The content in this feature is rated as "A++". You must be at least 18 years old to view this feature.
Home>>Romantic Stories>>Tarangam ... Taarangam ...
తారంగం - తారంగం

- ప్రకాష్

కూడలి స్థలంలో పబ్లిసిటీ నిమిత్తం ఏర్పాటు చేసిన నిలువెత్తు ఆ తార భంగిమను చూశాడు గౌతమ్. అతని మనసు చలించింది. ఆ స్నిగ్ధ సౌందర్యానికి, త్వరలో విడుదల కాబోయే ఆ చిత్రంలో వానపాట ఉండి కాబోలు తడిసిన పల్చటి తెల్ల చీరలో మేని ఒంపులు ఆ భంగిమలో బహిర్గతమవు తున్నాయి. ఆ తార పేరు దేవి. తెలుగుచిత్రసీమ నుంచి హిందీ చిత్రసీమకు వలస వెళ్ళి ప్రస్తుతం ఆలిండియా స్టార్ గా వెలుగొందుతోంది.

ఆమె నవ్వితే నందనాలు కదిలి వస్తాయి. ఆమె ఓరగా చూస్తే వసంతాలు పూస్తాయి. నడిస్తే ఎన్ని నర్తనలో? మాట్లాడితే ఎన్ని కీర్తనలో? ఓరగా ఓ చూపు విసిరిండా అది వలపు తూపే అనుకున్నాడు గౌతమ్. ఆమెని తలచుకొని ఆమె నటించిన ప్రతి చిత్రం తప్పక అయిదారు సార్లు చూస్తాడతను. చిత్రంలో ఆమె కన్పిస్తున్నంత సేపూ కనీసం కనురెప్పయినా వాల్చడు. తెరపై ఆమె పైట కదిలితే అతని గుండె కదలిక ఆగుతుంది క్షణం సేపు. పాటలో ఆమె నర్తిస్తుంటే పడే నడుం మేలికలో తన ప్రాణం పొతే బాగుండును అనుకునే వాడతను.

ఆమె మెడ వంపు చుట్టూ ప్రస్తుత సినిమా రీళ్ళు రీళ్ళుగా తిరుగుతుంటే గౌతమ్ కూడా తన స్వప్నాల వాకిళ్ళలో మధురోహాల అగరొత్తులు వెలిగించుకుంటూ ఆ సౌందర్యాన్ని మనసులో ప్రతిష్టించుకున్నాడు. అతను సినిమాలో ఆమె పక్కన హీరోగా ఊహించుకొని స్వాంతన పొందుతాడు. ఒక్కోసారి వాస్తవానికి దిగివచ్చి తను, తన ఉద్యోగం, తన భార్యని తలచి ఆ తారని పొందలేని ఈ బతుకుపై విరక్తితో దిగులు చెందుతాడు. అతనిదో చిత్రమైన జీవితం. అంతే!!!

"శాంతీ నా షర్ట్ ఏదీ?'' గట్టిగా అరిచాడు గౌతమ్.

"బీరువాలో ఉంది చూసుకోండి'' వంటింట్లోంచి శాంతి సమాధానం.

"శాంతీ నా వాచ్''

"టేబుల్ మీద ఉంది''

"శాంతీ నా పర్సెక్కడుంది?''

"అబ్బా చూసుకోండి ... అక్కడే ఎక్కడో వుంటుంది'' చిరాగ్గా జవాబిచ్చింది శాంతి.

తోక తొక్కినా తాచులా లేచాడు గౌతమ్. ఎకాఎకిన వంటింట్లోకి వచ్చి "ఛీ ... ఛీ ... వెధవ ఇళ్ళు ... అరె, ఆఫీసు టైమయిపోతోంది భర్తకి ఏం కావాలో చూడాలన్న కనీస ఇంగితం కూడా లేకపోతే ఎలా? ఏం చేస్తున్నావక్కడ?''

"మీ క్యారేజ్ సర్టుటున్నాను. ఇదీ మీ పనే కదా ఉదయం లేచిందగ్గర్నుంచి వంట ప్రయత్నంలోనే సరిపోతుందాయే'' అంది శాంతి.

"ఎన్ని పనులు చేస్తున్నా భర్తని ఆఫీసుకు సాగనంపే విషయంలో కాస్త శ్రెద్ద చూపీలి. చూడు ఆ 'దేవి'ని చూసయినా కాస్త నేర్చుకో'' అన్నాడు గౌతమ్.

"ఏ దేవిని?'' అడిగింది శాంతి.

