ఆమెని చూసిన రోజు గుర్తుకి వచ్చింది…
అప్పుడు సాయంత్రం నాలుగవుతుందనుకుంటా… అమీర్ పేట్ బస్టాప్ ప్రక్కనే ఉన్న హోటల్ లో ఛాయ్ త్రాగాక బయటికి వచ్చి నా ఫ్రెండ్ ని పంపించివేసి, పార్కింగ్ చేసిన నా బైక్ దగ్గరకు వచ్చాను. నేను బైక్ ని స్టార్ట్ చేస్తుండగానే రయ్యిన దూసుకువచ్చి నా ప్రక్కన ఆగింది మారుతీకారు. డ్రైవింగ్ సీట్లో కూర్చుని ఉంది ఆమె…
ఒక్క క్షణం ఆమెని చూడగానే నా హృదయం కాసేపు కొట్టుకోవడం ఆపిందేమో అన్న ఫీలింగ్ కలిగింది…. ఆమె కారుని పార్క్ చేసి మెల్లిగా బయటికి దిగింది. అంత అందమైన రూపాన్ని చూడడానికి నాకు తెలియకుండానే నా రెండు కళ్ళూ పెద్దవయ్యాయి.
చేతిలోని బ్యాగ్ ని భుజానికి వేసుకుంటూ నా వైపు చూసిన ఆమె నా మొహంలోని ఫీలింగ్స్ ని పసిగట్టినట్టు చిన్నగా నవ్వుకుంటూ నా ప్రక్కనుండే వెళ్ళిపోయింది… ఒక్కసారిగా ఆమె శరీరంలో నుండి సుగంధపు పరిమళం నా ముక్కు పుటాలకి త్రాకి నన్ను మరింత ఉక్కిరిబిక్కిరి చేసాయి.
వెళుతున్న ఆమె వైపే నోరు తెరుచుకుని చూస్తూ ఉండిపోయాను… ఆమె కనుమరుగయ్యాక కూడా నేను తెరుకోలేకపోయాను… మళ్ళీ మామూలు స్థితికి రావడానికి నాకు ఐదు నిమిషాలు పట్టింది. గట్టిగా నిట్టూరుస్తూ బైక్ ని స్టార్ట్ చేసి అక్కడి నుండి వెళ్ళాను. అలా ఒక స్త్రీని చూసి నన్ను నేను మరిచిపోయిన సందర్భం ఇదే… ఇంతకు ముందెప్పుడూ నాకిలాంటి ఫీలింగ్ కలగలేదు…. ఎందుకో ఆమెని ఫాలో చేయాలనిపించింది… బైక్ ఆపి వెనక్కి తిరిగి చూసాను. ఆమె ఓ కాంప్లెక్స్ లోకి వెళ్ళింది. అందులో ఆమెని వెతికి పట్టుకోవడం పెద్ద కష్టం కాకపోయినా… డ్యూటీ పనిమీద అర్జంటుగా వెళ్ళాల్సి రావడంతో ఒకింత నిరుత్సాహంగా కదలబోయి ఆమె కారు వంక చూసాను…. తెల్లటి మారుతీ కారు… వెనకవైపు నల్లటి బోర్డుపైన తెల్లగా మెరుస్తున్న ఆ కారు నెంబర్ ని నా మనసులో ముద్రించుకుని అక్కడి నుండి కదిలాను….
ఆమెని చూసింది రెండు నిమిషాలసేపే అయినా ఆ ప్రభావం రెండు మూడు రోజుల వరకూ నాపై పడింది. ఏ పని చేసినా ఆమె రూపమే కళ్ళముందు కదలాడుతోంది… ఆమెని మరిచిపోవాలని ఎంత ప్రయత్నించినా ఫలితం శూన్యం… ఈ రెండు రోజులూ అదే సమయానికి ఆమెని మొదటిసారి కలిసిన ఆ చోటుకి నాలుగైదు సార్లు వెళ్ళాను… మళ్ళీ ఆమె అక్కడికి వస్తుందేమోనన్న ఆశతో… నేను చేసే ఈ ప్రయత్నం ఏమాత్రం ఫలించదని తెలిసి కూడా అలా రావడం మానుకోలేదు. మరో రెండు రోజులు పోయాక… ఆమెని కొద్దిగా మరిచిపోయాననుకున్న సమయంలో… ఆ రోజు జరిగిందొక సంఘటన…
రాత్రి పదిన్నర అవుతుంది. త్వరగా రూంకి చేరుకోవాలన్న ఆతృతతో బైక్ ని వేగంగా నడుపుతున్నాను. జూబ్లీ హిల్స్ చెక్ పోస్టు నుండి వెళుతున్న నాకు కొంచెం ముందుగా రోడ్డు పక్కనే పార్క్ చేసిన మారుతీ కారు కనిపించింది. ఆ కారు పక్కనే ఆమె నిలబడి ఉండడం చూసి నా ఆశ్చర్యానికి అవధులు లేకుండా పోయింది…
ఆమెని ఇంత త్వరగా చూస్తానని అసలు ఊహించలేకపోయాను నేను. అనుకోకుండానే నా బైక్ ని స్లో చేసి నడిపిస్తున్నాను. అది గమనించినట్లు ఆమె చేయితో ఆగమన్నట్లు సైగ చేసింది. కారుకి కొద్ది ముందు బైక్ ని ఆపి ఆమె దగ్గరకు వెళ్ళాను… ఎందుకో నా గుండె మళ్ళీ వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. ఆమె మొహాన్ని సూటిగా చూడాలంటే కొంచెం సిగ్గుగా అనిపించింది. వచ్చేపోయే వాహనాల హెడ్ లైట్స్ వెలుతురులో ఆమె మొహం వజ్రంలా మెరుస్తుండడం గమనించాను. ఆమె దగ్గరకు వెళ్ళనైతే వెళ్ళాను కానీ ఏం మాట్లాడాలో తెలియక బిక్క మొహం వేసుకున్నాను.
