The content in this feature is rated as "A++". You must be at least 18 years old to view this feature.
Home>>Romantic Stories>>Palletoori Bava ...
పల్లెటూరి బావ

- జె. బాలవర్ధి రాజు

అది శోభనం గది. మెల్లగా తలుపులు తెరచుకున్నాయి. పాలమీగడ లాంటి తెల్లచీరలో తలనిండా మల్లెపూలతో సిగ్గుపడుతూ పాలగ్లాస్ తో రవళి శోభనం గదిలోనికి అడుగు పెట్టింది. సిగ్గుల మొగ్గవుతూ మెల్లమెల్లగా కాలి అందియలు ఘల్లుఘల్లుమని చిరుసవ్వది చేస్తుండగా అడుగులో అడుగు వేసుకుంటూ వస్తున్నా భార్యను తదేకంగా చూస్తున్నాడు మోహన్.

మంచానికి కొద్ది దూరంలో నిలబడి ఉంది రవళి. “అక్కడే ఆగిపోయావేం? రా రవళీ!'' అంటూ మంచం మీదనుండి లేచి వచ్చి రవళిని మంచం వద్దకు తీసుకొని వచ్చాడు. “ఒక్క నిమిషం'' అంటూ గబగబా వెళ్ళి తలుపులు మూసి వచ్చాడు మోహన్. రవళి తలవంచుకొని నేలచూపులు చూస్తూ ఉంది.

ఎందుకనో రవళి శరీరం చిన్నగా కంపిస్తూ ఉంది. శోభనం అంటే ఏమిటో స్నేహితురాళ్ళ ద్వారా, సినిమాల వల్ల కొంత తెలుసుకున్నా ఎందుకనో శోభనం అంటే భయం భయంగానే వుందామెకు. తన భర్త అసలే పల్లెటూరివాడు. ఎంత మొరటుగా ప్రవర్తిస్తాడో బెంబేలు పడసాగింది రవళి. ఆమె ప్రమేయం లేకుండానే చేతులు చిన్నగా వణకసాగాయి. “అదేంటి రవళీ! అలా వణికి పోతున్నావేం?'' అన్నాడు ఆమె చేతుల్లో నుండి పాలగ్లాసును తీసుకొని పక్కన పెడుతూ. ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోయింది రవళి.

“కొంపదీసి నేను నీకు విలన్ లా కనబడుతున్నానా ఏమిటి?'' ఆమె ప్రక్కన కూర్చుంటూ అన్నాడు మోహన్. “ఊహు'' అంటూ మెల్లగా తల అడ్డంగా ఊపింది. అలా తల ఊపినప్పుడు ఆమె చేవులకున్న బుట్టాలు గమ్మత్తుగా కదలసాగాయి. వాటి కదలికలను అదేపనిగా చూస్తూ ... “మరి నీకీ పెళ్ళి ఇష్టంలేదా?'' ఆత్రంగా ప్రశ్నించాడు. “అలాంటిదేమీ లేదు'' మెల్లగా అన్నది రవళి.

“మరెండుకలా భయపడిపోతున్నావ్?'' అడిగాడు మోహన్. “ఎందుకనో నాకు భయంగా ఉంది'' భార్య మాటలకు నవ్వోచింది మోహన్ కు. పట్నం పిల్ల నోటి నుండి అలాంటి మాట రావడం అతనికి ఆశ్చర్యాన్ని కలిగించింది. “పట్నం పిల్లవు, ఈ భయాలు, సిగ్గులు ఏమిటి?'' నవ్వుతూ అన్నాడు మోహన్. “ఏం? పట్నం అమ్మాయిలకు సిగ్గులు, భయాలుండవా?'' ఎదురు ప్రశ్నించింది. పెళ్ళికి ముందు ఎంతో హుషారుగా, అల్లరిగా ఉండే రవళి శోభనం గదిలో అలా మౌనంగా, భయంగా ఉండేసరికి అతను మరోలా అర్థం చేసుకున్నాడు.

