- ఎస్. లలిత
.png)
ఆఫీసుకు వచ్చి అరగంటపైగా అయింది .... స్వరూప్ తలపట్టుకునే కూర్చున్నాడు. పెళ్ళై ఆర్నేల్లె అయినా దాని తాలూకు హ్యాపీనెస్ మాత్రం అతని ముఖంలో ఏమాత్రం కనిపించడం లేదు. మాటి మాటికీ తలకొట్టుకుంటున్నాడు. స్వరూప్ అవస్థ గమనిస్తున్న గోపాల్ తన సీతులోంచి లేచి అతని దగ్గరకు వచ్చాడు. "ఏమిటి మిస్టర్ స్వరూప్ ...! మరీ ఇంత డల్ గా ఉన్నారు ...'' అడిగాడు.
"ఏం లేదు ... కొద్దిగా తలనొప్పి అంతే ...''
"చూడండి స్వరూప్ ... చాలా రోజులుగా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నాను ... మీరెందుకో ఉదాసీనంగా ఉంటున్నారు ... ఫ్యామిలీ లైఫ్ లో ప్రాబ్లెం ఏదైనా ఉందా ...'' సూటిగా అడిగాడు గోపాల్.
అ మాటలకు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు స్వరూప్ ... ఇతనికి నా బాధ ఎలా తెల్సిందబ్బా .... ఆశ్చర్యపడ్డాడు. అయినా ఇలాంటివి చెప్పడం ఇష్టంలేక ... "అబ్బే అదేంలేదు'' మాట దాటవేశాడు.
"మీరు చెప్పకపోయినా ... తెలుసుకోలేనంత చిన్నపిల్లవాణ్ణి కాదులెండి. పెళ్ళికి ముందున్నంత ఉత్సాహంగా మీరు లేరు ... మీకేదైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్ ఉంటేనే ఇలా ఉంటారు ... నాతొ చెప్పండి ప్లీజ్ నాకు తోచిన సలహా నేనిస్తాను ....'' అనునయంగా అన్నాడు.
తన మనసులోని మాటలని ఇంకెవరికి చెప్పలేడు ... ఇంట్లో అందరికీ మనోజ్ఞ అంటే ఇష్టం ... ఆమె వేషభాషలు అంటే కూడా ఎవ్వరికీ విముఖత లేదు ... తనకే బాధ ... కనీసం ప్రెండ్ తో అయినా చెప్పుకుంటే సగంభారం తీరుతుంది అని చెప్పటం మొదలెట్టాడు .....
*****
ఆరోజు ఆఫేసునుంచి రాగానే ఇల్లంతా సందడిగా ఉండటం చూసి ఆశ్చర్యపడ్డాడు స్వరూప్. దగ్గర్లో పండుగలు ఏం లేవు ... బంధువులు ఎవ్వరూ వచ్చినట్టు లేరు ... మరి ఇంట్లో చెల్లెలు, అమ్మ, వదిన అందరూ పట్టుచీరలు కట్టుకుని ఫుల్ మేకప్ తో ఉన్నారు ... తండ్రి కూడా పండుగలకు కట్టుకునే పట్టుపెంచె, లాల్చీ వేసుకుని దర్జాగా ఉన్నారు ... స్వరూప్ ఆశ్చర్యాన్ని గమనించిన చెల్లెలు శైలజ ... "అన్నయ్యా సూట్ రెడీ ... మనమిప్పుడు పెళ్ళిచూపులకు వెళ్ళాలి'' అంది చీర సవరించుకుంటూ.
"పెళ్ళిచూపులా ... మరి నిన్ను చూసుకోవటానికి వాళ్ళు రావాలి కానీ, మనం వెళ్ళటం ఏంటీ?'' మరింత ఆశ్చర్యంగా అన్నాడు.
"ఉత్త ట్యూబ్ లైట్ వి ... పెళ్ళి చూపులు నాకు కాదు, నీకే .... అమ్మాయి కంప్యూటర్ ఇంజనీర్ .... వుద్యోగం చేస్తోంది. మంచి ఫాస్టులే ...'' అంది సంబరంగా శైలజ,
"ఇప్పుడు న పెళ్ళికేంటి తొందర ... అమ్మా ... నువ్వు ఓ.కే. చెప్పావా ...?'' ఆవిడ దగ్గరగా వెళ్ళి అడిగాడు.
"తొందర నీకుకాదు ... మాకు ... పదపద'' ఆర్డర్ వేసిందావిడ.
