The content in this feature is rated as "A++". You must be at least 18 years old to view this feature.
Home>>Cancer to Testicles in Men
మగవారి జననావయవ క్యాన్సర్

దురదృష్టవశాత్తు బీజాలకు కలిగే క్యాన్సర్ ఎక్కువగా యువకుల్లో కలుగుతుంది. మగవారిలో కలిగే మిగతా క్యాన్సర్ల కన్నా ఇది అత్యంత అరుదు. సెమినోమా, టెరటోమా, లింఫోమా ఇలా అనేక రకాలుగా బీజాలకు సంబంధించిన క్యాన్సర్ వుంటుంది. సెమినోమా క్యాన్సర్ సుమారు నలభైశాతం మందిలో వుంటుంది. ఇది 35-54 సంవత్సరాల నధ్యవారిలో వస్తుంది. టెరటోమా ఇరవై నుంచి ముప్పయి అయిదు సంవత్సరాల మధ్య వయసుకలవారిలో వస్తుంది. బీజాల క్యాన్సర్ వున్నవారిలో సుమారు ముప్పయి రెండు శాతం మందిలో ఇది వుంటుంది.

 

పద్నాలుగు శాతం మందిలో సెమనోమా, టెరటోమా రెండూ వుంటాయి. ఈ వ్యాధిలో కలిగే మొదటి లక్షణం బీజం పెద్దదవ్వడం మామూలు పరిమాణానికి రెండు మూడు రెట్లు పెద్దదవుతుంది. మూడవవంతు మంది మాత్రమే నొప్పి వుందని చెపుతారు. సుమారు పదిశాతం మంది అక్కడ దెబ్బ తగిలిందని చెపుతారు. దెబ్బవల్లనే ఇలా అయిందనుకుంటారు గానీ కంతి గూర్చి పెద్దగా పట్టించుకోరు. కొందరిలో బీజాల దగ్గర లక్షణాలకంటే క్యాన్సర్ ఇతర చోట్లకు వ్యాపించినందువలన ఆ ప్రదేశాలలో కలిగే లక్షణాలు కలుగుతాయి. ఉదాహరణకు ఊపిరితిత్తులకు వ్యాపించినవారిలో దగ్గు, ఆయాసం, రక్తం పడడం ఇలాంటి లక్షణాలు కలుగుతాయి. కడుపులో వ్యాపించిన వారికి కడుపులో గడ్డలు లాగా వుంటాయి. కొందరిలో నొప్పి, వాపు అధికంగా వుంటుంది. ఒకటి నుంచి అయిదు శాతం మందిలో వక్షోజాలు పెద్దవి అవుతాయి. కొందరిలో కొన్ని వారాలలోనే పూర్తిగా వ్యాపించి మరణానికి దారి తీస్తుంది. మరికొందరిలో వ్యాధి వ్యాప్తి రెండుమూడు సంవత్సరాలలో అవుతుంది. ముందుగానే గుర్తించి అవసరానుగుణంగా రేడియేషన్, కీమోథెరపీ, బీజాలు తొలగించడం లాంటి చికిత్సలు యూరాలజిస్ట్, ఆంకాలజిస్ట్ (క్యాన్సర్ స్పెషలిస్ట్) పర్యవేక్షణలో జరగాలి.

అంగానికి క్యాన్సర్ :- అంగానికి క్యాన్సర్ వచ్చినవారిలో సుమారు నలభైశాతం మంది నలభై సంవత్సరాల వయసు లోపువారే. ఈ వ్యాధి నెమ్మదిగా వ్యాపిస్తుంది. మొదట్లో ఇరిటేషన్, డిశ్ఛార్జ్ వుంటాయి. అరవైశాతం మందిలో గజ్జల్లో బిళ్లలు కడతాయి. అంగం పూర్వ చర్మం వెనుకకు రాదు. గ్లాన్స్ అంతా దుర్వాసనతో కూడిన గడ్డ కలిగి వుంటుంది. బయాప్సీ ద్వారా వ్యాధి నిర్దారణ జరుగుతుంది. చికిత్సలో అరవైనుంచి డెభ్బైశాతం మందిలో రేడియో థెరపీ ద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. రేడియో థెరపీ ఫెయిలయివారిలో అంగంలో కొంతభాగాన్ని కానీ మొత్తం అంగాన్ని కానీ తొలగిస్తారు. మూత్రపుతిత్తి, రెక్టమ్ లేదా ప్రోస్టేట్ లో కలిగిన క్యాన్సర్ అంగానికి కూడా కొందరిలో వ్యాపిస్తుంది.