The content in this feature is rated as "A++". You must be at least 18 years old to view this feature.
Home>>Romantic Stories>>Mallepoola Vaana
మల్లెపూల వాన

బండి లీల

"నీ మనసులో ఏముందో నాకు తెలుసు'' బెడ్ రూమ్ లోకి అడుగుపెడుతూ అన్నది బామ్మ. ఆ మాటలకు ఐశ్వర్య అవాక్కై చూసింది. వెంటనే సర్ధుకుంటూ

"ఏంటే ... ముసలీ ... నీకు తెలిసిందేంటీ? ... నా మనసులో ఉన్నదేంటీ?'' అన్నది చిరుకోపంగా. పసుపూ, వెన్నేనూ కలిపి ముద్దచేసి అందమైన బొమ్మలా తీర్చినట్టు ముచ్చటగా ఉంటుంది ఐశ్వర్య. దానిమ్మ గింజల్లాంటి పలువరస, దొండ పండు పెదాల మధ్య తళుక్కుమంటాయి. బెదిరిన లేడిపిల్లలా కళ్ళు చురుగ్గా కదులుతుంటాయి. అద్దంలాంటి చెక్కిళ్ళు, పోక చేక్కల్లాంటి చుబుకం, కాస్తంత పొగరు, పోగారుకు తగ్గ వగరు.

అవయవాలన్నీ అతి జాగ్రత్తగా చేసి వీటిమీద మాత్రం పక్షవాతం పెంచుకున్నాడా అన్నట్టు ఎత్తైన ఎద సంపద, నేనేం తక్కువ కాదంటున్న జఘన గగనం. మనవరాలి వైపు ఒకసారి తేరిపారా చూసి వచ్చి పక్కగా కూర్చుంది బామ్మ. ఐశ్వర్య రుసరుసలాడుతూ దూరంగా జరిగింది. బామ్మ నవ్వుకుంటూ

"కాదమ్మా, బంగారు బొమ్మా ... మొన్న ఒక సంబంధం వచ్చిందా? అది కాదన్నావు. అంతకు ముందు రెండు అమెరికా సంబంధాలను మెచ్చలేదు. ఈ రోజు వచ్చిన సంబంధం ... అబ్బాయి అందంగా ఉన్నాడు. మంచి ఉద్యోగం, లక్షణమైన కుటుంబం. అయినా నచ్చడం లేదు. అందుకే అంటున్నాను నీ మనసులో ఏముందో తెలుసునని'' అన్నది.

"ఏముంది ...!?'' గడుసుగా అడిగింది ఐశ్వర్య.

"ఏముందని కాదు? ఎవరున్నారని? రాకుమారుడి లాంటి మేనబావ నీ మనసు నిండా ఆక్రమించుకున్నాక ఇతరులకు చోటెక్కడుటుంది? ఇతరులపై మనసెక్కడ నిలుస్తుంది. అవునా ...?'' బామ్మ అడిగింది. ఐశ్వర్య సిగ్గుల మొగ్గయింది. ఆమె కనురెప్పలు బరువుగా వాలిపోయాయి. బుగ్గలు ఎరుపెక్కుతుంటే సిగ్గును దాచుకోవాలని చూసింది. కానీ సాధ్యం కాలేదు.

"పొ ,,, బామ్మా'' అంటూ సిగ్గుతో మొహం దాచుకుంది. ఆ ఊపుకు మేని మెరుపుతో పోటీపడుతున్న ఆమె చెవి జూకాలు అందంగా కదిలి తళుక్కున మెరిశాయి. మనవరాలిని మురిపెంగా దగ్గరకు తీసుకుంది బామ్మ.

"నువ్వెంటీ .. చెప్పా పెట్టకుండా వచ్చావు'' పత్తిని దులుపుకుంటూ అడిగాడు సిద్ధార్థ.

"ఏం రాకూడదా?'' అంటూ ప్రశ్నించిందామె.

"అబ్బెం అదేం కాదు. సమయానికి అమ్మకూడా లేదు. ఫోన్ చేస్తే ఉండిపోయేది గదా అని'' తెలుసులేవోయ్ ... ఓ సరసపు మాటలు తెలీవు, చేష్టలు తెలియవు అనుకుంటూ పైకి "అయ్యో ! అలాగా? నేను తిరుణాళ్ళ కని వచ్చానే'' అన్నది.