"సంసార స్వప్నం హీరోయిన్ ఆ చిత్రంలో భర్తని ఎంత చక్కగా చూసుకుంటుందామె. కోటు దగ్గరనుంచి అన్నీ అందించి వాకిట్లో దాకా వచ్చి ఓ ముద్దిచి వీడ్కోలు చెబుతుంది''

"ఆ భర్తకి కోటు టై ఉంది'' అంది శాంతి.

"అంటే నాకు లేవనేగా ఈ నిర్లక్ష్యం''

"ఆ భర్త ఫ్యాక్టరీ యజమాని ఓ కారుంది'' మళ్ళీ అంది శాంతి.

"ఛీ ఛీ నీతో వేగాలేకపోతున్నాను. పెళ్ళిచూపుల నాడు సైడ్ ఏంగిల్ లో నిన్ను చూశాను. ఆ దేవిలా కన్పిస్తే అలాగే ఉంటావనుకోని నిన్ను కట్టుకున్నాను'' అన్నాడు గౌతమ్.

"పోనీ వదిలేయండి'' చటుక్కున అంది శాంతి.

అంతే ...! ఆవేశంలో ఊగిపోయాడు గౌతమ్. "నీకసలు పెళ్ళంటే బొత్తిగా గౌరవం లేదు. మొగుడంటే ప్రేమ లేదు. తాళన్నా, భార్తన్నా ఏడడుగుల బంధమన్నా ఏమిటో ఆ దేవి నటించిన ప్రేమ కావాలి చిత్రం చూసి నేర్చుకో''

"లక్షలిస్తారు కాబట్టి చిత్రానికో భర్తకు చక్కగా ఆప్యాయత చూపిస్తూ సేవ చేస్తుంది ఆ దేవి. నాకూ లక్షలిస్తే లక్షణంగా కాపురం చేస్తాను'' అంతే!

గౌతమ్ చెయ్యి విసురుగా శాంతి చెంపను తాకింది. శాంతి కళ్ళు కన్నీటి కడవలు. సెకండ్ షో నుంచి ఇంటికి వచ్చాడు గౌతమ్. శాంతి గాఢనిద్రలో ఉంది గదిలో నీలిరంగు బల్బు వెలుగుతోంది. కనురెప్పలు తెరిచినా మూసినా దేవి రూపం కన్పిస్తూ కవ్విస్తోందతన్ని. ఆ చిత్ర దర్శకుడు ఆ అమ్మాయి సౌదర్యాన్ని వివిధ భంగిమల్లో నేత్రపర్వం చేయడంలో కృత కృత్యుడయ్యాడు. ఓ పాటలో బత్తాయి పళ్ళ రాశుల మీద ఆమెను పడుకోబెట్టి ఆమె బొడ్డుమీద ద్రాక్షపళ్ళను ఒక్కొక్కటిగా పడేలా చిత్రీకరించాడు.

ఆ ఘట్టం చూస్తున్న థియేటర్ లోని ప్రేక్షకులు అనుభూతి చెప్పనలవికాదు. నెమ్మదిగా చేయి చాపాడు గౌతమ్. మెత్తగా ఉన్న శాంతి శరీరం తగిలింది. కాదు ... కాదు ... దేవి తనువు సౌందర్యమది. దగ్గరకు తీసుకున్నాడు. నల్లటి వత్తయిన జుత్తు విశాలమైన నుదురు, కాటుక హద్దులు గీసిన కళల ప్రపంచం వాకిళ్ళయిన ఆ రెండు కళ్ళు సంపెంగలాంటి నాసిక, నీలిరంగు బల్బు కాంతిలో వింతగా మెరుస్తున్న ముక్కుపుడక. ఒక్కొక్కటి తాకుతున్నాడు గౌతమ్.

మధురాలోలికించే బింబాదరాలు, శంఖాకారపు మెడ, నెమ్మదిగా ఆమె గుండెలపై చేయ్యివేశాడు గౌతమ్. పైట తొలగించాడు ... జాకెట్ హుక్స్ తీశాడు ... పంజరంలో చిక్కుకొని నలిగిపోతున్న పరువపు పావురాలకు స్వేచ్ఛ లభించినట్లయింది. యవ్వనాన్ని సవాల్ చేస్తున్నట్టున్నాయి అవి. ఇంకా కిందిక ఇచేయి చాచితే మరులు కోల్పుతూ మత్తెక్కించే బొడ్డు. కళల అలల సుడిగుండం.