నాలోని కంగారుని కనిపెట్టిందో ఏమో… ఆమె పెదవులపైన సన్నటి నవ్వు ప్రత్యక్షమైంది… మరీ మొద్దు సుద్దలా ప్రవర్తిస్తే బావుండదని ధైర్యాన్ని కూడదీసుకుని మెల్లిగా అడిగాను ఆమెని…
”కారు ట్రబులిచ్చిందాండీ…?”
ఆమె అవునన్నట్లు తలాడించింది. ఆమె చూపులు నాపైనే ఉండడం గమనించగానే మరింత సిగ్గు ముంచుకు వచ్చింది.
”మీరు నాకో హెల్ప్ చేయగలరా…” అభ్యర్థిస్తున్నట్టుగా అంది. ఆమె అలా అడగ్గానే ఎంత సంతోషం కలిగింది నాకు. ఈ సమయంలో ఆమెకి నేను చేయాల్సిన ఓకే ఒక సహాయం… ఆమెకి నా బైక్ పైన లిఫ్ట్ ఇవ్వడం… ఆ ఆలోచన రాగానే ఎగిరి గంతెయాలన్నంత ఉత్సాహం కలిగింది నాలో… ఒక అందమైన అమ్మాయి… సారీ… ఆంటీ… అదీ తను ఆరాధించే స్త్రీ. తనకి ఎదురు పడడమే ఎంతో గొప్ప విషయం అనుకుంటే… ఏకంగా బైక్ పైన ఎక్కించుకుని ఎంత దూరమైనా ప్రయాణం చేయాలని అప్పుడే డిసైడ్ చేసుకున్నాను నేను.
నేను నా ఆలోచనలో ఉండి ఆమె అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోవడంతో …
మళ్ళీ తనే…
”హలో… మిమ్మల్నే…” తన కుడిచేతిని చిటికవేస్తూ అంది. ఉలిక్కిపడి సర్దుకున్నాను నేను….
”ష్యూర్… తప్పకుండా… చెప్పండి ఏం చేయాలో…” విచిత్రంగా నా గొంతు సన్నగా వణుకుతున్నది ఆమెతో మాట్లాడుతుంటే… టెన్షన్ వల్ల కాబోలు నా మొహమంతా చెమట పట్టేసింది. నా ఫీలింగ్స్ ఆమె కనిపెట్టినట్లు చిన్నగా నవ్వింది….
”ఇక్కడికి కొద్ది దూరంలోనే మొకానిక్ షెడ్ ఒకటి ఉంది… మీరు ఆ రూట్లోనే వెళ్తున్నట్టున్నారు. కాస్త వారికి ఇన్ఫర్ మేషన్ ఇచ్చి కారు మెకానిక్ ఇక్కడికి వచ్చే ఏర్పాటు చేయగలరా…?”
ఆమె మాటలకి ఒక్కసారిగా నీరు కారిపోయాను నేను… నేనూహించిన దానికి విరుద్దంగా జరిగేసరికి నీరసం ఆవహించేసింది నాకు… మొహంలోకి ఆ ఫీలింగ్స్ ని కనిపించనీయకుండా జాగ్రత్తపడుతూ…
”అలాగే… తప్పకుండా…” అన్నాను నేను… ఆమె మొహం సంతోషంతో వెలిగిపోయింది.