తండ్రి 'ఛలో బేటా ...' అన్నట్టు కళ్ళతోనే ఓ లుక్ ఇచ్చాడు. స్వరూప్ తప్పనట్టు పెళ్ళిచూపులకు బయల్దేరడు.
పిల్ల మోడరన్ గా ఉండాలనుకున్నాడు కానీ ... పెళ్ళిచూపుల్లో కూడా జీన్స్ ఫ్యాంట్, టీ షర్ట్ వేసుకుంది ... దర్జాగా కుర్చీలో కూర్చుని, కొత్త లేకుండా టకటకా మాట్లాడుతుంటే స్వరూప్ కి ఇబ్బందిగా అనిపించింది. కానీ ఇంట్లో అందరికీ మనోజ్ఞ నచ్చటంతో, వాళ్ళ పెళ్ళి నిర్విఘ్నంగా జరిగిపోయింది. అప్పుడే మొదలయింది స్వరూప్ కి బ్యాడ్ పీరియడ్ ... అదెలాగంటే ...
*****
తొలిరేయి ... ఏదో వింత హాయి ... పెళ్ళి పట్టుచీరలో మనోజ్ఞ రంభాలా ఉందనుకున్నాడు స్వరూప్ ... తలంబ్రాల పసుపు అంటుకొని పచ్చని వేంకటగిరి చీరలో మంచిముత్యంలా మెరిసిపోయింది .... మనోజ్ఞ. పడకగదిలో ఏర్పాటు చూసి స్వరూప్ కి వళ్ళంతా వేడిపుట్టింది. మల్లెల గుబాళింపు ... అగరొత్తుల సువాసనలు, తెల్లటి పక్క, అతని నరాల్లో మత్తెక్కిస్తోంది పదిసార్లు తన డ్రెస్సింగ్ ని అద్దంలో చూసుకున్నాడు ... గదిలో తొంగిచూస్తున్న వెన్నెల చందమామని చూస్తే మరింత రొమాంటిక్ ఫీలింగ్స్ వస్తున్నాయి.
స్వరూప్ చేతి వాచీవంక చూసుకున్నాడు, టైం తొమ్మిదిన్నర అయింది. ఇంకా ఎందుకంత లేటో ... పదోసారి అనుకునేటప్పుడు తలుపు చప్పుడైంది .. గుమ్మం దగ్గర పాలరాతి బొమ్మలా మనోజ్ఞ నిల్చుని వుంది ... తలలో మల్లెలు, తెల్లని జార్జెట చీర, చేతిలో పాలగ్లాసు ... అపర రాతీదేవిలా ఉంది. స్వరూప్ గబగబా వెళ్ళి మనోజ్ఞ చేతిలో గ్లాసందుకున్నాడు. మనోజ్ఞ గ్లాసిచ్చి
"అబ్బబ్బ ... ఈ పూలు, ఈ చీర విసుగ్గా ఉంది స్వరూప్ ...'' అంది.
ఆమె అన్న మాటలకి స్వరూప్ ఉలిక్కిపడ్డాడు. ఎంతో చనువుగా ఎన్నో రోజుల పరిచయం ఉన్నట్టు ఆమె అలా అంటుంటే ... ఆమె వంక గుడ్లప్పగించి చూస్తుండిపోయాడు. అదేం పట్టించుకోకుండా మనోజ్ఞ వెళ్ళి తనకి నచ్చిన ఫ్యాంట్, షర్ట్ వేసుకుని జడంతా ముడిపెట్టి పైకి క్లిప్పు పెట్టింది. ఒక్కసారిగా స్వర్గంలోంచి నరకంలోకి జారిపోతున్న ఫీలింగ్ కలిగింది స్వరూప్ కి ...
"ఈ రోజు కూడా ఇలా ...'' అన్నాడు నోరు తెరిచి.
"టేకిట్ ఈజీ స్వరూప్ ... ఈఫ్ యూ డోంట్ మైండ్ నాకు కొంచెం వర్క్ వుంది ... మీరు పాలు తాగిపడుకోండి ... నా పని పూర్తయ్యాక వస్తాను'' అంటూ కంప్యూటర్ ముందు కూర్చుని, స్విచ్ ఆన్ చేసింది.