“బావా! నేను సిటీలో ఒక అబ్బాయిని ప్రేమించాను. కాని అమ్మానాన్నల బలవంతం మీద ఈ పెళ్ళికి ఒప్పుకున్నాను. నాకీ పెళ్ళి ఇష్టం లేదు'' అని రవళి అంటుందనుకున్నాడు కాని ... శోభనం అంటే భయపడుతుందని అర్థం అవడంతో మోహన్ మనసు తేలికపడింది. వేములవాడకు దగ్గరలో హన్మాజీపేట అనే చిన్న పల్లెటూరిలో వ్యవసాయం చేసుకుని జీవిస్తున్న మోహన్ తో పట్నంలో పుట్టి పెరిగిన రవళి పెళ్ళి జరగడం యాదృచ్చికమే కాదు, వాళ్ళ చిన్నప్పటి నుండి అనుకుంటున్న సంబంధమే.

మోహన్ మేనమామ కూతురే రవళి. డిగ్రీ చదివిన రవళి తల్లిదండ్రుల ఇష్టప్రకారమే బావ మోహన్ ను పెళ్ళాడింది. రవళి డిగ్రీ చదువుతున్నప్పుడు రవళితో మాట్లాడడానికి, ప్రేమలేఖలు అందించడానికి ఎందరెందరో ప్రయత్నించి, ప్రయత్నించి విఫలమయ్యారు. కాలేజీ బ్యూటీ అయిన రవళిని చూసి డబ్బున్న చాలా మంది అబ్బాయిలు ప్రేమ, పెళ్ళి ప్రస్తావన చేసినప్పటికీ వారిని సున్నితంగా తిరస్కరించింది. రవళికి ఈ నాటి ప్రేమల మీద నమ్మకం లేదు. ఆమె స్నేహితురాళ్ళను, చుట్టుపక్కల వాళ్ళ స్నేహాలను, ప్రేమలను ఎన్నింటినో చూసింది.

ఏ స్నేహం అయినా, ఏ ప్రేమ అయినా సినిమాలకు, పబ్ లకు, పార్క్ లకు పరిమితం అయ్యాయేగాని పెళ్ళివరకు ఏ ప్రేమా నిలబడలేదు. ఒకటో, రెండో ప్రేమ నుండి పెళ్ళి వరకు వచ్చి, పెళ్ళి అయి ఒకటి, రెండు సంవత్సరాలు గడవక ముందే ఏవోగొడవలు, ఏవేవో విభేదాలతో విడిపోయే ప్రేమజంటలను చూసింది. ఇవి అన్నీ తెలిసాక ఆమెకు ప్రేమ మీద నమ్మకం పోయింది. అందుకనే ఆమె ప్రేమవైపు తొంగి చూడలేదు. తన చదువే లోకంగా గడిపింది.

అయితే ... ప్రేమను ప్రేమగా ప్రేమతో ప్రేమించే ప్రేమ హృదయాలు అక్కడక్కడా ఉంటాయని అలాంటి ప్రేమ హృదయం కలవారు వారి ప్రేమను పెళ్ళిదాకా తీసుకుని వచ్చి పెద్దలు ఒప్పుకోకపోతే వారిని ఎదురించి పెళ్ళి చేసుకొని హాయిగా కాపురం చేసుకుంటున్నారనే విషయం రవళికి తెలియనిదేంకాదు. ఆకర్షణే పరమ అనుకొని భ్రమపడి చదువులను నిర్లక్ష్యం చేసి, ప్రేమా ... ప్రేమా ... అంటూ తిరిగే వారన్నా, చిన్నప్పటి నుండి ఎంతో ప్రేమతో పెంచి పెద్దచేసి విద్యాబుద్ధులు చెప్పిస్తున్న కన్నతల్లిదండ్రుల మనసులను బాధపెట్టే వారన్నా రవళికి అసహ్యం. అందుకనే తన తల్లిదండ్రులు చెప్పిన పల్లెటూరి సంబంధమే ఒప్పుకుంది.

ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లల యోగక్షేమాలను, సుఖసంతోషాలనే కోరుకుంటారనే సత్యాన్ని నమ్మిన మనిషి రవళి. అందుకనే పల్లెటూరి వాడిన మోహన్ ను పెళ్ళి చేసుకుంది. 'పట్నంలో చదువుకున్న పిల్ల ఈ పల్లెటూరి బావనెలా పెళ్ళి చేసుకుందబ్బా!' అని ఆశ్చర్యంతో రవళిని తదేకంగా చూస్తున్నాడు మోహన్. రవళితో పెళ్ళి జరిగినా ఇంకా నమ్మబుద్ధి కావడం లేదతనికి. అంతా కలగా ఉంది. అది కలకాదనీ. నిజమేనని ఎదురుగా ఉన్న రవళిని చూస్తే అర్థమవుతుంది కొన్ని అంతేనేమో!?

