The content in this feature is rated as "A++". You must be at least 18 years old to view this feature.
Home>>Is Heart Pains Comes Due To ...
మనసులు కలవకపోతే గుండెపోటు వస్తుందా?

పద్మినికి వివాహమైంది చూసేవారికి వారిద్దరూ చిలా గోరింకల్లా కనబడతారు. మంచి అందగాడు, హోదాగలవాడు పద్మినికి భర్తగా లభించడం చూసి ఆమె స్నిహితురాళ్ళు అసూయ కూడా చెందేవారు. ఎటువంటి లోపంలేని ఆనందమయ జీవితంలోకి అడుగుపెట్టిన పద్మినికి ఈ మధ్య అనుకోకుండా అకస్మాత్తుగా గుండెపోటు రావడం ప్రారంభమైంది. గుండెలో నొప్పిరాగానే చేతులు అదిమిపట్టుకుని నొప్పి భరించలేక మెలికలు తిరిగిపోవడం ప్రారంభించింది

 

.ఏమైనా గుండెజబ్బు వచ్చిందేమోనని ఎంతమంది డాక్టర్లకి చూపించినా, ఎన్నిసార్లు ఇ.సి.జి. తీసినా, ఎన్నిరకాల పరీక్షలు చేసినా ఎవ్వరూ ఏమీ లేదనే అంటున్నారు. కానీ పద్మినికి ఉన్నట్టుండి గుండెపోటు రావడం మానలేదు, మానసిక ఆందోళన తగ్గడంలేదు. క్రొత్తగా పెళ్ళి అయి ముచ్చటగా కాపురం చేసుకుంటున్న పిల్లకి ఇదేమిటి ఇలా రోగం వచ్చి పడిందని తల్లిదండ్రులు బాధపడనారంభించారు.

 

 

ఎవ్వరికీ అంతుపట్టని ఈ గుండె నొప్పికి దాంపత్య జీవితంలో ఏదైనా బాధ ఉన్నదేమోనని భావించి అడిగితే పద్మిని అలాంటిది ఏమీ లేదని గట్టిగా చెప్పేసేది. పైగా పెళ్ళి అంతే స్త్రీ-పురుషుల కామ సంబంధాలేనా అంటూ ఎదురుప్రశ్న వేసేది కాని ఆమె మనోవిశ్లేషణ చేసి చూస్తే దాంపత్య జీవితంలోని అసంతృప్తే ఆమె గుండెపోటుకి కారణమని తేలింది. భర్త ఎంత అందగాడైనా, ఎంత హోదాగలవాడైనా అతనిలో కొన్ని గుణాలు పద్మినికి నచ్కాలేదు. అవి ఆమెకు బాధాకరంగా అనిపిస్తాయి. కాని అవి తనకు నచ్చలేదని ధైర్యంగా పైకి చెప్పలేదు. సరే పైకి చెప్పి సరిదిద్దే ధైర్యం లేకపోతే వాటిని అంగీకరించి ఊరుకో గలుగుతుందా అంటే అదికాదు. ఎదురించనూ లేదు, ఇప్పుకోనూ లేదు ... ఇదీ ఆమె మానసిక స్థితి. ఇటువంటి మానసిక భావాల సంఘర్షణ దాంపత్య జీవితంలో అల్లకల్లోలాన్ని, అసంతృప్తిని తెచ్చిపెట్టింది. ఈ మానసిక అల్లకల్లోలమే గుండెపోటు లాంటిది వారడానికి కారణం. చాలామంది యువతుల్లో వారి దాంపత్య జీవితంలో కనబడే అసంతృప్తికి కారణాలు చాలా చిన్నవిగా కనబడతాయి. వాటికి అర్థం అంటూ ఉండదు. కాని వాటిని కొందరు యువతులు చాలా పెద్ద సమస్యగా చిత్రించుకుంటారు. ఏమాత్రం విజ్ఞతతో వ్యవహరించినా ఇటువంటి సమస్యల్ని అతి తేలికగా పరిష్కరించుకోవచ్చు.