స్వరూప్ కి అప్పటిదాకా చల్లదనం కురిపిస్తున్నాడనుకున్న చంద్రుడు ఓ శత్రువులా కనిపించాడు. వింత పరిమళాలు విరజిమ్ముతున్న ఆ గదిలో గాలి అతనికి వెగటుగా ఉంది ... డబుల్ కాట్ మీద విచ్చిన మల్లెలు వెక్కిరిస్తున్నట్టుగా వుంది .. స్వరూప్ ఆశలన్నీ ఒక్కసారిగా నలిగి ముక్కలైయ్యాయి. "అది మా తొలిరేయి ముచ్చట ... అది మొదలు ఆర్నేల్లైనా ఇదే తంతు ...
ఎప్పుడైనా త్వరగా ఆఫీసునుంచి వచ్చి, తను సరదాగా మాట్లాడినా, నాకే ఆవిడ వేషభాషలు నచ్చక నా మనసుకు సర్ది చెప్పుకోలేక పోతున్నాను'' అన్నాడు దిగులుగా.
"ఓస్ ఇంతేనా ... దానికి విరుగుడు నా దగ్గరుంది. నీ భార్యతో ఫైటింగ్ చేస్తావో ... రిక్వెస్టింగ్ చేస్తావో ... ఇవాళ ఆమె మా ఇంటికి రావాలి'' అన్నాడు కూల్ గా గోపాల్.
"ఎందుకు?''
"ఎందుకో వేచి చూడు ...'' నవ్వుతూ తన సీటులోకి వెళ్ళిపోయాడు గోపాల్.
*****
కాలింగ్ బెల్ మోతకి పరుగున వచ్చి తలుపు తీసింది రాధ. ఆమెకి తెలుసు రోజూ అదే టైం కి గోపాల్ వస్తాడు. కానీ ఎదురుగా మనోజ్ఞను చూసి స్టన్నైపోయింది రాధ. "వాటే సర్ప్రైజ్ ... కొత్త పెళ్ళికూతురు మొగుణ్ణి వదిలేసి మా ఇంటికి వచ్చింది .., రియల్లీ గ్రేట్ సర్ప్రైజ్'' నాటకీయంగా భుజాలు ఎగరేస్తూ అంది రాధ,
మనోజ్ఞ ఫీలింగ్స్ కి రియాక్ట్ అవకుండా సీరియస్ గా నిల్చునేసరికి "ఏంటో ఆ చూపులకి అర్థం.''
"నన్ను కాస్త లోపలికి రానిస్తావా ...'' విసుగ్గా అంది మనోజ్ఞ.
"సారీ డియర్ ... వెల్ కమ్ ... '' అని ఆమెను లోనికి ఆహ్వానించింది, లోపలికి వచ్చాక మూడీగా, ఉన్న ఫ్రెండ్ ని చూసి ఏదో జరిగిందని వూహించింది రాధ, ముభావంగా ఉన్న మనోజ్ఞను చూసి కొంత బాధ కలిగింది ... ఎటో చూస్తూ ఆలోచిస్తూ కూర్చున్న మనోజ్ఞను అసలు విషయం చెప్పమని అడిగింది ...
"నేనెలా ఉంటాను'' స్ట్రైట్ గా అడిగింది మనోజ్ఞ.
"నీకేం ... ఓ మోడల్ లా, అందంగా, చూసేవాళ్ళను ఆదరగొట్టేట్టు ఉంటావు''
"మరి ... మీవారి ఫ్రెండ్, అదే మా ఆయన నన్ను ఫిగర్ లెస్ క్రీచర్ అన్నాడు ... అదే కాదు ఇంకేదో కూడా అన్నాడు'' అంది మనోజ్ఞ రుద్ధమైన కంఠంతో.
"అరె ఇలాంటి మాట ఎక్కడ వినలేదే ... అయినా నీకేం తక్కువ ... మంచి ఫిగర్ ... ఓహో అందుకన్నాడా ...'' అంది. ఆమె వేసుకున్న జీన్స్ ఫ్యాంటు, టీ షర్టు వంక చూస్తూ.
"అందుకా ... అందుకంటే ...'' ఆశ్చర్యంగా అడిగింది మనోజ్ఞ.
"ఏం లేదులే ... బయట కారు వచ్చిన చప్పుడైంది ... మా వారు వచ్చారు ... నీకేం భయం లేదు ... రేపటికి అంతా సర్దుకుంటుంది'' అంటూ గుమ్మం దగ్గరికి వెళ్ళింది రాధ,
"ఇదేంటి తనకేదో సలహా ఇస్తుందని ఇక్కడకు వస్తే విషయాన్ని ఇంత లైట్ గా తీసుకుంది. మనోజ్ఞకి చిన్నతనంగా అనిపించింది ... బహుశా ... ఇంత చదువుకున్నది నాకు బ్రెయిన్ లెస్ గాళ్ అనుకుందేమో ...'' అన్న అనుమానం మొదలైంది.
