The content in this feature is rated as "A++". You must be at least 18 years old to view this feature.
Home>>Khajuraho>>Khajuraho
ఖజురాహో - 86

లిన్ కిటికీలు తెరిచి తొంగి చూశాడు బయటికి.

అదే వాతావరణం ...

అదే వాన చినుకులు, తడిసిపోయిన ఆకాశం ... వాన చినుకుల్లో అభ్యంగనస్నానం చేస్తున్న ఖజురాహో శిల్పాలు ముసి ముసిగా నవ్వుకుంటున్నట్టు అస్పష్టంగా అగుపిస్తున్నాయి. తనిప్పుడు ఆ శిల్పాలకు దూరంగా వెళ్ళిపోతున్నాడు.

మళ్ళీ వాటిని స్పర్శించలేడు, పలుకరించలేదు. "అప్పటి ప్రధాన శిల్పాచార్యుడు శీలభద్రుడు, అపురూప సౌందర్యరాశి భవానీ శిల్పాలు ఇక్కడే ఎక్కడో కొలువుతీరి వుంటాయి. నాకు కూడా తెలియదు గాలించాలన్నాడు గైడు ...'' గతం గుర్తుకు రాగానే లిన్ కళ్ళు చెమ్మగిల్లాయి. ఎవరో తలుపులు తట్టిన శబ్దం ...

లిన్ తేరుకుని, పిళ్ళై వచ్చి ఉంటాడన్న ఆత్రంతో వేగంగా నడుస్తూ వెళ్లి తలుపులు తీశాడు లిన్. ఓ అందమైన అమ్మాయి చేతిలో సూట్ కేస్, నలిగిన దుస్తులతో నిలబడి ఉంది.

"లిన్ గారికి నమస్కారం!'' అంటూ తన ముద్దులొలికే ముకుళిత హస్తాలతో అభివాదం చేసింది. నీలి ఆకాశం రంగు నిండిన చీరే జాకెట్టుతో మెరిసిపోతున్న ముక్కుపుడక, మేడలో బంగారు చైనులాకెట్టు, చేతులకి మట్టి గాజులు ... చూపు తిప్పుకోలేకపోయాడు లిన్.

"మీరు ...'' అంటూ ప్రశ్నార్థకంగా చూశాడు లిన్.

"మీరు నిన్నెప్పుడూ చూడలేదు. కానీ నేనెవరో మీకు బాగా తెలుసు. ఎప్పటినుంచో మీ పలకరింపుల కోసం ఎదురుతెన్నులు చూసిన ఓ అభిమానిని ... మీ ...''

"ఓ, నీవు అనామికవు కదూ! ... ఫెంటాస్టిక్!'' అన్నాడు లిన్.

"ఇప్పటి వరకూ అనామికనే, కానీ నా అసలు పేరు దుర్గాభవానీ ... మీరు అమెరికా వెళ్ళిపోతున్నారని తెలిసి చూద్దామని ...''

"వెల్ కమ్ భవానీ! వెల్ కమ్! కొంపదీసి నీవు ఖజురాహో భావానీవి కాదు కదా?'' అంటూ బిగ్గరగా నవ్వాడు లిన్.

"భయపడకండి! నేనా భవానీని కాదు. అంతటి అందం నేనెక్కడినుండి తేనూ? ఫ్రెష్ గా తయారై మళ్ళీ మీతో మాట్లాడతాను ...''

" ఓ.కే. నో ప్రాబ్లమ్! బాత్ రూంలో గీజర్ వుంది. రిఫ్రెష్ యువర్ సెల్ఫ్'' అంటూ లిన్ డార్టన్ సూటుకేసులు సర్దుకోసాగాడు.

తలంటుస్నానం చేసిన దుర్గ ఒక గంటకుగానీ తెమలలేకపోయింది. మల్లెపూవులాంటి తెల్లటి దుస్తుల్లో దేవదూతలా వుంది. ఛామన ఛాయా రంగైనా ముద్దులొలికే ఆకర్షణ నిండుగా వుంది. జుట్టును టవల్ తో ముడివేసుకుని సోఫాలోకొచ్చి కూర్చున్న దుర్గ గదినంతా పరిశీలనగా చూడ సాగింది. ఇంతలో లిన్ రెండు కప్పుల్లో కాఫీ తీసుకుని వచ్చి కూర్చున్నాడు.

"అయ్యయ్యో! మీరు కాఫీ చేసుకుని తెచ్చారెంటీ? నేనున్నానుకదండీ!'' అంటూ లిన్ చేతిలోని ట్రేను అందుకుంది భవానీ.

"డోంట్ వర్రీ! నో ప్రాబ్లమ్. అతిథి మర్యాదంటే భారతీయులకు చాలా ఇష్టం కదా! అదే నేను చేశాను. ఇట్స్ ఈ ప్లేజాజ్ టు మీ. అందులోనూ నీవు నా ప్రియమైన అభిమానివి కదా!'' అనగానే సిగ్గుపడిపోయింది దుర్గ. బుగ్గలమీద అందమైన సొట్టలు పడగా లిన్ వాటిని క్షణకాలం తిలకించాడు.

"పైజామా, జుబ్బాలో మీరు అచ్చంగా భారతీయుల్లా వున్నారు. మీ ఆ బ్లూ బస్ చూస్తె మాత్రం విదేశీయులనిపిస్తారు. మరిచిపోయా! మీ ప్రియమైన గైడ్ గారు శ్రీమాన్ సుబ్రహ్మణ్య పిళ్ళైగారు? ఎలా వున్నారు?

"ఖజురాహో కథ పూర్తీ చేసి వెళ్ళినవాడు ఇప్పటివరకూ తిరిగి రాలేదు. ఖజురాహో అంతా గాలించినా కనపడలేదు. నిన్నెప్పుడూ కుట్టి, కుట్టి అనేవాడు'' "ఏమై వుంటాడంటారూ?''

కాఫీ కప్పు, ట్రేలో పెడుతూ అంది దుర్గ.

"ఐ డోంట్ నో, నీవు రెస్ట్ తీసుకో భవానీ! ఇంతలో నేను బయటికి వెళ్లి వస్తాను' అంటూ వెళ్ళిపోయాడు లిన్.

దుర్గాభవానీ గెస్ట్ హౌస్ గదులన్నీ చూస్తూ లిన్ బెడ్ రూంలో కెళ్ళి పడుకుంది. ఎదురుగా గోడమీద 'ఖజురాహో' సుందరి వుంది. పురుషుడి బలమైన బాహువుల్లో తనువూనర్పించి కళ్ళుమూసుకున్న వాల్ పోస్టర్ ను గెస్ట్ హౌస్ వారే అతికించినట్టుంది. ఖజురాహో నలువైపులా వాతావరణమంతా సమ్మోహనంగా వుంది.

ఇంతకాలంగా లిన్ పురుషుడిగా వుండి ఒంటరిగా ఎలా కాలం గడుపుతున్నాడో! వయస్సు మళ్ళినా ఆరోగ్యంగానే వున్నాడు. విదేశీయులకు వయసు పట్టింపు అంతగా వుండదు. అరవైలో కూడా యువకుల్లా వుంటారని ఎక్కడో చదివినట్టు గుర్తు. ఇలానే ఆలోచించుకున్న భవానీకి ఎప్పుడు కళ్ళు మూతలు పడ్డాయో తెలియదు. ఆదమరిచి నిదురపోయింది.