆలస్యమవుతుంది.

యువకులలో సహజంగా సెక్స్ ఎక్కువగా వుంటుంది, వారిలో కలిగే సెక్స్ సమస్యలు పరిష్కరించడం చాలా సులభమని చాలామంది అనుకుంటూ వుంటారు. నిజానికి యువకులలో సెక్స్ సమస్యలు పరిష్కరించడానికి కొంచెం ఎక్కువ కష్టపడాల్సి వస్తోంది. పెర్ఫామెన్స్ యాంగ్జయిటీ యువకులలో ఎక్కువగా వుంటుంది. కారణాన్ని గూర్చి నిరంతరం ఆలోచిస్తూ వుండడం కూడా సెక్స్ సమస్యను పెంచుతోంది.
    వృత్తిలో ఆందోళన ఎక్కువ అవ్వడం అన్నది గత దశాబ్దంలో బాగా ఎక్కువ అయ్యింది.
    20 నుండి 40 సంవత్సరాల  మధ్య వయస్సు కలవారిలో పెళ్లి  అయినవారిలోనూ పెళ్లికాని వారిలోనూ సెక్స్ సమస్యలు ఎక్కువగా కనబడుతున్నాయి. తల్లిదండ్రులు నిర్లక్ష్యం చెయ్యడం కొందరిలో వుంటే, ఇంట్లో వాళ్ల ఒత్తిడి వలన కూడా సమస్య క్లిష్టమవుతోంది. అనేక శతాబ్దాలుగా సెక్స్ సామర్ద్యం, సెక్స్ నిర్వహించాలసిన బాధ్యత పూర్తిగా మగవానిపైనే వుండడంతో పెర్ఫామెన్స్ యాంగ్జయిటీ ఫలితంగా మగవాళ్లలో అంగస్తంభన సమస్య ఎక్కువవుతోంది. మగవాళ్లలో కలిగే ఇతర సెక్స్ సమస్యలకంటే అంగస్తంభన సమస్య యెంతో విభిన్నమైంది. ఆడవారిలో సెక్స్ సమస్యలు కూడా దీంతో పోల్చదగినవి కాదు. అందుకే ఈ పుస్తకంలో ఈ సమస్య గూర్చే అనేక పేజీలు వ్రాశాను.
    మాస్టర్స్ అండ్ జాన్సన్ లు వర్ణించిన అంగస్తంభన సమస్యకు దారితీసే కొన్ని కారణాలు, పరిస్థితులు చూద్దాం.
    1. శీఘ్రస్ఖలనం ఫలితంగా అంగస్తంభన సమస్య.
    2. ఎక్కువ మోతాదులో మద్యం సేవించినందువలన కలిగిన అంగస్తంభన సమస్య.
    3. కుటుంబంలో తల్లి పెత్తనం ఎక్కువగా వున్నందువలన కలిగే అంగస్తంభన సమస్య.
    4. కుటుంబంలో తండ్రి పెత్తనం ఎక్కువగా వున్నందువలన కలిగే సమస్య.
    5. మత చాదస్తం ఎక్కువగా వున్నందువలన కలిగే సమస్య.
    6. హోమో సెక్సువల్స్ లో కలిగే అంగస్తంభన సమస్య.
    వీటనిగూర్చి వివరంగా మాస్టర్స్ అండ్ జాన్సన్ లు వివరించారు.

అంగస్తంభన సమస్య కలిగినవారిలో కమ్యూనికేషన్ వుండదు. బెడ్ రూంలో కమ్యూనికేషన్ లోపం యొక్క ప్రభావం సెక్స్ జీవితం పైన పడుతుంది.
    వివాహం నిశ్చయమైంది అనగానే అప్పటిదాకా బాగా వున్నవారిలో కూడా పెర్ఫామెన్స్ యాంగ్జయిటీ మొదలయ్యి అంగస్తంభన సమస్య మొదలవుతుంది. మరికొందరిలో వివాహానికి  అనేక సంవత్సరాలు ముందునుంచే  అంగస్తంభన సమస్య వుంటుంది. దాన్ని నిర్లక్ష్యం చేస్తూ వస్తారు. తల్లిదండ్రులు ఒత్తిడి ఫలితంగా వివాహానికి ఒప్పుకుంటారు. ఇలాంటివారిలో  అప్పటికే వున్న సమస్యకు పెర్ఫామెన్స్ యాంగ్జయిటీ తోడయ్యి సమస్య మరింత తీవ్రమవుతుంది.
    తొలిరాత్రి తాలూకు భయం చాలామందిలో వుంటుంది. అనేక కారణాలవలన తొలిరాత్రి  జరగదు. ఆ భయంతో కూడా అంగస్తంభన సమస్య మొదలవుతుంది. సెక్స్ గూర్చి పరిజ్ఞానం ఇద్దరిలో లేనందువలన స్త్రీలలో వెజైనిస్మస్ వలన అంగప్రవేశం జరగదు. అది తమలోపంగా భావించి దిగులుకు లోనయి నందువలన అంగస్తంభన సమస్య కలుగుతుంది. ఇలా అనేక కారణాలుగా ఈ సమస్య కలుగుతుంది. చికిత్సలో ఓర్పు అత్యంత అవసరం.
యువకులలో ఇంపొటెన్సీ (అంగస్తంభన సమస్య), ఇన్ ఫెర్టిలిటీ (వీర్యకణాల సమస్య) ఈ రెండూ ఎక్కువవుతున్నాయి. వీర్యకణాల గూర్చి ప్రత్యేకం పురుషులలో సంతానలేమి - కారణాలు - చికిత్స  అన్న పుస్తకం వ్రాశాను.
కేవలం అంగస్తంభన సమస్యే కాకుండా ఫ్రీక్వెన్సీ కూడా యువకులలో బాగా తగ్గిపోతోంది. నెలలో 1, 2 సార్లు, ఏడాదిలో 1, 2 సార్లు మాత్రమే సెక్స్ లో పాల్గొంటున్నాం అంటూ వచ్చేవాళ్ల సంఖ్య ఇప్పుడు బాగా ఎక్కువ అవుతోంది. తమలో సమస్య ఉన్నప్పటికీ  తమకే సమస్య లేదని భార్యని బుకాయించడం, రాత్రి ఇంటికి వచ్చాక గొడవ పడడం, టీవీతోనో, కంప్యూటర్ తోనో గడపడం లాంటివి చాలామంది చేస్తున్నారు. సెక్స్ సమస్యతో పాటు ఆప్యాయత కూడా కరువయితే స్త్రీలకు భర్తంటేనే ఇష్టం పోతుంది. ఈ పరిస్థితి అనేక సంవత్సరాలు కొనసాగితే కుటుంబంలో కలహాలకు దారితీస్తుంది. రెండు సంసారాలని బాధించే సెక్స్ సమస్యల విషయంలో ఆడ, మగ ఇద్దరు జాగ్రత్త వహించి సకాలంలో చికిత్స తీసుకుంటే మంచిది.