ఒక్కొక్కప్పుడు నిజం కూడా కలలాగానే ఉంటుంది. అదేపనిగా తననే చూస్తున్న భర్తను క్షణం చూసిందంతే! ఆ చూపులు మోహన్ ను సంమోహితుడిని చేసాయి. మెల్లగా ఈ లోకంలోకి వచ్చాడు చిన్నగా నవ్వాడు మోహన్. “పాలు త్రాగండి బావగారూ!'' అన్నది రవళి పాలగ్లాసును అందిస్తూ. “ముందు నువ్వుత్రాగు'' చిరునవ్వుతో అన్నాడు. “ఊహు ముందు మీరే తాగాలి'' అన్నది రవళి. “నువ్వు ఎంగిలి చేసి ఇస్తే పాలు మరింత తియ్యగా అవుతాయి అందుకని'

' “ఛీ ... ఛీ ... నా ఎంగిలితో తియ్యగా ఎలా మారుతాయి. అంతా మీ బడాయి''

“సినిమాల్లో, సీరియల్స్ లొ, కథల్లో చూడలేదా? ముందు భార్య పాలను తాగితే అవి తియ్యగా అవుతాయట'' చిలిపిగా కన్నుకొట్టి అన్నాడు.

“ఏమో! నాకా సంగతి తెలియదు. నేను సినిమాలు చూడను, కథలు కూడా చదవను''

“మరి?'' ఆశ్చర్యపోతూ అడిగాడు మోహన్.

“నా ధ్యాసంతా డాక్టర్ ను కావాలనే. అందుకే క్లాస్ పుస్తకాలను, సైన్స్ కు సంబంధించిన పుస్తకాలనే విపరీతంగా చదువుతాను. ఇంటర్ లొ ఎంసెట్ రాసాను. ఎం.బి.బి.ఎస్.లొ సీటు రాలేదు. ఎం.బి.బి.ఎస్.చేసి డాక్టర్ అవ్వాలనేదే నా ఆశ కానీ ...'' అంటూ చెప్పడం ఆపింది.

“ఊ! కానీ ... చెప్పడం ఆపేశావేం?'' ఆసక్తిగా అడిగాడు మోహన్.

“ఇంకెక్కడి ఎం.బి.బి.ఎస్. ఇప్పుడే నాకు పెళ్ళి వద్దని ఎంత చెప్పినా వినకుండా పెళ్ళి చేసారు'' వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ అన్నది రవళి.

భార్య కళ్ళల్లో కన్నీళ్ళను చూసి ఆశ్చర్యపోయాడు, ఆందోళన పడ్డాడు మోహన్. “రవళీ! ఐయాం వెరీసారీ నా బలవంతం మీదనే ఈ పెళ్ళి జరిగిందే తప్ప మీ అమ్మానాన్నల తొందరపాటువల్ల కాదు. నీ గురించి తెలుసుకోకుండా, నీ ఆశలు, ఆశయాల గురించి తెలుసుకోకుండా నిన్ను పెళ్ళాడాను అయినా ఇప్పుడు మించిపోయిందేమీ లేదు. నువ్వు నిరభ్యంతరంగా చదువుకోవచ్చు. నాకు డాక్టర్ ను కావాలని ఉండేది.

కాని ఆ అవకాశం నాకు లేకుండా పోయింది. ఏజ్ బార్ వల్ల. నువ్వు డాక్టర్ చదువు చదువుతానంటే నేను నిన్ను తప్పకుండ చదివిస్తాను. మన రాష్ట్రంలో సీటు దొరకకపోయినా ఫరవాలేదు. డొనేషన్ కట్టి ప్రక్క రాష్ట్రంలోనైనా సరే నిన్ను డాక్టర్ చదువు చదివిస్తా! సరేనా?!'' అంటూ భార్య తలమీద చేతులు వేసి దగ్గరికి తీసుకున్నాడు.

“థాంక్యూ బావగారూ ... థాంక్యూ!'' ఆనందంతో భర్తను గట్టిగా కౌగిలించుకుంది రవళి.