”థాంక్యూ…” అంటి ఆమె నా వైపు కృతజ్ఞతగా చూస్తూ. ఇక అక్కడ ఉండాలనిపించలేదు నాకు… ఆమె దగ్గర సెలవు తీసుకుని నా బైక్ దగ్గరకు వచ్చి దిగాలుగా బైక్ స్టార్ట్ చేశాను… తను కోరుకున్న మగువ దగ్గరకు వచ్చి దూరం అయిందన్న ఫీలింగ్ కలిగింది. కనీసం ఆమె అడ్రస్ అయినా తీసుకోవాలనుకున్నాను. కానీ ఆలస్యం అయిపొయింది. ఇప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆమెని తన వివరాలు అడిగితే ఏమనుకుంటుంది…? ఛ… నా అంత తెలివితక్కువ వాడు ఈ ప్రపంచంలో ఉండడనిపించింది నాకు… అయినా ఆమెని చూడగానే విచిత్రంగా నా మెదడు మొద్దుబారిపోయినట్లయిన తర్వాత ఇంకేమి మాట్లాడను…!
బ్యాడ్ లక్ అనుకుంటూ… గేరు మార్చి బైక్ ని ముందుకు కదిలించబోయాను… అంతలో వెనుకనుండి చప్పట్లు వినిపించాయి. సర్రున తల త్రిప్పి వెనక్కి చూసాను…
ఆమె నన్ను పిలుస్తోంది… మళ్ళీ ఒక్కసారిగా ఉత్సాహం పొంగుకొచ్చింది. గబ గబా బైక్ దిగి, ఆమె దగ్గరకు వెళ్ళాను….
”మీరు ఎక్కడుంటారు…?” అడిగింది ఆమె నావైపు చూస్తూ.
”నారాయణగూడ”చెప్పాను నేను.
ఆమె కళ్ళు ఆనందంతో మెరవడం నేను గమనించాను.
”ఓ… నేను కూడా ఇప్పుడు హిమాయత్ నగర్ కి వెళ్ళాలి… నేనుండేది కూడా అక్కడే…” అంది ఆమె… నాకు మరింత సంతోషం వేసింది. మీ పరిచయం చాలు… ఆమెతో మరింత సన్నిహితంగా మెలగడానికి అనుకున్నాను.
”హిమాయత్ నగర్ లో ఎక్కడుంటారు…?” కుతూహలంగా అడిగాను నేను… ఆమె చిన్నగా నవ్వింది…. నేనడిగిన దానికి సమాధానం చెప్పకుండా….
”ఇప్పుడీ మీకు ఏమైనా అర్జంట్ పని ఉందా…?” అంది.
”ఆహా… ఏమీ లేవు… ఇప్పుడు నేను మా ఇంటికే వెళ్తున్నాను…” చెప్పాను నేను.
”మరోలా అనుకోకుంటే… నాకోసం ఒక గంట టైం స్పెండ్ చేయగలరా…?” రిక్వెస్ట్ గా అడిగింది…
నాకు ఎగిరి గంతేయాలనిపించింది.
”చెప్పండి… ఏం చేయాలో…;” చాలా మామూలుగా మాట్లాడటానికి ప్రయత్నిస్తూ అన్నాను నేను.
”ఆ మెకానిక్ ఇక్కడికి వచ్చినా… ఒకవేళ కారేమైనా మేజర్ రిపేర్ గానీ పెడితే మళ్ళీ నేను ఇక్కడే పడిగాపులు కాయాల్సి వస్తుంది. అందుకే మీరు మెకానిక్ ని తీసుకువచ్చి, నన్ను మీ బైక్ పైన హిమాయత్ నగర్ లో డ్రాప్ చేయగలరా? మరోలా అనుకోకండి… మీరు కూడా అటువైపు వెళ్తున్నారని అడుగుతున్నాను” అంది… ఆమె మాట్లాడుతుంటే ఇంకా వినాలనిపిస్తుంది ఆకు. అంతటి సన్నటి ఆ గొంతులో నుండి ముత్యాల్లా వచ్చిన ఈ మాటలు నాకు మరింత ఆనందాన్ని కలిగించాయి.
”ఓ… తప్పకుండా… మీరు మరీ ఇంత ఇదిగా అడగాలా… ఎలాగూ నేను అటువైపే వెళ్తున్నాను కదా…” అన్నాను నేను.
”అయితే మీరెళ్ళి మెకానిక్ ని తీసుకురండి… మీరు వచ్చేవరకూ నేనిక్కడే వెయిట్ చేస్తాను…”అంది ఆమె.
నేను ఉత్సాహంగా ”ఓ.కే.” అంటూ బయలుదేరబోయాను.
”నిజంగా వస్తారా… లేకపోతె దారినపోయే వాళ్ళంతా నాకెందుకులే అనుకుని అటునుండి అటే వెళ్ళిపోతారా…?” అనుమానంగా అంది ఆమె…
”భలేవారే… ఇంత రాత్రి వేళ హెల్ప్ కావాలని అడిగిన వారిని ఇలా వదిలేసి వెళ్ళిపోయే వాడిలా కనిపిస్తున్నానా మీ కంటికి…!” కొంచెం బాధపడుతున్నట్లుగా అన్నాను… ఆమె నొచ్చుకుంటున్నట్లుగా…”సారీ… నా ఉద్దేశ్యం అదికాదు… ముందు జాగ్రత్తగా…” నసుగుతూ అంది ఆమె.
