The content in this feature is rated as "A++". You must be at least 18 years old to view this feature.
Home>>Romantic Stories>>Sweet Nothings ...
స్వీట్ నథింగ్స్ ...

- ప్రకాష్

"హీరోయిన్ ని వెనుకనుంచి వాటేసుకుని ఆమె మెడ చుట్టూ చేతులు వేసి ఒకరి చెక్కిలి ఒకరికి తాకేలా దగ్గరగా నిలుచోండి ... కమింగ్ ఇష్యూ ముఖచిత్రం మీదే ...'' భుజానికి వేలాడు తున్న కెమెరాను పొజీషన్ లోకి తీసుకుని యాంగిల్ గురిచేసు కుంటూ సూచనలు ఇస్తున్నాడు సినీ మ్యాగజైన్ ఫోటోగ్రాఫర్.

ఈ చిత్రంలో కొత్తగా హీరోగా పరిచయమవుతున్న నీరజ్ గుండె 'లబ్ డబ్'' సవ్వడి ఒక్కసారిగా హెచ్చింది, శరీరంలోని రక్తం నురగలు కక్కుతూ తుఫాను వేగంతో విరుచుకుపడినట్ల యింది. చెవుల్లోంచి వేడి సెగలు. చుట్టూ చూశాడు నీరజ్ ... గుంపుగా జనం ... అందరి చూపూ తన్వేపు పదినిమిషాల కిందటే ఈ చిత్రం శుభారంభ వేడుక ముగిసింది. పూజా కార్యక్రమం అనంతరం 'మొహూర్తపు షాట'గా హీరోయిన్ కి గులాబిపువ్వు ఇచ్చి ఐ లవ్ యూ చెప్పడాన్ని హీరోపై చిత్రీకటించాడు దర్శకుడు. అప్పుడే హీరోయిన్ ని తొలిసారిగా చూడడం, ముంబాయి ముద్దుగుమ్మ. గెలుగు నేటివిటీకి అనుగుణంగా తన పేరును అపరంజిగా మార్చుకుంది.

నిజంగా అపరంజి బొమ్మలా వుందా పిల్ల. టైట్ జీన్స్ ... వైట్ కమీజ్ ... భుజంపైకి అలవోకగా వదిలేసిన శిరోజాలు. ఐ లవ్ యు చెప్పిన అరనిమిషంలోనే ఆమెని చూసినా 'కళ్ళకెమెరా' క్లిక్ మనిపించడంతో ఆమె రూపం గాఢంగా ముద్రపదిప్యింది. ప్రస్తుతం ట్రెండ్ కి తగ్గట్టుగా ప్రేమ కథాచిత్రం ఇది. తనకు హీరోగా ఛాన్స్ ఇస్తూనే అపరంజిని తెలుగు పరిశ్రమకు పరిచయం చేస్తున్నారు డైరెక్టర్. హీరోయిన్ ని ఖరారు చేసిన తరువాత ఆమెని పరిచయం చేస్తానని డైరెక్టర్ చెబుతుండడం, ఏదో కారణంగా ఆ పరిచయ కార్యక్రమం వాయిదా పడడంతో ముహూర్తపు రోజునే ఇద్దరూ ఒకరికొకరు ఎదురుపడ్డాడు. "హీరోగారూ వన్ ఫోటోగ్రాఫ్ ప్లీజ్ ....'' ఫోటోగ్రాఫర్ అడుగుతున్నాడు పదేపదే.

