అండకోశాలు :-(ఓవరీ)
.png)
ఇవి అండాల్ని, హార్మోన్లని ఉత్పత్తి చేస్తుంటాయి. ఇది ద్రాక్షకాయంత పరిమాణంలో ఒక్కొక్కటి వుంటుంది. సుమారు 1 అంగుళం, 1/2 అంగుళం పొడవు వెడల్పు కలిగి వుంటుంది. పుట్టినప్పుడు ప్రతి అండకోశంలోను 2 లక్షల ఎదగని అండాలు వుంటాయి. ప్రతి అండానికి పైన పలుచని పొర వుంటుంది. అండకోశాలు ఒకవైపున ఓవేరియన్ లిగమెంట్ తో అతుక్కుని వుంటాయి. ఈ ఒవేరియన్ లిగమెంట్ రెండవవైపు గర్భాశయానికి అతుక్కుని వుంటుంది. గర్భాశయానికి రెండువైపులా వుండే నాళాన్ని ఫెలోపియన్ ట్యూబ్స్ అంటారు. ఇటాలియన్ అనాటమిస్ట్ వాటిని మొదట వర్ణించాడు. కనుక ఆయన పేరు మీదుగా వీటికి ఆ పేరు వచ్చింది. అండకోశం నుంచి విడుదలయిన అండాలు ఈ ఫెలోపియన్ నాళాల ద్వారా ప్రయాణించి గర్భాశయాన్ని చేరాలి. కానీ అండకోశాలు ఫెలోపియన్ నాళాలు ఒకైవైపు గర్భాశయంలోకి తెరుచుకుని వుంటాయి. కాని రెండవవైపు అలా వేలాడుతూ వుంటాయి. అలా వేలాడే భాగం గరాటు ఆకారంలో, పువ్వులాగా వుంటుంది. దీన్ని ఫింబ్రియా అంటారు. అండం విడుదలయినప్పుడు ఈ ఫింబ్రియా కదలి అండాన్ని చుట్టు ముట్టుతాయి. అండం ఫెలోపియన్ నాలాలలోకి ప్రవేశిస్తుంది. ఫెలోపియన్ నాళాల లోపలివైపు వెంట్రుకల లాగా వుండే 'సీలియా' వుంటాయి. అండం శుక్రకణంతో కలిసి గర్భం ఏర్పడేది ఫెలోపియన్ నాళాలలోనే. అక్కడ గర్భం పెరగనారంభిస్తుంది. గర్భసంచి: ఇది 3 అంగుళాల పొడవు, 2అంగుళాల వెడల్పు వుంటుంది. ఇది కండరాలతో నిర్మితమైంది. దీనిపై పొరను యమోమెట్రియం అంటారు. గర్భాశయం లోపల ప్రత్యేకమైన పొర వుంటుంది. దీన్ని ఎండోమెట్రియం అంటారు. గర్భం కలగనప్పుడు ఈ పొరలోని ముక్కలే బహిష్టు స్రావంతో బయటకు వెళ్తాయి. గర్భం కలిగితే గర్భస్థ పిండం ఫెలోపియన్ నాళాల గుండా ప్రయాణించి ఎండోమెట్రియం (గర్బాశయపు లోపలి పొర) లో నాటుకుంటుంది. అక్కడ ఆహార పదార్దాల్ని తీసుకుని గర్భస్థపిండం తొలిదినాలలో పెరుగుతుంది.
సర్విక్స్