”మీరు నిరభ్యంతరంగా ఉండండి. పడి నిమిషాల్లో మెకానిక్ ని తీసుకు వచ్చి, మిమ్మల్ని తీసుకెళతాను…” నమ్మకంగా అన్నాను నేను…
ఆమె సంతోషంగా, ”థాంక్యూ…” అంది.
ఈరోజు ఉదయాన్నే లేచి ఎవరి మొహం చూసానా అని గుర్తుకు తెచ్చుకుంటూ.. గాలితో తెలిపోతున్నట్లుగా బైక్ ని పోనిస్తున్నాను. నిజంగా ఇది కాలో, నిజమే అర్థం కావడం లేదు నాకు… మొదటిసారిగా ఒక ఆడదాన్ని చూసి ఇంతలా కదిలిపోయిన నాకు, చూసి వారం కూడా తిరక్కముందే ఆమెతో మళ్ళీ నాకు పరిచయం కావడం… తను ఆమెకి హెల్ప్ చేయడం, ఓహ్.. నిజంగా ఈరోజు నా జీవితంలో మరిచిపోలేని రోజు…
ఆలోచనలతోనే రోడ్డు ప్రక్కనే ఉన్న గ్యారేజ్ లోకి బైక్ ని పోనిచ్చాను. అదృష్టం కొద్దీ అది ఇంకా తెరిచే వుంది… అందులో ఉన్న మెకానిక్ కి విషయం చెప్పాను అతను పది నిమిషాలు నన్ను వెయిట్ చేయించాడు. కానీ నాలో అసహనం పెరిగిపోతోంది. త్వరగా వెళ్ళి ఆమెని తన బైక్ పైన కూర్చోబెట్టుకుని తీసుకు వెళ్ళాలనే ఉత్సుకత మరింతగా పెరిగిపోతూంది. అతను మెకానిక్ కి కావలసిన వస్తువులన్నింటినీ ఒక బ్యాగ్ లో వేసుకుని నా బైక్ పైన కూర్చున్నాడు.
నేను మళ్ళీ ఆమె దగ్గరకు వెళ్ళేసరికి అరగంట పట్టింది… మెకానిక్ దిగి కారుని చెక్ చేస్తుండగా… మళ్ళీ టెన్షన్ మొదలయింది. కొంపదీసి అతను కొద్దిగా రిపేర్ చేసి కారు స్టార్ట్ గానే చేస్తే… ఆమెని తన బైక్ పైన కూర్చోబెట్టుకునే అవకాశాన్ని నేను చేజార్చుకుంటాను. ఆ ఆలోచన రాగానే మళ్ళీ నాలో టెన్షన్ పెరిగిపోయింది. మెకానిక్ కారుని చెక్ చేస్తున్నంత సేపూ ఎంతో టెన్షన్ గా చూస్తుండిపోయాను… అతను కారు స్టార్ట్ చేయకుండా చూడాలని కనిపించని దేవుళ్ళకి మనసులోనే ప్రార్థనలు చేయడం మొదలుపెట్టాను… అంది వచ్చిన ఈ సువర్ణావకాశం చేజారిపోతుందేమోనన్న దిగులు కూడా పట్టుకుంది నాకు… కానీ నా ఆలోచనలకు భిన్నంగా కారుని చెక్ చేసిన మెకానిక్ పెదవి విరిచాడు….!
”లాభం లేదు మేడం… బండిని గ్యారేజ్ లోకి తీసుకు వెళ్ళాల్సిందే… ఇంజన్ లో ప్రాబ్లెం వచ్చింది…” అతను అలా చెప్పగానే నా మనసు తేలికపడింది… మళ్ళీ ఒక్కసారిగా ఉత్సాహం వచ్చేసింది.
ముందే ఆ ప్రాబ్లెం ఉంటుందని ఊహించినట్లుంది ఆమె అతని మాటలకు పెద్దగా ఫీల్ కాకుండా….
”ఓ.కే… మీరు ఎలాగోలా గ్యారేజ్ కి తీసుకెళ్ళగలరా…” అంది ఆమె మెకానిక్ తో…
మెకానిక్ తల అడ్డంగా ఊపాడు…
”నా ఒక్కడి వల్ల దీన్ని తీసుకెళ్ళడం ఎలా వీలవుతుంది మేడం…? గ్యారేజ్ ఇక్కడికి కిలోమీటరు దూరంలో ఉంది. అంత దూరం కారుని తోసుకుంటూ వెళ్ళాల్సిందే…” అన్నాడు. ఆమె మరేమీ ఆలోచించకుండా తన పర్సులోంచి ఓ ఐదు వందల రూపాయల నోటు తీసి అతని చేతిలో పెట్టింది..
