The content in this feature is rated as "A++". You must be at least 18 years old to view this feature.
Home>>Preyasi Nee Peru Raakshasaa>>Preysi Nee Peru Rakshasaa
ప్రేయసి నీ పేరు రాక్షసా - 79

కరెంట్ పోయింది.

చిమ్మ చీకటి ... ఉలిక్కిపడింది అంకిత .... ఎలా? ఎలా తప్పించుకోవడం ...? చేత్తో నెమ్మదిగా తడిమి వంట ఇంట్లోంచి అగ్గిపెట్టె అందుకుని ఓ పుల్లగీసి ఆ వెల్తురులో పక్క గదిలోకి వచ్చింది. వాసన ... అదోరకం వాసన ... క్షణక్షణానికి అధికం అవుతూ వాసన ... వెంటిలేషన్ లేకుండా వున్న ఆ గదిలో సుఖజీవన్ శవంపై నుండే వస్తుంది వాసన అని గ్రహించడానికి ఎంతోసేపు పట్టలేదు. హఠాత్తుగా ఆమె శరీరం వణనకసాగింది. కారిడార్ లోకి పరిగెత్తింది వెనకాలవైపు.

క్షణక్షణానికీ నీరం అధికం అవుతోంది. కాళ్ళలో శక్తి పూర్తిగా పోయింది. టాయిలెట్ లోకి వెళ్లి చూసింది. ఎక్కడా బయటపడే మార్గం కనిపించలేదు. బాత్ రూంలోకి నడిచింది. కళ్ళు చీకటికి అలవాటుపడ్డాక కనిపించిందామెకు నెలకి అయిదు అడుగుల ఎత్తులో సబ్బులాంటివి పెట్టుకునే రాక్సు అక్కడికి రెండడుగుల ఎత్తులో వెంటిలేటరూ ... ఓ మనిషి కష్టపడితే పట్టొచ్చా వెంటిలేటర్ లోకి .... అవతలేముందే తెలీదు ... తర్వాత చూడొచ్చు ... కాని అక్కడికి చేరడం ఎలా? ఏదో ఆలోచన స్ఫురించినదానిలా మొదటి గదిలోకి పరిగెత్తింది.

కుర్చీ తీసుకుని వెనక్కి తిరిగి బాత్ రూం చేరింది. ఆ రోజు ఎందుకో ప్రొద్దున్న అనిపించింది, చీర కట్టుకోకుండా పాంటూ చొక్కా వేసుకురావటం మంచిదయింది. కుర్చీ సబ్బు రాక్స్ దగ్గరుంచింది, ఓ భుజానికి కెమెరా, ఓ భుజానికి బ్యాగూ తగిలించుకుని అది ఎక్కింది. ఉన్నట్లుంది కళ్ళు తిరిగాయి. చాలా సేపటికి కడుపులో దేవుతున్నట్టున్న ఆహారం ప్రవాహంలా రాసాగింది. అలాగే కుర్చీమీద నిలబడి గోడ కానుకుని శరీరం మొత్తం పడేలా వాంతి చేసుకుంది. బట్టలు కూడా తడిసిపోయాయి.

ఆహారంతో నెమ్మదిగా క్రిందికి దిగి కొళాయి విప్పి కొద్దిగా నీళ్ళు తీస్కుని మొహం తుడుచుకుంది. రెండు గుక్కెళ్ళు త్రాగింది. బట్టలు క్లీన్ చేసుకునే తీరికా, ఓపికా రెండూ లేవు ఆమెలో. కుర్చీ ఎక్కి నెమ్మదిగా షవర్ ని ఆసరా చేసుకొని సబ్బురాక్స్ పై ఎడం కాలుంచింది. తరువాత బలంగా ఎడంకాలిమీద వేసి కుడికాలుని పైకిలేపి రాక్స్ కి చేర్చింది. ఇప్పుడామెకి కుడిగా రెండడుగుల ఎత్తులో అంటే దాదాపు మోకాళ్ళ అంత స్థానంలో వుంది వెంటిలేటరు. ముందు కాళ్ళు పెట్టకుండా తలపెట్టి చూసింది. చిమ్మ చీకటి ... అవతల ఏముందో తెలియడం లేదు.

నేల ఎక్కడుందో కూడా తెలియలేదు. అంకిత వేగంగా ఆలోచించింది. బ్యాగులోంచి కాగితం తీసి దానికి నిప్పంటించి అవతలవైపుకి వదిలింది. కాగితం అంటుకుని నిప్పు క్రిందకు దిగుతూ కాటలో ఆరిపోయి నిప్పు కణికలు మరికొంత దూరం వెళ్ళి ఆగాయి. సుమారు దీనంత ఎత్తు వుంటుందని వూహించింది. అంటే దాదాపు ఏడడుగులన్నమాట. కళ్ళు మూసుకొని, కాళ్ళు ముందు వెంటిలేటర్ లోకి చాపి, తరువాత బ్యాగూ కెమెరా అవతలికి వచ్చేలా వదిలి నెమ్మదిగా జారుతూ అవతలివైపు వెంటిలేటర్ పట్టుకుని వ్రేల్లాడసాగింది. అలా పది సెకెన్లపాటు ఉండి వూపిరి పీల్చుకొని చేయి వదిలేసింది. దబ్బుమని ఇసుక కుప్పలో పడింది.

ఒళ్ళంతా జివ్వుమనడంతో ఒక్క క్షణంపాటు స్థంభించిపోయింది. అంకిత కళ్ళ ఎదుట లోకం. నోరు పిడచగట్టుకుపోతూంది ... గొంతు తడారిపోయింది. జ్వరం క్షణ క్షణానికి అధికం అవుతోంది. ఊరిపాడటం కష్టంగా వుంది. నెమ్మదిగా లేచింది అంకిత, బ్యాగ్, కెమెరా తీసుకుంది. ఆ చిమ్మ చీకటిలో పది క్షణాలు నిశ్శబ్దంగా కూర్చుంది. చెవులు రిక్కించి ఏదయినా అవాంతరం కోసం ఎదురు చూస్తూ ఏం భయంలేదని నిశ్చయించుకున్నాక లేచి నెమ్మదిగా అడుగులు వేయసాగింది.

తానూ పడ్డ ఇసుక కుప్ప దాటి క్రిందికి రావడానికి సుమారు రెండు నిమిషాలు పట్టింది. అంటే వెంటిలేటర్ నుండి అసలు నేల ఏ పదిహేనుఅడుగుల ఎత్తో వుంది. ఇసుక కుప్ప ఉండటంతో తాను బయటపడింది. ఒక్కసారి సుఖజీవన్ గది గుర్తు చేసుకుని నిట్టూర్చింది అంకిత. ఆ వూహకే ఆమె శరీరం గగ్గుర్పోడిచింది. దారి సరిగ్గా కనిపించక అగ్గిపుల్ల తీసి వెలిగించబోయి ఆగిపోయింది.

సరిగ్గా తాను నిల్చున్న ప్రదేశానికి ఆరడుగుల దూరంలో ఎర్రగా ఏదో కాలుతోంది ... అవును ... ఎవరో సిగరెట కాలుసున్నారు. పిలుద్దామని నోరు తెరిచిన అంకిత నోరు మూసేసింది వెంటనే ....