The content in this feature is rated as "A++". You must be at least 18 years old to view this feature.
Home>>Sex - Science>>Sex Problems - Techniques to cure
సెక్స్ సమస్యలు - చికిత్సా పద్ధతులు

“హస్తప్రయోగం, స్వప్నస్కలనాలు, వీర్యంపలుచన, శీఘ్రస్కల నానికి ఉత్తమ చికిత్స దురభ్యాసాలవల్ల అపార వీర్యనష్టం కలిగి నరాల బలహీనత, నపుంసకత్వం వచ్చిన వారికి విద్యుత్ యంత్రాలతో చికిత్స చేయబడును'' అనే ప్రకటన పత్రికలో చదివిన కుమార్ మనస్సు భయంతో కంపించిపోయింది. తాను హస్తప్రయోగానికి అలవాటు పడి ఎంతో వీర్యనష్టం కలిగించుకున్నానని, తాను చేసిన తప్పిదానికి తిరిగి ఎన్ని మందులు వాడినా పోయిన వీర్యశక్తిని, పుంసత్వాన్ని పొందలేనని బాధపడ నారంభించాడు. వెంటనే తాను చదివిన ప్రకటన ఎడ్రసు ప్రకారం ఆ డాక్టరు దగ్గరకే వెళ్లాడు.

“సెక్స్ స్పెషలిస్టు'' నని చెప్పుకునే ఆ నకిలీ డాక్టరు దగ్గర మందు ఎంత వాడుతున్నా, గతంలో తను చేసిన హస్తప్రయోగం వల్ల కలిగిన అపార వీర్య నష్టం భవిష్యత్ లో దాంపత్య జీవితంలో అసంతృప్తిని కలిగించకుండా ఉంటుందా అనే సందేహం మాటిమాటికీ వేధిస్తూనే వుంది. మనస్సులో ఇంతభయం, సందేహం గూడుకట్టుకుని ఉండబట్టి ఆ స్పెషలిస్టు దగ్గర ఎంత మందు వాడినా ఫలితం కనబడడం అటుంచి, అంతకు ముందు ఉన్న పుంసత్వం కాస్తాపోయి ఈ దిగులుతోనే అంగస్తంభనం కూడా కలగడం మాని వేసింది. దీనితో ఆ మందులు తీసుకోవడం మానివేసి ఇంగ్లీషు వైద్యంలో డిగ్రీ ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి జరిగినదంతా చేప్పాడు.

ఆ డాక్టర్ కుమార్ ని పరీక్ష చేసి "హస్తప్రయోగంవల్ల ప్రమాదం ఏమీ లేదనీ, పైగా ఒంటరివాళ్ళకి ఏకైక ఉపశమన మార్గమనీ, దాని గురించి బెంగ, భయం అనవసరమని'' చేప్పాడు. ఇంకా అతనికి ఒక సలహా ఇస్తూ "పనీ-పాటా లేకుండా, ఊరికే ఉంటే అనవసరంగా కామవాంఛలు కలుగుతూ వుంటాయి. హస్తప్రయోగం చేయాలనీ వుంటుంది. దీనితో ఇలాంటి పిచ్చిభాయాలు కలుగుతూ వుంటాయి. జీవితమంటే సెక్స్ ఒక్కటే కాదు, తనకి ఉన్న సమయాన్ని తన అభివృద్ధి కోసం, తన తోటివారికోసం మనస్సు లగ్నంచేసి పని చేస్తే సెక్స్ గురించి అనవసర ఆలోచనలు వుండవు. హస్తప్రయోగం ఉండదు. అనవసరంగా దీనికోసం దిగులు చెందే అవసరం కెదు'' అని చెప్పాడు.