”నువ్వెలా తీసుకెళ్తావో నాకు తెలియదు… రేపటికల్లా కారు రిపేర్ చేసి పెట్టాలి. ఈ ఐదు వందలు కారు ఇక్కడినుండి గ్యారేజ్ కి తీసుకెళ్ళడానికి ఇస్తున్నాను…”అంది ఆమె.
ఐదు వందల నోటుని చూడగానే అతని మొహం విప్పారింది… మరేమీ ఆలోచించకుండా … నోటుని జేబులో పెట్టుకుంటూ…
”మా కుర్రాళ్ళని రప్పించి ఈ కారుని తీసుకెళ్తాను… ఇక మీరు నిరభ్యంతరంగా వెళ్ళి రేపు గ్యారేజ్ కి వచ్చి కారుని తీసుకెళ్ళండి మేడం…” అన్నాడతను.
ఆమె కారులో ఏమైనా ముఖ్యమైన వస్తువులు ఉన్నాయా అని చూసుకుని తరువాత కారు కీస్ ని మెకానిక్ కి ఇచ్చేసింది…
నావైపు ఇక వెళ్దామా అన్నట్టుగా చూసింది…. నేను ఉత్సాహంగా బైక్ ని స్టార్ట్ చేశాను. ఆమె నా వెనకాల కూర్చోగానే మెల్లిగా బైక్ ని ముందుకి కదిలించాను.
ఆమె ఒంటిపై నుండి ఖరీదైన పెర్ ఫ్యూమ్ వాసన నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఆసరా కోసం ఆమె నా భుజం పైన చేయి వేసి పట్టుకుంది. ఆమె చేయి స్పర్శ తగలగానే నా శరీరం ఒక్కసారిగా వేడెక్కిపోయింది. క్రమంగా నాలో ఏదో మార్పు రావడం గ్రహించాను నేను. ఆ మైకంలో ఉన్న నాకు రోడ్డు కడ్డంగా ఉన్న స్పీడ్ బ్రేకర్ ని గమనించ లేకపోయాను… దగ్గరగా వచ్చిన తర్వాత చూసి ఒక్కసారిగా సడన్ బ్రేకు వేశాను. అలా బ్రేకు వేయగానే ఆమె ఎద పొంగులు మెత్తగా నా వీపుకి తగులుకున్నాయి. ఆమె రెండు చేతులతో నా భుజాలని పట్టుకుని….
”కొంచెం స్లోగా పోనీయండి…”
”ఓ… సారీ అండీ… స్పీడ్ బ్రేకర్ ని చూసుకోలేదు…” అన్నాను. బ్రేకు వేయడంతో ఆమె నాకు మరింత దగ్గరగా వచ్చేసింది. ఇప్పుడు ఆమె శరీరం మొత్తం నా వెనుక భాగానికి తగులుతోంది. ఆమె నన్ను హత్తుకున్నట్లుగా కూర్చుని ఉండడంతో నా మతి పూర్తిగా పోయింది. మొదటిసారిగా ఆ అనుభవాన్ని ఆస్వాదిస్తున్నందువల్ల ఆ అనుభూతికి డ్రైవింగ్ చేయడం కొంచెం కష్టమే అనిపించింది. అయినా పెద్దగా ట్రాఫిక్ లేని ఆ రోడ్ల మీద బండిని మెల్లిగా పోనిస్తున్నాను. మధ్యలో అవసరం లేకపోయినా బ్రేకు వేసుకుంటూ….
హిమాయత్ నగర్ చేరుకునే సరికి సరిగ్గా ఇరవై నిమిషాలు పట్టింది. రోడ్డుకి పక్కనే ఉన్న ఒక సందులో నుండి కొద్ది దూరం వెళ్ళాక వరుసగా ఉన్నమూడు అపార్ట్ మెంట్లని చూపిస్తూ… మధ్య అపార్ట్ మెంట్ దగ్గర ఆపమని చెప్పింది ఆమె.
నేను బైక్ ఆపగానే దిగి నన్ను లోపలికి ఆహ్వానించింది. నాకెందుకో ఇంత రాత్రి పూట ఒంటరిగా ఆమెతో వెళ్ళాలనిపించేలేదు. వాళ్ళాయన గానీ ఉండి ఉంటే ఇంత రాత్రివేళ పరాయి వాడి బైక్ పైన వచ్చినందుకు ఆమెని ఏమైనా అంటాడేమో అని అనిపించింది నాకు.
