The content in this feature is rated as "A++". You must be at least 18 years old to view this feature.
Home>>Romantic Stories>>Nannu Kshaminchavoo ...
నన్ను క్షమించవూ ...!

- విజయార్కె

శృంగార సమరానికి యుద్ధక్షేత్రమయిన ఆ గది తుది మెరుగులు దిద్దుకుంటోంది. అశ్వరథం పట్టెమంచంగా మారింది. కరవాలాలు మల్లెలమాలలై ఆ పట్టేమంచానికి అలంకారంగా మారాయి. ఆ యుద్ధంలో పరిమళాలు వెదజల్లే జాజులే సైనికులు. అగరొత్తుల సువాసన యుద్ధోన్మత్తులుగా చేయడానికి సన్నద్ధమవుతోంది. సూర్యోదయంతో మొదలై. సూర్యాస్తమయంతో ముగిసేది క్షత్రియ యుద్ధమైతే, సూర్యాస్తమయంతో మొదలై సూర్యోదయంతో ముగిసేది

శృంగార యుద్ధం. ఆమె-అతడు ఈ ఇద్దరి మధ్యా శృంగార యుద్ధం ప్రారంభం కావడానికి క్షణాల వ్యవధే వుంది. అంత చలిలోనూ మొహానికి పట్టిన చిరుచెమటని తుడుచుకున్నాడు గోపాలం. క్షణాల్లో జరగబోయే శృంగార యుద్ధం తలచుకుంటేనే 'యాంగ్జయిటీ' ఫీలవుతున్నాడు. మరో కొద్దిక్షణాల్లో .... ప్రమద్వర ... తన భార్య ... తన అందాల సుందరి గదిలోకి అడుగుపెడుతుంది. ఆ ఊహే ఒంట్లో సన్నటి ప్రకంపనలను సృష్టిస్తోంది. పడగ్గదిలో చిన్న శబ్దం. తలుపులు తెరుచుకున్న శబ్దం.

తలుపుదగ్గర ప్రమద్వర నిలబడివుంది. తెల్లచీరలో పాలగ్లాసుతో నిలబడ్డ ఆ గ్రీకుసున్దరిని చూస్తోంటే గోపాలానికి మతిపోతోంది. ప్రమద్వర శబ్దం కాకుండా తలుపులు వేసింది. గోపాలం వైపు అడుగులు వేయసాగింది. వాళ్ళిద్దరి సమరం చూసేందుకు చందమామ ఉత్సాహపడుతూ కిటికీలోంచి తొంగి చూస్తున్నాడు. గోపాలం దగ్గరికి వచ్చి నిలబడి పాలగ్లాసు అందించింది. ఒకే ఒక్క గుక్కలో పాలను తాగేశాడు. క్షణకాలం కూడా ఆలస్యాన్ని భరించలేకపోతున్నాడు. గ్లాసు పక్కనపెట్టి ప్రమద్వరను మీదకు లాక్క్కున్నాడు.

ఆమె మెత్తటి శరీఎరం మీద, ఆమె ఎత్తయిన గుండెలు అతనికి తగిలి, శరీరాన్ని వేడెక్కించాయి. ప్రమద్వర అతడ్ని విడిపించుకుని లేచి ట్యూబ్ లైట్ స్విచ్చాఫ్ చేసింది. నీలిరంగు బల్బు పల్చగా వెలుతురును అందిస్తోంది.

"రా ... ప్రమద్వారా ... ఈ మొదటిరాత్రి మనిద్దరం ఒకరినొకరం హత్తుకుని ... అతని మాటలింకా పూర్తికాకుండానే అతని నోటిని తన ఎర్రని పెదాలతో మూసేసింది. ఊహించని ఈ పరిణామానికి క్షణకాలం విస్తుపోయి ఆ వెంటనే ఉత్సాహంగా తన చేతులతో ప్రమద్వర నడుము చుట్టేశాడు. సన్నటి నడుము ... ముడతలు పడి ఒంపు తిరిగిన నడుము ... అతనిలో గిలిగింతలు పెడుతుంటే అలానే వుండిపోయాడు. ఆ గాఢ చుంబనం ముప్పయి క్షణాల్లో మధురంగా కరిగి పెదవుల్లో ఇమిడిపోయింది. ప్రమద్వర అతన్నుంచి విడిపోయి లేచి లైటు వేసింది.

