The content in this feature is rated as "A++". You must be at least 18 years old to view this feature.
Home>>Kalagantine Cheli
కలగంటినే చెలి - 94

శివాలయానికి ముందు మామిడితోట వుండడంవల్ల అక్కడంతా గుబురుగా భయం గొలిపేలా వుంటుంది. పామూ పుత్రా వుంటుందేమోనని అనుమానం పడిన చంద్రరేఖ శ్మశానం మైదానంలాగా వుంటుంది కాబట్టి ఆ దారిలో వస్తోంది. వాసూకి, శశికి వచ్చిన సమస్యలేదు అన్న ఆనందంతో వస్తున్నా ఆమె ఎదురుగా ఏదో కలకలంలా మనుషుల మాటలు విన్పిస్తుంటే ఎవరోస్తున్నారో తెలియక కళ్ళు చిట్లించి చూసింది. ఎవరూ కనపడడంలేదు గానీ మాటలు మాత్రం మరింత దగ్గరవుతున్నాయి.

"అదిగో వస్తోంది'' జనంలో ముందు నడుస్తున్న వాళ్ళలో ఎవరో అరిచారు.

"పదండి'' సరిగ్గా వాళ్ళు శ్మశానం నడిబొడ్డులో చంద్రరేఖకు ఎదురుపడ్డారు.

అంతమంది జనం తనముందు నిలబడటంతో ఏం జరిగిందో అర్థంకాక చంద్రరేఖ వాళ్ళవైపు ప్రశ్నార్థకంగా చూస్తోంది. జనమంతా పూనకం వచ్చినట్లు అదో ఉన్మాదంలో వున్నారు. అప్పుడు ఆమె చేస్తున్న సేవ ఎవరికీ గుర్తుకురాలేదు. ఇతరులకోసం ఆమె పడే తపన అసలే గుర్తుకురాలేదు. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఆమె చేస్తున్న పోరాటం ఎవరి మనసుకీ తట్టలేదు. ఇతరుల కష్టాల్ని తనకోచ్చినట్టు భావించే ఆమె గురించి ఎవరికీ పట్టలేదు. దామాచారి, భూపతిరెడ్డి వాళ్ళ గుండెల్లో అంత విషం నింపారు. భూపతిరెడ్డి కనుసైగ చేస్తే చాలు వాళ్ళు ఆమెను ఏమైనా చేసేస్థితిలో వున్నారు.

అయితే ఆయనంత తెలివితక్కువైనవాడు కాదు. ఆమెకు చిన్న చిన్న శిక్షలు వేసి సంతృప్తిచెందే స్థితిలో లేడు. ఇంకా క్రూరంగా ఆలోచిస్తున్నాడు. అందువల్ల ఆయన ఏం మాట్లాడకుండా వున్నాడు. ఇనుము ఇంకా కాలాలి. అప్పుడే వాత బాగా పడుతుంది. అదే ఆయనకీ కావాల్సింది. అందుకే "చూశారుగా ... ఇక పదండి'' అన్నాడు జనాంతికంగా.

జనానికి ఆ మాటలు రుచించలేదు. వాళ్ళకి ఆమెను కసితీరా తిట్టాలని వుంది. అయితే తమ రాజు అందుకు అనుమతించటంలేదు. ఆయన చెప్పకుండా ఏ పని చేయడానికీ వాళ్ళకి ధైర్యం లేదు. అందుకే ఒక్క మాటైనా మాట్లాడకుండా వెనుతిరిగారు. అంతమంది జనం ఎందుకు అక్కడికి వచ్చారో చంద్రరేఖకి అర్థం కాలేదు. ఏం జరిగిందో అడగాలని వున్నా ఎవరూ తనకు జవాబు చెప్పరని ఆమె వాళ్ళ ముఖాల్ని చూసే కనుక్కోగలిగింది. అందుకే మౌనంగా వాళ్ళ వెనకే నడిచి ఇంటికి చేరుకుంది. మరుసటి రోజు విషయం తెలిసింది.

జనానికి అప్పుడున్న కోపం ఇప్పుడు లేదు. అందుకే ఫ్రీగా ఆమెతో మాట్లాడ్డం లేదుగానీ అంతకంటే ఎవరూ ఆగ్రహాన్ని ప్రదర్శించలేదు. చంద్రరేఖ అయితే దాన్నంత సీరియస్ విషయంగా తీసుకోలేదు. జనం కాలం గడిచేకొద్దీ నిజం తెలుసుకుంటారని ఆమె నమ్మకం. ఇది జరిగిన వారం రోజుల తరువాత ఓ కుటుంబం ఆమెను వెతుక్కుంటూ వచ్చింది.

వాళ్ళు ముగ్గురు. భార్యా, భర్త, ఆమె తల్లి. భార్యపేరు గౌతమి, భర్త పేరు ఈశ్వరరావు, ఆమె తల్లి భాగ్యవతమ్మ. వాళ్ళని చూసి ఎవరో పోల్చుకోలేకపోయింది. ఇంతకుముందు ఎక్కడా చూసినట్టు కూడా లేదు. తనకు బంధువులెవరూ లేరు. మరి వీళ్ళెవరు? అదే ప్రశ్న వేసింది.