"మూడు రోజుల వరకూ రాదు. వంట ఎలా రా దేవుడా అనుకుంటున్నా మంచి పనిచేశావులే''

"ఆ ఆటలేం సాగవు ... నాకు వంట రాదు, నువ్వు వండి వడ్డించాల్సిందే'' అన్నది ఐశ్వర్య అతడినే ముచ్చటా చూస్తూ.

అన్నదే తడవుగా వంటపనిలో మునిగిపోయింది అది అందివ్వమని, ఇదెక్కడుందనీ అతడిని తన చుట్టూ తిప్పుకుంటుంది. చిన్న చిన్న పనులు పురమాయిస్తూ అతడి చెంపలు పిండాలనిపిస్తుంది. చెవులు నులుమాలనిపిస్తుంది. చెయ్యెత్తబోతుంటే కనురెప్పలు వాలిపోతున్నాయి. చూస్తుండగానే పొద్దు గూకింది. పొలం వెళ్ళొస్తానని సిద్దార్ధ వెళ్ళిపోయాడు. స్నానం చేసి బంగాళాపైకి వచ్చి కూర్చుంది ఐశ్వర్య. చుట్టూ పరిశీలనగా చూస్తోందామె. పల్లేతనం ఉట్టిపడుతూ అడుగడుగునా శృంగారమే కనిపిస్తుంది.

శ్రమలోనే సౌందర్యం గోచరిస్తుంది. మల్లెపొద దగ్గరికి వెళ్ళి పూల మాల అల్లుకుంది. పైరగాలి సుతిమెత్తగా ముంగురులను స్పృశిస్తూ వెళ్ళింది. గాలి చేసే అల్లరికి అలలా కదులుతున్న వోణి దాచాల్సిన వాటిని దాచలేక ఇబ్బంది పడుతుంది. చూస్తుండగానే చుక్కలు మొలిచాయి. ఈ రోజు రాత్రే ఐ లవ్యూ చెప్పి అతడి మనసులో ఏముందో తెలుసుకోవాలనుకుంది ఐశ్వర్య. దూరంగా సిద్ధార్థ బైక్ కనిపించింది. కిందకి వచ్చి డైనింగ్ టేబుల్ సర్దింది. సిద్ధార్థ స్నానం చేసి లుంగీ చుట్టుకుని వచ్చాడు. క్

షణకాలం మైమరచి అతడినే చూస్తుంది పోయింది ఐశ్వర్య. సిద్ధార్థ ఎత్తుగా బలంగా ఉంటాడు. కండలు తిరిగిన శరీరం, పచ్చని శరీర ఛాయ, ఒత్తయిన జుత్తు పలుచటి గెడ్డం, ఒత్తయిన మీసాలు, ఛాతీ మీద దట్టంగా పెరిగిన రింగులు తిరిగిన వెంట్రుకలు. అందులోంచి వేళ్ళను పోనిచ్చి విశాలమైన ఛాతీ మీద సేదతీరాలన్న కోరిక పుట్టింది. వెంటనే తన కోరికకు తనకే సిగ్గు వేసింది. సిద్ధార్థను కూర్చోబెట్టి భోజనం వడ్డించింది ఐశ్వర్య, కావాలని కొసరి కొసరి వడ్డించింది. వడ్డించే నెపంతో అతడి భుజంపైన నుండి వంగింది.

గాలికి కదులుతున్న జుత్తు చెంపలకి తాకి గిలిగింతలు పెట్టింది. కావాలనే స్వేచ్చగా వదిలిన ఎదపొంగుల బరువు అతడి వీపుపై ఆనుతుంటే అడగాలనుకున్న విషయం నోటి వద్దకు వచ్చి ఆగిపోయింది. గుండెలో చెప్పలేనంత అలజడి. సిద్ధార్థ మాత్రం మామూలుగానే ఉన్నాడు. భోజనం అయ్యాక కూలీలతో మాటల్లో మునిగిపోయాడు. అలసటతో ఐశ్వర్యకు నిద్రపట్టింది. మెలకువ వచ్చేసరికి అడుగుల చప్పుడు వినిపించింది. కళ్ళు తెరిచి చూసిందామె ... టైం పన్నెండు దాటింది. తన గదిలో తప్ప ఇంట్లో అంతటా చీకటి. అడుగులో అడుగు వేస్తూ వస్తున్నాడు సిద్ధార్థ, ఐశ్వర్య గుండె వేగం పెరిగింది. తనని తాను చూసుకుంది.

