.jpg)
ఇప్పుడతనికి కొంత సంతృప్తిగా వుంది. తన ఆట వస్తువుని తీసుకెళుతున్నందుకు తగిన శాస్తి జరిగింది. అయినా తన ఆటవస్తువు దూరంగా వెళ్ళిపోతునందుకు బాధగానే వుంది. అన్నం తినాలనిపించడం లేదు. రాత్రి పడుకున్నాడు గానీ నిద్రరావడం లేదు.
ఏవేవో ఊహలు తను జమునారాణి కోసం పరితపిస్తూ ఎక్కడెక్కడో తిరుగుంటాడు అలా పోతుండగా చీకట్లు పడతాయి. చుట్టూ చూస్తే అడవి. తను భయపడడు, చెట్లలోని పండ్లు కోసుకుతిని పడుకుంటాడు. అంతలో పక్కనే ఏదో జంతువూ మూలుగు తున్నట్లు వినిపిస్తుంది. తను ధైర్యంగా లేచి అక్కడికి వెళతాడు. ఓ పెద్దపులి మూలుగుతున్న శంధం అది. దాని కాలికి ఏదో దెబ్బ తగిలి రక్తం కారిపోతుంటుంది. చొక్కా చించి డానికి కట్టుకడతాడు. అది ఠక్కున మనుషుల భాషలో మాట్లాడుతుంది. ఇంత సహాయం చేసిన నీకు ఏం కావాలని అడుగుతుంది. తనకు జమునారాణి కావాలని అడుగుతాడు.
అప్పుడది బయలుదేరి అరక్కోణం వెళుతుంది. రంగానాతాన్ని శుభ్రంగా ఆరగించి జమునారాణిని నోటితో కరుచుకొచ్చి తనకు ఇస్తుంది. అప్పుడు తను తిరిగి ఆమెతో తన మామూలు ఆట మొదలుపెడతాడు. ఇలా కలలుకంటూ ఎప్పుడో తెల్లారుజామున నిద్రపోయాడు. కళ్ళు మూతలు పడ్డాయో లేదో తనని ఎవరో నిద్ర లేపుతున్నట్టు అనిపించింది, మెల్లగా కళ్ళు విప్పాడు. కాలో నిజమో తెలియడంలేదు. తన ఎదురుగా జమునారాణి.
"ఊరు వెళ్ళిపోతున్నాను, చెప్పి వెళదామని వచ్చాను. బాగా చదువుకో'' బెడ్ లైట్ వెలుగులో ఆమె అచ్చు తను చదివే చందమామ పుస్తకంలోని రాకుమారిలా వుంది. అతనికి నోట మాట రావటంలేదు. కళ్ళల్లో మాత్రం నీళ్ళు ఊరుతున్నాయి. "ఛీఛీ ఏడవకు, అరక్కోణం దగ్గరే కదా, అప్పుడప్పుడూ వస్తుంటాను. ఇంకా మా ఇళ్ళు, ఉన్న పోలమూ అమ్ముకోవాలి. అందుకైనా రావాలి కదా'' అని అతని చెక్కిళ్ళపై ముత్యాల్లా బిగుసుకుపోయిన కన్నీళ్ళను తుడిచింది. అతనికి ఆమెకి ఎలా వీడ్కోలు చెప్పాలో తెలియడం లేదు. అతనికి తెలిసింది ఒక్కతే భుజం మీద చేతులువేసి మెల్లగా ఆమె ఎద మీదకి దించాడు.
"త్వరగా ... త్వరగా ... వెళ్లిపోవాలి'' కొంత సమయం తరువాత అతను చేతులు తీసివేశాడు. "బాగా చదువుకోవాలి ... సరేనా'' ఆమె ప్రేమతో అతని బుగ్గను చరిచి వెళ్ళిపోయింది. అతను దుఃఖం ఆపుకోలేక పైకి ఏడ్చేశాడు. ఆమె వెళ్ళేటప్పుడు కోరుకున్నది బాగా చదువుకొమ్మని, కానీ అదే అతనికి వీలుకావడం లేదు. తనలోని ఆనందాన్ని, తనలోని చలాకీతనాన్ని అంతా ఆమె తనతోపాటు తీసుకెళ్ళినట్టు అనిపిస్తోంది. ఎప్పుడూ ఆమె ధ్యాసే. పదో తరగతి పరీక్షలు అయిపోయాయి.