గోపాలం ఇంకా ఆ మత్తులోనే ఉన్నాడు. "ఏమిటిది ప్రమద్వారా ... రా స్వర్గసుఖాలూ మనకోసం ఎదురుచూస్తున్నాయి. జీరపోయిన గొంతుతో తమకంగా అంటున్నాడు గోపాలం. ఒక్కసారి ఒళ్ళు విరుచుకుంది ప్రమద్వర. ఆ ఒళ్ళు విరుపుకు కలవరపడిన పైట తప్పుకుంది. ఆమె ఎత్తయిన గుండెలు చూసి గుటకలు మింగాడు గోపాలం.

మత్తుగా అతనివైపు చూసి ... "అబ్బా ... నిద్రొస్తుంది ... గుడ్ నైట్'' అంది మంచానికి ఓ వైపు అటుతిరిగి పడుకుని. ఆమె కళ్ళలో కన్నీటి మెరుపు! ఒక్కసారిగా గాలితీసిన బెలూన్ లా అయి

"అదేమిటీ ఇవ్వాళ మన ఫస్ట్ నైట్ ...'' కంగారుగా ప్రమద్వర భుజాలు పట్టి కుదుపుతూ అన్నాడు.

"అవునండీ ... మిగతా కార్యక్రమం రేపు. ఎంతయినా మీరు వాయిదాల మొగుడు కదా ...'' అంది ఆవలింపులు నటిస్తూ ప్రమద్వర. గోపాలం గుండెలో రాయిపడింది. అస్పష్టంగా ఏదో గొణుక్కున్నాడు. అతని మనస్సు ఆరునెలలు వెనక్కి వెళ్ళింది.

*****

గోపాలం స్వతహాగా మంచివాడే కానీ ఆ మంచితనాన్ని పిసినారితనం, 'డబ్బు యావ' డామినేట్ చేస్తోంది. ఎప్పుడూ అతని ఆలోచనలు డబ్బుమీదే. పెళ్ళయితే సంసారం ... పిల్లలూ ... జంజాటం ... ఖర్చులూ ... ఎట్సెట్రా ... ఎట్సెట్రా ... వుంటాయని కొన్నాళ్ళు పెళ్ళి వాయిదా వేసుకున్నాడు. కానీ ఆఫీసులో అందరూ అదోలా చూద్దాం పాయింట్ ఫైవ్ ఏమో ... అని గోనుక్కోవడంతో వెంటనే తను సంపూర్ణ పురుషుడినని నిరూపించుకోవాలని ఆఫీసులో తన కొలీగ్ పూర్ణానందాన్ని తీసుకుని 'ఆ'టైపు ఏరియాకు వెళ్ళాడు.

రాత్రికి అయిదువందలు, గంటకు వంద, అయిదు నిమిషాలకు యాభై అంటూ 'టారిఫ్' కార్డు చూపించేసరికి అమ్మో అనుకున్నాడు. ఓవైపు వయసు కోరికలు, మరోవైపు ఆఫీసులో అందరూ తనవైపు అదోలా చూద్దాం ... ఇంకోవైపు అంత వండుకోవడం ఇబ్బందిగా మారడంతో ఎలాగైనా పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అదీ కట్నం పెద్దమోత్తంగా తీసుకుని!

ఆ డబ్బును వద్దీలకి తిప్పి, ఆ డబ్బుతో తన కుటుంబం మెయిన్ టైన్ చేసుకోవచ్చన్న ఉద్దేశ్యంతో .... మంచి ఉద్యోగం, పైగా అందగాడు, ఏ బాదరబందీ లేదు. చాలామంది పిల్లనిస్తామని వచ్చారు కానీ గోపాలానికి వాళ్ళిచ్చే కట్నం నచ్చలేదు. కొండొకచో అమ్మాయిలూ ... కానీ ప్రమద్వర మాత్రం బాగా నచ్చింది.మంచి ఎత్తు, ఎత్తుకు తగ్గలావు, మెరుపుతీగలా వుంటుంది. నవ్వితే బుగ్గలు సొట్టలుపడి అందంగా మెరుస్తాయి. కావ్యకన్యలా, ప్రబంధాల్లోని శృంగార నాయికలా వుంటుంది. వెంటనే తలూపాడు. అయితే కట్నం రెండు లక్షలు అడిగాడు.

అంత ఇచ్చుకోలేమని చేతులెత్తేశారు పిల్ల తల్లిదండ్రులు. ఓవైపు ప్రమద్వర అందం మరోవైపు కట్నం వెంటనే మరో ప్రపోజల్ పెట్టాడు. ఒకేసారి కాకుండా ఆరు వాయిదాల్లో ఇమ్మన్నాడు. కట్నం ఎక్కువయినా అబ్బాయి స్థితిమంతుడు అన్ని విధాలా తగినవాడూ కావటంతో, అదీగాక వాయిదాల మీద చెల్లించే సౌలభ్యం వుండడంతో సరేనన్నాడు, ముహూర్తాలు పెట్టించాలనుకున్నారు. అయితే గోపాలం వెంటనే ముహూర్తాలు వద్దన్నాడు.