మోకాళ్ళపై వరకూ చెదిరింది లంగా, పరికిణి ఓణీ జారిపోయి భుజాలు కనిపిస్తున్నాయి. ఈ దృశ్యంలో తనని చూశాక తట్టుకోవడం కష్టమని ఆమెకు తెలుసు. తననేం చేస్తాడు? ముద్దు పెట్టుకుంటాడా? కౌగిలించుకుంటాడా? అమ్మ దొంగా! పట్టనట్టు ఉంటూ ఇంత పెద్ద ప్లాన్ ఆలోచిస్తావా? ఉండు నీ పని చెబుతా అనుకుంటూ నిద్రలో కదిలినట్టుగా అతడికి అనుకూలంగా పడుకుంది ఐశ్వర్య. క్షణాలు గడుస్తుంటే రక్తప్రసరణ పెరిగిపోతోంది. అతడు అదిమి పడతాడని కాబోలు ఆధారాలు అదిరదిరి పడుతుంటే అందాలు చెదిరి బెదిరిపోతున్నాయి. అడుగుల చప్పుడు దగ్గరైంది. అతడు పక్కనే వచ్చి నిలబడ్డాడు.

టెన్షన్ తట్టుకోలేక కళ్ళు మూసుకుంది. సిద్ధార్థ దుప్పటిని నిండుగా కప్పి లైటు ఆర్పి వెళ్ళిపోయాడు. ఐస్ గడ్డ మీద నిలబెట్టినట్టు చప్పున చల్లారి పోయిందామె. చేతిలో గన్ వుంటే కాల్చేద్దామన్నంత కోపం వచ్చింది. రాత్రంతా నిద్రపట్టక దొర్లుతూనే వుంది, తెల్లారే ఏదో విషయం తెల్చేయాలనుకుంది ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో రిహార్సల్ చేసుకుంది. చీకటితోనే లేచి ఇళ్ళూ వాకిలి ఊడ్చింది. కళ్ళాపి చల్లి ముగ్గులు వేసింది. ఆ పనులన్నీ కొత్త బావకు ఇష్టం కాబట్టి తను ఇష్టంగా చేస్తుంది. పనులన్నీ పూర్తి చేసుకుని స్నానం చేయడానికి బాత్ రూమ్ లోకి వెళ్ళింది ఐశ్వర్య.

పల్లెటూరే అయినా అన్ని వసతులున్న ఇల్లది. షవర్ తిప్పగానే నీళ్ళవర్షం. వంటిమీద నీళ్ళ బిందువులు పడగానే రాత్రి తాలూకు అలజడి మాయమై మనసు ప్రశాన్తమైంది. ఆనాడే తిరునాళ్ళు, చీరకట్టుకుని ముస్తాబైంది ఐశ్వర్య. పనులన్నీ మానిపించి సిద్ధార్థను జాతరకు బయలుదేర తీసింది. అతడు బైక్ ను బైటకు తీస్తుంటే వద్దని ఒంటెద్దు బండిని కట్టించింది. పులిహోర కలిపి క్యారియర్ కట్టింది. జాతర రెండు కిలోమీటర్లమైనే ఉంటుంది. బండ్లు చాలా వెళ్తుంటాయి. సిద్ధార్థ బండిని తోలుతుంటే వెనుక కూర్చుంది ఐశ్వర్య. ఎత్తువంపుల మట్టిదారిలో బండి కుదుపులకు అతడిని తాకుతుంటే హాయిగా ఉంది.

పచ్చటి పొలాల మధ్య నుంచి వెళ్తుంటే చెప్పలేని ఉద్వేగం ఆవహిస్తుంది. అన్నింటికీ మించి ఆ విషయం అతడితో చెప్పాలని మనసు ఆరాటపడుతుంది. అప్పుడే సెల్ మోగింది. ఇంటినుంచి బామ్మ 'చెప్పావా' అని అడిగింది. ఐశ్వర్య లేదని పోన్ పెట్టేసింది. రేపటి వరకు చూద్దాం. అతడు చెప్పకపోతే అప్పుడు చెప్పేద్దాం అనుకుంది . నిజానికి ఐ లవ్యూ చెప్పడం తేలికని ఇక్కడకొచ్చింది కానీ ఇప్పుడు తెలుస్తుంది ప్రపంచంలో అన్నింటికంటే కష్టమైన పని అదొక్కటే అని. జాతరంతా తిరిగింది ఐశ్వర్య రంగులరాట్నం వద్ద ఆమె చూపు ఆగింది. బలవంతం చేసి బావతో రాట్నం ఎక్కింది.

