The content in this feature is rated as "A++". You must be at least 18 years old to view this feature.
Home>>Romantic Stories>>Nuvvante Naku Ishtame
నువ్వంటే నాకు ఇష్టమే

సూరేపల్లి విజయ

షవర్ నుంచి నీటిధార ఆమె తలమీదుగా పడుతూ కిందికి వెళ్తోంది. నీటిధార ఆమె శరీరాన్ని తడిపేస్తోంది. అనాచ్చాదిత మైన తన దేహాన్ని మరోసారి ఎదురుగా వున్న అద్దంలో చూసుకుంది. నీటిధార ఆమె నుదురుమీది నుంచి జారుతూ పెదవుల పైకి వచ్చి, అక్కడ్నించి కంఠం మీదికి జారి, ఆమె ఎత్తయిన వక్షభాగాన్ని అతి ప్రయాసమీద జారి నాభి లోయలోకి వెళ్తూ అలా ... అలా ... నీటిధార జలపాతంగా మార్చేసింది.

ఒక్క క్షణం సిగ్గుతో కళ్ళు మూసుకుంది. తననిలా ప్రహ్లాద్ చూస్తే ఇంకేమైనా వుందా? ఆ ఆలోచన రాగానే ఆమె శరీరంలో చిన్న ప్రకంపన. ఒంట్లో వెచ్చటి ఆవిరి, శరీరం క్రమ క్రమంగా వేడెక్కుతున్న ఫీలింగ్. అంతలోనే సిగ్గు, అంతలో బిడియం ముప్పిరిగొన్న భావాల సమ్మిళితమే అయింది. ఈ విషయంలోనే కదా తనకూ ప్రహ్లాద్ కూ పేచీ.

ప్రహ్లాద్ అంటే తనకెంతో ఇష్టం. అతన్ని తానెప్పుడైనా బెడ్ మీద బెట్టు చేసి బాధపెట్టిందా? లేదే ... అతనెప్పుడూ తనని కావాలని అనుకున్నా తన మనసు తలుపులు తెరిచి, పడగ్గది తలుపులు మూసి, మూసినా తన కనుకొలకుల నుంచి, అతని స్పర్శానుభూతి అనుభవిస్తూ అతని కోర్కె తీచలేదు. అయినా ప్రహ్లాద్ తనని కాదని, ఆ వూహే భరించలేకపోతోంది. నిన్నటికి నిన్న ... అర్థరాత్రి మాంచి నిద్రలోవున్న తను ప్రహ్లాద్ తనను నిద్రలేపి దగ్గరకు తీసుకోగానే ఏం చేసింది? తనకింకా బాగా గుర్తు.

"నిహీ ... ఏమే నిహీ ... నీహారికా డాళింగ్'' భార్య చెవి దగ్గర పెదవులు ఆన్చి పిలిచాడు ప్రహ్లాద్.

మంచి నిద్రమత్తులో వుంది. అర్థరాత్రి పన్నెండున్నర రెండు గంటల క్రితమే ... ఆమెని ఊపిరి పీల్చుకోకుండా చుట్టేసి, ఆమె అణువణువునూ శోదిన్చేసి ఆపాదమస్తకం ఆమె శరీరాన్ని అనుభూతిమయం చేశాడు. మళ్ళీ అంతలోనే ... బద్ధకంగా కళ్ళు తెరిచి భర్తవేపు చూసింది.

నిద్రకళ్ళతో వున్న భార్యను చూస్తోంటే ముచ్చటేసింది. వెంటనే బుగ్గలమీద ముద్దు పెట్టుకున్నాడు.

"ఏమి ... టం ... డీ'' హస్కీగా అంటూ అతన్ని మీదికి లాక్కుంది నిహారిక. ఆమె శరీరపు మెత్తదనాన్ని మొత్తంగా అనుభవిస్తూ 'వన్స్ మోర్ ప్లీజ్' అన్నాడు, ఆమె కళ్ళు మూసుకుంది అతనికదే ఆహ్వానం అన్నట్టు.

నైటీ మీదనుంచే ఆమె గుండెలమీద ముద్దు పెట్టుకున్నాడు. నరాలు జివ్వుమన్న సెన్సేషన్. "నిషీ ... నైటీ తీసేయనా'' మెల్లగా అడిగాడు ఆమెనుంచి నెగటివ్ రెస్పాన్స్ ఆశిస్తూనే.

