The content in this feature is rated as "A++". You must be at least 18 years old to view this feature.
Home>>Jokes>>Kameshwari Leela Kamaraju Kala
కామేశ్వరి లీల - కామరాజు కల

ఆ నవలంటే రామచంద్రానికెంతో ఇష్టం. నాలుగేళ్ళక్రితం చదివిన ఆ నవలలో ప్రేమకు కొత్త నిర్వచనాలు తెలుసుకున్నాడు. కలకూ, వాస్తవానికీ భేదం తెలుసుకున్నాడు. ఆ నవల మళ్ళీ చదవాలంటే దొరకలేదు. నిన్న పార్కులో కామేశ్వరితొ కబుర్లు చెబుతుంటే ఆ నవల ప్రసక్తి వచ్చింది. ఆమెకూ అదంటే ఇష్టమే కాదు. ఆ నవల కాపీ ఆమె దగ్గరుంది. తనకిష్టమైన నవల ప్రియురాలికి ఇష్టమని రామచంద్రం పొంగి పోయాడు. అయితే ఆ నవల గురించి చర్చిస్తూంటే అందులోని చాలా సంఘటనలు గుర్తులేవని గ్రహించాడు.

మరోసారి ఆ నవల చదవాలకున్నాడు. పార్కు నుంచి ఇద్దరూ కామేశ్వరి ఇంటికి వెళ్ళారు. ఆమె అతడికి ఆ నవల ఇచ్చింది. అతడది తీసుకుని రూం చేరుకున్నాడు. స్థిమితపడ్డాక నవల తెరిచాడు. కామేశ్వరి నవలను శ్రద్ధగా చదివినట్లుంది. అందులో చాలాచోట్ల కొన్ని వాక్యాలు రెడ్ ఇంక్ తొ అండర్ లైన్ చేయబడి ఉన్నాయి. అలా చేయబడిన ప్రతి వాక్యమూ ఏంతో అద్భుతంగా వుంది. ఆమె అభిరుచిని మనసులోనే అభినందించుకుంటూ అతడు పుస్తకంలో అలాంటి వాక్యాలన్నీ ముందు చదవాలని పేజీలు తిరగేస్తూంటే – మధ్యలో రెండు పేజీల మధ్య ఒక పల్చటి ఇన్లాండ్ కవర్ కనబడింది. కవరు చిరునామా కామేశ్వరిది.

ఫ్రం అడ్రస్ వద్ద రాజా అని మాత్రముంది. రామచంద్రానికి తెలిసి కామేశ్వారికి రాజా పేరుతొ పరిచయమున్న వాళ్ళు లేరు. అయినా కుతూహలం కొద్దీ అతడా ఉత్తరం చదివాడు. ”డియర్ కామూ! జీవితంలో మరపురానిడీ, మరువలేనిదీ నాకు నీ స్నేహమొక్కటే! నీకంటే మూడేళ్ళు ముందు పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అందుకే నాకు పెద్దరికాన్నిచ్చి అన్ని సందేహాలూ నా దగ్గర తీర్చుకునేదానివి. ఇరుగుపోరుగులం కావడంతో మన సాన్నిహిత్యం అరమరికలు లేని స్థాయికి చేరుకుంది.

పదహారేళ్ళ వయసప్పుడు నీకు ఎన్ని సందేహాలు కలిగేవి! నీ సందేహాలు తీర్చడం కోసమే నేనూ ఎన్నో సెక్సు సైన్సు పుస్తకాలు చదివాను. అప్పట్లో మనిద్దరం ఇలాంటి కబుర్లు చెప్పుకునేందుకు ఏకాంతం కోసం ఎంత తాపత్రపడే వాళ్ళం! ఎన్నోసార్లు ఒకరినొకరు హత్తుకుని పడుకుని మనం భార్యాభర్తలమైతే ఏంతో బాగుండేదనుకునే వాళ్ళం కదా! కానీ దేవుడు మనకా అదృష్టం లేకుండా చేశాడు. అబద్దమెందుకు –పెళ్ళై రెండేళ్లయినా ఇంకా నీ పరిష్వంగ సుఖాన్ని మరువలేకున్నాను. ఇప్పట్లో మనం కలిసే అవకాశాలులేవు కాబట్టి ఉత్తరాలు మాత్రం విధి తప్పకుండా రాస్తూండు.