ఆకాశంలోకి ఎగురుతుంటే నరాలు జివ్వుమన్నాయి. భయంతో సిద్ధార్థను కరుచుకుపోయింది. అతడి ఒంటి వెచ్చదనం, చిరుగాలి చల్లదనం, ఊపిరి వెచ్చదనం, చూపుల చల్లదనం కలగలిపి తాను ఏం అర్పించుకుంటున్నానో తెలియని అవయవాల పొందికలన్నీ అతడికి అద్దింది. రంగుల రాట్నం ఆగేదాకా కళ్ళు తెరవలేదు. తపస్సులో కూర్చున్న మునిలా ఉన్నాడు సిద్ధార్థ, తుఫాను తర్వాత కల్లోల సముద్రంలా ఉంది ఐశ్వర్య.

"ఇంతగా భయపడేదానివి రంగుల రాట్నం ఎండకు ఎక్కావు?'' విసుక్కున్నాడు సిద్ధార్థ.

తన మనసేంటో తెలుసుకునేందుకు లోలోపలే ఉడుక్కుంటూ మూతి ముడుచుకుంది ఐశ్వర్య. రోజంతా మూదీగానే ఉంది. ఇంటికి వెళ్ళగానే అలసటగా ఉందని పడుకుంది. తెల్లారేవరకు నిద్రలేవలేదు. కరెంటు పంపు వద్దకు వద్దన్నా బయలుదేర తీశాడు సిద్ధార్థ, అతడు ఆహ్వానించగానే ఎంతో బలం వచ్చినట్లయింది ఐశ్వర్యకు. వెంటనే అతనితో బయలుదేరింది. పొలం గట్ల వెంట నడుస్తుంటే అతడి చేతిని ఆసరాగా పట్టుకుంది. లంగా కుచ్చిళ్ళను మోకాళ్ళ పైకి జరిపి బొడ్లో దోపుకుని పంట కాలువలను దాటింది. ఆసరాగా అతడి భుజాన్ని పట్టుకుని గట్టిగా నొక్కింది. లోతైన పంటకాలువల్ని చెంగున ఎగురుతూ దాటింది. బావమరదళ్ళిద్దరూ మంచే వద్దకు చేరుకున్నారు.

ఐశ్వర్య ఆమె ఒడిలో ఒదిగిపోయింది. "పిచ్చిపిల్లా ... చెప్పాల్సిన విషయం చెప్పకుండా దాచుకుంటే ఎన్నో అనర్థాలు జరిగిపోతాయమ్మా! నువ్వు వలచావు సరే! వాడు నిన్ను వలచాడా ...? ఈ విషయం వాడితో చెప్పావా ...? ఒకరినొకరు ఇష్టపడ్డారా?'' అడిగింది బామ్మ. అన్నింటికీ లేదన్నట్టే తలూపింది ఐశ్వర్య, మనసులో ఏదో బెంగ పట్టుకున్నట్టుంది బేలగా మొహం పెట్టింది. బామ్మకు జాలివేసింది. తను ఏదో టూకీగా ఈ విషయం తీసింది కానీ నిజంగానే ఆమె మనసులో బావ ఉన్నాడన్న విషయం బామ్మకు తెలియదు.

"పిచ్చిపిల్లా ... సిద్ధార్థ మొండిమనిషి, పెద్ద చదువులు చదివి వ్యవసాయం చేస్తూ పల్లెటూరిలోనే ఉంటున్నాడు. మీ నాన్నకు, అత్తయ్యకు పడదు. వాడి మనసులో వువున్నావో లేదో తెలియదు. మరి ఈ పెళ్ళి ఎలా జరిగేదే?'' అని మనవరాలిని అడిగింది బామ్మ. ఐశ్వర్య కాటుక కళ్ళనుంచి రాలిన నీటిబొట్లు చనుకట్టుపై పడ్డాయి. బామ్మ వైపు దీనంగా చూసింది. ఆ చూపులకు బామ్మ మనసు కరిగిపోయింది.

