The content in this feature is rated as "A++". You must be at least 18 years old to view this feature.
Home>>Romantic Stories>>Honeymoon ...
హనీమూన్ ...

ఎస్.లలిత

ఫోన్ రింగ్ అవగానే మృదుల ఎలర్ట్ అయింది. వాచీ వంక చూసింది. టైమ్ మూడున్నర కావొస్తోంది ... డెఫినెట్ గా ఈ ఫోన్ తనకే ...
అద్దాల పార్టీషన్ లోంచి బాస్ గదిలోకి చూస్తోంది మృదుల ... ఆవిడ ఫోనెత్తి ... "నీకే ఫోన్ అన్నట్టు'' సంజ్ఞ చేసింది.
మృదుల అనుకున్నట్టే అయింది. ఆ ఫోన్ కిరణ్ దగ్గర్నుంచి ఎన్నిసార్లు చెప్పినా వినకుండా ... ఫోన్ చేస్తూనే ఉంటాడు. భయం భయంగా బాస్ వంక చూస్తూ ఫోన్ రిసీవ్ చెవికాన్చుకుంది.
"హలో ...''
"హాయ్ మృదు ... ప్చ్ ...'' ముద్దు సౌండ్ కూడా వినిపించింది.
"ఛీ ... అన్నీ పాడు పనులే ... ఏంటో అర్జెంటుగా ఫోన్ చేశావు'' ఫోన్ కి చెయ్యడ్డం పెట్టి, చిన్నగా అడిగింది.
"ప్రక్కనే మీ బాసిణి ఉందా?'' జోక్ చేశాడు కిరణ్.
"అసలు విషయం చెప్పు ... ఇలా ఫోన్స్ చెయ్యోద్దంటే వినవేం?'' విసుగును తెప్పించుకుని అంది.
"మరి ఈవాళ సరిగ్గా నాల్గింటికి నెక్లెస్ రోడ్ కి వస్తానంటే మరింక ఫోన్ చెయ్యను ... మన సీట్ నెం గుర్తిందిగా సెవెన్ ...''
"నెం. సెవనా'
"ఎస్ ... ఉంటాను ...'' ఫోన్ కట్ అయింది.
మృదుల ఫోన్ క్రేదిల్ చేసి, బాస్ వంక చూసింది. ఆవిడ మృదుల వంకే చూస్తోంది. మృదులకి ఏం చెప్పాలో తెలియలేదు.
"ఏంటి ... నెం. సెవన్ అంటున్నావు?'' ఫైల్ లోకి చూస్తూ అడిగింది.
"మరి .... మరి ... మా అంకుల్ ణి హాస్పిటల్ లో ఎడ్మిట్ చేశారట ... రూమ్ నెం. సెవన్ అని మా కజిన్ ఫోన్ చేశాడు'' అబద్ధం చెప్పేసింది.
"ఈజిట ... అయ్యో పాపం ... నువెళ్ళాలా ...?'' సిన్సియర్ గా అడిగింది.
"మరి పర్మిషను ...'' సణిగింది మృదుల ...
"ఈ మాత్రం డానికి పర్మిషనెందుకు, వెళ్ళు ... వెళ్ళి చూసిరా'' ఆవిడ పర్మిషన్ ఇచ్చేసింది.
మృదుల మనసు ఇప్పుడు పూరి విప్పిన నెమలే అయ్యింది. ఎప్పుడెప్పుడు కిరణ్ బాహువుల్లో ఇమిడిపోదామా అని ఉవ్విళ్ళూరుతోంది ... ఆ రోజుకి తన వర్క్ కి పుల స్టాప్ పెట్టేసి ... నెక్లెస్ రోడ్డుకి పరుగుపెట్టింది.
మృదుల ఒక సాఫ్ట్ వేర్ సంస్థలో పనిచేస్తోంది.
ఆమె బాస్ రత్నమాల మంచి స్వభావం కలదే అయినా చచ్చేంత స్ట్రిక్టు ... అయినా రోజూ ఏదో వంకన మృదుల వర్క్ డుమ్మా కొట్టేసి, చెక్కేస్తూ వుంటుంది. అదంతా కిరణ్ పుణ్యమే ...