మనం కలుసుకున్నప్పుడు మాత్రం – నువ్వు నా కోసం కనీసం ఒక్క రాత్రి కేటాయించాలి. నీకు పెళ్లైనాసరే! అన్నట్లు నీ ఉత్తరంలో ఆ సందేహాలెం లేవేమిటి? ఇప్పుడు నేనిచ్చే జవాబుల్లో అనుభవం కూడా జతపడుతుంది. నా స్నేహాన్నుపయోగించుకునేందుకు నీకు ఇదే మంచి టైము. ఇక ఉంటాను – నీ రాజా” రామచంద్ర నివ్వెరపోయాడు. కామేశ్వరినతడు ప్రేమిస్తున్నాడు. త్వరలోనే ఆమెను పెళ్ళి చేసుకోవాలని అనుకుంటున్నాడు. ఆమె రూపం, గుణం, అభిరుచులు అన్నీ అతన్ని అపరిమితంగా ఆకర్షించాయి. ఇప్పటికీ ఆకర్షిసూనే ఉన్నాయి. ఇంతకాలం ఆమె అమాయకురాలని నమ్మాడు. ఇప్పుడిక నమ్మలేడు. అతడిక నవల చదవలేకపోయాడు.

రాత్రంతా సరిగ్గా నిద్రపట్టలేదు. రకరకాల కలలు వచ్చాయి. కలతనిద్రలో అందులో రాజా, కామేశ్వరి విచ్చలవిడిగా విహరిస్తున్నారు. కామేశ్వరి తనను రాజుకు చూపి హేళన చేస్తోంది. రాజా నవ్వుతున్నాడు. అతని రూపురేఖలు తెలుసుకోవాలంటే చాలా అస్పష్టంగా వుంది. తెల్లారేసరికి రామచంద్ర ఒక నిర్ణయానికి వచ్చాడు. కామేశ్వరి తనకు గతం చెప్పకుండా మోసగించింది. తనూ ఆమెను మోసగిస్తే! అలాంటి ఆలోచన పుట్టకూడదే కానీ అది వామనావతారంలా విజ్రుంభిస్తుంది. ఆ సాయంత్రం అతడు కామరాజుని కలుసుకున్నాడు. కామరాజు రామచంద్రం కంటే అయిదేళ్ళు పెద్ద. ఒకరోజున అతడు బస్టాపులో ఒంటరిగా వున్న యువతినుద్దేశించి నర్మగర్భంగా మాట్లాడుతుంటే ఆ మాటలు వినలేక రామచంద్రం ముఖం చిట్లించుకున్నాడు.

బస్సేక్కాక ఇద్దరూ పక్కపక్క సీట్లలో కూర్చున్నారు. కామరాజు అతడితో, ”అపరిచితుడైనా మీతో ఆ అమ్మాయి గురించి మాట్లాడేనని మీకు నచ్చలేదు కదూ! కానీ నాకు మీతో పనిలేదు. ఆ అమ్మాయికి నచ్చే పని చేయడమే నా ఇష్టం. అందుకు అపరిచితులైనా సాధనం చేసుకుందుకు సంకోచించి” అన్నాడు. ”ఆమె మీకు తెలుసా?” అన్నాడు రామచంద్రం. కామరాజుకు ఆమె తెలియదు. కానీ ముఖంచూసి అమ్మాయిల మనస్తత్వాన్నిట్టే అంచనా వేయగలదు. బస్ స్టాప్ లొ కనిపించిన అమ్మాయి కామెంట్లు ఎంజాయ్ చేస్తుందిట. ఎవరూ కామెంట్లు విసరకపోతే తను ఆ రోజుకి ఎవర్నీ ఆకర్షించలేకపోయానని చిన్నబుచ్చుకుంటుందిట. అలా ప్రారంభమైంది వారి పరిచయం. రెండ్రోరోజుల్లోనే ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు.