భార్య ముఖంలో ఆనందపు వెలుగులను చూసి "ఇప్పుడు నీకు ఆనందంగా ఉందా?'' రవళి ముఖాన్ని చేతుల్లోకి తీసుకుంటూ అన్నాడు.

“ఊ!''అంటూ తల ఊపింది రవళి.

రవళికి సంతోషంతో నోటమాట రానంది. కలగానే మిగిలిపోతుందనుకున్న డాక్టర్ చదువు త్వరలోనే నేరవేరబోతున్నందుకు ఉబ్బితబ్బిబై పోయింది ఆమె మనసు. పెళ్ళయ్యాక పల్లెటూరిలో ఎక్కడ మట్టి పిసుక్కోవలసి వస్తుందని భయపడింది. కాని తన మనసులోని కోరికను తెలుసుకొని అది నెరవేరుస్తానని మాట ఇచ్చిన భర్తంటే ఎక్కడలేని ప్రేమ పుట్టుకోచింది. అమ్మానాన్నల కోరిక మేరకు తాళి కట్టించుకుంది.

మనసు చంపుకొని బ్రతకాలని నిశ్చయించుకుంది పెళ్ళికి ముందు. కాని ఇప్పుడు ... తను డాక్టర్ అవుతుంది. ఆ ఆనందమే ఆమె మనసును ఆనంద డోలికల్లో తేలియాడిస్తోంది. ఆమె ముఖంలో తాండవిస్తున్న ఆనందపు వెలుగులను గమనించిన మోహన్ అసలు కార్యక్రమంలోకి దిగాడు. ముందుగా ... ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాడు. అది ఆమెకు తొలిముద్దు.

ఆ చిరుముద్దుకే ఆమె లేత శరీరం చిగురుటాకులా కంపించిపోసాగింది. అతను ఆమె సోగకళ్ళకు, నాజూకైన బుగ్గలను ఒక్కోకటిగా ముద్దాడుతూ ఉంటే ఆమె పులకరింతలతో తన్మయత్వానికి లోనవుతూ ఉంది. ఆటోమేటిక్ గా ఆమె కళ్ళు మూతలు పడ్డాయి. పెదవులు చిన్నగా అదురసాగాయి. మెల్లగా ఆమె పైటను లాగేశాడు. సిగ్గుతో తన గుండెలకు రెండు చేతులను 'ఎక్స్' ఆకారంలో అడ్డుగా పెట్టింది. ఆమె రెండు చేతులను అడ్డుగా ఉంచినా ఆమె జాకెట్ అంచుల్లో నుండి తొంగి తొంగి చూస్తున్నాయి ఆమె యవ్వన శిఖరాలు.

అప్పటికే ఊపిరి పెరిగి పోయిందేమో! ఉచ్చ్వాస, నిశ్వాసలకు ఆమె జాకెట్ సైజు పెరిగిపోయింది. మెల్లమెల్లగా ఆమె చేతులను అడ్డు తొలగించి అక్కడ పెదవులు ఆనించాడు మోహన్. ఆ పెదవుల స్పర్శతో ఆమె నరాలు జివ్వుమన్నాయి. ఎప్పుడు ఎరగని వింత అది. అతని పెదవులు ముద్దుల వర్షాన్ని గుప్పిస్తుంటే తన్మయత్వంతో పులకింతలు, గిలిగింతలు అయి మంచం మీద పడిపోయింది రవళి. రెండు చేతులతో కళ్ళు మూసుకుంది.

సిగ్గుల మొగ్గవుతూ మంచం మీద అత్తిపత్తిపువ్వులా ముడుచుకుపో సాగింది. “ఏయ్ రవళీ! పాలివ్వవా?'' నవ్వుతూ అడిగాడు మోహన్. ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూసింది రవళి. :ఏమన్నారూ?'' చిరుకోపంతో అన్నది. “ఇందాక పాలు తాగామన్నావు కదా! అదే అడుగుతున్నాను'' అన్నాడు ఆమె జాకెట్ వైపు చిలిపిగా చూస్తూ.

