.png)
జయంత్ ని బంధువులంతా గాయత్రి భార్తగానే చెప్పుకుంటున్నారు. గాయత్రి అంటే ఎవరు ... ఓ గవర్నమెంటు ఆఫేసులో క్లర్కు. జయంత్ ఓ క్లర్కు భర్త . అంతే!
కాని గాయత్రి ఓ అకౌంట్స్ జనరల్ భార్య. తనని పెళ్ళి చేసుకోవడం వలన జయంత్ అకౌంట్స్ జనరల్ స్థాయి నుంచి ఓ క్లర్కు భర్త స్థాయికి దిగజారిపోయాడు అన్న భావాన్ని జీర్ణించుకోలేకపోయింది గాయత్రి. తన ఉద్యోగానికి రాజీనామా ఇచ్చింది. ఆ రాజీనామా వెంటనే ఆమోదించబడింది.
ఈ వార్త విన్న వెంటనే మూడుగా రియాక్టు అయింది రజిత. పెళ్ళికి గాయత్రి తరపు బంధువులు వచ్చారు, ఆఫీసు స్టాఫ్ వచ్చారు కానీ జయంత్ తరపు బంధువులు ఏ ఒక్కరూ రాలేదు. అంటే జయంత్ కి 'నా' అన్నవారెవరూ లేరా? లేక తన వారెవరికీ చెప్పకుండా పెళ్ళిచేసుకుంటున్నాడా? ఆడంబరంగా జరిగిన పెళ్ళి ఏర్పాట్లు జయంత్ ఇస్తున్న ఖరీదైన బహుమతులు అకౌంట్స్ జనరల్ గా అతడి హోదా చూసిన ఏ ఒక్కరికీ ఈ విషయం స్ఫురించలేదు.
ఈ విషయాన్ని మరుగుపరచడానికి గాయత్రి బందువర్గాలలో తన పరపతి పెంచుకోవడానికి మాత్రమే జయంత్ దండిగా ఖర్చు చేశాడు. అంటే ఎక్కడో ఏదో ఒక మెలిక వుంది. గంగిగోవులాంటి గాయత్రి ముందూ వెనుకా ఆలోచించకుండా ఉద్యోగానికి రిజైన్ చేసింది. ఎందుకింతగా తొందరపడింది? ప్రతి చిన్న విషయాన్నీ నాకు చెప్పే గాయత్రి తన జీవితంలో అతి ముఖ్యమైన పెళ్ళి విషయాన్ని, ఉద్యోగానికి రాజీనామా విషయాన్ని ఎందుకు చెప్పలేదు?
గాయత్రి రాజీనామా వెనక్కి తీసుకునేలా చేయాలి అన్న ఉద్దేశ్యంతో శోభనపు పెళ్ళికూతురు దగ్గరికి బయల్దేరింది రజిత.
*****
|
|