పెళ్ళయ్యాక సరిగ్గా వాయిదాలు చెల్లించకపోతే, తను తన భార్యను పుట్టింటికి పంపటం, మళ్ళీ బ్రహ్మచారి జీవితం గడపడం, పెళ్ళయిందికదా అని తన మామగారు వాయిదాలు చెల్లించడానికి నిర్లక్ష్యం చేయటం ... ఇవన్నీ ముందుగానే ఊహించుకుని, ముందు ఆరునెలలపాటు పూర్తి వాయిదాలు చేల్లిన్చాకే ముహూర్తం పెట్టుకుందామన్నాడు. సంబంధం నచ్చడంతో గత్యంతరం లేక, ఆరునెలలు కాబోయే అల్లుడికి వాయిదాల రూపంలో చెల్లించి ముహూర్తాలు పెట్టుకున్నారు. గోపాలానికి వాయిదాలు ముట్టాయి, ముహూర్తాలు కుదిరాయి, పెళ్ళయింది. ఆ తర్వాత శోభనం ... మొదటి రాత్రి ... ఈ చేదు అనుభవం! ప్చ్!

*****

ఆ రాత్రి నిరాశగా తెల్లారింది గోపాలానికి. లేవడంతోనే ప్రమద్వర గోపాలం కాళ్ళకు నమస్కరించింది, పొంగిపోయాడు గోపాలం భార్య పాతివ్రత్యాన్ని చూసి. బాత్రూమ్ లో ప్రమద్వరే భర్తకు తలన్టింది. వీపురాయడం, తన చేతులతో ఛాతీమీద సబ్బుతో రాయడం అలా చేస్తుంటే వీపుకు ప్రమద్వర గుండెలు గుచ్చుకుని గిలిగింతలు పెట్టడం ఆగలేక తనమీదకి గోపాలం లాక్కోవడం జరిగిపోయాయి

. 'అబ్బ ... బాత్రూమ్ లో ఏమిటీ ... రాత్రికి ...'' అంటూ సిగ్గుపడుతూ తుర్రుమంది.

*****

రెండవ రాత్రి ... ఆ గదిలో పెర్ ఫ్యూమ్ సువాసనలు పరుచుకున్నాయి. ఈ రాత్రి ఎలాగైనా తాను ప్రమద్వరతో స్వర్గాన్ని చవిచూడాలి మనసులో అనుకున్నాడు. ప్రమద్వర పాలగ్లాసుతో వచ్చింది. ఈసారి పాలు తాగలేదు. పక్కన పెట్టాడు. తనే వెళ్ళి లైట్ స్విచ్చాఫ్ చేశాడు. బెడ్ లైట్ వేశాడు. నీలిరంగు ఆక్రమించుకుందా గది. తమకంగా ప్రమద్వరను మీదకు లాక్కునాడు. ప్రమద్వర అభ్యంతరం చెప్పలేదు. పైగా తన చేతులతో గోపాలం నడుమును చుట్టేసింది. బ్లౌజు కు వున్న సేఫ్టీ పిన్ లాగి కొంగును జారవిడిచాడు.

అలాగే ఆమెను వెనక్కి మంచం మీదకి తోసి, ఆమె గుండెలపై తలపెట్టాడు. క్షణాలు కరిగిపోతున్నాయి ... అతని వెచ్చని ఊపిరి ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అతనింకా అడ్వాన్స్ అయ్యాడు. అతని పెదవులతో ఆమె గుండెల సరిహద్దులు దాటి, కిందికి వచ్చాడు. ఒక్క ఉదుటున లేచింది ప్రమద్వర. బిత్తరపోయాడు. ... చీర సరిచేసుకుని, లేచి వెళ్ళి ట్యూబ్ లైట్ వేసింది.

"నిన్న ముద్దు, ఇవ్వాళ కౌగిలి, రేపు బిగి కౌగిలి, ఆ తర్వాత అలా ... అలా ... సుఖాన్ని అనుభవిద్దాం'' అంది ప్రమద్వర.

