The content in this feature is rated as "A++". You must be at least 18 years old to view this feature.
Home>>Kalagantine Cheli
కలగంటినే చెలి - 101

ప్రేమ లేనప్పుడు ఎదుటివ్యక్తి ఉనికిని సైతం భరించలేం. అతను ఎంత అభిమానంగా పలకరించినా విసుక్కుంటాం. అతని ప్రేమ కూడా ఏదో సుత్తి కొడుతున్నట్టు అనిపిస్తుంది. ఆమె కూడా ఆ స్టేజీకి వచ్చింది. కొంతలో కొంత నయం. పగలంతా అతను నిద్రపోవడంవల్ల ఆమెకి హాయిగా వుంది! లేకుంటే విసుక్కునేది. అప్పటికి వాళ్ళిద్దరూ బెడ్ ను పంచుకొని చాలా రోజులే అవుతోంది.

ఆమెకి రాత్రయితే కోరిక శరీరం పైకెక్కి స్వారీ చేస్తోంది. కానీ భర్త అందుబాటులో లేడు. అక్కడికి దాదాపు డెబ్బైకిలోమీటర్ల కావల అతను ఆ సమయంలో డ్యూటీ చేస్తుంటాడు. ఒక్కోసారి మరీ తట్టుకోలేనప్పుడు కోరికనంతా చంపుకోవడానికి చన్నీళ్ళస్నానం చేస్తోంది! ఎప్పుడంటే అప్పుడు చన్నీళ్ళ స్నానం చేయడంవలన మాటిమాటికీ జ్వరం వస్తోంది! జ్వరంలో కలవరింతలు, పీడకలలు! తమ మధ్య ఏం వుండటంలేడు గనుక ఇక పిల్లలు పుట్టరేమోనన్న దిగులు కూడా ఎక్కువయింది. ఆ దిగులు మొత్తం ఆమెనంతా ఆక్రమించుకోవడంతో ఆకలి వేయడం మానేసింది.

నిద్ర రావటం లేదు. ఎవరితో మాట్లాడాలనిపించడం లేదు. ఒంటరిగా వుండడం ఒక్కతే గౌతమి మనసును కొంతవరకూ కుదుటపరుస్తోంది. చివరికి తోడబుట్టిన వాళ్ళు వచ్చినా కూడా ఆమె మౌనంగా వుంటోంది తప్ప అంతగా మాటలు కలవడంలేదు. ఒకరోజున ఠక్కున డాక్టర్ గుర్తొచ్చి రిజల్ట్సు తెలుసుకోవడానికి వెళ్ళింది.

డాక్టర్ ఓ గోధుమరంగు కవర్ లో రిపోర్టులన్నీ పెట్టి చేతికిస్తూ "నీ భర్తవల్ల పిల్లలు పుట్టారు. మందులు వాడినా ప్రయోజనం వుండదు'' అంది.

పిడుగు నెత్తిమీదపది పాతాళంలో కూరుకుపోతున్నట్టు గిలగిల్లాడిపోయింది. 'తన భర్త వల్ల పిల్లలు పుట్టారు. అందునా తామిద్దరూ కల్సుకోవడం లేడు - మరెలా?' ఆమెకి మొదటిసారి మరో ఆలోచన వచ్చింది. అయితే అటువంటి ఆలోచన వచ్చినందుకు ఆమె వణికిపోయింది. భర్తతో పిల్లలు కలగరన్న వాస్తవం తెలిశాక ఘర్షణ ప్రారంభమైంది గౌతమికి. పిల్లలకోసం వేరే యువకుడ్ని తన జీవితంలోకి ఆహ్వానించాలా? లేక ఇలాగే అక్కయ్యల పిల్లల్ని ఆడించుకుంటూ శేష జీవితాన్ని గడిపెయ్యాలా? పిల్లలు లేకుండా బతుకు ఎంత నిస్తేజంగా వుంటుందో ప్రస్తుతం అనుభవిస్తోంది. జీవితమంతా శూన్యంలా తోస్తోంది!