ఫ్లాట్ లో నేనొక్కదాన్నే ఉండేది…” నా మనసులో ఆలోచనని కనుక్కున్నట్లు ఠక్కున అంది ఆమె… ఆశ్చర్యపోయాను నేను. బైక్ ని ఓ వారగా పార్క్ చేసి బిడియపడుతూనే ఆమె వెనకాలే నడిచాను నేను. లిఫ్ట్ ఎక్కి నాలుగో ఫ్లోర్ రాగానే అందులోంచి బయటకు వచ్చాము… ఎంతో రిచ్ గా కనిపిస్తుంది. ఆ అపార్ట్ మెంట్లో ఉన్న రూంలన్నీ…. వాటిని చూస్తేనే తెలుస్తుంది. అది చాలా ధనవంతులు మాత్రమే ఉండే అపార్ట్ మెంట్ అని. ఆమె ఒక గది దగ్గరకు వెళ్ళి పర్సులో నుండి కీస్ తీసి తాళం తీసింది. నన్ను లోపలికి రమ్మని చెప్పి పక్కనే ఉన్న స్విచ్ వేసింది… ఒక్కసారిగా ఆ రూం అంతా వెలుతురుతో నిండిపోయింది. నా మొహం కూడా ఆశ్చర్యంతో నిండిపోయింది ఆ గదుల్ని చూడగానే….
ఆ గదిలో అమర్చిన ప్రతీ వస్తువు అత్యంత ఖరీదైనవిగానే అనిపించింది నాకు. ఆ హాల్ కి ఆనుకుని మూడు గదులు విశాలంగా ఉన్నాయి. ఆశ్చర్యంగా నోరు తెరుచుకుని చూస్తున్న నన్ను కూర్చోమన్నట్లుగా సైగ చేసింది ఆమె….
”ఈ ఫ్లాట్ లో మీరొక్కరే ఉంటున్నారా…?” ఆశ్చర్యంగా అడిగాను నేను. ఆమె చిన్నగా నవ్వుతూ నా ఎదురుగా వచ్చి కూర్చుంది.
”అవును …! మా వారు స్టేట్స్ వెళ్ళారు. అతను రావడానికి మరో ఆరు నెలలు పడుతుంది…” చెప్పింది ఆమె.
”మరి పిల్లలూ…” అని అడగాలనుకుని విరమించుకున్నాను. అలా అడిగితే అతి చనువు ప్రదర్శించినట్టవుతుందేమోననుకుని….
”ఒక్క నిమిషం… డ్రస్ చేంజ్ చేసుకుని వస్తాను…” అని చెప్పి ఆ హాల్ కి ఒకవైపు ఉన్న పరదాచాటుకి దారితీసింది ఆమె…
”ఇక నేను బయలుదేరుతాను…” అని చెప్పాలనుకున్నాను. కానీ నా జవాబు కోసం ఎదురు చూడకుండా ఆమె అటుగా వెళ్ళడంతో మారుమాట్లాడకుండా అలాగే కూర్చున్నాను.
ఆమె నాకు కలవడం… బైక్ పైన ఆమెతో ప్రయాణించడం… ఇప్పుడు ఆమె ఇంటిలో ఇలా ఇద్దరమే ఏకాంతంగా అనిపించింది….
ఇంత అపురూప సౌందర్యరాశి ఎవరి తోడూ లేకుండా ఇలా ఒంటరిగా వుండడం నిజంగా నాకు ఆశ్చర్యమేసింది. ఏ ధైర్యంతో ఆమె ఒంటరిగా వుంటుందో అర్థం కాలేదు నాకు. చూడగానే మగవాడి మనసులో కోరికల బుసలు కొట్టించేంతటి సౌందర్యరాశి ఆమె.
నా ఆలోచనలకు బ్రేకు వేస్తున్నట్టుగా పరదాచాటున లైటు వెలిగింది.
అటువైపు చూసిన నా కళ్ళు ఒక్కసారిగా పెద్దవయ్యాయి… ఆమె ఒంటిపై నుండి ఒకటొకటిగా గుడ్డలు విప్పదీస్తుంది…. పల్చటి ఆ పరదా చాటుగా ఆమె శరీరం అస్పష్టంగా కనిపిస్తుంది. ఆమె జాకెట్ ఊడదీసి క్రింద పడేసింది… తన రెండు చేతులని మెల్లిగా పోనిచ్చి బ్రా హుక్స్ తీయడం ప్రారంభించింది. అప్పటి వరకు ఎంతో ఒద్దికగా ఆ బ్రాలో ఒదిగిపోయిన ఆమె ఎదపొంగులు ఒక్కసారిగా దానిలో నుండి విడిపోయి మరింత ముందుకి ఉబికినట్టుగా… ఆ దృశ్యం కళ్ళ ముందు కనిపించేసరికి…. నా శరీరం వేడెక్కిపోయింది.. ఒంట్లో ఉన్న రక్తం వేగంగా ప్రవహిస్తున్నట్లు ఫీలింగ్… కళ్ళు పెద్దవి చేసుకుని ఏదో మైకంలో వున్న వాడిలా అటువైపే చూడసాగాను… ఆమె క్షణాల్లో పూర్తిగా నగ్నంగా మారిపోయింది….