ఏం చేయాలో తెలీక గుంపులో ఇరుక్కున్న దర్శకుడిని చూపులతోనే వెతికిపట్టుకున్నాడు నీరజ్. ఫోటోకి ఫోజిమ్మన్నట్టు కళ్ళతోనే సైగ చేశాడు డైరెక్టర్. నీరజ్ కి కొద్దిదూరంలోనే అపరంజి తన తల్లితో, నీరజ్ ని రిక్వెస్ట్ చేసిన ఫోతోగ్రాఫారే ఆమె దగ్గరకు వెళ్ళాడు. ఏం చెప్పాడో ఏమో, ఆమె ఫోటోగ్రాఫర్ ని అనుసరించింది. "హీరోగారూ! హీరోయిన్ వెనుకగా నిలబడి ఇందాకనే చెప్పిన ఫోజివ్వండి'' మళ్ళీ సూచన. రెడీ అన్నట్లు చిరునవ్వులు చిందిస్తూ వెళ్ళడమే తరువాత గుండె దిటువు చేసుకుని ఆమెను చేరుకున్నాడు. నెమ్మదిగా ఆమె భుజాల చుట్టూ చేతులు వేశాడు. శరీరాన్ని తాకినా విద్యుత్ ప్రకంపన థ్రిల్లింగ్ గా వుంది నీరజ్ కి.

మొదటిసారి ... మొట్టమొదటిసారి అయిదున్నర అడుగుల ఎత్తున్న ఆడతనాన్ని ఆత్మీయంగా దగ్గరకు హత్తుకోవడం. అది అనిర్వచనీయమైన అనుభూతి. "మంచి ఫిజిక్ వుంది ... హీరోగా ప్రయత్నించకూడదూ'' అని హితులూ, సన్నిహితులూ ఆత్మీయంగా ఎలర్ట్ చేసేసరికి భాగ్యనగరంలో స్టూడియోల చుట్టూ తిరిగి తిరిగి ఈ అవకాశాలు సంపాదించుకున్నాడు. కానీ నటనకు సంబంధించి ప్రత్యేకంగా హీరోయిన్ కి అతి దగ్గరగా ఫక్తు ప్రొఫెషనల్ గా మెలగడంలోని మెళకువల గురించి నీరజ్ కి అంతగా తెలియవు. అందుకే అతడిలో అంత తికమక.

"హీరోగారూ ...! ఇంకాస్త దగ్గరగా హృదయానికి హత్తుకోండి. ఇలా చూస్తే ప్రమికులనరేమో'' ఫోటోగ్రాఫర్ అంటూనే నీరజ్ కి దగ్గరగా వచ్చి ఎంత దగ్గరగా ఫోజివ్వాలో విడమర్చి చెప్పాడు. దాంతో అపరంజిని దగ్గరగా తీసుకుని కుడిభుజంపై తలవాల్చి అరుణిమ లోలుకుతున్న చెక్కిలికి తన చెక్కిలిని ఏమాత్రం గ్యాప్ లేకుండా తగిలించి కెమెరా వైపు చూశాడు నీరజ్. "స్మయిల్'' అంటూనే క్లిక్ మనిపించాడు ఫోటో గ్రాఫర్. ఇద్దరి ముఖాలపైన ఫ్లాష్ వెలుగు ఒక్కసారిగా విరిసింది ఇంద్రధనుస్సులా.

ఆ ఒక్క ఫోటోతోనే ఆగలేదు ఆ తంతు. ఆ ఒక్క ఫోతోగ్రాఫరే కాదు ఇతర పత్రికలూ, చానళ్ళకు సంబంధిచిన ఫోటోగ్రాఫర్లు చుట్టుముట్టేశారు ఆ ఇద్దర్నీ. ఆ తర్వాత వరుసగా ఎన్నో భంగిమలు. ఆమె ఒడిలో అతడు ... అతని ఒడిలో ఆమె ... పచ్చిక తిన్నెలపై కూర్చుని ఒకసారి, కళ్ళల్లో కళ్ళు పెట్టి తన్మయంగా చూసుకుంటూ మరోసారి, సగం కొరికిన జామపండు ఆమె నోటికి అందిస్తూ మరోసారి ... ఎన్నో ... ఎన్నెన్నో భంగిమలు! అన్నింటిలోనూ చాలా చలాకీగా సహకరించింది నీరజ్ కి,.. ఫోటోగ్రాఫర్స్ కి. అపరంజి ఇంతకుముందు కొన్ని యాడ్స్ కి మోడల్ గా చేసిన డైరెక్టర్ చెప్పిన మాటలు ఆ క్షణంలో గుర్తొచ్చాయి.