"ఐసూ ... నువ్వు ఇప్పుడు పుట్టాల్సిందానివి కాదు. నాకంటే వందేళ్ళు ముందుగా పుట్టాల్సిన దానివి. ఇప్పటి పిల్లలు చూసు, ఇటు చూశారో లేదో అటు మాట్లాడుకుంటున్నారు. ఐ లవ్యూలు, ఐటూలు చెప్పుకుంటున్నారు. మీటింగులూ, డేటింగులూ పెట్టుకుంటున్నారు. రోజులమీద పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. నెలల మీద తల్లులు అవుతున్నారు'' అన్నది బామ్మ నవ్వుతూ.

బామ్మ పక్కనే ఒదిగి కూర్చుని ఐశ్వర్య కూడా సిగ్గుగా నవ్వింది. "దీనికి ఒక్కటే మార్గం. నీ మనసులో వాడున్నాడు. మరి వాడి మనసులో నువ్వున్నావో లేదో తెలుసుకో. వాడు కూడా నిన్ను ఇష్టపడితే ఈ పెళ్ళి జరిపించే పూచీ నాది'' అంటూ భరోసా ఇస్తూ మాట్లాడింది బామ్మ.

"అదే ... ఆ విషయం ఎలా తెలుసుకునేది?'' అని బామ్మని అమాయకంగా అడిగింది ఐశ్వర్య. "మామ్మవే ... మా తల్లే, నువ్వు కళ్ళు మూసుకుని పడుకో. వాడు రెక్కలు గట్టుకుని వచ్చి నిన్నెత్తుకు పోతాడు. బుద్ధి లేకపోతే సరి. చాడువుకోగానే సరిపోదు. కాస్తంత తెగువ ఉండాలి'' వెటకారంగా అన్నది బామ్మ. ఐశ్వర్య మూతి ముడిచింది.అలిగి బెడ్ మీద మూడంకె వేసింది. మోకాళ్ళ వరకు నైటీ తొలగింది. పాలరాతి శిల్పాల్లా కాళ్ళు మెరుస్తున్నాయి. ఊపిరికి ఎద బరువుగా కదులుతుంది. వెన్నెల కిరణాల్ని రంగరించి అద్భుతమైన శిల్పం అప్పుడే తయారుచేసినట్టుగా ఉంది. బామ్మ కొద్దిసేపు మనవరాలిని మురిపెంగా చూసింది.

"ముసలిదాన్ని అందునా ఆడదాన్ని. నేనే నీ రూపురేఖలకు తట్టుకోలేక పోతున్నాను. ఇక వాడు ఎట్లా తట్టుకుంటాడే'' అంటూ ఆమె చెవిలో ఉపాయం చెప్పింది. అరగంట సేపు ధైర్యం నూరిపోస్తే తప్ప ఒప్పుకోలేదు ఐశ్వర్య. "బామ్మా ... నువ్వు కూడా రారాదే నా వెంట. ఎప్పుడైనా పూడూరుకు ఇద్దరం కలిసే వెళ్ళేవాళ్ళం కదా!'' అడిగింది. "ఎప్పుడూ వేరు, ఇప్పుడు వేరు. నీ మొగుణ్ణి నువ్వే గెలుచుకున్నావన్న తృప్తి జీవితాంతం నీకుంటుంది. అయినా ఇది ఒకరి సహాయంతో చేసే పని కాదు'' అని ఐశ్వర్యతో ఒకింత సీరియస్ గా అన్నది బామ్మ.

కొద్దిగా దిగులు పడినా వెంటనే ఐశ్వర్య "బామ్మా! బావ మనసులో నేను లేనట్లయితే'' ఆ ఊహనే భరించనట్టుగా ఆమె మాటలు తడబడి ఆగిపోయాయి. బామ్మ మాత్రం తోట్రుబాటు లేకుండా "పెళ్ళి కొడుకులకు దేశంలో కరువేం లేదు'' అన్నది నవ్వుతూ. ఆ మాటలకు ఐశ్వర్య ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