భర్త చూపులు ఎక్కడ ఉన్నాయో గమనించి "నేనన్నది ఆ పాల గురించి'' అంటూ లేచి పాల గ్లాస్ ను భర్త పెదవులకు అందించింది. “ముందు నిన్ను తాగమన్నానుగా'' అని అంటూనే భార్య పెదవుల దగ్గర పాలగ్లాస్ ను ఉంచాడు. ఇక తప్పదన్నట్టు కొద్దిగా పాలను తాగి మిగతావి భర్తకు తాగించింది రవళి. కొద్దిసేపటికి మోహన్, రవళి శృంగార క్రీడ ప్రారంభం అయ్యింది. రవళి సిగ్గుల మొగ్గవుతూ ఒక్కొక్క అందాన్ని భర్తకు అపురూపంగా అందిస్తూ ఉంటే ఆనందంతో ఆమె అందాలను ఆస్వాదిస్తూ ఆమెను నిలువెల్లా ఆక్రమించుకున్నాడు.

మూడు నిద్రలు అయిన తర్వాత ఆ ఇంట్లో రవళి చదువు గురించి చర్చ జరిగింది. మోహన్ తల్లిదండ్రులు రవళి చదువుకు పచ్చజెండా ఊపారు. కోడలు డాక్టర్ అయితే తమకూ సంతోషమేనన్నారు. ఆ సంవత్సరమే రవళి ఎంసెట్ రాయడం, ఎక్కువ ర్యాంక్ రావడంతో రాష్ట్రంలోని మెడికల్ కాలేజీలపై ఆశలు వదులు కొన్నారు. తమిళనాడులొ మెడిసిన్ సీటు దొరికితే అక్కడ ఎం.బి.బి.ఎస్. లొ జాయిన్ అయింది రవళి.

రవళి డాక్టర్ పట్టా పుచ్చుకొని వచ్చేసరికి ఆ ఊరిలోనే ఒక పెద్ద హాస్పిటల్ కట్టించాడు మోహన్. “రవళీ! ఈ ఊరి ప్రజలకు ఉచితవైద్యం అందించాలనే నా చిరకాల వాంఛను నువ్వు నిజం చేయాలి. అందుకనే ఈ హాస్పిటల్ కట్టించాను. ఈ హాస్పిటల్ లొ ప్రజాసేవ చేయాలనుకునే నిస్వార్థపు డాక్టర్లనె మనం చేర్చుకుందాం ఏమంటావ్? నీ కోరిక, నా ఆశయం రెండు నేరవేరుతున్నాయి కదూ?'' అన్నాడు మోహన్ ఆనందంగా.

“బావా! నువ్వు నిజంగా గ్రేట్ పెళ్ళికి ముందు నిన్ను చాలా తక్కువగా అంచనా వేశాను. మొదటి సంభోగంలో రక్తం కారకపోతే చెడిపోయిన దానివని నన్ను చిత్రహింసలు పెడతావనీ ఇంకా ఏమేమో ఊహించుకున్నాను. కాని నా మనసులోని కోరికను తెలుసుకొని నన్ను డాక్టర్ ను చేసినందుకు నేనెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు'' అని ఇంకేదో అనబోతుండగా ఆమె పెదవులను తన పెదవులతో మూసేసాడు.

భర్త సుదీర్ఘచుంబనానికి ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అయింది రవళి. భార్య అవస్థను చూడలేక జాలిపడి ఆమె పెదవులను వదిలేసాడు. ఒక వారంకాదు, నెలకాడు, సంవత్సరం కూడా కాదు ఐదు సంవత్సరాల సుదీర్ఘ విరహం మరి. ఆ మాత్రం స్పీడ్ ఉండకుండా ఎలా ఉంటుంది? వెంటనే తన కౌగిట్లో బంధించాడు భార్యను. గువ్వలా ఒదిగి పోయింది రవళి. ఆ రాత్రి అయిదేళ్ళకు మళ్ళీ ఆ పడక గదిలో మోహన్ రవళుల నిట్టూర్పులు వినిపించసాగాయి.

ఒకరి ఆశ, మరొకరి ఆశయం రెండు నెరవేరి నందుకు ఇద్దరూ ఆనందంతో చెలరేగిపోతున్నారు. వారిద్దరి బరువులు మోయలేక మంచం 'కుయ్యో మొఱ్ఱో' అని కేకలు పెడుతుంటే కిటికీలో నుండి చూస్తున్న చందమామ నవ్వుకుంటూ మబ్బుల చాటున దాక్కున్నాడు.