చాలా క్యాజువల్ గా బిహేవ్ చేసింది అపరంజి. కనీసం ఒక్కసారి కూడా 'హలో' అని పలకరించకుండానే, ఏ మాత్రం పరిచయం లేని వయసొచ్చిన ఓ అమ్మాయికి అత్యంత చేరువలో వుండి క్షణాల్లోనే కౌగిలించుకోవడం నీరజ్ కి కొత్త అనుభవం. కాటుకలద్దిన ఆమె కళ్ళలోకి తొలిసారి తొంగిచూసినప్పుడు లోతు తెలియని లోకాలకు ఆ కళ్ళు వాకిళ్ళనిపించాయి అతడికి. ఆమె శరీరానికి పూసుకున్న పేరు తెలీని ఫారిన్ సెంట్ పరిమళం అతడి నాసికాపుటాల్ని తాకి ఉక్కిరిబిక్కిరి చేసేసింది. కొంగుచాటు లేని ఆమె ఎత్తుగుండెలు ఉచ్చ్వాలనిష్వాసాలకు ఎగిరిపడుతూ నీరజ్ ని ఊఒరిస్తున్నాయి. ఇక ఆ రాత్రి మరి నిద్రలేదు నీరజ్ కి.

*****

మర్నాడు సరికొత్త సూర్యోదయాన్ని చూశాడు నీరజ్ కి. తానిప్పుడు వెండితెర హీరో. ఈ సుప్రభాతం నుంచీ కొత్త వెలుగులు జీవితంలో ప్రసరించనున్నాయి. మరో ఆలోచనకు తావివ్వకుండా పట్టుదలగా స్క్రీన్ పై తానేమిటో నిరూపించుకోవాలి. కృత నిశ్చయంతో వున్నాడు నీరజ్. ఓ గంట తర్వాత షూటింగ్ స్పాట్ లో వున్నాడు నీరజ్. వార్తా పత్రికల్లోని సిన్మా పేజీలో ప్రచురితమైన సిన్మా విశేషాలను ఆసక్తిగా చదువుతున్న డైరెక్టర్, నీరజ్ ని ఆదరంగా ఆహ్వానించాడు 'కంగ్రాచ్యులేషన్స్' చెబుతూ.

"ఎందుకు సార్?'' సిగ్గుపడుతూ డైరెక్టర్ పక్కనున్న కుర్చీలో కూర్చున్నాడు నీరజ్. "ఈ ఫోటో చూడు ... జంట బావుందని అప్పుడే సెల్ ఫోన్ లో ఎన్నో సందేశాయు. మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్న నా నమ్మకం వంముకాదనిపిస్తోంది. 'జోడి' చక్కగా కుదిరింది అంటున్నాడు డైరెక్టర్. ఆత్రుతగా చూశాడు నీరజ్ ఆ ఫోటోలని. డైరెక్టర్ చెప్పింది నిజమేననిపించింది. ఒక పురుషుడి పక్కన ఒక స్త్రీ అంత చనువుగా ఎప్పుడు నిలబడుతుంది? తానరిగిన సంప్రదాయ ప్రపంచంలోనైతే ఒక్క భార్యే.

"జోడి చక్కగా కుదిరింగి'' డైరెక్టర్ మాటలు మళ్ళీ వినిపిస్తున్నాయి నీరజ్ చెవుల్లో గింగుర్లులు తిరుగుతూ. కాటుక కళ్ళు టపటపలాడిస్తూ కనిపిస్తున్న అపరంజి అతడి మనో యవనికపై ఒక్కసారిగా కదిలింది. ఆమె శరీరపు సెంట్ పరిమళాన్ని నాసిక గుర్తుచేస్తోంది. వెనుకనించి ఆమెని కౌగిలించుకుని ఆమె మెడ చుట్టూ నగలా పెనవేసుకున్న తన రెండు చేతుల్ని తన్మయంగా చూసుకున్నాడు నీరజ్. అతడు పేపర్ మీంచి దృష్టి మరల్చి పరిసరాల్ని గమనించాడు. యూనిట్ సభ్యులు తీయబోయే దృశ్యం కోసం హడావుడి పడుతున్నారు. వివిధ శాఖల అసిస్టెంట్ డైరెక్టర్ వద్దకు వచ్చి సందేహాలు తీర్చుకుంటున్నారు. అయితే, నీరజ్ చూపులు మాత్రం దేనికోసమో తీక్షణంగా గాలిస్తున్నాయి. "ఎలా వున్నాయి ఫోటోలు?'' డైరెక్టర్ ప్రశ్న.