*****
భోజనాలు చేశారు ముగ్గురూ ... ఎప్పుడూ గలగలా మాట్లాడే గోపాల్ ముభావంగా భోజనం ముగించాడు. రాధ వంటిల్లు సర్దేసి మనోజ్ఞ ప్రక్క హాలులో ఆరెంజ్ చేసింది. కాసేపు ఆమెతో మాట్లాడుకున్న మనోజ్ఞ ఆలోచనలకు బ్రేక్ వేస్తూ గోపాల్ గదిలోంచి రాధను గట్టిగా పిలిచాడు. "గుడ్ నైట్ మనూ ...' వెళ్ళిపోయింది రాధ.
*****
ఇంట్లో రోజూ ఆఫీస్ నుంచి వచ్చేసరికి స్వరూప్ సగం వంట పూర్తిచేసేవాడు. మిగతాదే మనోజ్ఞ పూర్తిచేసి ఏదో తప్పదన్నట్టు డిన్నర్ పూర్తి చేసేవాళ్ళు ... కంపెనీలో మంచి ఎఫిషియంట్ అన్న పేరు ఉండటంతో మనోజ్ఞ ఆలోచనలు ఎప్పుడూ మర్నాటి వర్క్ గురించే ఆలోచించేది. అప్పుడప్పుడు స్వరూప్ అడిగేవాడు .. ఒక్కసారి చీర కట్టుకోమని ... తనకే ఇష్టం ఉండేది కాదు. ఫ్యాంట్, షర్ట్ వేసుకుంటే ఎందుకంత కోపమో ఈయనకి ఇలా ఆలోచిస్తూ నిద్రకి దూరమైంది ... కాసేపటికి రాధ గదిలోంచి చిన్నగా మాటలు వినిపిస్తున్నాయి. నిద్రపోని మనోజ్ఞకు అవి స్పష్టంగా వినిపిస్తున్నాయి.
"ఛ ... ఇంతా పని ... కనీసం నా వంటిమీద చీరైనా ఉండనివ్వరా ... ''గారంగా అంటోంది రాధ.
"చీరలో నువ్వెంతో అందంగా ఉంటావ్ ... చీరలేకుండా అంతే అందంగా ఉంటావు డియర్'' చిలిపిగా అంటూ ఆ బ్లౌజ్ హుక్స్ మీద చేయివేశాడు.
"ఛ మీవన్నీ పోకిరీ బుద్ధులే ... కాస్త వాయిస్ తగ్గించండి. అవతల నా ఫ్రెండ్ వుంది, విందంటే ...''
"వింటే విననీ ... రోమాన్స్ గురించి తనకేం తెలుసు ... ఉత్త మగరాయుడు ...'' అన్నాడు.
"ప్లీజ్ నెమ్మదిగా ... అయినా దానికేం తక్కువ ... అందం, చదువు, ఉద్యోగం ... మీ ఫ్రెండ్ కే ఏదో మిస్సైంది'' ఉడుకున్నట్టుగా అంది.
"ఏయ్ ... వాన్నేమీ అనకు ... చూడు నీ నడుం అందం చూస్తే నాకే కసిపుడుతుంది. నీ పెదవుల తడి నన్ను మత్తెక్కిస్తుంది ... నీ కౌగిట్లో నాకు స్వర్గంలా ఉంటుంది. నీ అణువణువు, ఆరుగాజాల చీరలో ఇమిడి ... నాకు మనస్సులో వేడి పుట్టేట్టు చేస్తుంది. మరి వాడికి ఇవాల్టి వరకూ ఆవిడగారి కొలతలు కూడా తెలీవు ... బరువు అసలే తెలీదు ...'' రాధను హత్తుకుంటూ అన్నాడు.
"మగాళ్ళనిపించుకున్నారు ... అయినా మోడరన్ డ్రెస్ వేసుకుంటే తప్పేంటి?'' భర్త ఛాతీమీద చిన్నవేళ్ళతో ముద్దుగా అడిగింది.
"చెప్పనా ...'' అన్నాడు కొంటెగా.
"చెప్పండి ...''
