- సామర్ల లక్ష్మీ రాజ్
.png)
”ఏయ్… ఏయ్ ఏమిటిది? మరీ అలా రెచ్చిపోతున్నారు? ఊహో …! ప్లీజ్ కొంచెం ఆగండి సార్…? కొంచెం బ్రేక్?” ఆమె మెత్తగా కసిరింది. కానీ ఆ కసరటంలో ఓ వయ్యారం …. ఓ కొంటెతనం అతన్ని మరింత ‘ఉసి’ గొల్పుతున్నాయి.
”ప్చ్! ప్లీజ్ ప్లీజ్… ఇదేం బాలేదు? అలా వూరిస్తూ నన్ను దూరంగా ఆపేయటం భావ్యమా? వూ … నేను ఆగలేనోయ్…?” అతను చిన్నపిల్లాడిలా మారాం చేస్తున్నాడు. ఆమె అతని చేతికి ‘పట్టు’ దొరక్కుండా వూరించేస్తోంది. మెల్లగా అతని చేయి ఆమె చేయిని లాగింది… చటుక్కున బ్యాలెన్స్ తప్పి అతని ఒళ్ళో పడింది… ఆ పడటం పడటం ఆమె పైట జారిపోయింది… ఆమె ఎద ఎత్తులు చూసేసరికి అతని కళ్ళు చెదిరిపోయాయి… ఆమె అప్పుడే ఏర్చి కూర్చి కట్టిన ‘పూలగుత్తిలా’ ఫ్రెష్ గా వుంది. కంటికి… ఒంటికి… యింపుగా… ఒంపుగా… అతను ఆమెను గట్టిగా హత్తుకున్నాడు.
ఎద పొంగులన్నీ అతని కౌగిలిలో నలిగిపోతుంటే అదో హాయిగా అనిపించేస్తూంటే ఆమె ‘ఊ’ అంది మత్తుగా…! అంతే… ! ఆ మాటే గ్రీన్ సిగ్నల్ అయింది అతగాడికి. ఎడారిలో దాహంతో తపిస్తున్నవాడి ఎదుట నీటి చెలమ వున్నట్టుగా అతను చెలరేగిపోయాడు. ఆమె ఒళ్ళంతా ముద్దులతో నింపేశాడు. అతని అధరం తాకినా ప్రతి ప్రదేశం ఓ మధురమే! ఒళ్ళంతా తమకం…. తనువంతా తాపం… ఆప లేని మొహం… ఏదో కావాలని ఆవేశం… కోరికల పుట్ట పగిలింది… ఈసారి ఆమె విజ్రుంభించింది… అతన్ని గిల్లుతూ… ముద్దు పెట్టేస్తూ… ఎక్కడ పట్టుకుంటే అతను వెర్రెక్కిపోతాడో ఆ ప్రదేశాలను కావాలని మరింత సున్నితంగా రాస్తూ… రెండు కోడె త్రాచులు పెనవేసుకుంటున్నట్టుగా… నగ్నంగా రెండు శరీరాలు… శృంగారం ఒక స్థాయికి చేరితే వర్ణించటం బహు కష్టం.
అందుకే చీకట్లో చేసుకోవాలి అన్నారు పెద్దలు. కానీ ఇక్కడ జరుగుతోంది అందుకు విరుద్ధంగా…! అదీ పట్టపగలు…! ఆ రతీ కార్యాన్ని కిటికీ చాటునుండి చూసిన ఆమెకు తను చూస్తున్నది వాస్తవమా? లేక ఏదైనా ‘బ్లూ ఫిల్మా’ అని అనుమానం వచ్చేసింది. కానీ అది నిజమని తెలుస్తూనే వుంది. అప్పుడే పుట్టింటి నుండి భర్త మీద అతి బెంగతో గొప్ప ఆరాటంగా వచ్చేసింది. తీరా వచ్చి చూసేసరికి ఇల్లు లోపల తాళం వేసి వుంది. పెరటివైపు వచ్చి ‘బెడ్ రూం’ కిటికీ నుండి చూస్తే ఏం వుంది? అక్కడ ‘రాసలీల’ రసరమ్యహేలగా సాగిపోతోంది. అతను అంత తెగిస్తాడనీ…
అసలు అటువంటి వ్యక్తి అనీ తెలీక ఎంత పొరబడిందో ఆమెకు బాగానే తెలిసొచ్చింది ‘ఒంట్లోకి – మతిలోకి కూడా’ అది ఆమె ఇల్లు… అతను ఆమె భర్త… ఇది పచ్చి నిజం… కానీ తన భర్తను… ఆ పక్కను పంచుకున్న స్త్రీ మాత్రం ఎవరో ‘పరాయి ఆడది…!”
