- ముచ్చర్ల రజనీ శకుంతల
.png)
ఇక్కడ రెండు శరీరాల మధ్య మదనక్రీడ మొదలైంది. ఇక్కడ రెండు మనసుల మధ్య రాపిడి రాజుకుంటోంది. ఆ రాపిడి నుంచి కోరికల వేడి పోగల సెగలు కోరికల కొలిమిలో ఊసులాడుకుంటు న్నాయి. కాలంతో పనిలేకుండా, కరిగిపోయే కోరికల తాలూకు అనుభవాలను, జీవితకాలం మిగిలిపోయే అనుభూతులుగా మార్చగల మనసు ఫ్రిజ్ లోని అనుభూతుల ఫ్రీజర్ పని చేయడం మొదలైంది. ఇక అనుభవైకవేద్యమవ్వడమే తరువాయి.
“ఏయ్ మధువనీ’’ గొంతులోని ‘హనీ’ నింపుకుని, పెదవుల్లోకి కాసింత ఓంపుకొని, ఓంపుకున్నదాన్ని ఆమె పెదవులమీద తన పెదవులతో ధారగా పోసే ప్రయత్నం చేస్తూ తన పెదవులను ఆమె పెదవులపైకి ఆన్చి … పిలిచాడు అనిరుద్ర.
“వా … ట్ … అనీ …’’ అతని రెండు పెదవుల మధ్య తన కింద పెదవి చిక్కుపడిపోయిందన్న తీపి బాధని ఎంజాయ్ చేస్తూ అడిగింది మధువని.
"ఈ గది … నీ మదీ … ఈ వర్షం … నీ మనసు చేసే హర్షమూ … ఈ మంచం … మన కోరికల గుడుగుడు గుంజెం … ఆ అగరొత్తులు … నీ మత్తు చూపులూ … చలీ … కోరికా … సరదాలు … సరసాలు …. ఎంత గొప్ప కాంబినేషన్ చూశావా?" అతనామెను హత్తుకుపోయే ప్రయత్నం చేస్తూ అన్నాడు. బయట వర్షం కురుస్తోంది … కిటికీలోనుంచి కురిసే వర్షం తాలూకు లయబద్ధమైన శబ్దం … వర్షానికి తడిసిన మట్టి వాసనా … వర్షాన్ని అంటిపెట్టుకున్న చలిగాలీ … ఇద్దరి శరీరాల్లోకి దూసుకువచ్చి అల్లరి చేయడం మొదలుపెట్టింది.
ఆ ఇంట్లో అతనూ …. ఆమె … ఆంక్షల్లేక … హద్డుల్లేక .. శృంగార యుద్దానికి సమయ నిబంధన ఎటూ లేదు. ఇద్దరిలో కోరిక కామనే …. తపన నేచురలే … ఆమె స్థనద్వయం విర్రవీగుతోన్నట్టుంది. ఆమె బ్లోజు హుక్కులను చూసి ఎగిసే వక్షోజాల ఉచ్చ్వాస నిశ్వాసాల హుంకరిచాయేమో … హుక్కుల కొక్కాలు ఫట్ మన్నాయి. చీర కుచ్చెళ్లు పక్కకు తప్పుకొని అతన్ని చూసి కన్నుగీటాయి. ఆమె లేత పొట్ట లయబద్ధంగా కదులుతున్నట్టు అనిపించింది. ఆమె నాభిని చూసి రతీదేవి ఈర్ష్యపడింది.
తన బెటరాఫ్ కు దిష్టి తగులుతుందేమోనని అతను ఆమె నాభిని తన పెదాలతో మూసేసాడు. అదో చుంబనక్షతమైంది. అతనామె పొట్టమీద మరిన్ని ముద్దుల ముద్రలు వేయాలనే ప్రయత్నం మొదలుపెట్టాడు. ఆమె శరీరంలో స్వల్ప ప్రకంపనలు …. అతనామె బుగ్గలను ముద్దాడి, చెవి కొసని తన పెదవులతో బిగపట్టాడు. ఆమెలో పరవశం … వివశత్వమై … శృంగార తంత్రులను మీటుతూ వుండిపోయింది. “ఈ టైంలో, నా చిరకాలవాంఛ … నా లైఫ్ డ్రీమ్ .. .తీర్చుకోనా?’’ అతనామె చెవిదగ్గర గొణిగాడు.
“సిగ్గుపడాలా?’’ అడిగిందామె ….
అతనికామె అంతరంగం అవగతమైంది. “అంటే ఓ…కే…నా??’’
“కార్యశీలురు ఎప్పుడూ కాలాయాపన చేయరు …’’ అతనిలో ఉత్సాహం పెల్లుబికింది.