ఆ సుడిగుండంలో తన గుండె చిక్కుకుందేమో అనుకున్నాడు గౌతమ్. ఇక ఆగలేకపోయడు గౌతమ్ ... ఆమె పైకి నెమ్మదిగా చేరుకున్నాడు. 'దేవి ... దేవి ...'' పలవరిస్తున్నాడు.

అంతే!!!!!

చటుక్కున లేచింది శాంతి. గౌతమ్ ని పక్కకు తోసేసింది.

"ఏం ...!'' అడిగాడు మగతగా.

ఏం మాట్లాడలేదు శాంతి ... తలగడ దుప్పటి తీసుకొని ఆ గదిలోనే వేరే పడుకుంది. ఐదు నిముషాల తర్వాత శాంతి దగ్గరకు చేరుకున్నాడు గౌతమ్. "శాంతీ'' నెమ్మదిగా పిలిచాడు. ఆ పిలుపులో కోరిక, 'నువ్వు కావాలి' అన్న అభ్యర్థన స్పష్టంగా ధ్వనిస్తోంది.

"ప్లీజ్'' అంటున్నాడతను.

"వెళ్ళిపొండి ... దగ్గరకు రాకండి'' కటువుగా అంది శాంతి.

"శాంతీ ...!?''

"నేను శాంతినేనండీ ... తార దేవిని కాను. నన్ను నన్నుగా బతకనివ్వండి. వెళ్ళండి'' ఎన్ని రోజులుగా గౌతమ్ కి చెప్పాలనుకొంటున్న మాట అది. ఈరోజు ఇన్నాళ్ళకి ఆమె గొంతులోంచి విడివడింది.

"నాకూ ఓ అంతరంగం ఉంది, ఆలోచన ఉంది, నా భర్త నా స్వంతం కావాలి, నన్నే ప్రేమించాలి. నా కోసం జీవించాలి. అతని ఆలోచనల్లో సైతం పరాయిస్త్రీకి ప్రవేశం ఉండకూడదు. చిన్ని పరిధిని గీసుకున్నాను అంతే'' ఆమె కనుకొలకుల్లో నుంచి కన్నీరు కాల్వలై చెక్కిలిమీదుగా ప్రవహిస్తోంది.

"భర్త, భార్యని కేవలం ప్రాస్టిట్యూట్ గా భావిస్తుంటే ఏ స్త్రీ సహించదండీ, నా యవ్వనం మీద మీకు నమ్మకం లేదు. నా శరీరం మీద మీకు అభిమానం లేదు. నా మనసుమీద, నా ప్రేమమీద మీకు గౌరవం లేదు. థియేటర్ లో అర్థనగ్న సౌదర్యాలకు వేడెక్కి వస్తే తాపం తీర్చేందుకు నేనో పరికరం మాత్రమే. మీ కోర్కెల కొలిమిలో కాలే సమిధను మాత్రమే. నాకొద్దు ఈ జీవితం'' అంది శాంతి.

"దేవి మీకు తెలుసు. మీకే కాదు దేశ వ్యాప్తంగా కొన్ని లక్షలమందికి తెలుసు. కానీ ఆమెకి మీరెవరూ తెలియక పోవచ్చు. తెరపై నీడను తప్ప ఆమెని వ్యక్తిగా చూడలేదు మీరు. ఆమె శరీర సౌందర్యాన్ని కామ దృష్టితో చూస్తున్నాడు. ఆ వేడిని ఇల్లాలిదగ్గర తీర్చుకుంటున్నారు'' అంది శాంతి.

ఇప్పుడు సినీవనిలోకి మరో సౌదర్య తుఫానోచ్చింది పేరు దివ్య. నెమ్మదిగా దేవిని అటు ప్రేక్షకులు ఇటు నిర్మాతలు మరచిపోతున్నారు. ఏ ప్రాంతంలో ఏ గోడ మీద చూసినా దివ్య నటించిన చిత్రాల పోస్టర్లే దర్శనమిస్తున్నాయి. కూడలి స్థలాల్లో ఎత్తయిన భంగిమల్లో కూడా దివ్య దర్శనమే. ఇప్పుడు గౌతమ్ ఆలోచనలో దివ్య రూపం, ఆమె సౌందర్యం మహత్తర కావ్యమనుకొంటాడతడు.

అయితే శాంతి దగ్గర సినీతారల ప్రసక్తి తేవడం లేదతడు. తన భర్త మారిపోయడనే అమాయకంలో అవివేకంలో లేదు శాంతి కూడా! అయితే మనసు తూట్లు పడేలా వెండితెర దేవతల నామ జపంతో తనని హింసించడం లేదని ఆనందిస్తోందామె.

అంతే ...!!!!!