సిద్ధార్థ, ఐశ్వర్య ఇద్దరూ ఒకే కాలేజీలో చదువుకున్నారు. అతను ఆమె కంటే రెండేళ్ళు సీనియర్. అగ్రికల్చర్ పి.జి. అయిపోగానే సిద్ధార్థ ఊరికి వెళ్ళిపోయాడు. ఐశ్వర్య డిగ్రీ పాసై ఇంట్లో కూర్చుంది. సిద్ధార్థ తల్లి ప్రేమ వివాహంతో కుటుంబానికి దూరమైంది. సిద్ధార్థ పదవతరగతి చదువుతుండగా తండ్రి మరణించాడు. అప్పటినుండి రాకపోకలు మొదలయినా అవి అంతంత మాత్రమే. ఐశ్వర్య తండ్రి ప్రసాదరావు పట్టుదల మనిషి. తన మాట వినలేదని ఇంతవరకూ చెల్లిలి గడప దాటలేదు. బామ్మే అప్పుడప్పుడూ కూతురు వద్దకు వెళ్ళి వస్తుంది. వెళ్ళినప్పుడల్లా తన మనుమరాలిని వెంట తీసుకు వెళుతుంది.

గారాబంగా పెరిగిన ఒక్కగానొక్క కూతురు మాటను ఎన్నడూ కాదనలేదు ప్రసాదరావు. ఆ రోజు రాత్రే ఐశ్వర్యను రెడీ చేసింది బామ్మ. పంజాబీ డ్రెస్సులు, స్కర్ట్ లూ కాదని లంగా ఓణీలను బ్రీఫ్ కేసులో సర్దిపెట్టింది. ఏం చేయాలో, ఏ విధంగా మాసాలు కోవాలో మళ్ళీ చెప్పింది. పథకం ప్రకారం తన కూతురుకు ఫోన్ చేసి ఆమెకేదో పనిని పురమాయించింది. మూడు రోజుల పాటు ఊళ్ళో లేకుండా చేసింది బామ్మ. ఐశ్వర్య సిద్ధార్థతో ఒంటరిగా గడిపే ఏర్పాటు చేసింది. చుట్టూ జీడిమామిడి, అరటి, జామ, రేగు ... రకరకాల పళ్ళచెట్లు, పూల చెట్లు, మధ్య కుటీరంలా చిన్న ఇళ్ళు. పొదలతో పైకెక్కి ఇంటినిండా పరుచుకున్న మల్లెపందిరి, పందిరి నిండా పరుచుకున్న పూలు, పూల చెట్టూ తిరుగుతున్న భ్రమరాలు, అక్కడికి ఎన్నోసార్లు వచ్చింది ఐశ్వర్య, అడుగడుగూ ఆమెకు పరిచయమే కానీ, ఇప్పుడు కొత్తగా అడుగు పెడుతున్నట్టుగా ఉంది.

గుండెలో ఏదో గుబులు బైల్దేరింది. అడుగులు తడబడుతునాయి. "హాయ్ ... ఐసూ! ఎప్పుడొచ్చావ్! అందరూ బాగున్నారా ...?'' ఇంట్లోకి అడుగుపెట్టగానే సిద్ధార్థ కంఠం వినిపించింది. గది నిండా పత్తి రాశిలా పోసు ఉంది. పత్తి మధ్యలో సగం వరకు కూరుకుపోయి ఉన్నాడతను. పైకి రావాలని ప్రయత్నిస్తూ మరింతగా కూరుకుపోతున్నారు. ఐశ్వర్యకు నవ్వాగలేదు. బ్రీఫ్ కేస్ కింద పెట్టి పకపకా నవ్వింది. "సమయానికొచ్చావ్ ... కాస్త సాయం పట్టు ...'' చేతిని ముందుకు జాచాడు సిద్ధార్థ. పక్కనే ఉన్న ధాన్యం బస్తానెక్కి సిద్ధార్థ చేతిని అందుకుందామె. ఒక్కసారిగా శరీరంలో షాక్ ... ఐశ్వర్యలో కొత్తగా ఏదో గిలిగింత మొదలైంది.

బలంగా దృఢంగా ఉన్న సిద్ధార్థ చేయి ఐశ్వర్య చేతుల్లో ఇమడలేదు. పట్టుకోవడమైతే పట్టుకుంది గాని అలజడికి తట్టుకోవడం లేదు. వెంటనే చేతిని వదిలింది. పైకి లేవబోతున్న సిద్ధార్థ మళ్ళీ జారిపోయాడు. జారుతూ ఐశ్వర్య చేతిని అందుకున్నాడు. మళ్ళీ ఒంట్లో విద్యుత్ ప్రవహించింది. మణికట్టు వద్ద అతడి పిడికిలి బిగులుసుకుంటుంటే గుండెలో తీయని బాధ. అప్రయత్నంగా ఆమె ఎడమ చేయితో సిద్ధార్థ చేతిని నిమిరింది. పచ్చని చేతిపై గుబురుగా దట్టంగా పెరిగిన వెంట్రుకలు అరచేతిలోని నరాల స్వరాలను సుతారంగా మీటాయి. ఓపలేక ఒక్క క్షణం తొట్రు పడింది ఐశ్వర్య. అంతే! అమాంతంగా పత్తి గుట్టపై ... సిద్ధార్థ మీద పడిపోయింది.

