The content in this feature is rated as "A++". You must be at least 18 years old to view this feature.
Home>>Sex - Science>>Causes for Swollen Testicles
లావైన బీజాలు

అనుకోకుండా బజారులో కలుసుకున్న వెంకట్రావుకి పుల్లారావుని చూస్తూ వుంటే ఏమిటో తేడాలు కనబడు తున్నాయి. కొద్దిగా పరిశీలించి చూసేసరికి పుల్లారావు టైటుఫ్యాంటు ముందు భాగం ఎత్తుగా కనబడుతోంది. అది చూసిన వెనక్త్రావు "ఏమిటిరా ఎబ్బెట్టుగా ఆ వరిబీజమూ నువ్వూనూ'' అని అడిగితే "కాదురా, ఇది సెక్స్ అప్పీల్'' అని పుల్లారావు జవాబిచ్చాడు. "అదేమీ సెక్స్ అప్పీలుకాదు, పిచ్చి అప్పీలు'' అని వెంకట్రావు అతన్ని సర్జన్ దగ్గరికి ఆపరేషన్ చేయించడానికి తీసుకొని వచ్చాడు.

ఇంతలో సర్జన్ దగ్గరికి వచ్చిన మరొక యువకుని ముఖం చూస్తూవుంటే ఆశ్చర్యంగా ఉండి. ఆ యువకుని మొఖం ఎంతో దిగులుగా ఉంది. భవ్యమైన జీవితం చవిచూడకుండానే అంతమై పోయినట్లుగా భావిస్తున్నాడు. డాక్టరుతో తన విషయం చెబుతూ "డాక్టర్, నాకు గవదబిళ్ళలయి పదిరోజులయింది. అకస్మాత్తుగా నిన్నటినుండి నా కుడిబీర్జం ఒకటి వాచీ చాలా నొప్పి చేసింది. గవదబిళ్ళలయి బీర్జం వాస్తే పిల్లలు పుట్టే శక్తిపోతుందనీ, పుంసత్వం తగ్గిపోతుందనీ విన్నాను. నాకెంతో భయంగా వుంది. సుఖమయిన జీవితం గురించి నేను కన్న కలలన్నీ వృధాయేనా?'' అని ఎంతో వేదనతో అడిగాడు. వరిబీజాన్ని సెక్స్ అప్పీల్ అంటూ పుల్లారావు అట్టిపెట్టుకోవడంలో ఏమీ అర్థంలేదు.

అలాగే గవదబిళ్ళలయి (MUMPS) బీర్జాలు వాయగానే పుంసత్వం పోయిందని ఆ యువకుడు పూర్తిగా దిగులుపడి పోవడంలోనూ అర్థం లేదు. అయితే గవదబిళ్ళలయి వృషణాలు వాచీ దెబ్బతిన్నా వీర్యకణాల ఉత్పత్తి అంత తేలికగా తగ్గిపోదనీ, పుంసత్వం పాడనీ వైద్యశాస్త్రజ్ఞులు తమ పరిశీలనలో నిర్ణయించారు. వరిబీజం, వారికోసిల్, స్పెర్మటోసిల్, ఎపిడిడిమిటిస్, హెర్నియా, ట్యూమర్స్ వీటివల్లే చాలామందికి బీర్జాలు లావేక్కినట్లు కనిపిస్తాయి. బీర్జాలవాపు దాదాపు ఒకేలా కనబడినా, అందరికీ ఒకే కారణంవల్ల వాచడం జరగదు. అందుకనే ఇటువంటివాటి విషయంలో డాక్టరు రోగిని ఆ వాపు ఎప్పటినుంచి ప్రారంభమయిందనీ, అకస్మాత్తుగా ప్రారంభ మయిందా లేక క్రమక్రమంగా వాపు హెచ్చుతూ వచ్చిందా అనీ, ఆ వాపు, బీర్జాలకి ఏ విధమైన దెబ్బతగలడంవల్ల రావడంగాని, నొప్పి ఉండడం ఉందా అని సాధారణంగా ప్రశ్నించడం జరుగుతుంది. మామూలు వాడుకలో బీర్జాలవాపు అని వాడబడుతున్నా చాలావరకు వాపులు వృషణాలకి సంబంధించి కాకుండా ఉంటాయి. వృషణాలు బీజకోశంలో ఉంటాయి. వృషణాలకి వచ్చే వాపులని ORCHITS అంటారు. ఈ వాపు గవదబిళ్ళలు, టైఫాయిడ్ కొన్ని వైరస్ క్రిములవల్ల కలుగుతుంది. అలాగే సిఫిలిస్, ఫైలేరియావల్ల వృషణాల వాపు కలుగుతుంది.