తెలియని వెలితి బతుకుమీద మమకారాన్ని పోగొడుతోంది అలాగని మరొకర్ని ఆహ్వానించడానికి మనసు ఒప్పుకోవటంలేడు. చిన్నప్పటి నుంచీ నేర్చుకున్న నైతిక విలువలు 'అది తప్పని' హెచ్చరిస్తున్నాయి. మనసును తోసిరాజని ఆ తప్పు చేస్తే తర్వాత కలిగే క్షోభను తను భరించగలదా? ఏ నుయ్యో-గొయ్యో చూసుకోవాల్సి వస్తుంది. ఈ మానసిక ఘర్షణ ఏదో ఒక గంటో - ఒక రోజో అయితే ఫర్వాలేదు. ఇరవై నాలుగ్గంటలూ ఇదే సమస్య ఆమె మనస్సును తోలిచివేయడం ప్రారంభించింది. దీంతో ఆకలి చచ్చిపోయింది. శరీరమంతా నిస్సత్తువ కమ్ముకునేది!

ఎప్పుడూ పిల్లల్లెరన్న ధ్యాసే! ఏ గత్యంతరమూలేక ఒకసారి తప్పుచేయతానికి ఆమె అంత మథనపడిపోయింది. అదే ఆమె భర్త ఈశ్వరరావు ఎంచక్కా దర్జాగా అదే తప్పును కొన్ని పదులమందితో చేశాడు. కారణం మగాడికి శీలం అనేది లేకపోవడమే! ప్రతికట్టడీ, ప్రతి ఆంక్షలను ఉల్లంఘించుకున్నప్పుడు స్త్రీలకూ ఈ ఘర్షణ తప్పదు. అందుకే మానసిక జబ్బులు పురుషుల్లోకంటే స్త్రీలలోనే ఎక్కువ కలుగుతుంటాయి. గౌతమికి దీనికి తోడు సంసార సుఖంకూడా లేకపోయింది. భర్త ఎప్పుడూ రాత్రి డ్యూటీలో వుంటాడు.

ఇంటిదగ్గరి పగలే వుంటాడు. పగలు భర్తతో గడిపితే ఇంటికి ఆరిష్టమని ఎవరో చెపితే నమ్మింది ఆ నమ్మకంవలన పగలు అతనితో గడపలేకపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో ఆమె జబ్బు మరింత ముదిరింది. ఎవరితోనూ మాట్లాడేదికాదు. ఒంటరిగా యింట్లో ఏ మూలో కూర్చునేది. స్వంత అక్కయ్యలు వచ్చినా ఆమెలో ఏ మార్పూ గుండేది కాదు. ఈశ్వరరావుకి భార్యలో వచ్చిన మార్పులు అంత త్వరగా అర్థం కాలేదు. మొదట్లో ఏదో మూడీగా వుందిలే అనుకునేవాడు. పిల్లల్లెరన్న దిగులుతో అలా వుందేమోననుకున్నాడు.

తన కూతురికి ఏదో అయిందన్న విషయం మొదట ఆమె తల్లి గుర్తించింది. "గౌతమికి వోళ్ళేం బావుండడంలేదు. ఏం చేయాలో పాలుపోవడం లేదు'' దిగులుపడుతూ అంది ఓ రోజు ఆమె ఈశ్వరరావుతో.

"డాక్టర్ దగ్గరకు తీసుకుపోదాం'' అన్నాడతను. అంతర్గతంగా ఆమె మనసులో ఏం వుందో ఎవరికీ మాత్రం ఎలా తెలుస్తుంది?'' ఆ రోజే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళారు.

డాక్టర్ అంతా పరీక్షించాక "శారీరకంగా ఏ జబ్బూలేదు. మనసుకే ఏదో కష్టం వుండాలి'' అంది. దాంతో తిరిగి ఇంటికొచ్చేశారు.