"టౌన్ లోని డాక్టరమ్మ పంపింది'' అని అతను ఓ ఉత్తరాన్ని చంద్రరేఖకి ఇచ్చాడు.

రూపాదేవిని ట్రీట్ చేసిన లేడీ డాక్టర్ రాసిన ఉత్తరం అది. గౌతమి మానసిక రోగి. వాళ్ళది పెద కుటుంబం. టౌన్ లోని సైక్రియాటిస్ట్ కి చూపించి గౌతమిని బాగుచేయించే స్త్నితిలో లేరు. ఈ వివరాలన్నీ రాసి "నాకు తెలిసినంత వరకు ఆడవాళ్ళ జబ్బుల్ని నయం చేయడంలో నువ్వు ఫస్ట్. నీ ప్రావీణ్యత గురించి విన్నాను. స్వయంగా చూశాను. కాబట్టి గౌతమికి నయంచేసి పంపించే పూచీ నీది'' అని రాసింది.

వానాకాలం చదువులాగా తను డాక్టర్ దగ్గర పనిచేసి కొద్దిపాటి అనుభవం సంపాదించింది. ఈ చిన్న పల్లెటూర్లో సైక్రియాటిస్ట్ లు, న్యూరాలజిస్ట్ లూ, సైకాలజిస్ట్ ల గురించి తెలియదు గనుక తను ఏదో తెలిసిన మేరకు వైద్యం చేస్తోంది. ఇప్పుడు ఓ లేడీ డాక్టర్ తనకు ఓ కేసు రిఫర్ చేసిందని గర్వించాలో, అరవాకోరావా జ్ఞానంతో చికిత్స చేయడంకూడా ఓ పెద్ద క్వాలిఫికేషన్ గా ఆమె భావించినందుకు ఏడవాలో అర్థంకాకుండా పోయింది. వాళ్ళని పరిశీలించి చూసింది.

వాళ్ళని చూస్తుంటే ఒకప్పుడు బాగా బతికి చితికిపోయిన కుటుంబంలోంచి వచ్చినవాళ్ళులా వున్నారు. ఎంత అందంగా, ఆకర్షనీయంగా వున్నారో అంత పేదగా, బేలగా కనిపిస్తున్నారు. అందుకే వెళ్ళమని చెప్పలేకపోయింది. "లోపలికి రండి'' అని ఆహ్వానించింది. చిట్టిని పిలిచి "వీళ్ళు మన గెస్ట్ లు, ఏ ఇబ్బందీ లేకుండా చూసుకో'' అని చెప్పింది.

ఆమె మాటనే వేదంగా భావించే చిట్టి వాళ్ళకి అన్ని సదుపాయాలూ కల్పించే బిజీలో వున్నాడు. వాళ్ళు వచ్చింది ఉదయం తొమ్మిది గంటలకి. ఇక అప్పుడు సెలవు చీటీ పంపిస్తే మేనేజ్ మెంట్ ఉడుక్కుంటుంది, అందులోనూ గంటలోనో, అరగంటలోనో పరిష్కరించే కేసులా కనబడడం లేదు. అందుకే తీరిగ్గా సాయంకాలం పరీక్షిద్దామని భావించి చంద్రరేఖ ఫ్యాక్టరీకి వెళ్ళిపోయింది. తిరిగి సాయంకాలం వచ్చేటప్పటికి వాళ్ళు రిలాక్స్ అయి ఫ్రీగా ఏదో చుట్టాలింటికి వచ్చినట్టున్నారు. గౌతమి ఒక్కతే ఈ లోకంతో సంబంధం లేనట్టు ఎటో చూస్తోంది చుట్టూ ఏం జరుగుతూవుందో ఆమెకి ధ్యాసలేదు, మాట్లాడాదు ... ఏదయినా చెప్పినా వినదు.

కళ్ళు తెరుచుకుంటుంది తప్ప ఈ లోకంలో వుండదు. దీన్నే "ప్రపంచంతో సంబంధం తెగిపోవటం'' అంటారు. ఆమెకి పాతికేళ్ళు వుంటాయి. ఎర్రగా కనకాంబరం మొక్కలా వుంది. కనకాంబరం మొక్కకి చివరలో తెల్లటి పద్మాలు కాలవైపరీత్యంవల్ల పూసినట్టు ఆమె కళ్ళు పెద్దవిగా అందంగా వున్నాయి. ముక్కు వంపుని మరింత స్పష్టంగా చూపించడానికన్నట్టు పెదవులు ఎర్రగా, మందారాల పూలపోడిని నూరి పూసుకున్నట్టున్నాయి.

