- ముచ్చర్ల రజనీ శకుంతల
.png)
"ఏమండీ మరోసారి ఆలోచించండి ... ఎనీ థర్డ్ ఆర్ ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ ఆర్ సిక్త్స్ థాట్ ... అడిగింది చివరాఖరి ప్రయత్నంగా ఒళ్ళు విరుచుకొని భ్రమ.
"సారీ ... ఐ కాంట్ హెల్ప్ ... బామ్మ మొక్కును కాదనలేని నీచ నిస్సహాయ, నిర్ణయ, నికృష్ట మొగుడ్ని ...'' బాధగా అన్నాడు హేవ్ మోర్ లో మిడ్ నైట్ బ్యూటీ ఐస్ క్రీమ్ లా ఉన్న పెళ్ళాం నడుమందాలు చూస్తూ నచికేత.
"న-కారాలతో నాలుగు పదాలు యూజ్ చేసారు ... ప్రాసకోసమా? రియలైజేషన్ కోసమా?'' అడిగింది శబ్దరత్నాకరంలో ఆ పదాల అర్థాలు ఖచ్చితంగా ఏమై ఉంటాయో ఆలోచిస్తూ.
"భ్రమా ... నువ్వలా అంటే వృత్తిలేఖనితో నా గుండె మీద గుచ్చి, గుండ్రాలు గీస్తున్నంతగా గిన్జుకోవాల్సి వస్తుంది'' సిన్సియర్ గానే అన్నాడు నచికేత.
"నాలుగుకి, అయిదోది కలిపి, అయిదు 'గ'కారాల్లోకి వెళ్ళారు. అవునూ ... పెళ్ళిచూపులప్పుడే ... నీకేమైనా అడగాలని ఉంటే అడగొచ్చని అన్నప్పుడు అడిగితే బావోదని అడగలేదు ... మీ పేరు నచికేత ... ఏంటీ ... వెరైటీగా ఉంది''
భార్య వంక అలానే చూస్తుండిపోయాడు. భ్రమ భార్య అయితే అయ్యిందిగానీ ... ఇంకా తనలో సగమై కరిగిపోలేదు. తన కౌగిలిలో ఫిక్స్ డ్ డిపాజిట్ గా ఉండిపోలేదు. ప్యూర్ గోల్డ్ లావుపాటి మంగళసూత్రం భ్రమ మేడలో వేలాడుతూ, అప్పుడప్పుడూ భ్రమ అటూ, ఇటూ కదిలినప్పుడు రోమియో టైపులో ఆమె గుండెలను తాకి అల్లరి చేస్తోంది. కనీసం ఒక్క క్షణం తాను ఆ మంగళసూత్రం అయినా బావుండనిపించింది. అదే మాట భ్రమతో అంటే ...
"ఇంకా నయం ... ఇంకా ఏవేవో కావాలని అనిపించలేదు ...'' అంటూ కిసుక్కున నవ్వింది.
నచికేత, భ్రమల పెళ్ళయి రెండు నెలలు దాటింది. ముహూర్తం బాగోలేదని శోభనం, తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంలా వాయిదాపడుతూ వచ్చింది. ముహూర్తం కుదిరే సమయంలో నచికేత తాలూకు బామ్మ ... సెప్టెంబర్ 11 వరల్డ్ ట్రెడ్ సెంటర్ మీద దాడి జరిగిన రేంజ్ లో ... ఓ మిస్సయిల్ ని గురి చూసి భ్రమ, నచికేతలపైకి వదిలింది. దాని తాలూకు అర్థతాత్పర్య సారాంశం ఏమిటంటే ...
అప్పుడెప్పుడో సునామీ వచ్చినప్పుడు ఆ టైంలో బామ్మ వైజాగ్ బీచ్ ముంతకింద పప్పు తింటూ, వైజాగ్ లో సునామీ రాకుండా ఉంటే తన మనవడిని, కొత్తపెళ్ళి కూతురితో సహా తిరుపతికి టికెట్ థర్డ్ ఏ.సి.లో బుక్ చేయించింది. అక్కడ్నుంచి పూరీ జగన్నాథుడి దర్శనానికి, శ్రీకాళహస్తి దర్శనానికి, కాళీ విశ్వేశ్వరుల దర్శనానికి ... ఇలా అన్ని దర్శనాలకూ వరసగా రోజు విడిచి రోజు టిక్కెట్లు బుక్ చేయించింది.
"తిరుపతి గోవిందుడా ... ఈ నెల పదవ తేదీనాడు నా మనువడ్ని, మనవరాలిని పంపిస్తున్నాను. వాళ్ళకాస్త దర్శనమిచ్చి ఆశీర్వదించవయ్యా ...'' అని కూడా మొక్కుకుంది.