"సూపర్బ్ సర్ ...'' అన్నాడు నీరజ్ అన్యమనస్కంగా. క్షణం విరామం తరువాత నీరజ్ అడిగాడు "ఇవాళ తీయబోయే సన్నివేశమేమిట'ని. మరో వారందాకా హీరోయిన్ కాంబినేషన్ లేదోయ్! ముంబాయ్ లో రెండు చిత్రాల్లో నటిస్తోంది కదా. అక్కడ డేట్స్ ఇచ్చిందట. ఆమెలేని దృశ్యాలు మిగతా కాంబినేషన్ తో తీస్తున్నాం'' చెప్పాడు డైరెక్టర్. "అంటే ఆమె ఇప్పుడు ముంబాయిలో వున్నదన్నమాట'' "అవును ఏం!'' "ఏం లేదు సర్'' ఆరోజు షూట్ చేయవలసిన సన్నివేశాలు డైరెక్టర్ చెబుతున్నాడు. ఆవేమీ బుర్రకందడం లేదు నీరజ్ కి. మాటి మాటికీ అపరంజి అతడ్ని డిస్ట్రబ్ చేస్తోంది. నవ్వుతూ, కవ్విస్తూ కనులు రేరిచినా ఆమె రూపమే కనులు మూసినా ఆమె రూపమే. దాంతో టేకులు ఎక్కువ తింటూ తెగ ఇబ్బంది పడ్డాడు నీరజ్. కొత్త కనుక ఇది అనివార్యమని డైరెక్టర్ సర్దిచెప్పుకున్నాడు తనకు తానే

*****

ఆ రాత్రి నీరజ్ కి అసహనంగా గడిచింది. ఉదయం నుంచీ జరిగిన సంఘటనలు ఒక్కొక్కటిగా గుర్తుకురాసాగాయి. యూనిట్ సభ్యులు ఎందరున్నా తన భుజం తట్టి హీరో ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ ఉన్నా సరదాగా షూటింగ్ చూస్తూ కళ్ళతోనే ప్రోత్సహించే ప్రజలు చుట్టూ వున్నా అపరంజి లేని లోటు కొట్టొచ్చినట్టు కనిపించిందతనికి. నిజానికి ఆమె ఎవరో? తానెవరో? ఉత్తరాదిలో ఆమె పుట్టిపెరిగింది. హై సొసైటీ కల్చర్ అలవాటు చేసుకుంది. మోడల్ గా కొన్ని యాడ్స్ లో కనిపించింది. హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ పై క్యాట్ వాక్ చేయనుంది. తను ఆమె పక్కన ఓ హీరో అలా అని ఎంతగా సరిపెట్టుకుందామనుకున్నా అతడి వల్ల కావడం లేదు. ఆమె అతడికి ఏమీ కాదని తెలిసినా భాషరాని మూగమనసు తెగసతాయిస్తోంది.