ఆ కాక్తర్ చెప్పినది కుమార్ లో ఎంతో మార్పు తెచ్చింది కూడానూ. అవును, డాక్టరు చెప్పిన దాంట్లో చాల వరకు నిజం వుంది. ఈనాడు సెక్స్ గురించి ఎన్నో అపోహలు కలిగి వుండి. వాటికి సరైన సమాధానం లభించక ఎందరో యువకుల జీవితాలు నాశనం అవుతున్నాయి. హస్తప్రయోగం, స్వప్నస్కలనాలు, శీఘ్రస్కలనం, వీర్య పలచన, మూత్రంలో వీర్యం మొదలైన వాటి గురించి అపోహలు, భయాలు చాలావరకు వివాహం కాని యువకుల్లోనే ఎక్కువ. దీనికి సెక్స్ గురించి సరైన విజ్ఞానం ప్రచారంలో లేకపోవడం, సెక్స్ స్పెషలిస్టులమని ప్రచారంచేసుకునే వ్యక్తుల, ప్రకటనలు కారణం. హస్తప్రయోగం, స్వప్నస్కలనాలు మొదలైన వాటినించి ఇంతకు ముందు వివరంగా తెలుసుకోవటం జరిగింది. కనుక వీటికి సంబంధించిన మందులు చికిత్స గురించి టూకీగా ఇక్కడ తెలుసుకుందాం.

హస్త ప్రయోగం :-

కొందరు అప్పుడప్పుడు హస్తప్రయోగం చేస్తే మరికొందరు రోజుకి అయిదారు సార్లు చేస్తూ వుంటారు. దాంపత్య జీవితంలో భార్యతో రోజూ ఎక్కువ సార్లు సంయోగం జరిపినా అలసట వస్తుంది. ఒకేరోజు ఎక్కువసార్లు సంయోగం జరపడంవల్ల కామ గ్రంథులు అలసిపోతాయి. రోజూ ఎక్కువ సార్లు హస్తప్రయోగం చస్తే దాంపత్య జీవితంలో అతిగా పాల్గొంటే వచ్చినట్లు గానే తాత్కాలికంగా అలసట కలుగుతుంది. కామపరంగా ఈ అలసట, ఆశక్తత కలిగే వాళ్ళకి హస్త ప్రయోగంలో కలగడం, దాంపత్య జీవితంలో కలగక పోవటమంటూ తేడా వుండదు. అయితే కొందరు రతిలో గాని, హస్తప్రయోగంలోగాని ఎక్కువ ఎందుకు పాల్గొంటారని అనిపించవచ్చు.

ఇటువంటి వారికి మెదడులో వున్న కామకేంద్రం (Sex centre)గాని, వెన్నెముకలో వుండే దిగువ నాడీమండలం లోని కామకేంద్రం గాని ఎక్కువ వుద్రిక్తత చెందుతూ కామభావాల్ని రేకెత్తించడం, కామోద్రకాన్ని కలిగించడం జరుగుతుంది. అటువంటి వారు తమకి కలిగే కామోద్రేకాన్ని చల్లార్చుకోవడం కోసం అతిగా హస్తప్రయోగం చేయడంగాని, రతిలో పాల్గొనడం జరుగుతూ వుంటుంది. స్త్రీతో సంయోగం జరిపే వాళ్ళు దీని గురించి పెద్దగా ఆలోచించదు. అదే హస్తప్రయోగం చేసేవాళ్ళు అపార వీర్యనష్టం జరిగిపోయిందని దిగులు చెందిపోతారు. దీనికి కారణం వీర్యం ఎంతో విలువైనదనేభావం వారిలో వుండబట్టే, కాని వారు భయపడినట్లుగా వీర్యం నష్టపోతే ఏమీ జరగదు. ఎక్కువ కామవాంఛవల్ల రోజు పలుమార్లు రతిలో పాల్గొన్నా, హస్త ప్రయోగం చేసినా శారీరకంగా గాని, మానసికంగా గాని అలసట కలుగుతూ ఉంటే అటువంటి వ్యక్తులు ట్రాంక్విలైజర్స్ లాంటివి కామకేంద్రాల ఉద్రిక్తతలని తగ్గించడానికి వాడటం మంచిది.

ఇందుకు Speman forte టాబ్లెట్లు ఉదయం రెండు మధ్యాహ్నం రెండు, రాత్రి రెండు చొప్పున కామవాంఛ ఉద్రక్తత తగ్గేవరకు వాడాలి. ఇవి కాకపొతే Calmpose టాబ్లెట్లు ఉదయం ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి చొప్పున వాడాలి. మందులకంటే మనస్సు ఒక పనిలో లగ్నం చేసి పనిచేస్తూ ఉంటే అంత తేలికగా సెక్స్ సంబంధమైన కోర్కెలు కలగవు. ఎక్కువసార్లు హస్తప్రయోగాన్ చేస్తే తాత్కాలికంగా నయినా కామపరంగా అందరికీ అలసట ఉండాలనీ లేదు.