“థాంక్యూ డియర్ … సమయం … సందర్భం … సరసం అన్నీ కలిసొచ్చాయి …’’ అంటూ ఫ్రిజ్ దగ్గరకెళ్ళాడు. ఆమె అతను వెళ్ళినవైపే చూస్తోంది. ఈ అనుభవం ఎలా వుంటుందీ? మత్తుగానా? గమ్మత్తుగానా? ఇలాంటి అనుభవం తనెవరికీ చెప్పుకోలేదా? అయినా ప్రతీ అనుభవం చెప్పుకునేదా? కొన్ని అనుభవాలు గుండె గదిలోనే వుండాలి. తన అనుభవాలకు, తన బెటరాఫ్ గుండె గది లాకర్ లో పదిలపర్చదూ … వాళ్ళకు పెళ్ళయి సంవత్సరం దాటింది. ఇద్దరూ ప్రేమించి పెళ్ళి చేసుకోలేదు.
కానీ, ప్రేమించడాన్ని ఇప్పటికీ విపరీతంగా ప్రేమిస్తారు. అతని ఇష్టాలను ఆమె కాదనదు … ఆమె అభీష్టాన్ని అతను ‘నో’ అనడు. అలాంటి దాంపత్యంలో ఒకే ఒక తీరని కోరిక … అతని దృష్టిలో … ఇద్దరూ ఏకాంతంగా మందు కొడుతూ … రోమాన్స్ చేస్తూ … రోజంతా గడపాలి … రాత్రిని రాత్రి కమ్ముకునే వేళ … తమని సరసమనే అనుభూతిని చుట్టుకోవాలి … అది ఓ తీయని జ్ఞాపకంగా మిగుల్చుకోవాలి. విస్కీ సిప్ చేస్తూ అప్పుడప్పుడూ ముద్దుల్ని నంజుకుంటూ … గిలిగింతలను టచ్ చేస్తూ … ఫైనల్ గా పరాకాష్టకు చేరుకొని … అలా అలా … మత్తులో రాత్రంతా గడపాలి!
ఫస్ట్ నైట్ తన కోర్కె మొగుడు చెప్పగానే ‘ఛీ’ అనలేదు. ఇదేమి పిచ్చికోరిక … అని మొహం చిట్లించలేదు … ఛీ … యాక్ అని వామ్టింగ్ సెన్షేషన్ క్రియేట్ చేయలేదు. నాలుగ్గోడల మధ్య, రెండు శరీరాల పెనవేతల, రెండు మనసుల ప్రమేయంతో, ఒకే జీవితకాలం బ్రతకాలంటే దంపతుల మధ్య ఏదీ నిషిద్ధం కాదు. కానీ, సమయం కుదరలేదు … సందర్భం రాలేదు. ఇప్పుడింట్లో పెద్దవాళ్ళు లేరు. పనివాళ్ళు ఈ వేళ రారు. ఈ రాత్రి వాళ్ళది … ఈ కోరిక వాళ్ళది … వాళ్ళ కోరికలకు ప్రకృతే వేదిక అయింది.
*****
టీపాయ్ మీద విస్కీ సీసా, బీరు సీసా వున్నాయి … “బీరు బావుంటుందా?’’ టీపాయ్ మీద వున్న బీరు బాటిల్ చూస్తూ అడిగింది మధువని.
“పోనీ విస్కీ ట్రయ్ చేద్దామా?’’ హస్కీగా అడిగే ప్రయత్నం చేసాడు.
“కిక్కు నెత్తికెక్కుతుందేమో …’’
“ఎక్కితే ఎక్కనీ … మనమెలాగూ ఆ తర్వాత మంచమెక్కుతాంగా …’’
“మత్తులో పడగ్గది తలుపులు తీసి, వీరంగం చేయం కదా …! అప్పుడు అంతా శృంగభంగం అవుతుంది!’’
“అందుకో ఐడియా వుంది … తెల్లారేవరకూ మనం బయటికి వెళ్ళకుండా ఓ మార్గం వుంది …’’
“ఏమిటా మార్గం …?’’
“ఇదిగో … మనం లోపట్నుంచి తాళం వేసుకుందాం … ఎక్కినా బయటకు వెళ్ళలేం … ఎందుకంటే ఈ తాళం చెవి మనం కళ్ళు మూసుకుని ఓ మూలకి విసురుతాం … అదెక్కడుందో రేపు వుదయం లేచి వెతుక్కుందాం …’’
“వెరీ థ్రిల్లింగ్ ఐడియా …’’
అనిరుద్ర లోపట్నుంచి తాళం వేసాడు. కళ్ళు మూసుకుని తాళం విసిరేసాడు. అదెక్కడ పడిందో వాళ్ళకి తెలియదు.
*****
“అబ్బ … కాకరకాయరసం నయం దీనికన్నా …’’ అంది ఒకే ఒక్క సిప్ చేసి మధువని.
