The content in this feature is rated as "A++". You must be at least 18 years old to view this feature.
Home>>Dr X-Zone>>What is the function of Sperm
వీర్యం – ఏం చేస్తుంది..?

 

వీర్యం చాలా విలువైనదని, శరీరం నుంచి దీనిని వృధాగా బయటకు పంపకూడదని కొందరు వాదిస్తుంటారు. వీర్య నష్టం వల్ల పురుషుడు శక్తిని కోల్పోతాడని చెబుతుంటారు. నిజానికి వీర్యంలో ఎటువంటి శక్తిని పురుషునికి ఇవ్వదు. స్ఖలనం జరిగిన తర్వాత శృంగారాన్ని పురుషుడు ముగించేస్తున్నందువలన బహుశా ఇటువంటి అపోహలు కలిగి ఉండచ్చు.

వీర్యం అవసరం ఏమిటి అంటే…. స్త్రీ గర్భం దాల్చడానికి ఉపయోగ పడుతుంది అనే చెప్పుకోవాలి. ఇక్కడ గమనించవలసిన మరో సంగతి ఏమిటంటే సంభోగశక్తికీ, వీర్యానికీ సంబంధం లేదు. సంభోగ శక్తి ఎక్కువ ఉన్న వ్యక్తిలో వీర్యం ఎక్కువగా ఉండాలని లేదు. అలాగే వీర్యం ఉన్న వ్యక్తిలో శృంగారేచ్చ ఎక్కువగా ఉండకపోవచ్చు.

మామూలు మనుషులు సరిగా అర్థం చేసుకోలేని మరో విషయం ఒకటి ఇక్కడుంది. అదేమిటంటే వ్యక్తుల మధ్య వీర్యం ఉత్పత్తిలో ఎక్కువ తక్కువలు అనేవి సహజమే అనేది. అందరిలో వీర్యం ఉత్పత్తి (పరిమాణం రీత్యా) ఏకరీతిగా ఉండదు. కొందరిలో ఎక్కువ ఉండచ్చు మరికొందరిలో తక్కువ ఉండచ్చు.

సాధారణంగా సగటున పురుషుడు స్ఖలించే వీర్యం రెండు మిల్లీ లీటర్ల నుంచి అయిదు మిల్లీ లీటర్లు ఉంటుంది. ఇది వ్యక్తికీ వ్యక్తికీ మారచ్చు. పురుషుడు స్ఖలించే వీర్యంలో ఉన్న శుక్ర కణాల వల్ల మాత్రమే స్త్రీ గర్భం ధరించగలుగుతుంది. సాధారణంగా రెండు ఎం.ఎల్, వీర్యంలో 60 మిలియన్ల శుక్ర కణాలు ఉంటే స్త్రీ గర్భం దాల్చగలుగుతుంది. కొన్ని సందర్భాలలో ఇంతకంటే తక్కువగా ఉన్నప్పటికీ కదలిక ఎక్కువగా ఉన్న ఆరోగ్యవంతమైన శుక్రకణాలుంటే గర్భం దాల్చడానికి ఉపయోగపడుతుంది.

మామూలు వ్యక్తులలో 60 మిలియన్ల వీర్య కణాలుండి, వాటిలో 40 శాతం చక్కని కదలిక ఉంటే ఆరోగ్యవంతమైన వీర్య కణాలుగా గుర్తించగలుగుతారు. కొందరిలో వీర్య కణాల ఉత్పత్తి అసలు జరగకపోవడం కానీ, లేదా చాలా తక్కువగా ఉండడం కానీ జరగచ్చు. ఇలాంటి వారికి కొన్ని చికిత్సలు చేయడం ద్వారా వీర్య కణాల సంఖ్య పెంచడం సాధ్యమే కానీ, మరీ ఎక్కువగా మాత్రం పెంచలేరు.

ఇలా పెంచగలమని ఎవరైనా చెప్పినా అది ఆచరణలో కష్టమే. చికిత్సల వలన కొద్దిగా మాత్రమే ప్రయోజనం చేకూరగలదు. ముందుగా చెప్పుకున్నట్టు శృంగార సామర్ధ్యానికీ, వీర్యానికీ సంబంధం లేదు.