నచికేతకు బామ్మ మీద ఎఫెక్షన్ కాస్త ఎక్కువే ... పైగా మొక్కు ... అందుకే స్వచ్చమైన నేటి మిఠాయిలా నోరూరిస్తోన్నా ... తనకు తానే 'డైవర్షన్ ... డైవర్షన్' అనుకుంటూ మనసును కంట్రోల్ లో ఉంచుకోవడానికి తెగ ట్రై చేస్తున్నాడు. తెల్లవారితే టెన్త్ ... ఈవినింగ్ పద్మావతి ట్రైన్ కు తిరుపతి వెళ్ళాలి. అప్పటివరకూ మేనేజ్ చేస్తే ... దేవుడి దగ్గర ఎలానూ కుదర్దు. ఆ తరువాత ... అంతా పైవాడి దయ ... అంటూ నిట్టూర్పు విడిచాడు.
"ఓ మైడియర్ స్వీట్ పాలకోవా ... భ్రమా ... టిక్కెట్లు ఎక్కడ పెట్టావ్ ...'' అడిగాడు నచికేత.
"ఏం ...? నా జాకెట్ పర్సులో పెడితే తీసుకుంటారా? తీసుకున్నా తీసుకుంటారు ... ఏ ఫీలింగూ లేకుండా''
"అబ్బా ... ఇప్పుడు సరసమైన జోకులతో చాకుల్లా పొడవకే'' బ్రతిమిలాడాడు నచికేత.
"దేవుడి గదిలో వున్నాయి ... మీరే కదా టిక్కెట్లను దేవుడి గదిలో పెట్టమంది. అనవసరంగా దేవుడ్ని నాతొ నిష్టూరాలాడించకండి'' అంటూ విసవిసా పడగ్గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది.
"భ్రమా ... రెడీనా?'' అడిగాడు బట్టలు సూట్ కేస్ లో సర్ది నచికేత.
"నేనెప్పుడో రెడీ. మీదే ఆలస్యం ... బయల్దేరుదామా?'' అడిగింది భ్రమ హ్యాండ్ బ్యాగ్ చేతిలోకి తీసుకుంటూ ...
"అబ్బ ... ఇప్పుడెంతయిందని ... జస్ట్ సిక్స్ ... ట్రెయిన్ ఎయిట్ కి కదా ... మనం ప్యారడైజ్ నుండి పావుగంటలో వెళ్తాము. వెళ్ళేది కారులోనే కదా ... అప్పటివరకూ 'మ' గుణింతం నేర్చుకుందాం'' భార్యను దగ్గరకు లాక్కొని అన్నాడు నచికేత.
"అదేంటి ... బియస్సీ చదివానన్నారు 'మ'గుణింతం రాదా ... కొంపదీసి యస్స్ స్సీతో ఆపేసి మోసం చేసారా?'' అడిగింది మొగుడి వంక అనుమానంగా చూస్తూ భ్రమ.
"అబ్బ ... జోక్స్ వద్దు ... 'మ' గుణింతం అంటే ... ముద్దు, ముచ్చట, మురిపెం ... ఎట్సెట్రా ... ఎట్సెట్రా ...'' "మీ దగ్గర ఇలాంటి విద్యలు కూడా ఉన్నాయా? అయినా శోభనం వద్దన్నారుగా ...''
"శోభనం వద్దన్నది బామ్మ ... అయినా శోభనం వద్దన్నానుగానీ, ముద్దూ ముచ్చట్లు వద్దనలేదుగా ...'' అంటూ భ్రమను దగ్గరికి లాక్కొని గులాబీ రంగు పెదాలను తన పెదవులతో బంధించి, ఒక్క క్షణం షాకయినట్టు దూరం జరిగాడు.
"ఏమైందేంటి ...'' అడిగింది భ్రమ.
"ఏమవ్వడమెంటీ ... నీ బాడీలో ఎలక్ట్రిసిటీ తో పాటు జనరేటర్ కూడా ఉన్నట్టుండి ... షాక్ కొట్టింది ... ఎంత టెంప్టింగ్ ...'' అంటూ బిక్కచచ్చిపోయాడు.
భ్రమర నవ్వుకుంది. ఆ తర్వాత మొగుడివైపు చూసి "పోనీ దేవుడికో దండం పెట్టుకుని ... కానిచ్చేద్దామా?'' అడిగింది లాస్ట్ హోప్ తో.
"అబ్బ బావోదేమో ...'' అంటూ టైం చూసుకుని "పద ... పద ... టైమవుతోంది. నీతో ఉంటే టైమే తెలియదు'' అంటూ తొందర చేసాడు. సికింద్రాబాద్ స్టేషన్ కు వచ్చి 'పద్మావతి' ట్రయిన్ ఏ ఫ్లాట్ ఫామ్ మీదికి వస్తుందని టి.సి.ని అడిగితే అతను పగలబడి నవ్వి, చూసి "ఎప్పుడూ రేపా ...? నాకు తెలియదు'' అంటూ సెటైర్ వేసి "పద్మావతి సెవన్ కి ... నాట్ ఎయిట్ ... నోట్ దాట్ పాయింట్'' అన్న లుక్కొకటి ఇచ్చి వెళ్ళిపోయాడు. నచికేత గుండెలో గ్రహశకల మేదో పడ్డ ఫీలింగ్ ...