ఆమె చిత్రంలో పారితోషికం తీసుకుని నటిస్తున్న నాయిక. అదే చిత్రంలో కథానాయకుడైనందువల్ల కెమెరా ముందు తనపై ప్రేమ కురిపిస్తోంది. అందులో భాగంగానే ఐ లవ్ యూ చెప్పినా, గులాబీ పువ్వుచ్చినా అంగీకరిస్తోంది. ఈ లోకేషన్ లో ఇక్కట తనతోనే కాదు ముంబాయిలో కూడా మరో హీరోతో ... ఈ భావన రావడంతోనే నీరజ్ కి చేదుతిన్న ఫీలింగ్, రూపం సరిగ్గా కనిపించని మరో హీరోతో అపరంజి ప్రేమ కబుర్లు చెబుతున్న దృశ్యాలు, పాటల్లో అతడ్ని బిగికౌగిలిలోకి తీసుకుని గాలికూడా చొరరాని ఇరుకు బాహుబంధంలో ముగ్ధమనోహరంగా పరవశిస్తున్న సీన్లు ఒకదానివెంట ఒకటిగా కదిలిపోతుంటే నీరజ్ కి గుండె రగిలిపోతోంది.

*****

"హలో హౌ ఆర్ యూ! ఎలా జరుగుతోంది షూటింగ్. నా ఆబ్సెన్స్ ఫీలయ్యారా?'' పాలరాతి ఏకాంతమందిరంలో గుప్పెడు రత్నాలు గలగలా రాలినట్లు అనిపించింది నీరజ్ కి. "షెడ్యూల్ ప్రకారం మీరు లేని సీన్స్ షూట్ చేశారింతవరకూ, నిజం చెప్పాలంటే మీ ఆబ్సెన్స్ ఫీలయింది మనస్ఫూర్తిగా నేను'' అప్పుడే మాటలు నేర్చుకుంటున్న వాడిలా నీరజ్ ఒక్కో పదాన్ని ఒత్తిపలుకుతూ ఎట్టకేలకు పూర్తిచేశాడు. "అంటే .... మీరు!'' ఆమె ఆర్థోక్తిలో ఆగిపోయింది.

"ష్యూర్ ... ముహూర్తం రోజునే మీరు చాలా డిస్ట్రబ్ చేశారు'' చెప్పాడు నీరజ్ ధైర్యం పుంజుకుని. రెండ్రోజుల నుంచి హీరోహీరోయిన్ల కాంబినేషన్ పై వరుస దృశ్యాల చిత్రీకరణ జరుగుతోంది. బంజారాహిల్స్ లోని సుందర భవంతిలో హీరోహీరోయిన్లు కథాపరంగా దగ్గరయ్యే దృశ్యాలు తీస్తున్నారు. హీరో కుటుంబంలో ఒక సభ్యురాలిగా కలిసిపోయిన హీరోయిన్ ని హీరోతో ప్రేమలో పడేందుకు దారితీసే సీన్లు చిత్రీకరిస్తుండటంతో నీరజ్ కి అపరంజితో కాస్త చనువు ఏర్పడింది. షాట గ్యాప్ లో ఇద్దరూ పక్కపక్కనే కూర్చుని వుండగా

"మిమ్మల్ని డిస్ట్రబ్ చేశానా?'' అర్తంకానట్టు అడిగింది అపరంజి. ఎదపై నుంచి జారిపోతున్న చునీ సర్ధుకుంటూ. "ఇలాంటి డిస్ట్రబెన్స్ మీకెక్కడా ఎదురుకాలేదా?'' ఆసక్తిగా అడిగాడు నీరజ్. నీరజ్ హీరోగా అరంగ్రేటం చేస్తున్న సినిమా ఇదే అయితే, ఏకకాలంలో ఆమె ముగ్గురు హీరోలతో మూడు సినిమాలు చేస్తున్న సంగతి అతడికి గుర్తొచ్చి అలా అడిగాడు. వారానికి రెండుసార్లు హైదరాబాద్ టు ముంబాయి విమాన ప్రయాణం చేసే ఈ ముద్దుగుమ్మ హృదయంలోకి తొంగి చూడాలని ప్రయత్నిస్తున్నాడు నీరజ్.