"అంటే ఏమిటి ప్రమద్వారా? అలాంటి శోభనం నేనెక్కడా చూడలేదు. శోభనం అంటే రోజుకో పార్ట్ తో గేమ్ అనుకున్నావా? ఈ లెక్కన అన్ని అవయవాలూ పూర్తయ్యేసరికి ఒంట్లో ఏ అవయవమూ పనిచేయదు'' నిట్టూరుస్తూ అన్నాడు.

"అదేమిటండీ పెళ్ళంటే వాయిదాలు వేసుకున్నాక కుదుర్చుకునే అగ్రిమెంట్ అయినప్పుడు శోభనం కూడా వాయిదాల చొప్పున ఎందుకు అనుభవించకూడదు. ఇందులో కూడా థ్రిల్ వుంటుంది'' చెప్పి అటువైపు తిరిగి పడుకుంది.

కసిగా ఫ్రిజ్ దగ్గరికి వెళ్ళి, వాటర్ బాటిల్ ఓపెన్ చేసి తలమీద ఆ నీళ్ళు గుమ్మరించుకున్నాడు.

*****

"అదేమిటోయ్ గోపాలం ... ముచ్చటగా మూడో రాత్రి కాకుండానే ఆఫీసుకు వచ్చావు ... మరి జీతం కట్ అవుతుందని భయపడ్డావా?'' పూర్ణానందం నవ్వుతూనే జోక్ చేశాడు. గోపాలం పూర్ణానందాన్ని క్యాంటీన్ కు దూరంగా వున్న ఒక చెట్టు దగ్గరికి ఈడ్చుకుంటూ వెళ్ళినంత పనిచేసి బావురుమన్నాడు.

"ఏంట్రా ... కష్టాలు మనుషులకు కాకపొతే రోబోట్స్ కి వస్తాయా> రాత్రిపూట ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమా? నొ ప్రాబ్లమ్ ... నీవెం వరీ అవకు ... సమరం గారి దగ్గరకు వెళ్దాం'' సానుభూతిగా గోపాలం వైపు చూస్తూ అన్నాడు పూర్ణానందం

."చంపేస్తాను అలాంటి కుళ్ళు అనుమానాలతో జోక్ చేస్తే ... నాకే టెక్నికల్ ప్రాబ్లెం లేదు. కానీ మా ఆవిడ ...'' అంటూ రెండు రోజులుగా జరుగుతున్న భాగోతం గురించి చెప్పాడు సిగ్గువిడిచి.

"అంటే ... ఇప్పటివరకూ ఏమీ జరగలేదన్నమాట. సమస్య ఏమిటో తెలుసుకున్నావా?''

"ఎం చెప్పడం లేదు. కాకపొతే వాయిదాల మొగుడు అని దెప్పిపొడుస్తుంది. ఎదురుగా బంగినపల్లి మామిడిపండును పెట్టుకుని తినకుండా అయింది నా పరిస్థితి. నువ్వే ఏదైనా సలహా చెప్పరా'' అన్నాడు తనకేదైనా సమస్య వస్తే అతనితో చెప్పుకుంటాడు.

"సముద్రం లోతూ, ఆడవాళ్ళ మనస్సులోతూ తెలుసుకోవడం చాలా కష్టం. ఒక పట్టాన బయటపడరు. వాళ్ళ మనసులోని బాధను మాటలతో చెప్పరు. మొత్తానికి ఏదో జరిగే వుంటుంది. అన్నట్టు మీ ఆవిడకు డైరీ రాసే అలవాటు ఉందా?'' సడెన్ గా అడిగాడు.

"ఉంది ... రెండ్రోజులుగా రాత్రి నేను అటుతిరిగి ఇటుతిరిగి పడుకోగానే డైరీ రాసుకుంటుంది.''

"అయితే ఓ పనిచెయ్ .... ఈ రోజు రాత్రి ఆమె రాసిన డైరీ చదువు. ఆ తర్వాత ఏంచేయాలో ఆలోచిద్దువుగాని'' చెప్పాడు పూర్ణానందం.

*****

లోపల వాళ్ళ నాన్నతో ఏదో మాట్లాడుతోంది ప్రమద్వర. మూడు రాత్రుల వరకూ వుండి వెళ్దామనుకున్నారు ప్రమద్వర తల్లిదండ్రులు. ఇదే అదను అనుకుని బెడ్రూంలోకి వెళ్ళి బీరువాలో అడుగు సోరలో వున్న ప్రమద్వర డైరీ తీశాడు. జనవరి 1 గోపాలం అనే వుఅక్తి పెళ్ళి చూపులకు వచ్చాడు. నాకు నచ్చాడు. కట్నం దగ్గర పేచీ వచ్చింది. జనవరి 2 కట్నం వాయిదాల్లో ఇవ్వమన్నాడు. నా మనసు కలుక్కుమంది. తనతో జీవితాన్ని పంచుకునే 'నన్ను' వాయిదాలమీద వస్తువుల్ని కొనుకుంటున్నట్టు కొనుక్కుంటున్నాడా?

