.jpg)
పెళ్ళయి మూడు సంవత్సరాల తరువాత తనకు వచ్చిన మొదటి రాత్రిలా అనిపిస్తోంది ఆమెకి. తన భర్త తన దగ్గరికి వచ్చాడు. తను ఇంతకాలం పదిలంగా దాచుకున్న అందాలను కొల్లగొట్టబోతున్నాడు. అలా ఊహించుకోవడంవల్లే ఆమెకి తప్పు చేస్తున్నానన్న భావన కలగడంలేదు. ఎప్పుడైతే అలా అనుకుందో ఇక ఆమెకి ఏ సమస్యా లేకుండా పోయింది. సిగ్గు తప్ప మరేమీ లేదు.
అతనికేసి వట్టింది. అతను ముద్దులతో ఆమె శరీరాన్ని నానబెడుతున్నట్టు ఒళ్ళంతా అతను తనను ఆక్రమించుకుంటే ఇంకా బావుంటుందన్న ఆలోచనలతో తన శరీరాన్నంతా తన పెదవుల తడితో ముంచేస్తున్నాయి. నుదురునుంచి మొదలైన అతని పెదవులు మాదుర్యాన్నిబట్టి ఒక్కో అవయవం దగ్గర ఒక్కో టైమ్ వరకు ఆగి జుర్రుకుంటున్నాయి.
ఆమె పెదవుల దగ్గర ఎక్కువసేపు ఆగిన తన పెదవులు ఎద దగ్గర ఇంకా ఎక్కువసేపు ఆగాయి. అతని చర్యలను ఆమె అభ్యంతరం చెప్పే స్థాయిని దాటి చాలాసేపే అయ్యింది. ఈ ప్రణయాన్ని కళ్ళు సాగదీసుకుని చూస్తున్నట్టు నక్షత్రాలు మరింత కాంతివంతమయ్యాయి. వాళ్ళిద్దరి తన్మయత్వాన్ని చూడడానికి ఒపిగ్గా కొండ ఎక్కుతున్నట్టు గాలి ఎక్కువైంది. వాళ్ళిద్దరి నిట్టూర్పులకు శృతి చేస్తున్నట్టు జోరీగల రొద బాగా వినిపిస్తోంది. పడమటి ఆకాశంలో అప్పుడే పుడుతున్న చంద్రవంక సిగ్గుతో కుచించుకుపోయినట్టు చిన్నదిగా కనిపిస్తోంది. వాళ్ళిద్దరూ తేరుకునేటప్పటికి లాంతర్లు కొండచివర వెలుగుతున్న పెద్ద ప్రమిదలా చుట్టుకున్నాయి.
"అందరూ గుడి దగ్గరికి చేరుకున్నట్టుంది'' చాలాసేపటికి అతను మాట్లాడాడు.
"ఆ ... '' ఆమె ఇంకా ఆ మాదుర్యాన్నుంచి తెరుకున్నట్టు లేదు. లేకుంటే ఆమె అంతటితో మాట్లాడడం ఆపేసేది కాదు.
"రూపా''
"ఊ ...''
"వెళదామా?''
"నాకు ఇక్కణ్నుంచి వెళ్ళాలని లేదు''
"మనిద్దరం ఎప్పటికీ ఇక్కడే వుండిపోదాం'' అతను పలకకపోయేసరికి ఆమె అంది.
"నాకూ అలానే అనిపిస్తుంది'' అతను ఆమెమీద చేతులు వేశాడు. అయితే ఇప్పుడా చేతుల్లో మండించే కోరికలేదు. చల్లగా తగిలే ఆత్మీయత వుంది. మరో అరగంట తరువాత ఇద్దరూ లేచారు. అంతసేపైనా వాళ్ళు ఒకరి చేతుల్ని మరొకరు వదల్లేదు. ప్రపంచంలో తామిద్దరూ తప్ప మరెవరూ లేరన్న భావనలో వున్నారు. ప్రేమకీ, అభినాననికి కరువై, వాటికోసం కొన్ని సంవత్సరాలపాటు తమలో తాము పరిత్క్యపించిన వాళ్ళిద్దరూ ఒకరికోసం మరొకరు అన్న ఫీలింగ్ తో వున్నారంటే ఆశ్చర్యపోనక్కర్లేదు.
వెనక్కి తిరిగివచ్చి మామూలు దారిలో నడవడం మొదలుపెట్టారు. మరో అరగంటకి గుడికి చేరుకున్నారు. తాము దారితప్పి తిరిగి వస్తున్నట్టు చెప్పారు బంధువులెవరికి అనుమానం రాలేదు. దేవుడికి పెట్టాక కోడిని కోశారు. అక్కడే దాన్ని వండి భోజనాలు పూర్తిచేసేటప్పటికి అర్థరాత్రి దాటింది. కాసేపు రెస్ట్ తీసుకున్నాక తిరిగి ఊరికి బయలుదేరారు. ఊరు చేరేటప్పటికి మొదటి కోడి కూసింది. గంగాధరం, రూప ఎవరింటికి వాళ్ళు వెళ్ళినా మనసులు మాత్రం పెనవేసుకునే వున్నాయి.
తాము ఐక్యం అయిన అనుభవాన్నే తలుచుకుంటూ వుంటే అనుభూతి ఎక్కువవుతూ ఉండేటప్ప తరగడం లేదు. ఇద్దరూ తెల్లవారు తుండగా నిద్రలోకి జారుకున్నారు. గంగాధరం మధ్యాహ్నం లేచి భోజనంచేసి తిరిగి పడుకుండిపోయాడు. సాయంకాలం మెలకువ వచ్చింది. అంత తృప్తిగా ఒళ్ళు ఎరగకుండా నిద్రపోవడం అదే మొదటిసారి. మెలకువ వస్తూనే అతనికి గుర్తొచ్చింది రూప మాత్రమే. వెంటనే చూడాలనిపించి వడివడిగా పడకమీదనుంచి లేచి తయారయ్యాడు. స్నానంచేసి వీథిలో నడుస్తున్నాడు.
రాత్రి జరిగినదంతా అబద్ధం కాదని చెప్పడానికే ఒళ్ళంతా తీయటి నొప్పులతో మూలుగుతోంది. అతనికోసమే ఆమె కూడా కాచుకుని కూర్చున్నట్టు ద్వారం దగ్గర నిలబడి వుంది. వాళ్ళిద్దరి చూపులు ఒక్కక్షణం కలుసుకుని విడివడ్డాయి.
|
|