గర్భాశయంలో కిందిభాగాన్ని సర్విక్స్ (అంటే లాటిన్ లో మెడ అని అర్దం ) అంటారు. దీన్నే గర్బాశయ ముఖ ద్వారం అంటారు. ఇది యోనిపై భాగాన వుంటుంది. ఈ సర్విక్స్ మధ్యలో చిన్న రంధ్రం వుంటుంది. దీనిగుండా బహిష్టుస్రావం గర్భాశయంలోకి ప్రవేశిస్తాయి. అక్కడనుంచి ఫెలోపియన్ నాళాలలోకి చేరి అండంతో కలుస్తాయి. అండం విడుదలవ్వడానికి ముందు జిగట లాంటి పదార్దం గర్భాశయం నుంచి స్రవిస్తుంది. వేళ్ళమధ్య నుంచి లాగినప్పుడు ఇది తీగలు సాగుతుంది. గర్భాశయ ముఖద్వారం కొద్దిగా తెరుచుకుంటుంది. ఈ మార్పుల వలన వీర్యకణాలు గర్భాశయం ముఖద్వారం బాగా తెరుచుకుని శిశువు బయటకు రావడానికి మార్గం ఏర్పడుతుంది. యోని వీర్యకణాలు లోపలికి ప్రవేశించడానికి, బహిష్టు స్రావం బయటకు రావడానికి ఉపయోగపడేది
యోని.

రతిలో పురుషాంగం ప్రవేశించేది దీనిలోకే. ప్రసవం అప్పుడు ప్రసవ మార్గం కూడా ఇదే. ఇది 4 అంగుళాల పొడవుండే నాళము. ఇది కండరాలతో తయారౌతుంది. ఈ కండరాలు సాగగలుగుతాయి. ఇవి బాగా సాగినందువలన పురుషాంగం తేలికగా ప్రవేశించగలుగుతుంది. అదేవిధంగా శిశువు బయటకు వచ్చేంత బాగా కూడా ఇది తెరుచుకోగలదు. యోని లోపలి పొర నోటి లోపలి పొర లాగా వుంటుంది. ఈ పొరనుంచే యోనిలోకి స్రావాలు ఊరేది. కామోద్రేకం కలిగినప్పుడు యోనిలో స్రావాలు ఊరి అది తెరుచుకుంటుంది. అందువలన పురుషాంగం తేలికగా లోపలికి జారుతూ ప్రవేశించగలదు. ఈ స్రావాలు లేకపోతే స్త్రీకి మంట కలగడం, పురుషునికి నొప్పి కలగడం జరుగుతుంది. కామోద్రేకం లేని సమయంలో యోని గోడలు ఒకదాన్ని ఒకటి తగులుతూ వుంటాయి. యోని రంధ్రాన్ని పాక్షికంగా మూస్తూ కన్నెపొర వుంటుంది. కొందరిలో ఈ పొర యోని రంధ్రాన్ని పూర్తిగా మూసివేస్తుంది. అందువలన బహిష్టు స్రావాలు బయటకు రాక లోపలే వుండి కొన్ని నెలలకు పొత్తి కడుపులో ఉబ్బెత్తుగా వుండి నొప్పిని కలిగిస్తాయి. ఇలాంటి సందర్భాలలో చిన్న ఆపరేషన్ ద్వారా ఈ పొర తొలగిస్తారు.
కన్నెపొర

కన్నెపొర గూర్చి అనేక అపోహలున్నాయి. ఇది చాలా మందిలో చాలా పలుచగా వుండి సైకిల్ తొక్కేప్పుడు లేదా ఆటలాడేప్పుడు తెగిపోతుంది. మరికొందరిలో సాగుతూ వుంటుంది. అందువలన వారిని కన్యలు కాదు అని అనుకోవడం పొరపాటు. యోని లోపల పొర గ్లైకోజన్ కు కలిగి వుంటుంది. ఇది ఆమ్లాలను ఉత్పత్తి చేస్తుంది. అందువలన యోని ఆమ్లతను కలిగి వుంటుంది. ఈ ఆమ్లత వలన సూక్ష్మక్రిములు యోనిలో పెరగకుండా వుంటాయి. ఈ ఆమ్లతే వీర్యకణాల్ని కూడా నిర్వీర్యం చేస్తుంది. కానీ వీర్యంలోని ఇతర స్రావాలు క్షారీయంగా వుండి యోనిలోని ఆమ్లతను తగ్గిస్తాయి.
|
|