"ప్లీజ్ .... ఆ ఒక్కటీ అడగొద్దు ... ముందా బెడ్ లైట్ స్విచాఫ్ చేయండి'' ఒక్క క్షణం అతనిలో ఉత్సాహం చల్లారిపోయింది. ఉద్వేగం నీరసించింది. ఉద్విగ్నం నిర్లిప్తమైంది. భర్తలో వస్తున్న మార్పును కంటిచివర్ల నుంచి గమనిస్తూనే వుంది.

"ప్లీజ్ నేను కళ్ళు మూసుకుంటాను. మీరేమైనా చేసుకోండి. ఆ ఒక్కటీ తప్ప. అయినా నైటీ తీస్తేనేం తీయకపోతే ఏం మన కోర్కె ఎంత మధురంగా, అనుభవంగా మారి అనుభూతి అవుతుంది. అది చాలు''

ప్రహ్లాద్ మంచం చివర కూర్చున్నాడు. "చాలదు ... చాలదు నీహారికా ... నాకు మొత్తంగా, ఇష్టంగా నిన్ను దగ్గరికి తీసుకోవాలన్న కోరిక నీ మనసులోనే కాదు, నీ శరీరంలోని ఏ భాగమూ నాకు అపరిచితంగా వుండకూడదు. మన మధ్య బిడియం ... సంకోచాలే కాదు ఏ అచ్చాదనా అడ్డుగా వుండకూడదు'' తన ఫీలింగ్స్ చెప్పాడు ప్రహ్లాద్.

నిహారిక అతడ్ని వెనగా వెళ్ళి గట్టిగా హత్తుకుంటూ "చిన్నపిల్లాడిలా మారాం చేస్తారెందుకు? మీరు తల్చుకుంటే సంవత్సరలో ఓ చిన్నపిల్లాడికి తల్లిని చేస్తారు'' అంది అతడ్ని తనవేపు లాక్కునే ప్రయత్నం చేస్తూ.

కొంత ఇష్టంగా ... మరికొంత అయిష్టంగా అతను ఆమెను దగ్గరకు లాక్కున్నాడు. ముద్దుగా, బొద్దుగా వుండే నిహారిక అంటే అతనికి బోల్డు ఇష్టం ... ఈ ఒక్క విషయంలోనే .... ఒక్క క్షణం రెండు పెదిమలు గట్టిగా బిగించిపట్టి ఊపిరిని రిలీఫ్ గా వదిలేసింది. ఆమె చేతులు బిగుసుకున్నాయి. నుదురంతా స్వేదం అలుముకుంది. అలాగే ఆ చేతుల్ని తీసుకెళ్ళి భర్త నడుం చుట్టేసి తనవేపు భర్తని లాక్కుంది.

ఎంత గొప్ప అనుభవం ... ఎంత గొప్ప అనుభూతి ... రెండు శరీరాల మధ్య రాపిడి, రెండు మనసులతో ముడివేసుకుంటే ఇంత బావుంటుందా? అనుకుందామె.

*****

ఆ అనుభూతి ఆమెను వెన్నాడుతూ, ఆపాదమస్తకం ఆక్రమించుకుంటున్న సమయంలోనే పొద్దున్నే నిహారిక అన్నయ్య ఫోన్ చేశాడు. "బావగారున్నారా?'' అటువేపు నుంచి కిరీటి అడిగాడు. "లేదు, ఉదయమే వెళ్ళారు. ఏదో అర్జంట్ పని వుందని ... ఎందుకురా?'' అడిగింది నిహారిక. "ఏం లేదు ... ఏం లేదు ... అయితే అక్కడికే వెళ్ళాడన్న మాట'' స్వగతంగా గొణుక్కున్నట్టు అన్నాడు ఫోన్ లోని అతను.

"ఎక్కడికి ... అసలు విషయమేంట్రా" అడిగింది. "ఏం లేదు ... ఏం లేదు ... ఏం లేదులే వుంటా'' "ఒరే, ఆగరా ... నాకు అసలు విషయం చెప్పు ఏంటీ?'' "ఏం లేదు ... అనవసరంగా ఆరా తీయకు ... లేనిపోని బాధలు'' "ఒరే అన్నయ్యా ... చెప్పకపోతే నామీద ఒట్టే'' అంది చివరిగా బెదిరింపు అస్త్రాన్ని సంధిస్తూ. "గత కొద్ది రోజులుగా బావగారు ఓ అమ్మాయితో ...'' ఒక్క క్షణం నిశ్శబ్దం ... మెల్లగా గొంతు పెగాల్చుకుని అడిగింది "ఎ ... వ ... రా ... అమ్మాయి?''