బాస్ గురించి చెప్తే ... "ఆవిదకేం నలభై ఏళ్ళు వచ్చాయి. పిల్లలు పెద్దవాళ్ళయ్యారు ... అన్ని ముచ్చట్లు తీరిపోయాయి ... కనుక పగలు, రాత్రీ ఆ కంప్యూటర్ తో కుస్తీ పడుతుంది. మనం కూడా అలా చేస్తే ... ఇంకో ఇరవై ఏళ్ళయినా మనిద్దరం తప్పితే మూడో వాళ్ళు మన మధ్యకి రారు'' అంటూ ఏడిపిస్తాడు.
మృదుల తన బైక్ ఓ ప్రక్కగా పార్క్ చేసి ... కిరణ్ వెయిట్ చేస్తున్న స్థలం దగ్గరికి వెళ్ళింది. అక్కడ సిమెంట్ బెంచీ మీద ... కిరణ్ విష్ణుమూర్తి శేషతల్పంపై పడుకున్నట్టు, ఫోజ్ ఇచ్చాడు. బ్లూ కలర్ జీన్స్ ... వైట్ రీబాక్ షర్ట్ తో నిజంగా విష్ణుమూర్తి సివిల్ డ్రెస్ లో ఉన్నట్టున్నాడు.
తనలో తానే నవ్వుకుంటూ కిరణ్ ని సమీపించింది. కిరణ్ ఆమె నడక వంక చూస్తూనే దగ్గరకు రాగానే "దివినుంచి భువికి దిగివచ్చే దిగివచ్చే పారిజాతమే నీవై నీవై'' సన్నగా హమ్ చేశాడు.
మృదుల మాత్రం కిరణ్ వంక కోపంగా చూసి, అతని కాళ్ళు ఓ ప్రక్కగా నెట్టి అక్కడే కూర్చుంది.
"అబ్బో ... దేవిగారు అలిగినట్టున్నారు'' కిరణ్ చప్పున ఆమె చుబుకం పైకెత్తి కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు.
"మరి లేకపోతె ఇదేం పని ... లక్షణంగా ఉద్యోగం చేసుకోనీయకుండా ఈ పార్కుల వెంట, రోడ్ల వెంట త్రిప్పుతున్నావు'' విసుగ్గా అంది.
"మరేం చేయను ... నాకా ఆఫీసులో అట్టే పని ఉండదు ... రంభలాంటి నువ్వుండగా, ఒంటరిగా షికార్లు కొట్టడం నా వల్ల కాదు ... అయినా మనం ఏం చేసినా  ఇప్పుడే ఓ యాభై ఏళ్ళు వచ్చాక, పరిగెట్టుకుంటూ వెళ్ళి ఐస్ క్రీమ్ తిని రాగలమా ... గంటలు గంటలు ఇలా పార్కుల్లో, రోడ్లవెంక తిరగ్గలమా ...'' అన్నాడు ఆమె భుజం చుట్టూ చేయి వేస్తూ.
ఆ స్పర్శకి గుండె ఝల్లుమంది మృదులకు ... ఏంటో అపురూపంగా అదో మత్తుగా ఉంది ... అయినా చుట్టూ ఎవరైనా చూస్తారేమోనాన్న భయం ...
"నీతో ఇదే చిక్కు ... ఏం చెప్పినా ... నీదే రైట్ అన్నట్టుంటాయి నీ మాటలు ... ఇవాళ ప్రోగ్రాం ఏంటీ?'' అతని కళ్ళలోకి చూస్తూ అంది ...
కిరణ్ ఆమె మాట్లాడేప్పుడు తమాషా కదలాడే చెవి రింగులను ... నవ్వినప్పుడు ఆమె బుగ్గ మీద పడే సొట్టను తన్మయత్వంగా చూస్తున్నాడు ...
"నిన్నే ... ఇది పబ్లిక్ ప్లేస్ ... బుగ్గలు కోరికేయాలని ప్లాన్ వేస్తున్నావేమో ...?'' కొంటెగా అంది.
"మధువులూరే నీ పెదవులు చప్పరించాలని[పిస్తోంది ... శంఖం లాంటి మెడ దాటి ... ఇంకా కిందకి ... చేతులు జాపాలనిపిస్తోంది'' చిలిపిగా అన్నాడు.
"చక్కగా చెప్పావుగానీ ... నా పని ఎగ్గొట్టించి ... ఈ పార్కులో ఇలా మాట్లాడితే ఎమోస్తుందో ...'' అతని చేతిని తన చేతుల్లోకి తీసుకుని గట్టిగా వత్తుతూ అడిగింది.
"అది నేను చెప్పక్కర్లేదు ... నీకేం వస్తుందో ... నీ చేతలే చెప్తున్నాయి ...'' నిజంగా మృదులకి ఏదీ చెప్పలేని హాయి ... మాటల్లో చెప్పలేని పరవశం కలుగుతోంది.
