The content in this feature is rated as "A++". You must be at least 18 years old to view this feature.
Home>>Kalagantine Cheli>>Kalagantine Cheli
కలగంటినే చెలి - 83

జయ అందరిలాంటి పిల్లకాదు. రెండు మాట్లాడితే ఎక్కువ. ఒకటి మాట్లాడితే తక్కువ. కాబట్టి ఆచితూచి అడుగెయ్యాలి. "శనగపప్పు అలా పొలంలో పడిపోనీ, తరువాత ఆలోచిద్దాం'' అన్నాడు తెలివిగా.

"పొలంలో విత్తనాలు వేసేవరకూ ఆగితే ఇక అంటే సంగతులు''

"మరి ఏం చేద్దాం?''

"పెళ్ళి చేసుకుందాంలే అని అనడంలేదు గదా నువ్వు?''

ప్రకాష్ అదిరిపడ్డాడు. అది అతను ఊహించని విషయం. కూలీ నాలీ చేసుకుని పోట్టుపోసుకునే పిల్ల - కులంరీత్యా కూడా ఎంతో కిందవున్న పిల్ల. అలా అడుగు తుందని అతను అనుకోలేదు. అందుకే షాక్ తిన్నాడు.

"ఏం ఈ కులం తక్కువ పిల్ల - అందునా రెండో మనువు పిల్ల ఇలా అడుగుతోంది, పిచ్చిగాని పట్టలేదుకదా అని అనుకుంటున్నావా? ఏం నాతొ పడుకునేటప్పుడు మాత్రం మా కులం గుర్తురాదా? అని నిలిసినట్టు కటువుగా అడిగింది జయ.

ఏం చెప్పాలో పాలుపోలేదు అతనికి. అలా చూస్తుండిపోయాడు.

"ఏం తక్కువ నాకు> ఏదో మీరు కులంరీత్యా గోప్పగానీ మాకు లేనిదీ మీకున్నదీ ఏమిటి? నేను పనికిరానా పెళ్ళాంగా? చెప్పు. మీ కులం ఆడవాళ్ళను చూస్తూనే వున్నాను గదా. వాళ్ళకంటే నేనే బావుంటాను'' అంది అతను ఏం మాట్లాడకపోయినా.

అతనికి కళ్ళు తిరుగుతున్నాయి. నెల తప్పింది తనకా? జయకా? అన్న అనుమానం వచ్చింది లేకపోతే తనకు కళ్ళు తిరగటం ఏమిటి? "సరే నే వెళ్ళొస్తాను. ఇంట్లోవాళ్ళు వేరుశనక్కాయలు నలుస్తున్నారు వెళ్ళాలి'' అన్నాడు ఇక అక్కడ ఒక్క క్షణం వుండలేక.

"వేళ్ళు - నే వద్దన్నానా? మరి నన్ను ఏం చేయమంటావో చప్పి వేళ్ళు''

"చెప్పడానికేం వుంది? వేరుశెనగపప్పు వేసేయ్యాలి. తరువాత టౌన్ కి తీసుకెళ్ళి డాక్టర్ కి చూపిద్దాం''

"అంటే కడుపు పోగొట్టేస్తానంటావ్ గానీ పెళ్ళి చేసుకోవన్నమాట'' నిష్టూరంగా అంది.

"అలా నికాదు - పెళ్ళికైనా కడుపు వుంచాలా? దానిపాటికి అది దీనిపాటికి ఇది. కడుపు పోగొట్టుకుని నిదానంగా ఆలోచిద్దాం'' బుజ్జగింపు ధోరణిలో అన్నాడు.

"నిదానంగా ఆలోచించడానికేముందు? ఇద్దరం ఏ గుడికో వెళ్లామా మూడుముళ్ళు వేసుకుని వచ్చేశామా?'' అన్నది జయ.