ఓణీ భుజం మీద నుంచి జారిపోయింది. లంగా మోకాళ్ళ పైకి లేచింది. సుతిమెత్తని పత్తి ఆమెను చిన్నగా కుదిపి లేపి సిద్ధార్థ అక్కున చేర్చింది. పత్తిపువ్వులా అందాలు విచ్చుకోగా దిగ్గున లేచి కూర్చుంది ఐశ్వర్య. అతడికి సమీపంలో ఆమె ఎంతగా అంటే అతడి ఊపిరి వేడి ఆమె గుండెల్ని తాకుతుంది. అది గుండెలో మంటల్ని రేపుతుంది. ఒకసారి తనని తాను చూసుకుంది ఐశ్వర్య. రెండు చందమామల్ని కలిపి బంధిస్తే ... కలిసి పోరాడుతున్నట్టు బిరుసెక్కిన అర్థభాగం అందాలు అతడి సహాయం అర్థిస్తున్నట్టు ఎదురు చూస్తున్నాయి. తల వంచుకుని తంటాలు పడి పైకిలేచింది ఐశ్వర్య.

ఆ లోపునే పైకి లేచాడు సిద్ధార్థ నవ్వుతూ. "ఆటక పైకి ఎక్కబోతూ జరిపదిపోయాను. అది సరే చుట్టూ మక్కచేను. మనిషి అలికిడి లేదు. తనపై చేయి వేస్తేనేం! ముద్దు చేస్తేనేం! వరసైన ఆడపిల్ల సరసన ఉంటే కాస్త సరసం చేస్తేనేం! ఏం మనిషి ఇతడు ...?' ఆలోచిస్తూ నిలబడింది ఐశ్వర్య. అలసటతో చెమటలు పట్టాయి. చిలకపచ్చ జాకెట్టు మీద నీలిరంగు ఓణీ గుట్టలా చుట్టూ పాయలా ప్రవహిస్తున్న గోదావరిలా ఒదిగి పోయింది. సన్నని నడుంపై నిలువనంటున్న లంగా ఎక్కడికో జారి ఆగిపోతే గుమ్మడి పువ్వులా విచ్చుకున్న నాభి చిరుచెమటకు తడి చేరి మెరుస్తుంటే కావాలనే అందమైన శిల్ప భంగిమలో నిలబడింది ఐశ్వర్య.

"మంచె ఎక్కుదామా ...? అడిగాడు సిద్ధార్థ, అక్కడైనా మనసు విప్పుతాడని సరేనంది. సిద్ధార్థ పైకెక్కి చేతిని ఆసరాగా ఇచ్చాడు. అతడి చేతిని అందుకుంటూ కళ్ళలోకి సూటిగా చూసింది ఐశ్వర్య. నిచ్చెన ఎక్కబోతుంటే ఓణీ జారింది. నిర్లక్ష్యంగా మంచెపైకెక్కింది. కావాలనే చివరి అడుగును అతడి కాలిపై వేసింది. అడుగు కింద అతడి కాలు నలిగిపోతుంది. అరికాళ్ళలో మెల్లగా కంపనం మొదలయి శరీరమంతా పాకింది. ఏదో అవయవాలు ఏదో స్పర్శను కోరుకుంటున్నాయి. చేతిలో చేయి నలుగుతోంది. మునిపంటి పెదవిని నొక్కిపెట్టి కొనకంటితో చూస్తుంటే మునిలా నిశ్చలంగా ఉన్నాడు సిద్ధార్థ.

మంచెమీద నుంచి గుడిని, ఊరిని, గుట్టలను, కొండలను మాత్రం చూపించాడు. తిరిగి వస్తూ పంపు వద్ద నీళ్ళు తాగుతుంటే అక్కడే వున్న పలేల్పడుచు ఐశ్వర్యను చూస్తూ ముచ్చటగా అడిగింది సిద్దార్తను "ఎవరీమె ... బావా ...''