ఆమె శారీరక స్థితి అర్థం అయిన కిరణ్, మరింత దగ్గరగా జరిగి ... ఆమె కుడిచేతిని తీసుకుని పెదవులకాన్చుకున్నాడు ....
ఒళ్ళంతా జివ్వుమంది మృదులకి ... ఏదో తీయని అనుభూతి ... దీనికోసమే కదా ... తను ఆఫీసు వదిలేసి పరిగెత్తుకు వస్తుంది ...
ఆ తరువాత ఆ రోడ్డంతా నడిచారు ... చిన్నపిల్లలా అక్కడ అమ్మేవన్నీ కొనుకున్నారు ....
చివరగా ఐస్ క్రీమ్ తీసుకున్నారు. అప్పటికి జనం బాగానే నిండారు. ఆ ప్రదేశం అంతా ... ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూస్తూ ఐస్ క్రీమ్ పూర్తీచేశారు ...
ఆరున్నర అవుతుండగా ఎవరు బైక్ మీద వాళ్ళు వెళ్ళిపోయారు.
*****
ఆకాశం రంగు షిఫాన్ చీర ... అదే రంగు బ్లౌజ్ ... అందుల్లోంచి స్పష్టంగా కనిపిస్తున్న నల్లటి బ్రా ... పొడవాటి జుత్తు అలాగే వదిలేసి ... చీరకి, బ్లౌజ్ కి మధ్య చంద్రవంకలా ఉన్న నడుము ... వెనకనుంచి చూసి రత్నమాలకి మతిపోయింది ....
మృదుల బాస్ రూమ్ లో నిల్చుని, అటు తిరిగి ఫోన్ లో మాట్లాడుతోంది.
"నన్నేం చేయమంటావు ... ? నాకివాళ కుదరదు ... రోజూ ఏం పర్మిషన్ అడగను?''
"మీ బామ్మనో, మా బామ్మనో చంపెయ్యి ...'' అన్నాడు నవ్వుతూ ...
"ఇంకా విషయం మా బామ్మకి తెలిస్తే ... ఇటు ఏడు తరాలను, అటు ఏడు తరాలను శాపనార్థాలు పెట్టగలదు. నా వల్ల కాదు'' అంది బ్రతిమిలాడుతున్నట్టు.
"సరే నీ ఇష్టం ... పుట్టినరోజు కదా ... ఏదైనా మంచి రెస్టారెంట్ కి తీసుకెళదాం అనుకున్నా, చక్కగా మ్యాట్నీకి ప్లాన్ చేశాను ...'' అన్నాడు కిరణ్.
"ఏం చేయాలో నాకు తోచటం లేదు ...'' ఆమె గొంతులో చెప్పలేని నిస్పృహ చోటు చేసుకుంది.
"ఏంటి మృదుల ...? వాట్ హ్యాపెండ్ ...?'' రత్నమాల వెనకగా వచ్చి అడిగింది.
మృదుల గిరుక్కున వెనక్కి తిరిగింది.
"గుడ్ మార్నింగ్ మేడమ్ ...''
"మార్నింగ్ ... ఓహ్ ... లవ్లీ ... యూ ఆర్ లుకింగ్ బ్యూటీఫుల్ ...'' అంది మృదులనె కన్నార్పకుండా చూస్తూ.
"ఇవాళ ... నా బర్త్ డే మేడమ్ ...'' అని చెప్పింది.
"మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ... ఎటైనా వెళ్ళాలా?'' అడిగింది.
మృదుల ఇంకా టెలిఫోన్ హోల్డ్ చేసే వుంది .... "ఇవాళ ఇంట్లో చిన్న ఫంక్షనుంది ... త్వరగా రమ్మని మళ్ళీ మా అక్క ఫోను'' అంది పొలైట్ గా.
"మరైతే శెలవు పెట్టలేకపోయావా ...? ఇంట్లో ఫంక్షన్ పెట్టుకుని ... ఎందుకు వచ్చావు ... టేక్ లీవ్ ఎండ్ గో ...''  అంది రత్నమాల.
మృదుల మోహంలో కోటి సూర్యకాంతులు ... చెప్పలేని ఆనందం ... వెంటనే "ఫోన్ పెట్టేయ్యి ... నేను వస్తున్నాను ...'' అంది.
"థాంక్యూ మేడమ్ ...'' మళ్ళీ చెప్పింది బాస్ కి.