ఇక ఆమె ఎదను చూస్తే ఎవరికయినా గుడిగోపురం మీద వుండే రాగి కలశాలు గుర్తుకొస్తాయి. అంత పెద్ద ఎదను మోయడంవల్ల కృశించిపోయినట్టు నడుం మరింత సన్నగా అయిపొయింది. అతనూ చూడడానికి బావున్నాడుగానీ అంత తెలివైనవాడుగా అనిపించడం లేదు. జీతాన్ని లెక్కవేసుకునేటప్పుడు తప్ప ఇక మరేపుడూ బుర్ర్రను ఉపయోగించేటట్టు లేడు. గౌతమి తల్లి సాదా సీదా స్త్రీ. కూతురి అనారోగ్యమంతా తాను అనుభవిస్తున్నట్టు ఆమె దైన్యంగా వుంది.

"చిట్టి అందరికీ కాఫీలివ్వు'' అని మంచాన్ని కొబ్బరిచెట్టు కిందకి లాగింది చంద్రరేఖ. అక్కడినుంచితే వీథి కనిపించదు. తడికెల చాటు వుంటుంది. మంచాన్ని వేశాక ఈశ్వరరావుని అక్కడికి రమ్మన్నట్టు సైగచేసింది. అతను వచ్చాడు. గౌరామి తల్లి వెనకాల కూర్చుని వుంది. వాళ్ళిద్దరూ గడపకి ఆవతల కూర్చుని వీథిలోకి చూస్తున్నారు. చిట్టి వాళ్ళకి కాఫీలిచ్చి, మరో రెండు గ్లాసుల్ని కొబ్బరిచెట్టు దగ్గరికి తెచ్చాడు. మంచం ఓ చివర చంద్రరేఖ కూర్చుని అటు చివర కూర్చోమన్నట్టు చేత్తో చూపిస్తూ "కూర్చో'' అంది ఈశ్వరరావుతో.

చిట్టి చేతుల్లోని గ్లాసుని అందుకుని ఒకటి అతనికిచ్చింది. కాఫీ ఓ సిప్ చేశాక "ఈశ్వరరావ్! కొత్తంతా పోయింది కదా ... ఇప్పుడు తీరిగ్గా మీ గురించి ... అంటే మీ భార్యాభర్తల సంసారిక జీవితం గురించి ఏదీ దాచకుండా చెప్పు. నువ్వు చెప్పిన నిజాలమీదే నీ భార్య ఆరోగ్యం ఆధారపడి వుంటుందని గ్రహించు. గౌతమి ఏమీ చెప్పే స్థితిలో లేదు. ఏమీ పట్టనట్టు వుండే ఈ స్థితిలో సోషల్ విత్ డ్రాల్ అంటారు. ఆమెని హిప్నటైజ్ చేసినా ప్రయోజనం వుండదు. ఇక మీ అత్తమ్మకు మీ సంసారిక జీవితం గురించి తెలిసే అవకాశం వుండదు. కాబట్టి నువ్వు ఎలాంటి అరమరికలు లేకుండా మీ గురించి చెప్పు'' అంది.

"అలానే'' అని తలాడించాడు. ఆమె అడిగితే మొత్తం చెప్పాలని ముందే నిర్ణయించుకోవడంవల్ల కాఫీని చకచకా తాగేశాడు. అతను చెబుతుంటే శ్రద్ధగా వింటోంది.

ఈశ్వరరావుది అనంతపురం దగ్గర పల్లెటూరు. ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. అప్పటికి వాళ్ళింటి పరిస్థితి బాగాలేదు. ఇక చదవడానికి అతనికి స్థోమత లేకుండా పోయింది. ఉన్న కొద్దిపాటి పొలంలో వచ్చే రాబడే జీవనాధారం. ఆ పల్లెటూళ్ళు దరిద్రంతో తాండవించేవి. ఏ ఊరెళ్ళినా "అనంతపురమా - అక్కడంతా కరువుగదా'' అని చిన్నచూపుగా అడిగేవాళ్ళు. అందుకే వున్న ఊరునీ, కన్న తల్లిదండ్రుల్ని దూరంగా వదిలిపోవాలని నిశ్చయించుకున్నాడు.

అనంతపురం జిల్లాను వదిలేస్తే తప్ప తన ఇన్ ఫీరియారిటీ కాంప్లెక్స్ పొడనుకున్నాడు. అందుకే ఉద్యోగ ప్రయత్నాల్లో పడ్డాడు. కాని ఇంటర్ మీడియట్ కి ఏ ఉదోగం వస్తుంది. అయినా పట్టు వదల్లేదు. కనిపించిన ప్రకటనలన్నిటికీ అప్లై చేసేవాడు. చివరికి నెల్లూరు జిల్లాలో ఇటు ఆంధ్రాకూ, అటు తమిళనాడుకూ బోర్డర్ లో వుండే తడ దగ్గరున్న ఓ ప్రైవేట్ ఫ్యాక్టరీలో సెక్యూరిటీ ఆఫీసర్ ఉద్యోగం వచ్చింది. జీతం తక్కువైనా జాయినైపోయాడు.