జీవం లేని వస్తువు, జీవముండి ఆయనే నా జీవితం అనుకుంటూ తన జీవితంలోకి అడుగుపెట్టే నేనూ ఒక్కటేనా? ప్చ్ ... ఏడుపొస్తోంది! జనవరి 3 నా పెళ్ళికి కట్నం మొదటి వాయిదా చెల్లించడానికి నాన్న తనకిష్టమయిన పాత ఇంటిని ఆమ్మేశాడు.

ఫిబ్రవరి 3 ఈ నెల వాయిదా కట్టడానికి తన చేతికి వున్న రెండు బంగారు ఉంగరాలు, ఒంటిపేట గొలుసు అమ్మాడు.

జూన్ 1 ఈ నేలతో నన్ను కొనుక్కోవడానికి సరిపడా వాయిదాలు పూర్తయ్యాయి. నాన్న తన స్థిరచరాస్తులు ఇంటితో సహా నాకోసం అమ్మేశాడు. అద్దెఇంట్లోకి మారారు. నాడు ఏడుపొస్తోంది.

జూన్ 20 మా శోభనం ... ఈరోజు రెండు మనసులు, రెండు శరీరాలూ ఏకం కావాలి. కానీ నాకెందుకో దీనంగా నాకోసం వీథినపడ్డ నాన్నే గుర్తుకోస్తున్నాడు. తను రోడ్డున పడితే నేనెలా ఈ సుఖాన్ని అనుభవించాలి. దేవుడా ... వచ్చే జన్మలో నన్ను ఆడదానిగా పుట్టించకు. ప్రేమను పంచుకునే జీవిత నేస్తంగా చూసే మగాడినై సృష్టించు.

తల విదిల్చాడు గోపాలం .... ఈ ఆరునెలలుగా ప్రమద్వర పడ్డ మానసిక వేదన ఆ క్షణంలో అతనికి అర్థమయింది. డైరీలో ప్రమద్వర రాసుకున్నవి అక్షరాలు కాదు, జీవిత సత్యాలు. తనకు జ్ఞానోదయం కలిగించిన ఆలోచనా నేత్రాలు. వెంటనే ఓ నిర్ణయానికి వచ్చాడు గోపాలం.

*****

థర్డ్ నైట్ పాలగ్లాసుతో వచ్చింది ప్రమద్వర. లైటాఫ్ చేసి ప్రమద్వరను మీదికి లాక్కోలేదు. బీరువా దగ్గరకు వెళ్ళి ఏదో ఓ కవరు తీసుకువచ్చాడు.

"కూర్చో ప్రమద్వారా ... భార్యాభర్తలు మనసు విప్పి, శరీరాల ఐక్యతతో జీవితాన్ని పండించుకునే శ్రీకారానికి తొలిరాత్రి శోభనం. మనసా వాచా కర్మణా నీవెంట వుంతానన్న నేను డబ్బుతో వచ్చే ముడిసరుకువు అనుకున్నాను. నన్ను క్షమించవూ ... ఇదిగో ఈ కవర్ లో మీనాన్న దగ్గర నేను తీసుకున్న డబ్బు తాలూకు చెక్కులు వున్నాయి. మీనాన్న పేరుమీద రాశాను. నాకు మీనాన్న ఇచ్చిన పవిత్రమైన ఖరీదైన ఆస్తివి నువ్వు నాతొ జీతితాంతం వుండే నీకన్నా క్షణాల్లో చేతులు మారే ఈ కరెన్సీ వద్దు. ముందు మీనంనకు ఈ కవర్ ఇచ్చి రా ... నీలోని సంఘర్షణ, సంతోషంగా మారాక మనం ఒక్కతవుదాం. ఆ అమృతక్షణం కోసం ఎదురు చూస్తా ...'' అన్నాడు.

అంతే ... కన్రెప్పల మధ్య మెరిసే కన్నీటి మేఘాలతో అతన్ని అల్లుకుపోయింది ప్రమద్వర. గాలి వారిమధ్య ఊపిరాడక గిలగిల్లాడిపోయింది. ఆ సంగమం అపూర్వం, ఆ శృంగారయుద్ధంలో ఇద్దరూ విజేతలే.