*****
తెలతెల్లవారింది… ఇంకా ఎంతో బద్ధకంగా అటువైపు తిరిగి పడుకున్న భార్యవైపు చిత్రంగా చూశాడు అతను. ”ఏయ్… ప్రియా… ఏవిటోయ్ ఆ నిద్ర… ఒంట్లో బాలేదా…? ఎనీ ప్రాబ్లెం, పోనీ డాక్టర్ దగ్గరకి వెళదామా…?” ఆదుర్దా నటిస్తూ ఆమె ముంగురులు సవరిస్తున్నాడు అతడు. ఆమె కళ్ళిప్పలేదు కావాలే. అతను మరింత కంగారుగా… ”ఏవిటో ప్రియా… నువ్వు వుదయాన్నే లేచి ఇంట్లో తిరిగితే ఎంత కళగా వుంటుందో తెలుసా…? ఏవిటో ‘డల్’ గా వుంది ఈ మార్నింగ్ నాకు” … అంటూ
”ఆ … అన్నట్టు… ఈ రోజు శ్రావణ శుక్రవారం అన్నావ్ మరిచిపోయావా…?” అంటూ ఆమెను తట్టి లేపుతూ అతను దిగాలుగా మొహం పెట్టాడు. ఆమె మెల్లగా కళ్ళు తెరిచింది. సూటిగా అతని కళ్ళలోకి చూసింది. గ్రహించగలిగి వుంటే ఆ కళ్ళల్లో కోటి భావాలు… ”అదేమిటోయ్… ! అలా చూసావ్…? ప్రతిసారీ ఈ రోజు తెగ హడావిడి పడిపోయి మమ్మల్ని కంగారు పెట్టేసేదానివి, పూజలు, పునస్కారాలంటూ… ఏవిటివాళ ఇలా…?” మౌనాన్ని చీల్చుకుంటూ అప్పుడు పేల్చింది బాంబు…! మాటలతో ఆటంబాంబులు… ”పూజలూ.. పునస్కారాలూ… హు…! మా ఆడవాళ్ళం ఎంత పిచ్చివాళ్ళం…! మా సౌభాగ్యం కోసం… భర్త క్షేమం కోసం రోజంతా ఉపవాసాలుండి పవిత్రంగా పూహాలు చేస్తాం… ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాం కానీ…”
”ఈ మొగుడు ఇంట్లో నాటకాలాడుతూ భార్య కళ్ళు గప్పి పబ్లిక్ గా పరాయి దానితో తిరుగుతాడు… పట్టపగలే ఇంట్లో ఇంకోదాని ‘పక్కలో’ దూరిపోతాడు… పెళ్ళానికి ద్రోహం చేస్తాడు… ఎవరి సంగతో నాకు తెలీదు… నా మట్టుకు నేను ఇహ ఏ పూజలూ చేయను. ఆ దేవుడిని కొలుస్తూ శ్రావణ శుక్రవారాలంటూ పవిత్రమైన ఆ రోజుని ఇక నుంచి పాడు చెయ్యాలని లేదు … దట్సాల్…”
అతనికి అర్థమైపోయింది. భార్య మొహం మీద కొట్టకుండానే మాటలతో కొట్టుకొచ్చింది ఇన్ డైరెక్ట్ గా. గట్టిగా చెప్పాలంటే ”నీ వెధవ తిరుగుళ్ళన్నీ నాకు తెలిసిపోయాయ్… నీలాంటి వాడికోసం నేనే వ్రతాలు, నోములు చేయను. నువ్వెట్లా పోయినా నా కానవసరం… గో… టూ… హెల్…!! ఏ భర్తకైనా అంతకంటే పెద్ద శిక్ష ఇంకేం వుంటుంది. ఇహ ఈ జన్మలో భార్య తనని నమ్మడాని తెలిసిపోయింది అతనికి! అవమానంతో అతని మొహం నలుపెక్కుతూ తల భూమిలోకి వాలిపోయింది…!
|
|


