The content in this feature is rated as "A++". You must be at least 18 years old to view this feature.
Home>>Kalagantine Cheli
కలగంటినే చెలి - 79

మళ్ళీ చంద్రరేఖే మాట్లాడటం ప్రారంభించింది. "అభిమానుల్లో రకరకాలు, వేళ్ళు తమ అభిమానంతో ఆయా తారలకు ఎంతో ఇబ్బంది కలిగిస్తుంటారు. కొందరు పాదాభి వందనం చేస్తుంటారు. ఇంకొందరు వీరావేశంతో రక్తతిలకం దిద్దుతుంటారు. మరి కొందరు ఇళ్ళకుపోయి గంటల తరబడి కాచుక్కూచుంటారు. ఇంకొందరు గాఢంగా ప్రేమిస్తున్నామని ఉత్తరాలు రాస్తారు. ఇంకొందరు చేయి పట్టుకుని ముద్దు పెట్టు కోవడానికి ప్రయత్నిస్తారు. ఇలాంటి చేష్టలు ఎన్నో శ్రీదేవికి నువ్వొక్కడివే అభిమాని అయితే ఆమె కూడా నిన్ను ఇంటికి పిలిపించి, హాపీగా భోజనంపెట్టి గంటల తరబడి కబుర్లు చెప్పి పంపించేది.

కానీ నీ దురదృష్టంకొద్దీ, ఆమె అదృష్టంకొద్దీ దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా ఆమెకి లక్షల సంఖ్యలో అభిమానులున్నారు. మరి వీళ్ళందరితో తీరిగ్గా మాట్లాడటానికి ఎంత టైము కావాలో ఆలోచించు. అభిమానుల విషయంలో తారల తప్పేమీ లేదని నేననను. ఆర్టిస్టుగా పరిచయం అయిన రోజుల్లో వాళ్ళు అభిమానుల కోసం పరితపిస్తారు. తనను గుర్తుపట్టి జనం గుమిగూడితే సంతోషిస్తారు. షూటింగ్ లో తను డయాస్ ఎక్కగానే జనం కొట్టే చప్పట్లకు ఛాతీ కనీసం అంగుళం వరకు పొంగుతుంది. ఆ తర్వాత వాళ్ళు ఆర్టిస్టు స్థాయినుంచి స్టార్ వరకు ఎదుగుతారు. అభిమానులు పెరుగుతారు. తమకొచ్చిన క్రేజ్ వలన తాము ఇబ్బందులు పడుతున్నామన్న స్పృహ వస్తుంది.

ఇంట్లో తప్ప మరెక్కడా ప్రైవసీ దొరకదు. కనీసం సాయంకాలంపూట షాపింగ్ చేయడానికి కూడా కుదరదు. జనం గుర్తుపట్టడం, గుమిగూడడం, చప్పట్లు చరచడం లాంటివి మామూలై, కిక్కు ఇవ్వడం మానేస్తాయి. దాంతో అభిమానులంటేనే ఏవగింపు కలిగే స్థాయికివస్తారు. అంటే తమకు కావాల్సినప్పుడు జనం రావాలి, వద్దనుకున్నప్పుడు వుండకూడదు. సినిమా వాళ్ళకే కాదు రాజకీయ నాయకుల దగ్గర్నుంచీ చోటా పబ్లిక్ ఫిగార్స్ వరకూ వున్న దుర్లక్షణం ఇదే'' ఆమె చెప్పడం ఆపింది.

గంగాధరం ఆలోచనలన్నీ ఆమె చెప్పిన విషయాల చుట్టూనే పరిభ్రమిస్తున్నాయి. ఈ విషవలయం నుంచి బయటపడాలి. తన జీవితాన్ని తను జీవించాలి. కానీ ఎవరికోసం బతకాలి? ఈ గుండెల్లోని ప్రేమని ఎవరికీ పంచాలి? ప్రేమకోసం తపించిపోతున్న తనను ఏ స్త్రీ మూర్తి లాలనతో ఒడిలోకి చేర్చుకుంటుంది? ఆ ప్రశ్నలకి మాత్రం అతనికి జవాబు దొరకలేదు. అందుకే అతను బస్సెక్కాక కూడా చంద్రరేఖతో మాట్లాడలేక పోయాడు! అతను ఏం ఆలోచిస్తున్నాడో, ప్రస్తుతం అతని బాధ ఏమిటో కూడా ఆమె సులభంగానే ఊహించగలిగింది.