ఆడపిల్లల మనస్తత్వాల గురించి విని పలకరించే వయసు కావడంతో కామరాజు కబుర్లు రామచంద్రానికి నచ్చేవి. మరో విశేషమేమిటంటే కామరాజు మాట్లాడే మాటల్లో అసభ్యత అనేది ఉండదు. పైగా సంస్కారం కూడా ఉంటుంది. అతడెప్పుడూ దేనికీ ఏ ఆడపిల్ల గురించీ తప్పుముక్క అనలేదు. ఇష్టపడే అమ్మాయిల గురించి అతడు విసిరే కామెంట్లు ముఖమండలాన్ని దాటి క్రిందకు వెళ్లవు. పాదాలు దాటి పైకి వెళ్లవు. దుస్తుల్ని దాటి లోనికి చొరబడవు. తనమీద తనకి ఎంత నమ్మకమో – అతడెప్పుడూ ఏ ఆడపిల్లచేతా మాట పడలేదంటే మనస్తత్వశాస్త్రంలో నిధి అనే అనుకోవాలి. ఒకసారి రామచంద్రం కామేశ్వారిని కామరాజుకు పరిచయం చేశాడు.

కామరాజు ఆమెతో పుస్తకాల గురించి, ఆర్ట్ ఫిలింస్ గురించీ మాట్లాడేడు. పొరపాటున కూడా అందం ప్రసక్తి రాలేదు. తర్వాత ‘నా ఫియాన్సీ అని గౌరవించారు. థాంక్స్’ అన్నాడు రామచంద్రం కామరాజుతో. ”మనకలాంటి మొహమాటాలు లేవు. మీరిష్టపడ్డ అమ్మాయి టైపు వేరు. ఆమె శృంగార జీవితం భర్తకే అంకితం. ఆమె ఆడతనం పడకటింటికే పరిమితం. అలాంటివాళ్ళతొ మగాళ్ళతో ఎలా మాట్లాడతామో అలా మాట్లాడాలి. అంతే చేశాను. మీరు చాలా అదృష్టవంతులు. ఆమె అభిరుచులు వ్యక్తిత్వం అరుదైనవి” అంటూ వివరించాడు కామరాజు. అప్పుడు రామచంద్రం ఛాతీ గర్వంతో ఉబ్బింది.

ఇప్పుడీ ఉత్తరం అతన్ని కృంగదీసింది. దీనికి కామరాజేమంటాడో అనుకున్నాడు. తన మనస్తత్వశాస్త్ర సామర్థ్యానికి మొదటి దెబ్బ తగిలిందని చిన్నబుచ్చుకుంటాడేమో… కామరాజు ఉత్తరం చూసి చలించకుండా, ”ఉత్తరాన్ని యథాప్రకారం నవలలో పెట్టి ఆమెకు వెనక్కిచ్చేయండి. మీరామెను పూర్తిగా నమ్మండి. ఆమె గొప్పతనం నిలకడమీద తెలుస్తుంది” అన్నాడు. ”ఇంకా తెలుసుకోవలసినదేమైనా ఉందంటారా?” అన్నాడు రామచంద్రం అసహనంగా. ”ఉత్తరం చదివి మీరేం తెలుసుకున్నారో నా కతమయింది. ముఖం చూసి నేను అన్నీ చెప్పగలను. కామేశ్వరికింకా పురుషస్పర్శ తెలియదు…”

”అయితే ఆ ఉత్తరం ఆమెకి కాదంటారా?” ”కావచ్చు. కానీ ఆ ఉత్తరంలో ఇతరులు చదవకూడని దేమీ లేదని ఆమె నమ్మకం. అందుకే అంత ధైర్యంగా ఓపెన్ బుక్ లొ ఉంచింది…” రామచంద్రం అసంతృప్తిగా ”తెలివితక్కువ హంతకుడు తేలిగ్గా దొరికిపోయే క్లూలు వదిలితే అతడు నేరస్తుడు కాకుండా పోతాడా?” అన్నాడు. కామరాజు కాదన్నట్లు తల అడ్డంగా ఊపి - ”కామేశ్వరి తెలివితక్కువదీ కాదు. నేరస్తురాలూ కాదు. ఉత్తరంలోని క్లూలతో లేని నేరాన్ని ఊహించుకోవడం నీ తెలివితక్కువ” అన్నాడు. ”అయితే మీ తెలివితో ఆ ఉత్తరంలోని క్లూలతో ఆమెను శీలవతిని చెయ్యండి” అన్నాడు రామచంద్రం.