అలా ఆమెని చూస్తూ నేను తట్టుకోలేకపోతున్నాను… నరనరానా కాంక్ష ప్రజ్వరిల్లుతుంటే లేచి వెళ్ళి అమాంతం ఆమెని నా చేతుల్లో బంధించాలనే కోరిక కలిగింది నాకు. పక్కనే ఉన్న నైటీని ఒంటికి చుట్టుకుని మెల్లిగా పరదాచాటు నుండి బయటకి వచ్చిందామె. చప్పున తలదించుకున్నాను నేను… ఆమె నా ఎదురుగా వచ్చి కూర్చుని …. ”ఏమిటీ… అలా ఆడపిల్లలా తలదించుకున్నావు…” అంది నవ్వుతూ.
నేను మెల్లిగా తలెత్తాను. నా మొహం వైపు చూసి ఆమె ఆశ్చర్యపోతూ… ”అరె… ఏమిటీ అలా మొహమంతా చెమట పట్టేసింది…” అనుకుంటూ పక్కనే ఉన్న టవల్ తీసుకుని…
”తుడుచుకో” అంటూ నా పక్కకి వచ్చి కూర్చుంది…. మొహానికి చెమట పట్టిన సంగతి ఆమె చెప్పేవరకు గానీ నేను తెలుసుకోలేకపోయాను… చప్పున టవల్ తీసుకుని మొహం తుడుచుకున్నాను… ఆమె తన చేయిని నా భుజంపైన వేసి… ”నా అందాలని పరదా చాటు నుండి చూస్తేనే ఇంత టెన్షన్ ఫీలయ్యావు… ఇక పరదా లేకుండా చూస్తే మూర్చపోతావేమో…!”
చప్పున ఆమె వైపు చూసాను నేను…
అప్పుడు గమనించాను.
ఆమె కళ్ళల్లో కూడా ఏదో కాంక్ష… నా నుండి ఆమె కూడా ఏదో ఆశిస్తోందని అప్పుడు అర్థమయింది… ఆ చూపులో ఎంత విరహాగ్నిజ్వాల కనిపిస్తోంది. ఆమె కళ్ళు ఎరుపెక్కి ఉన్నాయి. మొహంలో కోరిక స్పష్టంగా కనిపిస్తోంది….
ఆమె నా ప్రక్కన అంత దగ్గరగా కూర్చుని వుండడంతో భరించలేకపోయాను… నా చేయిని మెల్లిగా ఆమె తొడలపైన వేశాను…. పల్చటి నైటీ గరుకుగా తగిలింది. ఆమె అడ్డు చెప్పకపోవడంతో ఇక ఆగలేకపోయాను. అదే చేత్తో ఆమె భుజాన్ని పట్టుకుని నా వైపుకి లాక్కున్నాను…. ఆ ,మొహానికి దగ్గరగా ఆమె మొహం… ఆమె విడుస్తున్న ఉచ్చ్వాస నిశ్వాసాలు నాకు వెచ్చగా తగులుతున్నాయి… దొండపండులాంటి ఆమె పెదాలు ఊరిస్తుండగా మెల్లిగా వంగాను…. ఆ పెదాలని నా పెదాలతో అందుకోవడం కోసం…
సరిగ్గా అప్పుడు నేనూహించని విధంగా నన్ను తోసేసి, చప్పున లేచి నా ఎదురుగా కూర్చుంది ఆమె… ఆమె మొహంలో ఏదో కంగారు… మొహాన్ని సోఫా వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుంది… ఆమె వేగంగా ఊపిరి తీయడాన్ని బట్టి, తనలోని కోరికని బలవంతంగా అధిమిపడుతున్నట్లు అనిపించింది నాకు…
ఒక్కసారిగా ఆమె అలా మారిపోవడంతో నాకు ఏం చేయాలో పాలుపోలేదు. నేనేమైనా తప్పుగా ప్రవర్తించానేమో అని అనుమానం వేసింది కళ్ళు మూసుకుని ఉన్న ఆమె మొహంలో క్రమంగా రంగులు మారడం కనిపించింది… ఆమె ప్రవర్తన నాకే మాత్రం అర్థం కావడం లేదు. దాదాపు ఐదు నిమిషాల వరకు ఆమె కళ్ళు తెరవలేదు.