మోడల్ గా చేసిన రోజుల్లోని మగస్నేహాల కన్నా ముంబాయిలో ప్రస్తుతం చేస్తున్న సినిమాల్లోని హీరోలకన్నా ఈ చిత్రంలో అదీ ఈ హీరోతోనే తను డిస్టర్బ్ అయ్యాననే సమాధానం నీరజ్ ఆమెనుంచి ఆశిస్తున్నాడు. అంతేకాదు, అతడు మరో నూరడుగులు ముందుకు డ్రీమ్స్ లోకి వెళ్ళిపోయాడు కూడా. ఆ డ్రీం లో మల్లెపందిరి నీడలో వెన్నెల జాగారం చేస్తూ ఓ ఇద్దరు ... ఆ ఇద్దరిలో ఒకరు అపరంజి. తారలు తలంబ్రాలు కాగా తలొంచుకుని తాళి కట్టించుకున్న తర్వాత ఏకాంత తన్మయత్వంలో మరో వ్యక్తి నీరజ్. పిండారబోసినట్లు వెన్నెల్లో తెల్లచీర కట్టుకుని అపరంజిలా ఆమె సమ్మోహనపరుస్తుంటే ఆమె అరుణారుణ ఆధారాలను అతడు అందుకోబోతుండగా "ముహూర్తం రోజునే అంత డిస్టర్బెన్సా?'' అడిగింది అపరంజి.

"అన్నింటికీ సమాధానాలు పదాల్లో వుండవు. పెదాల్లో వుంటాయి'' అన్నాడు నీరజ్. అతదేమంటున్నాడో ఆమెకి అర్థం కాలేదు. అతడాశించిన సమాధానం ఆమెనుంచి రాలేదు. ఆ సాయంత్రం షూటింగ్ పేకప్ చెప్పాక తర్వాత అందరూ ఎవరికి వారు వీడ్కోలు చెప్పి విడిపోయే సమయంలో అపరంజి స్క్రిప్ట్ రైటర్ ను అడుగుతోంది. "పదాలు, పెదాలు అంటే ఏమిటని?'' స్క్రిప్ట్ రైటర్ చెబుతున్నదేమిటో నీరజ్ కి అర్థం కావడంలేదు. ఎందుకంటే అప్పటికే అతడు షాక్ తిన్నాడు కనుక.

****

ఊటీలో పిక్చరైజేషన్ మంచు కురుస్తున్న ఓ ఉషోదయవేల కొండలపై నుంచి కిందకు దూకుతున్న జలపాతంలో తెల్లటి పల్చటి చీర ధరించిన హీరోయిన్ అపరంజి తడిసి ముద్దవుతుంటే నీరజ్ తమకంగా తదేకంగా చూస్తున్నాడు. పల్లం, చరణం హీరోయిన్ పై చిత్రీకరించిన తర్వాత రెండో చరణంలో హీరో ఆమెతో జత కలిపి యుగళం పాడతాడు. అదీ సాంగ్ సిట్యుయేషన్. ఊటీ చలిగాలులు శరీరాన్ని కోసేస్తుంటే పాతికేళ్ళ ప్రాయమున్న వంటరితనం జంటకోసం తహతహలాడుతుంటే ఎదురుగా నేత్రపర్వంగా పరువాల పాపాయి జలకాలాడుతుంటే నరనరాన తీపి జ్వరం, నీరజ్ తల్లడిల్లిపోతున్నాడు.

మధ్యాహ్న సమయాన షాట గ్యాప్ లో దగ్గరకొచ్చిన అపరంజి నెమ్మదిగా గుసగుసగా అంది 'ఆరోజు మీరడిన ప్రశ్నకి ఈరోజు సమాధానం దొరికింది' "ఏమిటి?'' "అర్థం కాలేదా? ఒట్టిమొద్దు!'' అప్పటికీ అర్థం కానట్టు ముఖంపెట్టి అయోమయంగా చూశాడు నీరజ్. అపరంజి తన ప్లేట్ లోని పొంగలిని సగం తీసి అతడి ప్లేట్లో వేసి సగం సగం అంది. అంతటితో ఆగకుండా నేనూ డిస్టర్బ్ అయ్యాను రాత్రి మనిద్దరం చేరోసగం రెచ్చగొడుతున్నట్లు చూస్తూ ఊటీ శీతల గాలులతో చల్లబడిన సూర్యకిరణం ఒకటి ఆమె తడిసిన అందాలను తడిమి తడిమి చూస్తోంది.