"మగాడు ప్రక్కన మగాడు పడుకున్నట్టు ఉంటుంది'' కాస్త గట్టిగానే అన్నాడు.
ఆ మాటలకు రాధ ఉలిక్కిపడితే, మనోజ్ఞ చటుక్కున లేచి కూర్చుంది ...
*****
ఆదమరిచి నిద్రపోతున్న రాధకి పనిమనిషి కేకతో మెలకువ వచ్చింది. ఒంటికి చీర చుట్టుకుని, హాల్లోకి వస్తే మనోజ్ఞ బెడ్ ఖాళీగా కనిపించింది. "ఏంటమ్మగారూ ... తెలుపులు తీసే పడుకున్నారా ...'' నవ్వుతూ అడుగుతోంది పనిమనిషి ... గోపాల్ ని లేపడానికి గదిలోకి పరుగెత్తింది రాధ.
*****
రోజులాగే ఆఫీసుకి తయారవుతున్నాడు స్వరూప్ ... మనోజ్ఞ ఇంటికి వచ్చిందీ పట్టించుకోలేదు .... అతను స్నానానికి వెళ్ళి వచ్చేసరికి గది షేప్ మారిపోయింది. గది కితికీలన్నీ మూసి ఉన్నాయి. కర్తెన్స్ ఫుల్ గా వేసి ఉన్నాయి ... బెడ్ ల్యాంప్ వెలుగు ... పగలే వెన్నెల తలపిస్తోంది ... బెడ్ షీట్స్ తెల్లగా పాలనురగలా ఉన్నాయి ... అక్కడ అక్కడ విరిసిన మల్లెలు విరగబడి నవ్వుతున్నాయి. రూమ్ అంతా సెంటెడ్ స్ప్రేతో కొత్త ఊహలను రేపుతోంది ...
స్వరూప్ కళ్ళు ఆ గదిలో ప్రతి అంగుళం, ప్రతి వస్తువుని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. పట్టపగేలే రాత్రి తలపించే ఆ సీన్ క్రియేట్ చేసిన ఆర్టిస్ట్ కోసం వెతికాడు. అతన్ని కష్టపెట్టకుండానే మనోజ్ఞ ఎంటర్ అయ్యింది ... తెల్లటి చీర, ఎర్రటి బ్లౌజు, తలలో జాజులు, చేతినిండా గాజులు ... ఆమెను చూస్తే మతిపోయింది స్వరూప్ కి. తెల్లటి షిఫాన్ చీరలోంచి ఆమె అందాలు విందు చేస్తోంటే ... కనురెప్పలు వేయటం మరచిపోయాడు.
అతను అలా చూస్తుండగా మనోజ్ఞ తన ఒంటిమీద వలువలు ఒక్కొక్కటీ అతనికి అందించి బాత్రూమ్ లో ... బాత్ టబ్ లోకి వెళ్ళిపోయింది. నడిచి వెళ్తున్న అజంతా సుందరిలా ఉన్న ఆమె వెనకే మంత్రముగ్ధుడై తనూ వెళ్ళాడు. వారి తొలిరేయి సంబరం ఆ నీళ్ళ టబ్బులోనే జరిగిపోయింది, మాటామంతీ లేకుండా మనోజ్ఞ భర్త చేసే చిలిపి అల్లరికి కరిగిపోతూ కోరికతో చెలరేగిపోతోంది ....
స్నానాలు అయ్హ్యాక ... డబుల్ కాట్ మీదున్న మల్లెలు నలిగిపోయేవరకూ ఇద్దరూ రసమయజగత్తులో తేలిపోయారు ... మధ్యమధ్యన స్వరూప్ అనే మాటలకు సిగ్గుపడుతూనే అతనికి ఫుల్ కోపరేషన్ చేస్తోంది మనోజ్ఞ. "యస్, యూ ఆర్ ఏ వుమెన్'' గుసగుసగా అన్నాడు స్వరూప్.
"యూ నాటీ ...'' అంటూ అతని బుగ్గ కొరికింది మనోజ్ఞా.
"ఎంత తీయగా ఉందో ... ఈ శిక్ష కోసమేగా ఇన్నాళ్ళు నేను వెయిట్ చేసింది'' పరవశంగా అన్నాడు.
"ఇది తీయగా ఉందా .. అయితే చూడండి'' అంటూ మరింత గట్టిగా హత్తుకుని స్వరూప్ ఆధారాలను అందిపుచ్చుకుంది మనోజ్ఞ.
|
|