"మా మేనమామ కూతురు'' అన్నాడు సిద్ధార్థ. "పెళ్ళి చేసుతుంటావా?'' అడిగిందామె. "మొన్ననే చెప్పాను గదా! నిన్ను తప్ప ఎవరినీ చేసుకోనని'' సిద్ధార్థ అన్నాడు. పడుచు సిగ్గుతో పరిగెత్తింది. ఐశ్వర్య చల్లబడి పోయింది. తనలోని భావాలను ఎక్కడా బయట పెట్టలేదు. ఇంటికి వచ్చేసరికి అత్తయ్య కనిపించింది. కాసేపు మాట్లాడినాక వెళ్లిపోతానని బట్టల్ని సర్దుకుంది ఐశ్వర్య. అప్పటికి చీకటిగా వుంది. "ఇంత రాత్రివేళ ఎలా వెళ్తావు ఊర్లోకి బస్సు కూడా రాదిప్పుడు'' అంటూ సర్ది చెప్పింది అత్తయ్య.

"బావను బైక్ మీద క్రాస్ రోడ్డు వద్ద డ్రాప్ చేయమను. అక్కడి నుంది సిటీకి ఎన్నో బస్సులు బస్టాండ్ ముందే ఇళ్ళు. ఏ రాత్రి దిగినా వెళ్ళవచ్చు'' దుఃఖాన్ని ఆపుకుంటూ అన్నది. ఒక్క క్షణం కూడా నిలవాలనిపించడం లేదామెకు. ఎంత చెప్పినా వినడం లేదు. గదినిండా కన్నీరే ఉంది. కదిపితే కాలువై పారేట్టుగా వుంది. ఆమెకు ఇష్టమని ఎద్దుబంది కదతానన్నాడు సిద్ధార్థ. వద్దని వారించి బైక్ తీయించింది ఐశ్వర్య. క్రాస్ రోడ్ వెళ్ళాలంటే అయిదారు కిలోమీటర్లు దాటాలి. నిర్మానుష్యమైన అడవి. వెన్నెల విరగకాస్తుంది.

బైక్ మీద అంటీ ముట్టనట్టు కూర్చుంది ఐశ్వర్య. కొద్ది దూరం వెళ్ళాక బైక్ ఆగిపోయింది. ఇద్దరూ దిగారు. ఏమైందని అడిగింది భయంగా ఐశ్వర్య. బోర్ లో పిస్టన్ చిక్కిపోయి ఆగిపోయిందని చెప్పాడు భయంగా చూస్తుంటే సిద్దార్థ నవ్వుతూ ఐశ్వర్యను దగ్గరకు తీసుకున్నాడు. తన బాహువులతో బందీని చేసి పెదాలను అందుకున్నాడు. ఈ హఠాత్పరిణామానికి విస్తుపోయి ఐశ్వర్య తేరుకోక ముందే ఒళ్ళంతా ముద్దులతో ముంచెత్తాడు.

"బామ్మ నాకు అంతా చెప్పింది. శోభనం మల్లెపందిరి కిందే ఏర్పాటు చేశారు. పందిరి నిండా పూచిన మల్లెపూలు. పందిరి మంచం నిండాయి. ఆ రోజు సిటీ నుంది బైక్ మీద వస్తుంటే అక్కడే మళ్ళీ ఆగిపోయింది బైక్. "ఏమైంది ...?'' భయంగా అడిగింది. "మొదటిరోజు గుర్తొచ్చి సిగ్గుల మొగ్గయింది ఐశ్వర్య. "అంటే తెలుసా ...? నా మనసు నీ హృదయంలో చిక్కుకుంది చూసుకుని'' అంటూ ఆమెను తమకంగా అల్లుకు పోతుంటే ఇసుక తిన్నెల పట్టు పానుపులయ్యాయి.

అడవి మల్లెలు మంచి గంధాన్ని పూసి గాలితో రాయబారమంపాయి. చంద్రుడు సిగ్గుపడి మబ్బుల చాటుకు దాక్కుంటే చుక్కలు కాపలా కాశాయి. సిద్ధార్థ ఆమెలోని అణువణువూ తడిమి మీటుతుంటే రెట్టింపు వేగంతో ఎదురుదాడికి దిగింది ఐశ్వర్య.