”ముందు మీకొక కథ చెబుతాను. అది విని నా ప్రశ్నకు బదులివ్వడంలో మీ సమస్యకు పరిష్కారముంటుంది…” అన్నాడు కామరాజు. కామేశ్వరిని నిర్దోషిగా రుజువు చేయడం అతడికి ఇష్టమే! అందుకే రామచంద్రం, కామరాజు చెప్పే కథను చాలా శ్రద్ధగా విన్నాడు. కానీ కథ సీరియస్ గా లేదు. కామేశ్వరికి రాజు వ్రాసి ఉత్తరాన్ని మంచి వేడిగా ఉంది. ఒకరోజు కామరాజు తల్లిదండ్రులు ఉన్నట్లుండి ఊరు ప్రయాణమై వెళ్ళిపోయారు. వాళ్ళతో పాటు అతడి చెల్లెలు కమల వెళ్ళింది. వెళ్ళేముందు ”రాత్రికి సరళ మనింటికి కంబైండ్ స్టడీస్ కొస్తుంది. ముందుగా వెళ్ళి వాళ్ళింట్లో కబురు చెప్పు” అని హెచ్చరించింది.

తనవాళ్ళను బస్సెక్కించాక కామరాజు తిన్నగా ఆఫీసుకెళ్ళాడు. ఆఫీసునుంచి అలవాటు ప్రకారం తిన్నగా ఇంటికే వెళ్ళిపోయాడు. ఇంట్లో అన్ని ఏర్పాట్లూవున్నాయి ఆ పూట తిండికి, ఫ్లాస్కులోంచి కాఫీ తీసుకుని తాగాడు. టిఫిను తిన్నాడు. టీ.వీ. చూశాడు. ఎనిమిదింటికి భోంచేస్తుండగా సరళ విషయం గుర్తుకొచ్చింది. సరళ అతడి దూరపు బంధువులమ్మాయి. బీయస్సీ సెకెండియరు చదువుతోంది. కమలకు క్లాస్ మేటు, కంబైండ్ స్టడీస్ కో, కబుర్లకో – అప్పుడప్పుడు రాత్రిళ్ళు ఒకరింట్లో ఒకరు గడపడం కమలకూ, సరళకూ రివాజు. పైకి అనడంలేదుగానీ కామరాజుకు సరళను పెళ్ళి చేసుకోవాలనే ఉద్దేశ్యముంది. డిగ్రీ పూర్తయ్యేదాకా ఆగుదామని పైకి చెప్పలేదతడు. సాధారణంగా సరళ వచ్చేది తొమ్మిది గంటల ప్రాంతంలో. ఇప్పటికైనా మించిపోయింది లేదు

వెళ్ళి చెబుదామా అనుకుంటూ భోజనం పూర్తిచేసేసరికి పెద్దపెట్టున వాన మొదలైంది. అంతవరకూ ఉక్కగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది. అందువల్లనో ఏమో కామరాజుకు మత్తు ముంచుకొచ్చింది. ఈ వానలో సరళ మాత్రం ఎందుకొస్తుందిలే అని సరిపెట్టుకుని టీవి ఆఫ్ చేసి మంచమెక్కేశాడు. నిద్రపట్టేసింది. కాసేపటికి కాలింగ్ బెల మోగింది. చటుక్కున లేచాడు కామరాజు. గదిలో ఇంకా లైటు వెలుగుతూనే వుంది. గడియారం తొమ్మిదీ పది అయింది. కామరాజుకు మత్తు వదల్లేదు. వచ్చిందెవరై వుంటారా అన్న ఆలోచన కూడా అతడికి కలగలేదు, నిద్రలోంచి అసంకల్పిత ప్రతీకారచర్యలా లేచివెళ్ళి తలుపుతీయడం చిన్నప్పట్నుంచీ అతడికి అలవాటు. కనీసం పెళ్ళయ్యేదాకా అది పోదు. అలవాటు ప్రకారం వెళ్ళి తలుపుతీస్తే - గుమ్మంలో సరళ.