"ఎవరో మంజరిట''

"ఎ ... ఎ ... ఎప్పట్నుంచీ?''

"ఈ మధ్యే ... అవునూ ... నీకూ బావగారికి ఏమైనా గొడవలోచ్చాయా? ఐ మీన్ అతన్ని ఏ విషయంలోనయినా హార్ట్ చేశావా?'' ఒక్క క్షణం నిశ్శబ్దంగా వుండిపోయింది. భర్తని తాను ఏ విషయంలోనూ హార్ట్ చేయలేదు. ఒక్క ఆ విషయంలో తప్ప ... కానీ ఆ విషయం ఎట్లా చెప్పేది? "చూడు నిహా ... నేన్నీకు అన్నయ్యనే కాదు, నాన్నన్ని, అమ్మని కూడా ... జాగ్రత్త ... భర్త మనసు నొప్పించకూడదు. అతని ఇష్టాలు మనవే అనుకోవాలి. అతని కష్టాలూ మనకూ కష్టాలే అనుకోవాలి. మనసెరిగి నడుచుకోవాలి. ఇంతకన్నా స్పష్టంగా చెప్పలేను'' అటువేపు నుంచి ఫోన్ పెట్టేశాడు.

*****

అదీ ఉదయం జరిగిన సంఘటన .... ప్రహ్లాద్ మరో అమ్మాయితో తిరుగుతున్నాడా? అన్నయ్య తొందరపడి ఏ విషయమూ నమ్మడు. ఎందుకు ప్రహ్లాద్ ఇలా చేస్తున్నాడు? ఆ విషయంలో అతను అసంతృప్తిగా వున్నాడా? అయినా ... తను అతనికి ఏం లోటు చేసింది? అతనికిప్పుడు ఏం కావాలన్నా అన్నీ అమర్చిపెట్టింది. నిజంగా ఆ విషయంలో ఫీలై ....

*****

ప్రహ్లాద్ కు తనని అలా చూడాలని కోరిక. తనని అలా చుట్టేయ్యాలని కోరిక. తననిలాగే తెల్లవార్లూ కరుచుకోవాలని కోరిక. ఆ విషయంలోనే తను అభ్యంతర పెడుతుంది. పెట్టదా మరి ... అలా చూస్తే ... తనని మొత్తంగా చూస్తేనే ... అతనికి తన మీద ఆకర్షణ ఎందుకు వుంటుంది? గుప్పిట విప్పేక ఆసక్తి, గుట్టూ ఏముంటాయి. గుప్పెట విప్పేక ఏముందిలే అన్న పెదవి విరుపు ధోరణి. తన సమస్యకు పరిష్కారం చెప్పేవారెవరు? అసలు తనలో కానీ, తన ఆలోచనలో కానీ ఏమైనా లోపముందా?

ఆ క్షణమే ఆమెకు గుర్తొచ్చింది గాయత్రీరావు .... తన ఫ్రెండ్, సైకాలజిస్ట్. తానైతే చక్కని పరిష్కారం చెప్పగలదు ... అంతకన్నా తన సమస్యను మనసు విప్పి చెప్పుకోగలదు. ఆ ఆలోచన ఆమెకు కొట్ట ఉల్లాసాన్ని ఇచ్చింది. ఇలాంటి విషయాల్లో ఆలస్యం చేయకూడదన్నదే ఆమె థియరీ.

*****

నిహారిక, గాయత్రీ రాయ్ ఇంటికి వెళ్ళింది. అప్పుడే క్లినిక్ కు వెళ్ళటానికి బయల్దేరుతోంది. ఫ్రెండ్ ని చూసి సంతోషంతో ఎదురెళ్ళింది. "హాయ్ నిహా ... వాటే సర్ ప్రైజ్ ... రా రా'' అంటూ లోపలికి ఆహ్వానించింది. నాయర్ వేడి వేడి ఇడ్లీలు తీసుకువచ్చి టేబుల్ మీద పెట్టాడు. పదినిముషాల్లో టిఫిన్ ముగించి గాయత్రీ రాయ్ ని ఆమె గదిలోకి లాక్కెళ్ళింది. "ఏమిటి నిహా ... ఎనీ ప్రాబ్లమ్?'' అని అడిగింది తన స్నేహితురాలివంక చూస్తూ.

