.jpg)
అతను శ్రద్ధగా వింటున్నాడు. "ఆలస్యం అమృతం విషం అన్నవాళ్ళే నిదానమే ప్రదానం అని కూడా అన్నారు. కాబట్టి సమయానుకూలంగా మనం ప్రవర్తించాలన్న మాట. తేలుకీ పాముకీ ఒకే మందువేస్తామా? ఏ జబ్బుకి ఆ మందువేయాలి. అలాన్నే కొన్ని నిదానంగా చేయాలి. మరొకొన్ని అర్జెంట్ గా చేయాలి అవునా?''
అవునన్నట్టు తలూపాడు.
"నీకే సంబంధించిన పనులు త్వరగా చేసినా, నిదానంగా చేసినా దాని ఫలితం నీకొక్కడికే చెందుతుంది. లాభనష్టాలు నీకే పరిమితం అవుతాయి. కానీ కొన్ని అవతల వ్యక్తితో కూడా ముడిపడి వుంటాయి. వాటిని పూర్తిచేయడంలో నీ ఒక్కడి ఇష్టమే సరిపోదు. అవతల వ్యక్తి కూడా ఏం కోరుకుంటుందో నువ్వు ఆలోచించాలి''
అతనికి అర్థమయ్యీ కానట్టు వుంది.
"ప్రతి పనీ తొందరగా చేయడం మంచి మగాడి లక్షణమే, కాననాను కానీ అప్పగించిన పనిని నిదానంగా, అందరికీ ఆమోదయోగ్యంగా చేయడం ఇంకా మంచి లక్షణం. వెనుకనుంచి ఏదో తరుముకోస్తున్నట్టు ప్రతిపనీ చేయడాన్ని చూస్తే ఎవరయినా ఏమనుకుంటారో తెలుసా? ఇతనంతా ఒట్టి మగరాయుడని అనుకుంటారు. అందుకే ఇకనుంచి నువ్వు తొందర తగ్గించుకోవాలి'' అన్నది చంద్రరేఖ.
ఆమె చెప్పినదానికి అతను అవునన్నట్లుగానీ కాదన్నట్టుగానీ తల వూపలేదు.
"ప్రతి పనీ నువ్వు తొందరగా చేయడంవలన తప్పులుచేసే అవకాశం ఎక్కువగా వుంటుంది. దాంతో నువ్వు ఏదీ అద్భుతంగా చేయలేవు జీవితంలో దేన్నీ సక్సెస్ ఫుల్ గా సాధించలేవు అందుకే ప్రతీదీ ఆచితూచి చేసినట్టు చేయగలగాలి. అప్పుడు నీకన్నీ కితాబులే'' అతను మౌనంగా వుండటం చూసి ఆమె చెప్పడం ప్రారంభించింది. "నువ్వు తొందర తగ్గించుకున్నావనుకో నేను నీకో బహుమానం ఇస్తాను'' అతని కళ్ళు మెరిశాయి.
తన చికిత్సలో ఇది రెండో భాగం. అందుకే అతని బుర్రలోకి తన మాటల్ని ఎక్కించటానికి ఇంకాస్త ముందుకి జరిగింది. ఇప్పుడామె అతనికి మరింత దగ్గరగా, విల్లులాగా వంగితే ముఖానికి ముఖం తగిలేంత దగ్గరలో వుంది. "రపట్నుంనుంచీ నువ్వు నేను చెప్పినట్లు చేయడం ప్రారంభించాలి. భోజనం తినడం దగ్గర్నుంచి సిగరెట్ తాగేవరకు అన్నీ నిదానంగానే చేయడం అలవరచుకోవాలి. నీ తొందరంతా పోగొట్టుకోవాలి.'' ఆమెనుంచి వస్తున్నా సీకాయి పరిమళం అతన్ని ముంచెత్తుతోంది. అయితే అతను దానిని పట్టించుకోవడం లేదు. ఆమె చెప్పినదాన్ని శరీరమంతా చేవిలాగా చేసుకుని వింటున్నాడు.
"ఈ అలవాటు మానుకున్నావని తెలిసన రోజున అంటే ఆ రాత్రి యిదే యిదే చెట్టుకింద ఇదే నక్షత్రాలకింద ఓ బహుమతి ఇస్తాను'' అని పైటను ఓసారి తీసినట్టు తీసి ఎదంతా అతని కళ్ళల్లో పరచుకునేలా ఓ క్షణంపాటు వుంచి, ఆ తర్వాత వేసుకుంది.
ఆమె ఇవ్వబోయే బహుమతి ఏమిటో అతనికి అర్థమైంది. కళ్ళముందు జమునారాణి మెదిలింది. చిన్నతనం, బాత్రూమ్ లో తను ఈగర్ గా వెయిట్ చేయడం, ఆమె రావడం, తను కిందపడిపోకుండా ఆమె భుజాల్ని పట్టుకోవడం అప్పుడు తనకు తెలియకుండానే తన చేతులు ఆమె ఎదమీదకి జారడం ఆ తరువాత ఇన్ని రోజులకు తను బహుమతిగా వాటిని అందుకోవడం, ఈ ఊహతోనే అతని శరీరమంతా చిన్నగా కంపించింది.
మరి వస్తాను వాసూ, నీ ప్రవర్తనలో మార్పు వచ్చిందని తెలిసిన క్షణం బహుమతి ఇస్తాను'' అని చంద్రరేఖ లేచింది. వెళుతూ వెళుతూ "నీకు ఇదేమంత కష్టమైన పనికాదని నాకు తెలుసు. ఏం అనుకునే అది సాధించే మగాడివి నువ్వు'' అని ఊరివపు బయల్దేరింది. అతనికి మాత్రం ఆమె తనకు ఇవ్వబోయే బహుమతి వళ్ళంతా వ్యాపిస్తోంది *****
|
|