కరెక్టే ... గుండెల్లో పేరుకుపోయిన ప్రేమను పంచగలిగేందుకు, తనను ప్రేమించేందుకు అతనికి ఓ వ్యక్తి కావాలి. ఆమె కళ్ళముందు రూపాదేవి మెదిలింది. రూపాదేవి భర్త గోపాల్ జన్యుపరమైన లోపంతోనే పుట్టాడు. అతను దాంపత్య సుఖానికి పనికిరాడు. ఈ విషయం అతనికి తెలుసు. కానీ ఇంట్లోవాళ్ళకి అతని లోపం ఏమిటో తెలుసుకునే జ్ఞానం గానీ, చదువు సంధ్యలుగానీ లేవు. పెళ్ళిచేస్తే అంత చక్కబడుతుందని వాళ్ళు నమ్మారు. ఆ సమయంలోనే సీతాపతి వరుడ్ని వెదుక్కుంటూ ఆ ఇంటికి వెళ్ళాడు.

గోపాల్ ని చూశాడు. ఎక్కడో డిఫరెన్స్ వుందని అనిపించిందిగానీ అదేమిటో ఆయనా తెలుసుకోలేకపోయాడు. దీంతో తన కూతురు రూపాదేవిని ఇచ్చి పెళ్ళి చేశాడు. కోటి కోర్కెలతో పెళ్ళిపీటలమీద కూర్చున్న ఆమెకి చీకటి పడగానే పడగ్గదిలో తన జీవితంలోనే చీకట్లు కమ్ముకున్నాయని అర్థమైంది. అప్పటికీ మనసుకి పరి పరివిదాల సర్దిచెప్పుకుంది. రెండో రోజు తనే చొరవ తీసుకుంది. తనని చూస్తేనే ముఖంలో రంగులు మారుతున్న భర్తను మాటల్లో పెట్టింది. ఆ రాత్రి అతనూ ఫ్రీగా మాట్లాడే స్టేజీజి తీసుకొచ్చింది. ఇది తన విజయమని, ఆ రోజు నిద్రపోయింది. అతను ఫ్రీగా మాట్లాడుతున్నాడుకానీ ఒంటిమీద చేయి వేయడం లేదు. ఇలా వారం రోజులు గడిచాయి.

పదహారు రోజుల పండక్కి భర్తతో పాటు పుట్టింటికి వచ్చింది రూపాదేవి. "ఏమిటే! రంగు తేలావ్ మీ ఆయన తన ఒంటిరంగును నీకూ కాస్తంత పూసినట్టున్నాడే''

"కెన్నెచెర వదిలించుకున్నావ్ ... భర్తను సంపాదించుకున్నావ్ ... అందులోనూ శీతాకాలంలో పెళ్ళి చేసుకున్నావ్. దుప్పటి అవసరంలేదు, ఎంచక్కా వెచ్చగా భర్తనే దుప్పట్లా కప్పుకోవచ్చు'' వచ్చే ఈనాటికి మగబిడ్డను అందివ్వాలి'' ఇలా స్న్హితురాళ్ళు తనను ఆటపట్టిస్తుంటే ఆమెకి ఏడుపొచ్చింది. ఎంత కంట్రోల్ చేసుకున్నా కళ్ళల్లోంచి నీళ్ళు బయటికి దుమికేశాయ్. వాళ్ళు షాక్ తిన్నారు. ఏమైందని ఎంత అడిగినా వాళ్ళకి ఏం చెప్పలేదు. చెప్పడానికి ఏముంది? ఉన్న విషయాన్ని సిగ్గువిడిచి ఎలా చెప్పడం?

ఆ రాత్రి ఆటో ఇటో తెల్చుకోవాలనుకుంది. చీకట్లు పడడంతోనే బోజనాలు పెట్టేయమంది."ఏమిటే భోజనాలంటున్నావ్. మరీ అంత తొందరగా వుందా?'' వదిన వరసయ్యేవాళ్ళు ఆటపట్టించారు. కానీ రూప అవేమీ పట్టించుకోలేదు. తన కళ్ళముందు ఒకే లక్ష్యం వుంది. సిగ్గు ఎగ్గూ గురించి ఆలోచించలేదు. అతను ఏమనుకుంటాడో అన్న సందేహం లేదు. విషయమేమిటో తెల్చేయాలి. వారంరోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్ డ్రామాకు తెర దించేయాలి.