"ఎస్ పర్సనల్ ప్రాబ్లమ్'' అంటూ ఉదయమే కిరీటి ఫోన్ చేసిన విషయం చెప్పింది. "అంటే ప్రహ్లాద్ కు మరో అమ్మాయితో సంబంధం వుండి వుంటుందంటావా?'' "నాకు తెలిసి అతని కేరెక్టర్ అదికాదు. కానీ అన్నయ్య మాటలను బట్టి ...''

"నిహా ... ఓ ఫ్రెండ్ గా కాక ఓ పెళ్ళయిన అమ్మాయిగా, సైకాలజిస్ట్ గా చెబుతున్నాను. నాకు తెలిసి ఏ భర్త అయినా మరో స్త్రీతో సంబంధం పెట్టుకున్నాడంటే ... ఒకటి అతను స్త్రీ లోలుడు అయి వుండాలి. లేదా డబ్బుకోసం (డబ్బున్న అమ్మాయి కోసం) అలాంటి తిరుగుళ్ళు తిరుగుతూ వుండాలి. అదీ కాదంటే భార్య వల్ల సంపూర్ణ సుఖం లభించకపోవటం కారణం అయివుండాలి''

నిహీరిక వెంటనే అంది "ప్రహ్లాద్ కు అమ్మాయిల వీక్నెస్ లేదు, డబ్బుమీద వ్యామోహం లేదు. అదే వుంటే కిరీటి నా పేరు మీద పదిహేను లక్షలు బ్యాంక్ లో వేస్తానంటే వద్దని వారించేవాడు కాదు''

"సో ... థర్డ్ రీఎజన్ ... నీనుంచి సంపూర్ణ సుఖం''

ఒక్క క్షణం నిహీరిక ముఖం సిగ్గుతో ఎర్రబడింది "అదేం లేదు ... గాయత్రీ ... అతన్నెప్పుడూ డిసప్పాయింట్ చేయలేదు. చివరికి ఆ మూడ్రోజుల్లో కూడా ... కానీ''

"కానీ, ఫర్లేదు చెప్పు. నీ చిన్నప్పటి నేస్తాన్ని ఓ సైకాలజిస్ట్ ని ... నీ ప్రాబ్లెం సాల్వ్ కావాలంటే డాక్టర్ల దగ్గర లాయర్ల దగ్గర దాచకూడదు.

"ప్రహ్లాద్ కు బెడ్ రూమ్ లో నేను నేకెడ్ గా వుండాలి''

"అంతేనా ... చిన్న సమస్యే ... అలానే వుండు. నీకో విషయం తెలుసా?'' అని అటూ ఇటూ చూసి "నేనూ .... మా ఆయనా రాత్రిళ్ళు అభ్యంగన వ్రతమాచరిస్తాం తెలుసా?

"అంటే?''

"మా ఒంటిమీద బట్టలుండవు. కాంక్షలు తప్ప, మా మనసులే కాదు ... శరీరాలు ట్రాన్స్ పరెంట్ గానే వుంటాయి.

ఆశ్చర్యంగా స్నేహితురాలివేపు చూసి "అలా చేస్తే ... ఆయనకు నీమీద ఆసక్తి ఏముంటుంది. చూసీ చూసీ మొహం మొత్తదా?''

"మనసులో ప్రేముండాలి కానీ, మనిషికి బోర్ వుండదు. మన శరీరాన్ని మనం అసహించుకుంటే ఎదుటి మనిషి మానని కూడా తనే అనుకుంటే అదే బోర్. అయిష్టం వుండదు. పైగా మరింత యిష్టం పెరుగుతుంది. నాకు తెలిసి చాలా కాపురాల్లో ఇలాంటి పడగ్గది విషయాల్లో అసంతృప్తి రాజుకుంటూ వుంటుంది. చాపకింద నీరులా వుంటుంది. సెక్స్ అంటే కళ్ళు మూసుకుని అనుభవించే ఎంజాయ్ కాదు. కంటిగింపుగా, మనసుకు ఇష్టంగా, శరీరానికి స్పర్శగా అనుభవించి అనుబూతించేది మొగ్గలోనే తుంచే నీ చాదస్తంతో నీ అనవసర భయంతో ప్రహ్లాద్ ని దూరం చేసుకోకు''

నిహారిక లేచింది ... "వస్తాను గాయత్రీ ... నా మనసు ఇప్పుడు తేలిగ్గా వుండి. వన్ సెకన్ ఓ ఫోన్ కాల్ చేసుకోవచ్చా?''