ఆఫీసు బయటికి వచ్చేసరికి కిరణ్ తన హీరో హోండాతో రెడీగా ఉన్నాడు. విశ్వసుందరిలా మెరిసిపోతున్న మృదులను చూసి, అతని కళ్ళ ముందు మెరుపులు మెరిశాయి ... దూరం నుంచే ఓ ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు.
మృదుల గబగబా వచ్చి అతని వెనుక కూర్చుంది ... "మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే .. ఏంటీ బర్త్ డే బెబీలా ఉంటావనుకున్నాను ...'' అన్నాడు కొంటెగా ...
"ఇంకొన్ని రోజులాగాలి సార్ ... ఇప్పుడు ప్రోగ్రాం ఏంటీ ...?''
"మార్నింగ్ షోకి వెళదాం ... ఆ తరువాత వైస్ రాయ్ లో లంచ్ ... అక్కడనుంచి మళ్ళీ మన స్పాట్ కి వెళదాం ... నేనీ రోజు లీవ్ పెట్టాను ...'' అన్నాడు.
సినిమా హాల్లో కిరణ్ చేసిన చిలిపి పనులకు, మృదుల రక్తం అంతా వేడెక్కి ... ఒళ్ళంతా ఒకటే పలవరింత ... మెడ వంపులో అతనిచ్చిన వెచ్చటి ముద్దులు ... గుర్తొచ్చినప్పుడల్లా మొహం ఎర్రబడుతూ మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తోంది ... ఆ సుఖం ...
సినిమా అయిపోగానే హోటల్ లో భోజనం చేసి ... మూడు గంటలవుతుండగా నెక్లెస్ రోడ్డు వైపు వెళ్లారు ... బైక్ పార్క్ చేసి చెట్టా పట్టాలు వేసుకుని, హుషారుగా వాళ్ళెప్పుడూ కూర్చునే ప్లేస్ కి దారి తీశారు ....
ఏదో పనిమీద రత్నమాల ఆ దారంటే వెళుతూ ఉంటే ... చుక్కల్లా మెరుస్తూ వీళ్ళిద్దరూ ఆమె కంటపడ్డారు.
మృదుల నడుం చుట్టూ చేయివేసి, దగ్గరగా హత్తుకుని ... కిరణ్ ... నడవసాగాడు. రత్నమాల కారులోంచి వెనక్కి తిరిగి చూసింది. వాళ్ళు కనుమరుగయ్యేవరకు.
"మేడం మిమ్మల్ని రమ్మన్నారు'' ప్యూన్ వచ్చి చెప్పాడు మృదులకు ...
మృదుల చేస్తున్న పని ఆపి, బాస్ రూమ్ లోకి వెళ్ళింది. "ఎస్ మేడమ్ ... పిలిచారట ....''
రత్నమాల ఆమె వంక పరిశీలనగా చూసింది ...
మృదుల తడబడింది ....
"కూర్చో ...'' అంది రత్నమాల.
ఎందుకో అర్థం కాలేదు ... మనస్సులో మాత్రం భయంగా ఉంది ....
"నీకు నేను చాలా అన్యాయం చేశాను ...'' అంది రత్నమాల.
మృదుల ప్రశ్నార్థకంగా ఆమె వంక చూసింది.
"అవును ... నీకు పెళ్ళికాగానే హనీమూన్ కి లీవ్ శాంక్షన్ చేయలేదు. పనెక్కువగా ఉందని, మీ ఇంట్లో మంచి రోజులు కాదని అత్తారింటికి పంపలేదు ... కానీ ఏం లాభం? నువ్వు పని మానేసి వెళ్ళిపోతున్నావు ... తప్పు నాడే ... క్రొత్త దంపతులను కావలసిన ఏకాంతం, స్వేచ్చ, నేనర్థం చేసుకోలేకపోయాను. ఇకనుంచి ఎవర్నీ ఆసుపత్రిపాలు (మాటల్లో) చేయకుండా ... ఇద్దరూ హనీమూన్ కి వెళ్ళండి ... నీకు పదిహేను రోజులు లీవ్ శాంక్షన్ చేశాను'' అంది రత్నమాల.
మృదుల నమ్మలేనట్టు ఆమె వంక చూసింది. అప్పుడే కిరణ్ తనని బర్త్ డే డ్రస్సులో చూడాలని మారాం చేస్తున్న దృశ్యం మదిలో మెదిలి, చిన్నగా నవ్వుకుంది