స్కూలు కూడా లేదు. ఎప్పుడూ అలా శూన్యంలోకి చూస్తూ వున్దిపోతున్నాడు. పక్కన పదిమంది మనుషులు మాట్లాడుతున్నా అతనికి వినిపింకాహ్డం లేదు. ఆకలీ, నిద్రా ఎలా వుంటాయో మరచిపోయాడు. బిడ్డ అలా ఎందుకు తగ్గిపోతున్నాడో తెలియక అతని తల్లిదండ్రులు గింజుకుపోయారు. డాక్టర్లకు చూపించారు, మంత్రాలు వేయించారు. ఆంజనేయుల స్వామి తాయెత్తు కట్టించారు. కానీ లాభం లేకపోయింది. ఓ రోజు వరలక్ష్మమ్మ పెదనాన్న చనిపోతే ఇంటిల్లీపాదీ ఊరికి బయల్దేరారు. కానీ వాసూ మాత్రం రానన్నాడు. తల్లిదండ్రులు ఎంత బ్రతిమిలాడినా రానన్నాడు. సాయంకాలానికి వచ్చేస్తాం కదా అని అందరూ బయల్దేరి వెళ్ళిపోయారు.
వాసూ ఒంటరిగా వుండిపోయాడు. "అక్కా ... అక్కా ...'' ద్వారం దగ్గర నిలబడి ఎవరో అరుస్తున్నారు. పనిమనుషులు పొలం దగ్గరికి వెళ్ళిపోవడంతో తనే వెళ్ళి తలుపు తీయక తప్పింది కాదు వాసూకి. ఎదురుగ్గా వున్న మనిషిని చూసి అతను ఒక్కసారిగా ఆనందపు సముద్రం అయిపోయాడు. ఆ సముద్రపు అలలు చెలియల కట్ట దాటి వురుకుతున్నట్లు కళ్ళల్లో నీళ్ళు బయటికి దూకాయి. ఆ వ్యక్తి జమునారాణి. "బావున్నావా?'' అంటూ లోపలికి నడిచింది. అతను ఆమెను అనుసరించాడు. ఆమె వంటగదిలోకి తొంగిచూసి, అక్కడ ఎవరూ లేకపోతే "అమ్మ ఎక్కడ?'' అని అడిగింది.
"లేదు ... ఊరెళ్ళారు. సాయంకాలం వస్తారు'' "అవునా ... నీ చదువెలా సాగుతోంది? పరీక్షలు బాగా రాశావా? అదేమిటి అలా తగ్గిపోయావ్? ఒంట్లో బాగాలేదా?'' అని అతనికి ఎదురుగా నిలబడి ప్రశ్నల్లో ముంచెత్తింది జమున. "నీమీద బెంగ. చిన్నప్పుడు అమ్మ అరక్షణం కనిపించకపోతే ఎలా అనిపించేదో నువ్వు వెళ్ళిపోయినప్పట్నుంచీ అలా అనిపిస్తోంది'' అన్నాడు తప్పు చేసినవాడిలా తల వంచుకుని. "అలా బాధపడకు, మరి నే వస్తాను. మా ఇంటి జాగా, పొలమూ, వెంకట్రామయ్య కొన్నాడు. మధ్యాహ్నం రెండు గంటలకి రిజిస్ట్రేషన్, అందరూ టౌన్ లో వున్నారు. నేను మిమ్మల్ని చూసిపోదామని ఇలా వచ్చాను. వెళ్ళిలిరానా?'' అని ముందుకు వెళ్ళిపోతోంది.
|
|