కళ్ళు తెరిచిన ఆమె కళ్ళల్లో నుండి రాలుతున్న కన్నీళ్ళని చూసి ఆశ్చర్యపోయాను… నన్ను చూసి ఆమెలోని దుఃఖం మరింత పెరిగింది.రెండు చేతులని మొహంపైన వేసుకుని గట్టిగా రోదించసాగింది. ఆ హఠాత్పరిణామానికి ఖిన్నుడైనాను నేను… ఆమె అలా ఏడుస్తూనే ఉంది… ఎప్పటినుండో గూడు కట్టుకుపోయిన బాధనంతా అలా కన్నీళ్ళ రూపంలో బయటికి తీస్తున్నట్టు అనిపించింది నాకు…
ఆ దేవుడు ఆమెకి అన్నీ ఇచ్చాడు… కానీ తన మనసులోని భావాలని చదవడానికి, తనలోని కోరికలని తీర్చడానికి తన ఆనందంలో… సుఖంలో… దుఃఖంలో పాలు పంచుకోవడానికి సరైన తోడుని ఇవ్వలేదని అర్థమయింది నాకు… ఆడదానికి పెళ్ళికి ముందు అలాంటి ఆదరణ తల్లిదండ్రుల ద్వారా, అక్కాచెల్లెళ్ళ ద్వారా, అన్నదమ్ముల ద్వారా ఎంతో లభిస్తుంది… కానీ యవ్వన దశలో జీవితానికి పరిపూర్ణత్వం తీసుకు వచ్చే మరో ఘట్టంలోకి అడుగు వేయబోయే సమయంలో…. అందరినీ వదిలేసి ఆప్యాయతలని, అనురాగాలనీ, భావోద్వేగాల్ని, కామోద్రకాలనీ పంచుకునేందుకై తన సర్వస్వాన్ని సమర్పించుకొనేది మాత్రం భర్త అనే వాడికే….
తన భర్త దగ్గర అలాంటి ఆదరణ కరువైతే, ఆ మగువ వాటి కోసం అన్వేషించే క్రమంలో తప్పుదారులు వెతుక్కోక తప్పదు… అనే నిర్థారణకి వచ్చేస్తుంది…. వాటన్నింటినీ కేవలం పది శాతమైనా పరాయి మగవాడి నుండి లభించిందంటే అతనికి అమాంతం లొంగిపోయి తన సర్వస్వాన్నీ సమర్పించేయడానికి కూడా వెనుకాడలేకపోతుంది….
ఆమెకి కూడా తన భర్త దగ్గర ఆదర కరువైపోయిందని నాకనిపించింది… ఎంత సేపూ డబ్బు… డబ్బు… డబ్బు.. అంటూ దాన్ని సంపాదించాలనే యావతో ఇంట్లో ఉన్న పెళ్ళాన్ని కూడా కేవలం తన అవసరం తీర్చే మరమనిషిగా భావించి, ఆమె ఆనందానుభూతుల్ని తేలికగా తీసుకుని ఒంటరిదాన్ని చేసేసి తన దారిన తాను పయనమై పోయాడని అనిపించింది… ఆమె తన కామోద్రేకాన్ని తీర్చుకోవడం కోసం కేవలం అతని కోసం ఎదురుచూస్తూ ఎన్నాళ్ళిలా ఉండిపోతుంది…. ఆ విషయాన్ని భర్తతో చెప్పలేక, తన కోరికని మనసులో దాచుకోలేక ఆమె అనుభవిస్తున్న వేదనని భర్త అనే అతను ఎప్పుడు అర్థం చేసుకుంటాడు…?
ఆమెని అలా చూస్తూ ఉంటే నాకు చాలా బాధేసింది…. నేను ఇంట్లోకి రాగానే తన కోరికని తీర్చుకోవడం కోసం ఆమె సిద్ధపడిపోయింది. అందుకే కావాలనే నేను చూస్తూ ఉండగానే పరదా చాటున బట్టలు మార్చుకుంది… తనను రెచ్చగొట్టి తను కోల్పోయిన సుఖాన్ని నా ద్వారా అనుభావించాలనుకుంది… కానీ చివరకి ఆమెలో వివేకం మేల్కొంది… తప్పు చేస్తున్నాననే భావన కలిగింది… అందుకే చివరి క్షణంలో అలా నిష్క్రమించింది…
గట్టిగా నిట్టూర్పు విడిచాను నేను…. ఆమె తెల్లటి పాలలాంటి శరీరాన్ని చూసి నాలో కామోద్రేకం కలిగిన మాట వాస్తవమే… కానీ ఆమె తెల్లటి శరీరం వెనుక దాగి వున్న స్వచ్చమైన మనసుని అర్థం చేసుకున్నాక అలాంటి కోర్కె నాలో కలిగినందుకు నిజంగా నాకు సిగ్గనిపించింది.
మెల్లిగా లేచి ఆమె వైపుకి నడిచాను నేను… ఆమె ప్రక్కనే కూర్చుని ఆమె భుజంపైన చేయి వేసాను ఆప్యాయంగా….
మెల్లిగా కళ్ళు తెరిచి నా వైపు చూసింది… ఆమె కళ్ళు ఎర్రబడి ఉన్నాయి…. ఆ చూపులో ఆప్యాయత కోసం ఆరాటంగా ఎదురు చూస్తున్నట్టనిపించింది నాకు….
ఆమెతో ఏం మాట్లాడాలో అర్థం కాలేదు నాకు… కానీ ఒక్కమాట మాత్రం స్థిరంగా పలికాను….
”ఇక నుండి మనిద్దరం ఫ్రెండ్స్…” అని…..
|
|


