The content in this feature is rated as "A++". You must be at least 18 years old to view this feature.
Home>>Kalagantine Cheli
కలగంటినే చెలి - 23

ఆమె చిన్న నోరు విప్పి "బ్రిడ్జి పక్క ఓ బోర్డుంది గమనించావా? బ్రిడ్జి బలనీహంగా వుంది. పదిహేను టన్నుల బరువున్న వాహనములు ప్రయాణించరాదు అని అందులో రాసుంది. అలానే నేను బలహీనంగా ఉన్నాను. డెబ్బై కేజీల మించిన బరువును మోయలేను'' అంది నవ్వుతూ.

"అరవయ్యే నేను'' అన్నాడతను.

అతను ఏదో అవస్థ పడుతుంటే "టేక్ డైవర్షన్'' అంది మళ్ళీ నవ్వుతూ.

ఈసారి అతను తన ముఖాన్ని కంఠంమీద నుంచి సరాసరి నడుం దగ్గరికి తెచ్చాడు.

"ఓవర్ టేకింగ్ ప్రమాదం'' అంది అదే నవ్వును కొనసాగిస్తూ.

అతను తన తప్పు తెలుసుకున్నాడు. తన పెదవుల్ని పైకి మరల్చాడు.

"శృంగారంలో కళ్ళు సైడ్ మిర్రర్ లాంటివి. ఆనందం ఎంత ఒలుకుతుందో తెలుసుకోవచ్చు'' అని అతన్ని ఉడికించడానికన్నట్లు నడుం మీద చక్కిలి గింతలు పెట్టింది.

అతను ఠక్కున ఆగాడు.

"మాయాబజార్ లో అభిమన్యుడు పోతున్న రథం రోడ్డుమీద రాక్షసుడు గోడలా లేస్తే ఇలానే ఠక్కున ఆగిపోయింది'' అంది నిద్రలో పలవరిస్తున్నట్లు.

తను ఎందుకు ఆగాడో చెప్పడానికి అతనికి సిగ్గు అడ్డం వచ్చింది. అతను ఎందుకు ఆగాడో ఆమెకి తెలిసి ఆమె ఏదో అంది. అయితే అప్పుడే బ్రిడ్జిపైన వాహనం ఏదో వెళుతుండడంవల్ల ఆమె అన్నది అతనికే వినిపించింది. ఆ తరువాత కూడా చాలా వాహనాలే వెళ్ళాయిగానీ ఆ శబ్దాలు కూడా వినిపించనంతగా వాళ్ళు మైమరచిపోయారు. బ్రిడ్జిమీద నిముషానికి ఒక వాహనం చొప్పున వెళుతోంది, వాళ్ళు అక్కడ వుండగానే దాదాపు పదిహేను వాహనాలు అటు వెళ్లగా, పదిహేను వాహనాలు ఇటు వెళ్ళాయి. వాళ్ళు పైకి లేచి తిరిగి రోడ్డుమీద కెక్కేటప్పటికి సాయంకాలంమయమైపోతోంది.

ఆమెకైతే ప్రపంచం కొత్తగా వుండి. రాళ్ళు సైతం కూనిరాగాలు తీస్తున్నట్టున్నాయి. మసక చీకట్లు కూడా మెరుస్తున్నట్లు తోస్తోంది. సబ్బు ముక్కలా అనిపించే నీలాకాశం సముద్రపు కెరటంలా వుంది. పిచ్చిగువ్వలా వుండే నక్షత్రాలు ముత్యపు చిప్పల్లా వున్నాయి. తను మామూలుగా నడవగాలుగుతున్నానన్న నిజాన్ని అప్పుడు గ్రహించిండామె. ఏమైంది తనకి? వెంకటాచలం ఏమైనా మంత్రం వేసి తన కాళ్ళనొప్పుల్ని తీశేశాడా? లేదా తథాస్తు దేవతలు తనని ఆశీర్వదినారా? ఆ ఊహతోనే తన సంబంధానికి దేవతలు సైతం ఆయోదముద్ర వేసినట్టు అనిపించింది. ఎక్కడో నక్కి వున్న పాపభీతి కూడా పటాపంచలైపోయింది. ఆమె అతనికంటే ముందు నడుస్తోంది.

మరో వారానికి శరీరంమీద పొక్కులు కూడా అదృశ్యం కావడం ప్రారంభమైంది. ఇంకో నెలకంతా ఆమె మామూలు మనిషి అయ్యింది. ఒకరోజు సాయంకాలం వెంకటాచలం పెళ్ళి పత్రికలూ తీసుకొచ్చాడు. "రేపు సాయంకాలం శివాలయంలో మా పెళ్ళి. ఎవర్నీ పిలవటం లేదు. ఏదో ముఖ్యమైన వాళ్ళని మాత్రం పిలుస్తున్నాం. నువ్వు అందరికంటే ముఖ్యమైనదానివి. అందుకే ఈ పిలుపు, మా ఊర్మిళ తిరిగి మనిషని చేసిన నీకు చర్మంతో చెప్పులు కుట్టిచ్చినా నీ ఋణం తీరదు'' అన్నాడు.

అతని కళ్ళల్లో సన్నటి నీటిపొర. ఆ అభిమానానికి చంద్రరేఖ కూడా కదిలిపోయింది. "ఇందులో నేనేం చేశాను వెంకటాచలం. బహుశా ఊర్మిళకు జబ్బు బాగయ్యేప్పుడు నేను సలహాలు ఇవ్వడం ప్రారంభించి వుంటాను. పెళ్ళి రేపు రాత్రికి కదా తప్పక వస్తాను'' అతను వెళ్ళిపోయాడు.

మరికాసేపటికి ఊర్మిళ వచ్చి కార్డు ఇచ్చింది. వెళుతూ వెళుతూ "నేనేం తప్పు చేయడం లేదు కదా'' అని అడిగింది.

"చీచీ అలాంటిదేమీ లేదు' 'చకచకా నడుచుకుంటూ వెళుతున్న ఆమెను చూసి చిట్టి ఆశ్చర్యపోయాడు. "ఎలా బాగుచేశావ్ ఆమెను? ఇంతకీ ఏమిటి జబ్బు?''

"శారీరకంగా ఏ జబ్బూలేదు. అంతా మానసికమే. మానసిక జబ్బుల్లో చాలా మటుకు పడకటింట్లో పుట్టేవే. దాన్ని కనిపెట్టి మందువేస్తే ఫలితం బ్రహ్మాండంగా వుంటుంది. మనం చేయాల్సిందల్లా దాని మూల కారణం ఖచ్చితంగా కనిపెట్టడమే.

రెండోరోజు రాత్రి చంద్రరేఖ, చిట్టి ఊర్మిళ పెళ్ళికి బయల్దేరారు. ఊరికి ఫర్లాంగు దూరంలో వున్న శివాలయంలో పెళ్ళి. ఊరు దాతబోతుండగా వి.ఎల్. డబ్య్లు క్వార్టర్స్ దగ్గర గంగాధరం కనిపించాడు. వీథి దీపపు వెలుగు మసగ్గా పడుతోంది. ఆ వెలుతురులో అతను గోడమీద బొగ్గుతో ఏదో బొమ్మ గీస్తున్నాడు. చంద్రరేఖ తన సహజమైన ఉత్సుకతతో ఆగింది. అతను చుట్టుపక్కల్ని పట్టించుకోకుండా బొమ్మ గీస్తున్నాడు.