.jpg)
భోజనం కాగానే తమ గదిలోకి దూరింది రూప. మరో పావుగంటకి గోపాల్ వెళ్ళాడు. లోపలికి అడుగుపెట్టి గడియవేసి అటు తలతిప్పిన అతను శిలా ప్రతిమలా నిలబడిపోయాడు. మంచంమీద నగ్నంగా ఆమె. గొళ్ళెం తీసుకుని బయటికి పరుగెత్తాలన్న ఆలోచన బలవంతాన అణచుకున్నాడు. ఆమె ఏమీ సిగ్గుపడలేదు. రా రమ్మన్నట్టు చేతులు చాపింది. అతను దగ్గరికి వచాడుగానీ ఆమె చేతుల్ని పట్టుకోలేదు.
తను ఇంత నగ్నంగా పడుకున్నా అతను అకడుగు దూరంలోనే ఎలా కూర్చోగలుగు తున్నాడు? మీదపడి రక్కేయ్యడం లేదు ... గోళ్ళతో గిచ్చేయ్యడం లేదు ... తనలో కలిసిపోవడం లేదు ... మగాడికి ఇలా దూరంగా వుండడం సాధ్యమయ్యే పనేనా? అతను చిన్నగా, తల వంచుకుని చెప్పలేక చెప్పలేక ఒక్కొక్క మాటా చెప్పాడు.
"ఏమీ అనుకోవద్దు రూపా ... నేను నిన్ను ఏమీ చేయలేను''
అప్పటికి అర్థమైంది ఆమెకి. ఆకాశం తనమీద పడిపోయినట్టు, భూమి తొలుచుకుంటూ పోయి తను అందులో కూరుకుపోతున్నట్టు పిచ్చి పట్టినదాన్లా చూసింది. పదహారు రోజుల పండుగనాడు అలా భర్త గురించి పరమసత్యం తెలిసిపోయింది.
"కాపురం మా వూర్లో వద్దు. నేనేమిటో అక్కడ అందరికీ తెలుసు. నిన్ను మాటలతో కాకుల్లా పొడుస్తారు. భరించలేవు ... అందుకని ఈ వూర్లోనే సెటిల్ అయిపోదాం'' అన్నాడతను.
ఆమె కళ్ళనుంచి నీళ్ళు అదేపనిగా కారిపోతున్నప్పుడు, ఆ షాక్ నుంచి ఆమె ఎప్పటికీ తెరుకోలేకపోయింది. అతనే కాపురాన్ని రామాపురానికి మార్చాడు. అప్పటినుంచి రూపకి ఏదో ఒక జబ్బు. మొదట్లో కలల్లో భయపడి లేచి అరిచేది. ఆ తరువాత కాళ్ళనొప్పులు, కొన్ని రోజులు కడుపు నొప్పి, మరికొన్ని రోజులు తలనొప్పి. మధ్యలో స్పృహతప్పి పడిపోయేది. చంద్రరేఖ రూపాదేవి హిస్టరీ అంతా తెలుసుకుంది. గోపాల్ తో కూడా మాట్లాడింది. శారీరకంగా వున్న లోపం కాబట్టి ఏమీ చేయలేమని అతన్ని వదిలేసింది. మరి తను చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్న రూపను ఎలా వదిలేయడం?
అలా గంగాధరం, చంద్రరేఖ ఎవరికీ వారు తమ ఆలోచనలతో పక్కన ఓ వ్యక్తి వున్నారన్న స్పృహ అయినా లేకుండా ఊరికి చేరుకున్నారు. బస్సు దిగేటప్పటికి చీకట్లు పడ్డాయి. అమావాస్య రోజులు కాబోలు ఆకసహం కాటుక డబ్బాలా వుంది. అక్కడక్కడా వున్న నక్షత్రాలు మాత్రం మరింతగా మెరిసిపోతున్నాయి. గాలి దారి వెదుక్కుంటూ సాగిపోతున్నట్టు మెల్లగా వీస్తోంది. గంగాధరాన్ని శ్రీదేవినుంచి దారి మళ్ళించడానికి ఇంతకుమించిన సమయం మరొకటి వుండదు. గుండెల్లో పొంగి ప్రవహిస్తున్న ఆ పేదవాడి ప్రేమకి ఓ ఆలంబన కావాలి. నేనున్నానంటూ వెచ్చగా భుజంమీద చేయివేసి దగ్గరకు తీసుకునే తోడుకావాలి. "గంగాధరం'' ప్రేమగా పిలిచింది.
"ఊ ...''
"నీకో విషయం చెప్పాలోయ్''
ఏమిటి అని అతను అడగలేదు. కానీ చంద్రరేఖ చెప్పింది. "మన ఊర్లో రూపాదేవి ... అదే గోపాల్ భార్య ఎప్పుడూ నిన్ను గురించే అడుగుతుంటుంది. బహుశా నువ్వంటే ఆమెకి అంత ఇష్టమేమో''
అతను ఠక్కున చూశాడు. తనకోసం ఓ స్త్రీ మూర్తి పరితపిస్తూ వుందని వినడం జీవితంలో అదే మొదటిసారి అతనికి. గుండె పగిలిపోతుందేమోనన్న ఆనందం. అతను దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది.
|
|