"యురేకా'' అని అరిచాడు నీరజ్. అతనికిప్పుడు అంతా అర్థమైపోయింది. ఆ రాత్రి - రెండు సగాలోకటై సంపూర్ణత్వం సిద్ధించిన రాత్రి. నాలుగు పెదవుల ఎకతాలం పలికించిన రాత్రి. నాగుపాముల్లా ఒకర్నొకరు అల్లుకుపోతూ శృంగార రసావిష్కరణ కావించుకున్న రాత్రి. వారిద్దరి హృదయాల్లో అమృతం కురిసిన రాత్రి.

*****

"నీరజ్ నువ్వేనా? ఎంతమార్పు ఒక్క సంనివేశామైనా ఐదో టేకు లేకుండా అవుననిపించేవాడివి కాదు. ఇప్పుడేమైంది? ఒకేఒక్క టేకులో ఒకే చేస్తున్నావు'' నవ్వుతూ డైరెక్టర్ అడిగాడా ప్రశ్నని. నీరజ్ ఏం సమాధానం ఇవ్వలేదు. రాత్రేం జరిగినట్లుగా అమాయకంగా చూస్తోంది అపరంజి నీరజ్ ని. ఆ ఒక్కరాత్రే కాదు ఆ తర్వాత ఎన్నో మరెన్నో రాత్రులు వెన్నెలని మోసుకొచ్చి నీరజ్ కి అందించింది అపరంజి. మత్తెక్కించే సౌరభాల్ని కానుకగా అప్పగించింది. కార్తీకంలో వనభోజనపు సందడిలా గడిచిపోయాయి రోజులు. కొబ్బరికాయ కొట్టి ప్రారంభించాన సినిమా షూటింగ్ గుమ్మడికాయ కొట్టి అయిందనిపించాడు డైరెక్టర్ సినిమా రిలీజైంది అయితే వారం కూడా ఆడలేదు. నిర్మాత, డైరెక్టర్ యూనిట్ మొత్తాన్ని సినిమా నిరాకరించింది.

అపరంజి నటించిన రెండు హిందీ సినిమాలు బాక్సాఫీస్ హిట్ కావడంతో ఆమె మకాం ముంబాయికి మార్చింది. కెమేరాకు అలవాటు పడని మొదటి దశలో వయసు వ్యామోహంతో నీరజ్ గజిబిజి అవుతుంటే గమనించిన అపరంజి సరిగా అప్పుడే అతడ్ని ఆదుకుంది. ఊటీ చలిరేయిలో అందాల్ని, ఆడతనాన్ని అప్పగించేసి అతడికి చనువిచ్చింది. ఆ చనువులో ఆ తర్వాత నీరజ్ వ్యవహరిస్తే అది సిన్మాకు ప్లస్ అవుతుందనుకుంది కానీ, అలా జరగలేదు. ఇప్పుడు హాలీఫుద్ లో అపరంజి బిజీ హీరోయిన్.

ఎప్పుడైనా ముంబాయి నుంచి హైదరాబాద్ వచ్చి షూటింగ్ లో పాల్గొంటే క్రమం తప్పకుండా మొదటగా ఆమెను పలకరించేది ఓ గులాబీ పువ్వే. ఆ తర్వాత ఐ లవ్ యూ మాటే. తలెత్తి చూస్తే నీరజ్ ... అపరిచిత అభిమాని ఇచ్చిన అపురూప కానుకలా అలవోకగా ఆ పువ్వుని అందుకుంటోంది అపరంజి. చిర్నవ్వుతో థాంక్స్ చెప్పి ముందుకు కదులుతోంది. అంతే ...!!! ఆమె ఎప్పుడూ రాబోయే చిత్రం సక్సెస్ గురించి ఆలోచిస్తుంటుంది. కానీ నీరజ్ ...! అతడి అంతరాంతరాల్లో ఆనాటి స్వీట్ నథింగ్స్ స్పెషల్ గా ఇప్పటికీ గుబాళిస్తూనే వుంటాయి.