ఆమె వంటి సొంపులన్నీ శిల్పాకృతిలో బయటపడేటంతగా వానలో తడిసింది. ఏమయిందీ అని అతడడిగినా బదులివ్వలేనంతగా చలికి గజగజవణుకుతోంది. కామరాజుకు మత్తు వదిలింది. కానీ స్పృహరాలేదు. అతగాడు నోట మాటరాక చటుక్కున పక్కకు తప్పుకున్నాడు. సరళకా ఇల్లు కొత్తకాదు. ఆమె చరచరా లోపలకు నడిచి బెడ్రూం చేరుకుంది. అతడు తలుపులు వేసి పడకగది చేరుకునే సమయానికి ఆమె టవలుతో తల తుడుచుకుంటోంది. అతడు తటపటాయించి గుమ్మంలో ఆగిపోతే ఆమె ఏ మాత్రమూ సంకోచించకుండా తడిబట్టలు విప్పింది. అతడు నివ్వెరపోయి చూస్తున్నాడు. ఆమె నిలువుటద్దం ముందుకు కదిలింది.

అతడు వాస్తవంగా కబబడుతున్న ఆమె వీపు భాగాన్ని విడిచిపెట్టి అద్దంలో కనబడుతున్న ఆమె ప్రతిబింబాన్నే రెప్పవాల్చకుండా చూస్తున్నాడు. సరళ ఒళ్ళుతుడుచుకుంది. పొడిబట్టలు తీసి కట్టుకుంది. అప్పటికి ధైర్యం చేసి కామరాజు ముందుకు వెళ్ళాడు. సరళ అతన్ని నవ్వుతూ చూసి ”తెలుగుసినిమా చూసి ఇలా వస్తున్నాను. నన్ను చూస్తూనే తెలుగు సినిమా గుర్తొచ్చేలా వున్నాను కదూ!” అంది. కామరాజ్ కంగారుపడుతూ ”ఇంట్లో నేను తప్ప ఎవరూ లేరు. అయినా ఈ సమయంలో వచ్చావేమేటీ?” అన్నాడు.

”నాకు తెలిసే వచ్చాను. అయినా నాకు నీమీద చాలా నమ్మకం” అంది సరళ కొంటెగా నవ్వుతూ. అసలే తెలుగు సినిమా చూసింది. ఆపైన వానలో తడిసింది. ఆ నవ్వు ఆ రెంటికీ తగ్గట్టే ఉంది. ”కానీ నామీద నాకు నమ్మకంలేదు” అన్నాడు కామరాజు వెంటనే. ”ఓహో – నువ్వా నమ్మకం గురించి మాట్లాడుతున్నావా? త్వరలో నన్ను నువ్వు పెళ్ళి చేసుకుంటావన్న నమ్మకం గురించి నేను చెప్పాను. కాబట్టి ఇప్పుడేం జరిగినా నాకేం బెంగలేదు” అంది సరళ. ”కథనంత దాకా రానివ్వద్దు. పద… నిన్నింటిదగ్గర దిగబెడతాను…” అన్నాడు కామరాజు.

”అమ్మో- బయటింకా వానపడుతోంది. పోదిబట్టలు కట్టుకున్నా నాకింకా చలి తగ్గలేదు. ఇప్పుడు మళ్ళీ వానలో తడిశానంటే…” అంటూ సరళ వున్నట్లుంది అతన్ని బలంగా వాటేసుకుంది. ఎంత బలంగా అంటే వెంటనే ఇద్దరూ మంచం మీద పడ్డారు. ఆమె చేతుల్లో అంత బలముంటుందని ఊహించడం కష్టం. అయితే కామరాజు అప్పుడామె బలం గురించి ఆలోచించడంలేదు. ఆమె స్పర్శ అతడిని వేరేలోకాలకు తీసుకుపోతూంటే వాస్తవంలోకి రావడం కోసం ప్రతిఘటించసాగాడు. అందుకతడు చేసే ప్రతి ప్రయత్నమూ మధురానుభవాలనందించగా క్రమంగా మనసు బలహీనపడుతోంది.