"ఎవరికీ?''

"మా ఆయనకీ అర్జంట్ గా యింటికి రమ్మని'' అంటూ భర్తకు ఫోన్ చేసింది. తర్వాత గాయత్రి రాయ్ దగ్గర సెలవు తీసుకుని యింటికి వెళ్ళింది.

******

ఉదయం 11.30 ... ప్రహ్లాద్ భార్య పోన్ చేయటంతో హడావుడిగా వచ్చాడు. బెడ్రూంలో పడుకుని వుంది నిహారిక. "ఏమిటి నిహా ... అర్జంట్ గా రమ్మని ఫోన్ చేశావ్'' అంటూనే బెడ్ పక్కనే కుప్పలా వున్న ఆమె దుస్తులు చూశాడు. ఆమె కప్పుకున్న బ్లాంకెట్ ని చివరకు లాగాడు. వేనవేల విద్యుల్లతలు తటాలున మెరిసిన ఫీలింగ్ ... బంగారు వర్ణంతో పోటీ పడే ఆమె శరీరం అతడ్ని ఆహ్వానిస్తోంది అనాచ్చాదితమై .... రెండు చేతులూ చాచింది.

అయిదే అయిదు క్షణాలు చాలు తన దుస్తులను బహిష్కరించటానికి. అతనామే శరీరాన్ని శృతి చేస్తున్నాడు. లయబద్ధంగా ... చుంబన బద్ధంగా ... ఆమె నడుం వంపు ... ఎత్తయిన ఎద అందాలు .... ముద్దొచ్చే నాభి ... మొత్తంగా మత్తెక్కించే ఆమె శరీరం ... అతడి ఆహ్వానిస్తోంది. ఆమె అణువణువునూ స్పృశిస్తున్నాడు ... శోదిస్తున్నాడు. అనుభవాల ఆల్చిప్పలు ... అనుభూతుల ముత్యాలు ఏరుకుంటూ మనసు పొరల్లో భద్రపరచుకుంటున్నాడు. ఏ సాయంత్రమో ... అతను హ్యాట్రిక్ సాధించి సేదతీరుతుంటే అడిగింది

"నన్నిలా ఉదయం నుంచి చూస్తుంటే బోర్ కొట్టడం లేదా? మోజు తగ్గినట్టు అనిపించటం లేదా?'' "ఇష్టమైనదెప్పుడూ బోర్ కొట్టదు. నా ఊపిరి నాకు ఎప్పుడయినా బోర్ కొడుతుందా? అలా బోర్ కొట్టి ఊపిరి పీల్చుకోకపోతే చస్తాం. అంటే నువ్వు మనసులో ఇష్టమైనప్పుడు శారీరకంగా ఇష్టమే. ఇంకా ఇంకా ఇష్టమే'' మరో హ్యాట్రిక్ కు శ్రీకారం చుడుతూ.

******

రాత్రి తొమ్మిది గంటలకు బెడ్ రూమ్ లోనుంచి బయటకు వచ్చారు. బాల్కనీలో నిలబడి సెల్ ఫోన్ తీసి కిరీటికి ఫోన్ చేశాడు. "థాంక్స్ రా బావా ... మన డ్రామా మంచి రక్తి కట్టింది. గాయత్రీ రాయ్ గారికి కూడా థాంక్స్ చెప్పు రేపు కలుద్దాం ... గుడ్ నైట్''

*****

నిహారిక అనాచ్చాదిత దేహాన్ని తన గుండెలకేసి హత్తుకుంటూ అన్నాడు "నిహీ నువ్వంటే నా కిష్టమే ... ప్రామిస్'' "ఐ టూ'' అంటూ అతన్ని మొత్తంగా చుట్టేసింది.