"నువ్వలానే మాట్లాడతావ్. నేకంటే పూర్తిగా మునిగిపోయినాదానివి నాకు అలా కాదె. కన్నవాళ్ళున్నారు, పెంచినవాళ్ళున్నారు, అక్కలున్నారు, బావలున్నారు, అన్నదమ్ములున్నారు. నువ్వు పిలవగానే నీ మెడలో తాళిబొట్టు కట్టేస్తే వాళ్ళు ఏమైపోతారు? నిన్నూ, నన్నూ ఇంట్లోకి రానిస్తారా?'' ప్రకాష్ ఈసారి కాస్తంత సీరియస్ గా అన్నాడు. పైకి కూల్ గా వున్నాడుగానీ లోపల ఉదికిపోతున్నాడు.

"అంటే నేనేనా అలా ఒంటరిగా వీథిలో నిలబడి వున్నది. నాకూ నీలాగే తల్లీదండ్రీ వున్నారు. తోడబుట్టినవాళ్ళున్నారు. నాకు తెలియక అడుగుతాను - పళ్ళాన్నప్పుడే ఇన్ని మాటలు మాట్లాడుతున్నావ్, మరి రాత్రయితే పోలంగాట్లు మీద నాతొ దోర్లినప్పుడు మీ అమ్మానాన్న గుర్తు రాలేదా? అక్కలూ, బావలూ గుర్తుకురాలేదా? అప్పుడు గుర్తుకురానివాళ్ళు ఇప్పుడు మాత్రం ఎలా గుర్తొచ్చారు?'' ఆమె కూడా అతనికంటే ఏం తగ్గలేదు.

జయ కథ అతనికి బాగా తెలుసు. మగదికంటే ఏం తగ్గాడు ఆమె. అందుకే జాగ్రత్తగా ఈ విషయాన్ని డీల్ చేయాలనుకున్నాడు. అందుకే తన విసుగునీ, కోపాన్నీ లోపలే దాచుకుని పైకిమాత్రం నవ్వుతూ "ఎందుకంత ఆవేశపడిపోతావ్? ముందు జరగాల్సింది చూద్దాం. మొదట నీకొచ్చిన సమస్యను పరిష్కరించుకుందాం. ఆ తర్వాత సమయం చూసి నేను మా ఇంట్లో విషయం కదుపుతాను. వాళ్ళు ఒప్పుకుంటే సరి, లేకుంటే ఎటో వెళ్ళి గుళ్ళో పెళ్ళిచేసుకుందాం, సరేనా! అంతేగానీ ఇప్పుడే ఈ క్షణంలోనే విషయం తెల్చేయమంటే నేనేం చేయాలో చెప్పు'' అన్నాడు.

అప్పటికి ఆమె శాతించింది. "సరే నీ మాటమీద నక్కకంతో ప్రస్తుతానికి ఒప్పుకుంటున్నాను. ఆ తరువాత ఏమైనా ఆటలు ఆడవా నేను అలాంటి ఇలాంటి ఆడదాన్ని కాదు. మీ ఊరు రోడ్లో ఉరేసుకుని, నా చావుకి నువ్వేనని చీటీ రాసిపెట్టి చస్తాను'' అంది.

"ఛీ ఛీ అలాంటి మాటలనకు'' అన్నాడు. కాసేపు అవీ ఇవీ కబుర్లు ఆడాక ప్రకాష్ తిరుగుముఖం పట్టాడు. కానీ దారంతా ఒకటే ఆలోచనలు. జయను ఎలా వదిల్చుకోవాలో అర్థం కావడం లేదు. ఏదో మొగుడ్ని వదిలేసినపిల్ల కదా అని స్నేహం చేశాడు. అంతేతప్ప పెళ్ళిచేసుకుందామన్న తలంపు ఏ కోశానా లేదు. జయ అన్నట్లు ఆమెకి ఏం తక్కువకాదు.

అంత అందమైన పిల్ల ఆంజనేయపురంలో లేదు. ముక్కుసూటిగా వ్యవహరించే మనిషి. కానీ కులంకూడా ఎలాగో సర్దుకోవచ్చు గానీ రెండో మనువుపిల్లను ఎలా చేసుకోవడం? ఇంట్లోవాళ్ళు అసలు ఇప్పుకోరు. మరి జయను ఎలా కన్వీన్స్ చేయాలో అర్థం కావడం లేదు. తెలిసీ తెలియని ఊబిలో ఇరుక్కున్నానన్న భయం పట్టుకుంది.