వెంటనే ఎయిర్ లైన్స్ కు ఫోన్ చేసాడు. ఏ ఫ్లయిట్ లోనూ ఖాళీ లేదు. చాలా సేపు ఆలోచించాడు. నెక్ట్స్ డేకు కూడా టిక్కెట్స్ లేవు .. రెండ్రోజుల తరువాతే వెళ్ళాలి ... ఈలోగా లింక్ టిక్కెట్స్ పూరీకి, కాశీకి, శ్రీకాళహస్తికి, మదురైకి మొత్తం చెయిన్ సిస్టంలా ... ఏ దారీ లేక ఇంటికి తిరిగొచ్చారు. నైట్ టెన్ థర్టీ ... ఓ పక్కన సూట్ కేస్ బిక్కు బిక్కుమంటూ సోఫాలో పడివుంది. మంచం మధ్యలో రెండు చేతులను చుబుకానికి ఆన్చుకొని మంచం చివర కూర్చుని ఆలోచ్నిస్తున్న మొగుడి వంకే చూస్తోంది భ్రమ.
"ఇలా జరిగిందేమిటి?'' అన్నాడు దిగులుగా నచికేత. "మన శోభనం వాయిదాపడ్డం ఆ దేవుడికి కూడా ఇష్టం లేదు. అయినా మన మొదటి రాత్రి వాయిదా వేసుకొని రమ్మంటాడా దేవుడు. ఆ దేవుడికి మాత్రం దేవేరి లేదూ ... ఆ దేవుడు మన పూజగదిలో లేడూ ...'' అంది అనునయంగా భ్రమ.
"అంతేనంటావా ...!?'' అన్నాడు నచికేత.
"మీరు అంతే అనుకుంటే అంతే ... లేదంటే మనం ఇంతే'' అంది భ్రమ.
ఏ.సి. తాలూకు చల్లదనం ఆ గదిని ఆక్రమించుకుంటూ వుండగా నచికేత భ్రమను సమీపించాడు. అలాగే మొగుడ్ని మీదకి లాక్కంది భ్రమ. ఒక్కక్షణం చిన్న కలవరపాటు ... చిన్న కంపనం ... ప్రకంపనాలను సృష్టించింది. భ్రమ చేతివేళ్ళు అతడి వీపులో గుచ్చుకున్నాయి. భ్రమ పెదాలను తన పెదవులతో లాక్ చేసాడు. ఆ తర్వాత అతను పారాహుషార్ అంటూ శంఖం దగ్గరికి వచ్చాడు. వెన్నెల పరివర్తనం ఆమె శరీరమ్మీద ఇంద్రధనుస్సు అయింది. అతను శరీరాన్ని అస్త్రంగా సంధించాడు. ఉద్వేగం వింటినారిగా మారింది. ఉచ్చ్వాస, నిశ్వాసాలు గమ్యం వైపు దూసుకువెళ్తున్నాయి. ఆమె పిడికిళ్ళు బిగుస్తున్నాయి.
ఆమె కింది పెదవి మీద పై పెదవి దాష్టీకం చేసి నొక్కిపెట్టింది. ఆరోహణ, అవరోహణల మధ్య శృంగారం పరిమళ భరితమై సుగంధ చందన చర్చితమైంది. తొలిరాత్రి మధురోహల పలవరింతలతో పులకించి పోయింది. తెల్లవారుఝామున ఇద్దరూ ఒకే బెడ్ షీట్ ని అచ్చాదనగా చుట్టుకున్నారు. "తప్పు చేసామా ... దేవుడి మొక్కు'' కాసింత భయంగా అన్నాడు నచికేత.
"పిచ్చి నా మొగుడు దేవుడా ... నేను మొన్ననే ఆ దేవుడ్ని మొక్కుకున్నాను. మా శోభనం సవ్యంగా జరిగేలా చూడు స్వామీ ... అలా జరిగితే మీ బామ్మను ఎదుకొంతలు నడిపించి, దర్శనం చేయిస్తానని కూడా మొక్కుకున్నాను. అందుకే ఇప్పుడు రావొద్దని చెప్పి, శోభనం జరుపుకోమన్నాడు. అయినా ట్రయిన్ టైం మరిచిపోయే మొగుడు దొరికాడేంటీ?'' అల్లరిగా అంది భ్రమ.
దేవుడు మాత్రం భక్తుల విరహవేదన అర్థం చేసుకోలేడా ...
మొత్తానికి ఇద్దరూ "థాంక్స్ గాడ్'' అనుకున్నారు. తెల్లవారు ఝామున మరోసారి వాళ్ళు రోమాంఛిత క్రీడకు సిద్దమవుతుండగా బామ్మా ఫోన్ చేసి "ఎక్కడున్నారు ...?'' అని అడిగింది.
"స్వర్గంలో ...'' అని చెప్పి సెల్ స్వేచాఫ్ చేశాడు నచికేత. చేతికి దగ్గర్లో ఉన్న స్వర్గాన్ని (భ్రమను) దగ్గరకు లాక్కుంటూ ....
|
|