ఆ సమయంలో సాయపడగలిగినది దేవుడొక్కడే అనిపించి ”దేవుడా… నా వల్ల తప్పు జరక్కుండా కాపాడు. ఒకవేళ తప్పు జరిగితే అదినాది కాదు. ఆమెది!” అనుకున్నాడు. అంతటితో ఆగక ”నువ్వు నన్ను రెచ్చగొడుతున్నావు. తప్పు జరిగితే అది నీది!” అని ఆమెక్కూడా చెప్పాడు. ”ఓ.కే… అగ్రీడ్” అంది సరళ. సరిగ్గా ఇక్కడా కథను ఆపాడు కామరాజు. రామచంద్రం వంక చూసి ”అప్పుడు తప్పు జరిగిందే అనుకో… ఎవరిదా తప్పు?” అన్నాడు. కథ అలా ఆగిపోవడం రామచంద్రానికి నచ్చలేదు. ”నిస్సందేహంగా తప్పు సరళది” అన్నాడతడు ప్రశ్నకు బదులిస్తూ. ”మీరు లోతుగా ఆలోచించలేదు. ఆలోచిస్తే సరళ వంటి అమ్మాయి అలా ప్రవర్తించడం అసహజంగా వున్నదనీ… తప్పు నాలోనే వున్నదనీ గుర్తించేవారు.” అన్నాడు కామరాజు నిట్టూర్చి.

”ఎలా…?” ”ఎందుకంటే నేను చెప్పిన విశేషం వాస్తవం కాదు కల. ఆమె గురించి అలాంటి కల కనడం నా తప్పేకదా!” అన్నాడు కామరాజు. ”అయితే ఆ రాత్రి ఆమె రాలేదా?” ”వచ్చింది. వానలో తడిసి మరీ వచ్చింది. ఇంట్లో ఎవరూ లేరని తెలియగానే ఒక్క నిమిషం కూడా ఆగకుండా ఇంకా వాన చినుకులు పడుతున్నా వెంటనే వెనక్కు వెళ్ళిపోయింది. మధ్యలో కాస్త తెరిపి ఇచ్చిందని ధైర్యంచేసి వస్తే మళ్ళీ వాన ప్రారంభమైందనీ, ఇంటిదగ్గర కంగారుపడతారనీ అంటూ గొణుక్కుంటూనే మోపెడ్ స్టార్ట్ చేసింది. అప్పుడు నేను నా కల నిజంకాలేదని ఎంత నిరుత్సాహపడ్డానో… కాబట్టి తప్పేవరిదంటారు?”

రామచంద్రం ఏం మాట్లాడలేదు . ”మనదేశంలో ఏ ఆడదీ తప్పు చేయదని నేను రాసివ్వగలను. మగాడి స్వార్థం, మగాడి కల, మగాడి అసహనం, మగాడి బలం… ఇన్నెందుకూ జస్ట్ మాగాడే అంటే సరిపోతుంది. ఆడదాని తప్పుకు కారణం….” అన్నాడు కామరాజు. అప్పటికి రామచంద్రం కామరాజు వద్ద సెలవు తీసుకున్నాడు. ఆ తర్వాత వారంరోజులకు అతడు కామరాజును కలుసుకుని ”ఆడదాని విషయంలో మీ అభిప్రాయం అక్షరాలా నిజం. నేను కామేశ్వరి మనసునొప్పించకుండా. ఆమెకనుమానం రానివ్వకుండా తెలివిగా కబుర్లలోకి దింపి, గతంలోకి పంపి తెలుసుకున్నదేమిటంటే రాజా పేరు రాజ్యలక్ష్మి… అన్నాడు.