స్వప్నస్కలనాలు - శుక్లనష్టం :-

వివాహం కాని యువకుల్లో వివాహమయి కూడా భార్యకు దూరంగా ఉన్న వారిలో స్వప్నస్కలనాలు 10-15 రోజులకి ఒకసారి అవడం మామూలే. కొందరు వ్యక్తులకి రోజుగాని, రోజువిడిచి రోజుగాని స్వప్నస్కలనాలు అవుతూ ఉంటాయి. దీనివల్ల ఆరోగ్యానికి ఎటువంటి భంగం ఉండదు. కాని ఇలా తరుచు స్వప్నస్కలనాలు అవుతుంటే మానసికంగా ఆందోళన ఉండటం సహజం. వీటిని అరికట్టడానికి SPEMAN గాని SPEMAN FORTE టాబ్లెట్లుగాని, ఉదయం రెండు బిళ్ళలు, మధ్యాహ్నం రెండు బిళ్ళలు, రాత్రి రెండు బిళ్ళల చొప్పున తగ్గేవరకు వాడాలి. ఇవి కాకపొతే ఏ Tranqulizers అయినా రోజూ వాడవచ్చు. శుక్లనష్టం అవుతున్నప్పుడు కూడా పై చెప్పిన మందులే వాడవచ్చు.

కామపటుత్వం - నరాల బలహీనత :-

హస్తప్రయోగం, స్వప్నస్కలనాలవల్ల నరాల బలహీనత కలుగుతుందనుకోవడం పొరపాటు అభిప్రాయమే. అతిగా హస్తప్రయోగం చేసినవారిలో శారీరక, మానసిక ఉద్రిక్తతవల్ల తాత్కాలికంగా అలసట కలగటం తప్ప నరాల బలహీనత కలగదు. అలాగే మానసిక అలసట వల్ల తాత్కాలికంగా కామవాంఛ కలగక పోవచ్చు గాని నపుంసకత్వం కలగదు. నరాల బలహీనతకి, శీఘ్రస్కలనానికి సంబంధం లేదు. హస్త ప్రయోగం, స్వప్నస్కలనాలు, శీఘ్రస్కలనం ఉన్న వాళ్ళల్లో అపోహల వల్ల అంగ స్తంభనం కలగకపోవచ్చు. అది మానసికమైన కారణమే కాని లైంగిక నపుంసకత్వం కాదు. నరాల బలహీనతా కాదు. దీనికి విద్యుత్ యంత్రాలతో చికిత్స అర్థరహితమైనది. కామవాంఛ, కామ పటుత్వం తక్కువ ఉన్నప్పుడు హార్మోన్ల ఇంజక్షన్లు, టాబ్లెట్లు వాడటం మంచిది. మానసిక కారణాలవల్ల కామపటుత్వం తగ్గినట్లనిపిస్తే విజ్ఞతతో దానిని సరిదిద్దుకోవడం మంచిది. కామపటుత్వం తక్కువ ఉన్నప్పుడు TESTOVERON 100mg ఇంజక్సన్ గాని, SUSTENON 100mg ఇంజక్షన్లుగాని పది పదిహేను రోజులకి ఒకటి చేయించుకోవడం మంచిది.

TENTEX FORTE బిళ్ళలు ఉదయం ఒకటి, రాత్రి ఒకటి వాడితే కూడా కామపరంగా కొంత శక్తిని, హుషారుని కలిగిస్తాయి. మానసిక కారణంవల్ల నపుంసకత్వం తెచ్చిపెడుతున్నా రతిలో అంతగా ఆసక్తి చూపించలేకుండా ఉన్నా పైన చెప్పిన ఇంజక్షన్లు, టాబ్లెట్లు ఫలితాన్ని కలిగిస్తాయి. ఏది ఏమయినా సరైన సెక్స్ విజ్ఞానం కలిగి ఉంటే ఎటువంటి అపోహలు ఉండవు. మానసిక భయాందోళనలు ఉండవు. ఆ భయాందోళనలని నిరోధించడానికి మందులు వాడవలసిన అవసరమూ ఉండదు.