.jpg)
వాసూ పుట్టి పెరిగిన ఊరు ఓ మోస్తారుగా వుంటుంది. ఆ ఊర్లో వాసూ కుటుంబమే ఆర్థికంగా ముందున్నది. పెద్ద కుటుంబమనే మాట ఈ రోజుది కాదు, తరతరాలుగా వస్తున్నది. వాసూకి అన్నదమ్ములు ముగ్గురున్నారు. ముద్దుగా, బొద్దుగా వున్న వాసూ అంటే తల్లిదండ్రులకి చాలా ప్రేమ. వాసూ ఎలిమెంటరీ స్కూల్ వరకు ఆ ఊర్లోనే చదివి ఆరో తరగతికి పక్క ఊర్లోని హైస్కూల్ కి వెళ్ళడం ప్రారంభించాడు.
శ్రద్ధగా చదువుకుంటూ ప్రతి సంవత్సరం హైక్లాసుకెళ్ళే వాసూ అంటే అందరికీ వల్లమాలిన అభిమానం. అతను తొమ్మిదో తరగతిలో వుండగా అతని తల్లి వరలక్ష్మమ్మ జబ్బు చేసింది. అప్పటివరకు ఇళ్ళు చిమ్మడం, పశువుల మెటా చూడడంలాంటికి వగైరా పనులక్ము ఇద్దరు పనిమనుషులు వుండేవాళ్ళు. ఇప్పుడు వంటచేసి, వడ్డించడానికి, తనకు తోడుగా వుండడానికి ఓ మనిషి కావాల్సి వచ్చింది
వరలక్ష్మమ్మకి. తమ ఇంటికి వచ్చిపోయేవాళ్ళతో ఈ విషయమై చెప్పింది ఆమె. "మూడు పూటలా భోజనం పెడతాం. పండక్కి పబ్బానికి బట్టలు తీసిస్తాం సంవత్సరానికి నాలుగు బస్తాల వడ్లు ఇస్తాం'' అని చెబుతుంది.
ఇలా వరలక్ష్మమ్మ చెప్పెనాటికి రంగనాథం కుటుంబ పరిస్థితి తీసికట్టుగా వుంది. రంగనాథం వడ్రంగం చేసేవాడు. అయితే కుటుంబ ఖర్చులకు కూడా తగినంత డబ్బులు వచ్చేవికావు. ముసలి తల్లిదండ్రులు, పెళ్ళికెదిగిన చెల్లెలు, జులాయిగా తిరిగే తమ్మోడూ, తన భార్యం ఇద్దరు పిల్లల్ని పోషించలేక ఊరంతా అప్పులు చేసి చాలా దయనీయ స్థితిలో వున్నాడు. అతనికీ పెళ్ళయి ఆరు సంవత్సరాలయింది. భార్య జమునారాణి అందమైనది. అంతకంటే తెలివైంది.
కుటుంబ పరిస్థితి తెలిసింది గనుక పొదుపుగా బతుకు బండిని లాక్కోచ్చేది. భర్తకు అన్ని విధాలా సహాయం చేసేది. వరలక్ష్మమ్మకి పనిమనిషి కావాలని ఆమె చెవిన పడింది. ఆ రాత్రి అందరూ నిద్రపోయాక ఈ విషయమై భర్తను కదిపింది. "కోయ్యపని చేయడంవల్ల ఎమోస్తోంది చెప్పు. సరిగ్గా తినడానిక్కూడా సరిపోవడంలేదు. మన వెనుక చూస్తేనా పెద్ద కుటుంబం, మీ అమ్మా నాన్నా పనిచేయలేరు. ఇక మీ తమ్ముడు అలా షోకిల్లారాయుడిలా తిరుగుతున్నాడు. మనకా ఇద్దరు పిల్లలు ఎన్ని రోజులు అప్పులు చేసి తింటాం. వరలక్ష్మమ్మకి వంటమనిషి కావాలట. నేను వెళతాను ...''
రంగనాథం ఏమీ చెప్పలేకపోయాడు. చూస్తూ చూస్తూ భార్యను పనిమనిషిగా పంపలేడు, అలాగని వద్దనీ చెప్పలేకపోతున్నాడు. కడుపునిండా తిండికి కూడా సరిగా జరగడం లేదు.
"వరలక్ష్మమ్మ ఇంట్లో పనికి కుదిరితే వాళ్ళనడిగి రెండు ఎకరాలో మూడెకరాలో లీజుకి తీసుకోవచ్చు. దాంట్లో పైరు పెడితే తిండికి దిగులుండదు. కూరకీ, నారకీ నీ సంపాదన ఎలానూ వుంది. వాళ్ళు నాకిచ్చే జీతాన్ని అలా వెనకేసుకున్నామంటే మీ చెల్లెలి పెళ్ళి చేసెయ్యవచ్చు బాగా ఆలోచిండు'' ఇంకేం వుంది ఆలోచించడానికి. తిండికి మాది పస్తులతో ప్రాణాలు తీసుకోలేంగదా అందుకే రంగనాథం సరేనన్నాడు. అలా జమునారాణి వాళ్ళింట్లో చేరిపోయింది.
నిద్రలేచి వరలక్ష్మమ్మ ఇంటికి వస్తే రాత్రి భోజనాలయ్యాకే మళ్ళీ ఇంటికి వెళ్ళడం. మధ్య మధ్యలో ఇంటికి వెళ్ళడం కుదురుతుందిగానీ మరీ పనుంటే తప్ప మధ్యలో వెళ్ళేదికాదు జమునారాణి. ఆమె పనిమనిషిగా చేరేటప్పటికి వాసూ తొమ్మిదో తరగతిలో వున్నాడు. అతనంటే వరలక్ష్మమ్మ దంపతులకు చాలా ప్రేమ. అతన్ని తలుచుకోకుండా ఒక్క క్షణం వుండలేరు. "అబ్బాయి స్కూలుకి టైమైంది జమునా! త్వరగా వండు'' "వాసూ అలసిపోయి ఇంటికి వస్తాడు. వాడికి రాగానే పాలివ్వు'' ఇలా పురమాయించేది వరలక్ష్మమ్మ.
తమ యజమానులు ఇష్టపడే వ్యక్తులను అనివార్యంగా పనిమనుషులు కూడా ప్రేమిస్తారు. అలానే జమునారాణి కూడా ఆ కుర్రాడ్ని అభిమానంగా చూసేది. ఓ రోజు సాయంత్రం వాసూ స్కూలు నుంది వచ్చాడు. ఆవేళ వరలక్ష్మమ్మకి ఒంట్లో బాగాలేదు. అందువల్ల జమునారాణిని పిలిచి "వాడికి స్నానం చేయించు'' అంది. ఆ వయసు పిల్లాడికి మరొకరు స్నానం చేయించాల్సిన అవసరం లేదు. కొడుకంటే వున్న అభిమానం కొద్దీ ఆమె దగ్గరుండి ఆ పనిచేసేది.
|
|