“అవునవును … నోరంతా చేదుగా … వగరుగా వుందికదూ…’’
“అయినా ఓ యాంగిల్ లో సిప్ చేస్తూంటే బావుంది …’’
“అవునవును … స్వర్గానికి సిక్స్ ఫీట్ దూరంలో వున్నట్టుంది’’ మరో రౌండ్ కి రెడీ అయ్యారు.
“ఊ … కానీయ్ …’’ అంది మూడోరౌండ్ లో మధువని.
“విస్కీ టేస్టీగా వుంది కదూ …’’ హస్కీగా అంది మళ్ళీ.
“ఇకపై తాగితే రిస్కీయే …’’ అన్నాడు మత్తుగా అనిరుద్ర
*****
కొన్ని రౌండ్స్ తరువాత … “రేయ్ … అనీ … నువ్వేమిట్రా … డబుల్ ఫోజులో కనిపిస్తున్నావ్ …’’
“ఏయ్ మోద్దువనీ …. మొగుడ్ని రేయ్ అంటావా … చంపేస్తాను …!’’
“ఏమిట్రా షంపేది … నా షాం … సె … న్ … దమ్ముంటే …. రా …’’ అని ఆమె ఎదురెళ్ళింది.
*****
“అరె … నాకు నాలుగు కనిపిస్తున్నాయి …’’ “ఆ … లా … షూ … సు … కుం … టూ … వుంటా … వా …’’ అనిరుద్ర మధువని దగ్గరకెళ్ళాడు.
“అబ్బ … నీ బాడీ హీటర్ లా వుందిరా’’ అంది అతన్ని వాటేసుకుంటూ మధువని.
“నాకు మాత్రం ఫైర్ ప్లేస్ ముందు కూర్చున్నట్లు వుంది. విస్కీ కన్నా నీ కౌగిలి కిక్కే టానిక్ లా పనిచేస్తోంది’’ అతనామె పైట తీసి తన మొహంమీద కప్పుకున్నాడు.
“నాకు సిగ్గేస్తోంది డాళింగ్ …’’
“నాకూ సిగ్గేస్తోంది …’’ అంటూ ఆమె తన ఒంటిమీదున్న దుస్తులను విప్పేసింది. ఈ సమయంలో అతనూ పౌరుషంతో రెచ్చిపోయాడు.
*****
ఇద్దరిమధ్యా హద్దులన్నీ డోంట్ కేర్ అన్నాయి … సరిహద్దులు సెలవిక అంటూ తమ హద్దులు చేరిపెసుకున్నాయి. బయట హోరున కురిసే వర్షం …. చలిగాలి పరామర్శ … మత్తెక్కించే సన్నజాజులు …. కిక్కేక్కించిన విస్కీ తాలూకు వగరు రుచి … ఒకరినొకరు గెలిపించుకునే ప్రయత్నంలో …. ఒకరినొకరు ఓడించాలనే ప్రయత్నంలో … ఓడిపోయింది సిగ్గూ, బిడియం … గెలిచింది అనుభవం … అనుభూతీ …. ఆమె తెల్లటి శరీరంమీద చెమట బిందువులు మంచి ముత్యాలయ్యాయి. అనాచ్చాదితంగా ఆ ఇద్దరూ ఆ గదిలో … ఏ తెల్లవారుఝామునో తమ సరస పోరాటాన్ని తాత్కాలికంగా వాయిదా వేసి నిద్రపోయారు.
*****
ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నాడు. కెవ్వున కేక వేసుకోలేదు. సిగ్గుపడలేదు … బిడియమూ లేదు … ఒకరి కౌగిలిలో మరొకరు కరిగిపోయారు. “సారీ … రాత్రి ఆ మాత్రం తాగితేనే కిక్కు తలకెక్కి మిమ్మల్ని ఏరా … అన్నాను…’’
“నాకూ అంతే … కొత్తకదా … అయినా నీకీ విషయం తెలుసా … విస్కీ మత్తుకన్నా నీ ప్రేమ మత్తు, నీ కలయిక మత్తు ముద్దుముద్దుగా నన్ను హత్తుకుని, ఆ విస్కీ మత్తుని తరిమేసింది’’ విస్కీ కొట్టి రోమాన్స్ చేయాలన్న కోర్కె నెరవేరింది … మనసైన ప్రియురాలి ప్రేమ మత్తు మధురమైనది … ఏ మత్తూ దానికి సరిరాదు అన్న నగ్నసత్యమూ తెలిసింది. ఇద్దరి మధ్యా మరోసారి శృంగార యుద్ధం మొదలైంది.
****
గోరువెచ్చని నీరు జల్లుగా పడుతున్న షవర్ కింద ఇద్దరూ హాయిగా స్నానం చేసి బయటకొచ్చారు … బయటనుంచి తలుపులు బాదుతున్నారెవరో ………
|
|


